సంకలనాలు
Telugu

మీ స్టార్టప్ సక్సెస్ స్టోరీ ఎవరు రాస్తారు..?

మీడియా మోజులో కొత్తతరం అంట్రపెన్యూర్లు చేస్తున్న తప్పిదాలపై శ్రద్ధాశర్మ విశ్లేషణ

SOWJANYA RAJ
26th Apr 2016
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share


అది 2008 సంవత్సరం..!

నేను కొత్తగా స్టార్టప్ ప్రారంభించిన సంవత్సరం..!!

అప్పుడప్పుడే విస్తరిస్తున్న స్టార్టప్ ప్రపంచంలో నాదంటూ ముద్రవేయాలని ఉత్సాహంగా అడుగు ముందుకు వేసిన ఏడాది..!!

నా స్టార్టప్ , నా ప్రయత్నానికి కాస్తంత మీడియా కవరేజ్ వస్తే విజయం కోసం చేసే ప్రయత్నంలో మరికొంచెం ఉత్సాహం వస్తుంది. అలాంటి కవరేజీ కోసం ప్రయత్నం చేశా. స్టార్టప్ గురించి ప్రజలకు తెలియజేయడానికి ఇదొక్కటే దగ్గరి మార్గం అనుకున్నా. స్టార్టప్ ప్రపంచంలోకి నేనూ అడుగుపెట్టా అని ఓ రకంగా ఎలుగెత్తి చాటాను. కానీ మీడియా ప్రపంచంలో ఎవరూ మావైపు కన్నెత్తి చూడలేదు. కనీస కవరేజ్ ఇచ్చేందుకు కూడా ముందుకు రాలేదు. నేను చెప్పే మాటలను వినేందుకు ఎవరికీ సమయం లేకపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ఈ పరిస్థితి నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. అత్యంత ఇష్టంగా చేసుకుంటూ..అందరి మన్ననలు పొందుతున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి పెట్టి... సొంతంగా ఏదైనా చేయాలనే ఉత్సాహంతో స్టార్టప్ ప్రారంభిస్తుంటే.. నా స్టోరీని మీడియా ఎందుకు చెప్పకూడదు..?. కనీసం ఇంత వరకూ ఎవరూ అడుగుపెట్టని రంగంలో స్టార్టప్ ప్రారంభిస్తున్న నా వెంచర్ గురించైనా ఎందుకు చెప్పరు..? నిజం చెప్పాలంటే నేను CNBC TV18లో వస్తున్న యంగ్ టర్క్స్ షో లో నా మీద ఓ ఫీచర్ వేస్తారని గట్టిగా ఆశించా!! ఎందుకంటే అది నేను సుదీర్ఘకాలం ఉద్యోగం చేసిన చానల్ అది. కానీ వారూ కూడా నన్ను పట్టించుకోలేదు. కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు.

నిజం చెప్పాలంటే.. సంప్రదాయ మీడియా మొత్తం నన్ను వీలైనంత దూరం పెట్టింది. ఒక రకంగా ఇది నాకు మంచే చేసింది. నా ప్రయాణంలో జరిగిన ఓ మంచి విషయం ఏంటంటే.. ఈ సంప్రదాయ నన్ను మీడియా పట్టించుకోకపోవడం. ఇలాంటి సమయంలోనే ఓ సంస్థ ముగ్గురికి అవార్డులు ప్రదానం చేసింది. అందులో నేను ఒకరు. తర్వాతి రోజు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బిజినెస్ డైలీలో ఆ ఆర్టికల్ కోసం వెదికాను. నాతో పాటు అవార్డులు తీసుకున్న ఇద్దరి గురించి సగం పేజీ ఆర్టికల్ రాశారు. కానీ నా ప్రస్తావనే లేదు. కనీసం మూడో వ్యక్తి అవార్డు అందుకున్నారు.. అని ఒక్క లైన్ అయినా రాసి ఉంటారని.. పేపరంతా తిరగేసి.. తిరగేసి చదివా. నా ఆశ నిరాశే అయింది. ఎందుకంటే ఒక్కటంటే ఒక్క లైన్ కూడా నా గురించి.. నేను అవార్డు అందుకున్నాననే విషయం గురించి రాయలేదు. నా గురించో.. నా స్టార్టప్ గురించో ఒక్క వాక్యం రాసినా చాలు అనే ఆశ- నన్ను అంతలా వెదికేలా చేసింది. డబ్బులేమీ లేకుండా స్టార్టప్ పెట్టిన ఔత్సాహికులెవరైనా కొద్దిగా పేరు తెచ్చే వార్త కోసం ఎంత తాపత్రాయపడతారో నేనూ అంతే పడ్డాను. 

ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఆ అత్యంత ప్రజాదరణ పొందిన బిజినెస్ డైలీలో కూడా నేను కొన్నాళ్లు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాను. తర్వాత నేను వాస్తవాన్ని అర్థం చేసుకోగలిగాను. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను.. ఆ రోజు సంప్రదాయ మీడియా అలా వ్యవహరించబట్టే నాలో మరింత పట్టుదల పెరిగింది. దాంతోనే యువర్ స్టోరీ ని స్టార్టప్ రంగంలోకి వచ్చి ఔత్సాహికులకు అత్యంత ఇష్టమైన స్పేస్ గా మార్చగలిగాను. ఇప్పుడు ఎవరైనా.. ఎలాంటి స్టార్టప్ పెట్టినవారైనా తమ స్టోరీని చెప్పుకోవడానికి అవకాశం ఉందిక్కడ. ఇప్పటికే 30,000కుపైగా స్టోరీలను యువర్ స్టోరీ చెప్పింది. ఇప్పటికీ ఇంకా చెప్పాల్సిన స్టోరీలు ఎన్నో ఉన్నాయి.

ఒక అంట్రప్రెన్యూర్ గా మన స్టోరీ మనం చెప్పుకోవడం ఎంత అవసరమో నాకు తెలుసు. దానికి మీడియా సహకారం కూడా ఎంతో ఇంపార్టెంటనీ తెలుసు. నేను CNBCలో పనిచేస్తున్నప్పుడు ఫ్లిప్ కార్ట్ లోని ఓ ఉద్యోగి నాకు కాల్ చేశాడు. CNBCలో బాగా ప్రజాదరణ పొందిన యంగ్ టర్క్స్ ప్రోగ్రాంలో కవరేజ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. అప్పుడే ఫ్లిప్ కార్ట్ స్టార్టప్ ప్రారంభమయింది. యంగ్ టర్క్స్ కార్యక్రమంలో కవరేజీ వల్ల తనకు జరిగే ప్రయోజనాన్ని కూడా వివరించారు. "మేము కొత్త వాళ్లమే.. యంగ్ టర్క్స్ లో కవరేజీ ఇస్తే.. ప్రముఖ కాలేజీల్లో క్యాంపస్ సెలక్షన్ చేసుకోవడానికి మాకు కొంత ప్రచారం లభిస్తుంది" అనేదే వారి ఉద్దేశం . ఇప్పుడు ఈ విధంగా హెల్ప్ అడిగిన వ్యక్తి నాకు మంచి మిత్రుడు. మీడియా కవరేజీ కోసం ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. కారణం సమయాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అయితే మీరు వ్యాపారంలో ఉంటే మీకు కచ్చితంగా సమాచారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. దానికి మీడియానే సరైన దారి.

నిజానికి 2008లో యువర్ స్టోరీ ప్రారంభమైన తర్వాతే స్టార్టప్ ల గురించి ఇండియన్ మీడియా ఆలోచించడం ప్రారంభించింది. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు దేశంలో ప్రతి న్యూస్ పేపర్, మ్యాగజైన్, న్యూస్ వెబ్ సైట్లకు స్టార్టప్ స్టోరీ లేదని రోజు గడవడం లేదు. స్టార్టప్ స్టోరీలు ప్రజలకు చెప్పేందుకు ఇప్పుడు ఇవన్నీ ఉత్సాహపడతున్నాయి.

వాస్తవంగా రెండేళ్ల కిందటి వరకు స్టార్టప్ స్టోరీలు అంతంతమాత్రమే. కానీ రెండేళ్ల నుంచి అనూహ్యమైన మార్పు వచ్చింది. స్టార్టప్ స్టోరీల గురించి చెప్పడానికి ఎంతో ఉందని మీడియాలోని పెద్ద మనుషులంతా అప్పుడే గుర్తించారు. ఈ కామర్స్ స్టార్టప్స్ లోకి పెట్టుబడుల వెల్లువ రావడం.. వారిలో మార్పు రావడానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఆ తర్వాత స్టార్టప్స్ హెడ్ లైన్స్ లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు ప్రతి రోజూ స్టార్టప్ న్యూస్ హెడ్ లైన్ గా ఉంటుంది. అందులో అధికశాతం పెట్టుబడుల వార్తలే.

బిలియన్ డాలర్ల క్లబ్ లోకి చెరిన అంట్రప్రెన్యూర్ ఎవరు..?

స్టార్టప్ కొత్త పోస్టర్ బాయ్ ఎవరు..?

భారీగా పెట్టుబడులు పెడుతున్నదెవరు..?

ఇవే ... ప్రధాన వార్తలవుతున్నాయి.. సందర్భానుసారంగా యువర్ స్టోరీ కూడా వీటిని ప్రధానాంశాలుగా చేసింది. ఎందుకంటే ఆన్ లైన్ మీడియాలో పేజ్ వ్యూస్ కూడా ఓ ముఖ్యమైన అంశమే.

వార్తలు, హెడ్ లైన్స్ ... వీటి మధ్య గ్యాప్ గురించి మనం కొంత ఆలోచించాలి...

స్టార్టప్ న్యూస్ కు ప్రతీసారి ఎంతకంత ప్రాధాన్యత. ఉత్థాన పతనాలన్నింటిలోనూ అదే ధోరణి. దేశానికి స్టార్టప్స్ సేవియర్స్ అయితే.. వాటిని కాపాడల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ప్రతీ విషయంలోనూ సంచలనాత్మక ధోరణిలో ఉండే మీడియా.. దీన్ని ఎందుకు పట్టించుకోదు..?

గత వారం వరుసగా వచ్చిన విఫల స్టార్టప్ కథనాలు నన్ను తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే కొన్ని ఫండింగ్ వార్తలు నాలో ఉత్సాహన్ని నింపాయి. ఇతర అంట్రప్రెన్యూర్లలాగే నాకు కూడా ఫండింగ్ అనేది... సుదీర్ఘమైన ప్రయాణంలో వేసే మొదటి అడుగు లాంటిది. స్టార్టప్ ప్రపంచంలో విజయమో వీరస్వర్గమో తేల్చుకోవడానికి చేయాల్సిన ప్రయాణం ఆ తర్వాత ఎంతో ఉంది.

image


నేనేమీ ఎక్స్ పర్ట్ ని కాదు! కానీ మీడియాను నేను ఒకటి అడగదల్చుకున్నాను. ఎందుకు వ్యతిరేక విషయాలకు అంత ప్రాధాన్యత ఇస్తారు.. ? ఎగుడు, దిగుళ్లు అనేది ప్రతి రంగంలోనూ అత్యంత సహజమైన విషయమే కదా..! మరి ఎందుకు ఒకరోజు ఒకరిని హీరోను చేస్తారు.. మరొకరోజు వారిని అథ:పాతాళానికి తొక్కేసే ప్రయత్నం చేస్తారు..? ఇదంతా పైగా ప్రతిభ ఆధారంగా కాకుండా.. కేవలం స్పెక్యులేషన్ ఈ ప్రచారం చేయడం ఎందుకు..?

అంట్రపెన్యూర్లను నేను ఒకటి అడుగుతాను..!

" మొదటి పేజీలో మీ గురించి వార్త వస్తే ఎందుకు అంత గర్వంగా ఫీలవుతారు.."

గత కొన్నేళ్లుగా నేను చాలా మంది స్టార్టప్ ప్రారంభించిన ఔత్సాహికులను పరిశీలించాను. వారిలో చాలా మంది నేను హీరోని అన్న ఫీలింగ్ లో ఉండిపోయారు. సరిగ్గా స్టార్టప్ సక్సెస్ కాక ముందే వీరిలో ఆ ఫీలింగ్ బలపడిపోయింది. కారణం.. ఇలాంటి మీడియా అటెన్షన్ వల్లే. ఓ స్టోరీ విషయానికి సంబంధించి ఓ అంట్రపెన్యూర్ తో మాట్లాడాలనుకున్నప్పుడు... అతను అన్న మాటల్ని ఇక్కడ చెబుతాను.

" చాలా టీవీ చానళ్లు నా టైం అడుగుతున్నాయి. వాటి కోసమే నేను సమయాన్ని కేటాయించలేకపోతున్నాను. మీ కోసం నేను సమయాన్ని ఎలా కేటాయించగలను..?"

ఈ సమాధానం నన్ను ఓ రకంగా స్థాణువునే చేసింది. ఈ కొత్త తరం అంట్రప్రెన్యూర్లంతా ఈ మీడియా అటెన్షన్ శాశ్వతం కాదని ఎందుకు రియలైజ్ కాలేకపోతున్నారో అర్థం చేసుకోలేకపోయా. ఈ విశ్లేషణ.. మీడియా గురించి కాదు. కానీ వార్తకు సంచలనానికి మధ్య తేడా తెలియాలి. వార్త ఎప్పటికీ వార్తగానే ఉండాలి. వార్తలాగే మన దృష్టిని ఆకర్షించాలి. లేకపోతే అది బోరింగ్ గా ఉంటుంది. మన సమయాన్ని వృధా చేస్తుంది. నిజానికి ఓ స్పైసీ హెడ్ లైన్ వార్తలను చదివేలా, చూసేలా ప్రొత్సహిస్తుంది.

చాలా మంది అంట్రపెన్యూర్లు వారి వారి స్టోరీ చెప్పుకోవడానికి ఎందుకు అంతగా బిడియపడతారు. సమయం లేకనా..? లేక తమ స్టోరీ చెప్పుకునే అంత పెద్దగా కాదనా..? లేక దాని కోసం ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అవసమని భావిస్తారా..? మన గురించి మనం చెప్పుకోవడానికి ఇదే సరైన సమయం. పదే పదే మీడియా కవరేజీ కోసం మనం ఆరాటపడాల్సిన అవసరం ఏముంది. నిజానికి అత్యధిక మీడియా కవరేజీ కూడా ఓ సమస్యే. మనకు ఎంత కవరేజీ కావాలో అంత ప్రచారాన్నే మనం సోషల్ మీడియా ద్వారా ఎందుకు చేసుకోలేం..? ఇటీవల కొలాప్స్ అయిన పెప్పర్ టాప్ స్టార్టప్ విషయంలో ఇదే జరిగింది. నిజానికి పెప్పర్ టాప్ మూసేసే విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయానికి రాక ముందే..మీడియాలో ... ప్రచారమైపోయింది. ఎక్కువగా.. చాలా ఎక్కువగా.. ఇందులో నిజం లేదు.. అంతా స్పెక్యులేషన్ ఆధారంగానే పెప్పర్ టాప్ పనైపోయిందని మీడియా ప్రచారం చేసేసింది. కానీ పెప్పర్ టాప్ వ్యవస్థాపకుల మాటలనుఎవరూ పట్టించుకోలేదు. వారు చెప్పాలనుకున్నదంతా అరణ్యరోదనే అయింది. మీడియా ఓవర్ హైప్ వల్ల జరిగిన నష్టమే అది.

చాలామంది అంట్రప్రెన్యూర్లు నాతో చెప్పారు..

" నెక్ట్స్ యూనికార్న్ నేనే. నేను హెడ్ లైన్స్ లో ఉంటాను. "

అంట్రప్రెన్యూర్లు వెలిబుచ్చే ఇలాంటి ఆత్మవిశ్వాసం అంటే నాకెంతో ఇష్టం. అయితే వెలుగుతో పాటు చీకటికి సైతం సిద్ధపడి ఉండటం నేర్చుకోవాలి. వచ్చే రోజుల్లో రాత్రుళ్లు ఒంటరిగా ఉండటానికి కూడా సిద్ధపడాలి.

అందుకే అందరికీ చెబుతున్నాను..

"ఎవరి హెడ్ లైన్ వారిదే .. ఎవరి స్టార్టప్ సక్సెస్ స్టోరీ వారే రాసుకోవాలి"

రచయిత: శ్రద్ధా శర్మ, యువర్ స్టోరీ ఫౌండర్, చీఫ్ ఎడిటర్

అనువాదం: సౌజన్య

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags