సంకలనాలు
Telugu

పర్యావరణాన్ని కాపాడుతూ.. ప్రజల దాహం తీరుస్తున్న అమృత్ ధార

ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం లేకుండా కొత్త ప్రయోగంఅతి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి మినరల్ వాటర్‘అమృత్ ధార’ను దేశవ్యాప్తంగా విస్ధరించాలనే లక్ష్యం

ABDUL SAMAD
18th Apr 2015
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share

రైళ్లో ప్రయాణిస్తున్న మిన్ అమీన్ తన గమ్యానికి చేరుకునే సరికి ఆ ట్రైన్ ఫ్లోర్ మొత్తం ఖాళీ వాటర్ బాటిళ్లు దర్శనమిచ్చాయి. అయితే పర్యావరణం గురించి ఆలోచించే వారైనా సరే చివరికి దాహం వేస్తే వారికి ఆ ప్లాస్టిక్ బాటిల్స్‌లో దొరికే నీళ్లే దిక్కని భావించిన అమీన్, నీళ్ల బాటిళ్లకు ప్రత్యామ్నాయం వైపు ఆలోచించడం మొదలుపెట్టారు.

రోడ్డు పక్కన షాపుల్లో కొలువుదీరిన అమృతధార మెషీన్. కాయిన్ వేసి మనకు కావాల్సినంత నీరు తాగే సౌలభ్యం

రోడ్డు పక్కన షాపుల్లో కొలువుదీరిన అమృతధార మెషీన్. కాయిన్ వేసి మనకు కావాల్సినంత నీరు తాగే సౌలభ్యం


ఆ ఆలోచనే ‘అమృత్ ధార’ స్ధాపనకు పునాదిగా మారింది. బాటిల్ నీళ్లు కాకుండా, పబ్లిక్ ప్లేసుల్లో టోకెన్ మెషీన్ల ద్వారా నీళ్లు ఏర్పాటు చేయాలనేదే వారి ప్రయత్నం. ‘అమృత్ ధార’ వ్యవస్ధాపకులు మిన్ అమీన్, అక్షయ్ రుంగ్తా ఇద్దరు కూడా ఫైనాన్స్ మరియు పారిశ్రామిక డిజైన్‌తో సంబంధమున్న వ్యక్తులు. తమిళనాడులోని ‘అరువిల్లే’తో సంబంధమున్న ఆ ఇద్దరు, 2013 నుండి ‘అమృత్ ధార’ ప్రాజెక్ట్ ద్వారా బాటిల్ నీళ్ల ఉపయోగాన్ని ఏ విధంగా తగ్గించాలనే అంశాలపై ప్రయోగం ప్రారంభించారు.

“ఈ ప్రాజెక్ట్ అనుకున్న మొదటి సంవత్సరంలో పుదుచెరిలోని వివిధ స్టాల్స్‌లో బాటిల్ నీళ్లు కాకుండా లూజ్ నీళ్లు విక్రయించే ప్రయోగాలు చేశాం. ఈ ప్రయోగం నీళ్లు కొనే సమయంలో ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఉపయోగపడింది'' - అక్షయ్

“ఈ ప్రాజెక్ట్ అనుకున్న మొదటి సంవత్సరంలో పుదుచెరిలోని వివిధ స్టాల్స్‌లో బాటిల్ నీళ్లు కాకుండా లూజ్ నీళ్లు విక్రయించే ప్రయోగాలు చేశాం. ఈ ప్రయోగం నీళ్లు కొనే సమయంలో ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఉపయోగపడింది'' - అక్షయ్


“ అవన్నీ చేసి, వివిధ అంశాలపై చర్చలు, ఆన్ లైన్ , ఆఫ్ లైన్ ప్రచారాల అనంతరం ప్రజలకు దాహం వేస్తేనే వారి దృష్టి ఇటువైపు ఉంటుందని తెలిసింది. పైగా ‘అమృత్ ధార’ ‘ సులువుగా అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని భావించిన మేము, కొత్త స్టాల్స్ బదులు ఉన్న చిన్న చిన్న స్టాల్స్‌లోనే వాటిని పెట్టడం మంచిదని భావించామంటున్నారు అక్షయ్”.

టోకెన్ మెషిన్ల ద్వారా మంచి నీటిని అందిస్తున్న ‘అమృత్ ధార’ నీళ్ల అవసరాన్ని బట్టి డబ్బులు చార్జ్ చేస్తుంది. ఈ నీళ్లకు ప్లాస్టిక్ బాటిళ్ల ఖర్చు లేకపోవడంతో సగానికిపైగా తక్కువ ఖర్చుతో ఈ నీళ్లు అందుబాటులోకి వచ్చాయి.

ఎంతో సింపుల్‌గా ప్లాస్టిక్ బాటిళ్ల ప్యాకేజింగ్ లేకుండా మంచి నీళ్లు అంటుబాటులోకి తేవడం ఈ కంపెనీ ప్రత్యేకత. ఉన్న లోకల్ స్టోర్స్‌తో లింక్ చేసుకోవడంతో పాటు చాలా సులువైన టెక్నాలజీ వాడుతున్నామని అంటున్నారు అమృత్ ధార నిర్వహకులు. పెద్దగా కొత్త టెక్నాలజీ ఏమీ లేకుండా, అందుబాటులో ఉన్న వాటినే కాస్త వినూత్నంగా తయారుచేసామంటున్నారు. 

“మా వెండింగ్ మెషీన్‌లో ముందు భాగం క్లౌడ్‌తో కనెక్ట్ అయి ఉంది. అది నీళ్ల క్వాలిటీని చెక్ చేస్తుంది, వాటి గురించి డిస్‌ప్లే కూడా చేస్తుంది. డబ్బు తీసుకోవడం, నీళ్లు సరఫరా చేయడం, బబల్ టాప్ డిస్‌పెన్సర్ ద్వారా ఆన్‌సైట్ రివర్స్ ఆస్మోసిస్ ఫిల్టరేషన్ యూనిట్ ద్వారా ఈ సిస్టమ్ సప్లై అవుతుంది”.
ఇదే ప్రొడక్ట్ టెక్నాలజీ

ఇదే ప్రొడక్ట్ టెక్నాలజీ


కొన్ని నెలల ముందే తమ సర్విస్‌ని ప్రారంభించిన ‘అమృత్ ధార’, చెన్నైలోని ఓ స్టోర్ ద్వారా ప్రయోగం చేసారు. అక్కడ ఫీడ్ బ్యాక్ కూడా అనుకూలంగా వచ్చింది. అయితే వారి వెండింగ్ మెషీన్ పనితీరుపై స్టోర్ యజమాని కొన్ని ఫిర్యాదులు, సందేహాలు తెలపడంతో, వారి టెక్నాలజీనీ మరింత సులువుగా మార్చే పనిలో పడ్డారు 'అమృత్ ధార' టీమ్.

“ఇక లభాల విషయానికి వస్తే పెద్దగా రాబట్టలేకపోయాము, కాని మెషీన్ అమ్మకాలు, క్వాలిటీ కాంట్రాక్ట్ల ద్వారా రాబడుతున్నాము. ‘అమృత్ ధార’ ని దేశంలోని అన్నీ ప్రధాన నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము. వ్యాపారానికి బెంగుళూరు మంచి మెట్రో సిటీ కావడంతో మా తర్వాతి లక్ష్యం అదేనంటున్నారు" అక్షయ్.

వీళ్ల ఆలోచన నిజంగానే ఫలించి ప్లాస్టిక్ వినియోగం తగ్గితే ఇంతకు మించి కావాల్సింది ఏముంటుంది. ఒకవైపు ప్రజల దాహార్తి మరోవైపు పర్యావరణానికి మేలుకలిగితే అందరికీ సంతోషమే. మీ దగ్గర కూడా ఇలాంటి ఆలోచనలు ఏవైనా ఉన్నాయా ? అయితే మాతో పంచుకోండి.


image


“అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, విమర్శకులను ఎదురుకోవడం కష్టమైన పనే,” హెల్సింకీ లో తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేయకుండా ‘అమృత్ ధార’ కే అంకితమైన అక్షయ్, “సమస్య వైపే మళ్లీ వెళ్లీ మనం ఏదీ ఎందుకు చేస్తున్నామని ఆలోచించుకుని ముందుకు సాగాలని అంటున్నారు.”

Ends/

Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags