సంకలనాలు
Telugu

మీ మొబైల్ లోనే మీరు కోరుకునే ఆరోగ్య సమాచారం

Lakshmi Dirisala
14th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

గోల్డ్ మ్యాన్‌శాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పనిచేసిన నందు మాధవ తన పనిని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోయేవాడు. ఏదీ ఏమైనా గోల్డ్ మ్యాన్ శాక్స్‌లో వేతనాల్లో మంచి పెరుగుదలే ఉండేది. అతడికి సిలికాన్ వ్యాలీలోని వ్యాపారవేత్తలతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. తనలో వ్యాపారవేత్త కావాలన్న కోరిక బలంగా ఉన్న విషయం అతడికి అప్పుడే బాగా అర్ధమైంది. కానీ ఒక సార్టప్ తీసుకురావాలన్న ఆలోచన అతడికి కలిగేలా చేయగలిగింది ఏంటి ? అతడు పట్టభద్రుడు కావడానికి ముందు రెండేళ్ల పాటు లాటిన్ అమెరికాలో పీస్ కార్ప్స్‌గా పనిచేశాడు. ఆరోగ్యపర్యమైన సమాచారం కొరత చాలా తీవ్రంగా ఉందని అతడు అప్పుడే గుర్తించాడు. అది అత్యవసరమైనవారికి ఏమాత్రం అందుబాటులో లేదు, ప్రత్యేకించి సమాజంలో ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడని ఎయిడ్స్, గర్భధారణ లాంటి విషయాలకు సంబంధించి సరైన సమాచారం సామాన్యులకు చేరడం లేదు.

image


‘‘ ఒక వాలంటీర్‌గా నా పని సంతృప్తికరంగా ఉందని నేను భావించాను. మీరు ఒక మిలియనీర్ కోసం.. ఒక వ్యూహాన్ని సిద్ధం చేయాలంటే ఆ పని మనం కాకపోతే డబ్బులిస్తే మరొకరు ఎవరైనా చేస్తారు. అయితే అవసరాల్లో ఉన్న ప్రజలకు కావల్సిన ఆరోగ్య సంబంధ సమాచారం ఇవ్వడానికి తగినంత మంది డాక్టర్లు లేరు’’ అంటున్నారు నందు మాధవ. ఆయన ఎంఢిల్((mDhil) వ్యవస్థాపకుడు . హార్వర్డ్‌లో ఎంబిఏ పూర్తి చేయగానే ఆఫీస్ టైగర్‌లో చేరారు నందు. ఆఫీస్ టైగర్‌లో ఉద్యోగం సంపాదించిన తర్వాత తాను సొంతంగా వ్యాపారం చేయడానికి అదే సరైన సమయం అని ఆయన భావించారు.

image


అప్పటి దాకా తన జీవితమంతా అమెరికాలోనే గడిపిన నందు 2008లో ఇండియాకు వచ్చేశారు. 2009లో ఎంఢిల్(mDhil)ని స్థాపించారు. ఆరోగ్యం అంటే కింది స్థాయిలో సమస్య అన్నట్టు చూస్తున్నారు. అయితే నందు దృష్టి కోణంలో ఆరోగ్యం అనేది భారతదశంలో అన్ని వర్గాల్లో ప్రబలంగా ఉన్న సమస్య. ‘‘ భారతదేశంలో చాలా మంది ఈ ఆరోగ్య సమస్యల తీవ్రతను తెలుసుకోలేకపోతున్నారు. అది కేవలం B.O.P .(బాడీ ఆఫ్ పార్ట్స్) సమస్య కాదు. మధుమేహం, పొగతాగడం వంటి అనేక అంశాలు అన్ని చోట్ల ప్రబలుతున్నాయి. ధనిక వర్గాల్లో కూడా ఈ సమస్య ఉంది. ఆరోగ్యం అన్ని సమయాలకు సంబంధించింది, అన్ని వయస్సులవారికి సంబంధించింది.’’ అంటూ వివరించారు నందు.

సవాళ్లే అభివృద్ధికి బాటలు

ఎస్ఎంఎస్ బేస్డ్ సమాచారానికి సంబంధించి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మొదటి రెండేళ్లు పాటు మొబైల్, డెస్క్‌టాప్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడం మీద దృష్టిపెట్టారు. వీడియో కంటెంట్ మీద కూడా. వాళ్లకు వచ్చే కాల్స్‌లో 60 శాతం మొబైల్స్ నుంచి, 40 శాతం కంప్యూటర్స్ నుంచి ఉంటున్నాయి. వాటిలో 85 శాతం కాల్స్ ఇండియా నుంచి వచ్చేవే. పాకిస్తాన్, ఫిలిపైన్, సౌదీ, ఇండోనేషియా లాంటి దేశాల నుంచి 10 శాతం కాల్స్ వస్తున్నాయి.

ఎస్ఎంఎస్ సర్వీసులకు సాధారణంగా భాషా పరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. వీరు ఆ అడ్డుగోడల్ని అధిగమించుకుంటూ వస్తున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఎస్‌ఎంఎస్ కంటెట్ ఇస్తున్నారు. వీడియో, వెబ్‌లకు సంధించి ఇంకా నాణ్యమైన సేవలు అందించాలనుకుంటున్నారు, భవిష్యత్తులో భాషాపరమైన అవరోధాల్ని అధిగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

‘‘నేను ఎంత ఆదాయం వస్తుందన్నదాని మీద తక్కువ దృష్టిపెడతాను, వినియోగదారుల అనుభవాల మీద ఎక్కువ ఆలోచన. మరీ ఎక్కువ లాభాలూ అశించను ఎందుకంటే, ఈ కామర్స్ ఇండియాకు సరైన రీతిలో ఉపయోగపడుతోందని నేను అనుకోవడం లేదు. వాళ్లేమీ మిమ్మల్ని నిద్రలేపి, ఫలానా వస్తువు ఇక్కడుంది కొనుక్కోండి అంటూ చెప్పాల్సిన పనిలేదు. దానికి బదులుగా ప్రజలకు చాలా సమాచారం అవసరం. ఎలా అంటే – నా కూతురికి పిరియడ్స్ వస్తున్నాయి. దానికి సబంధించిన సమాచారం నాకు వ్యక్తిగతంగా, నా భాషలో దొరుకుతుందా, ఎందుకంటే నేను ఆ విషయాన్ని అందరి ముందు బాహాటంగా చర్చించలేనుకదా ?, ఇది మన మహిళల పరిస్థితి’’ అంటూ భారతదేశ స్థితిగతుల్ని వివరించేందుకు నందు ప్రయత్నిస్తారు.

అంతేకాదు, ఫార్మా కంపెనీలతో పార్ట్‌నర్ షిప్స్ నెలకొల్పుకోవడం ద్వారా వారు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఆయా కంపెనీలు కంటెంట్‌కి, బయటకు వెళ్లే సమాచారానికి స్పాన్సర్లుగా వ్యవహరిస్తూ తమ ఉత్పత్తుల గురించి ప్రచారం చేసుకుంటున్నారు. ఎయిర్‌టెల్ లాంటి సర్వీస్ ప్రొవైడర్ల నుంచి కూడా వీరు చార్జ్ వసూలు చేస్తున్నారు. నిజానికి వీరి ట్రాఫిక్ అంతా యూ ట్యూబ్, ట్విటర్, ఫేస్ బుక్‌ల ద్వారానే ఉంటుంది.

ప్రస్తుతం వీరి వెబ్ సైట్‌లోని వీడియో కంటెంట్‌ను రోజుకి లక్షమంది చూస్తున్నారు. 70 శాతం మంది భారతీయ వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్ పరికరాల ద్వారానే ఈ వైబ్ సైట్‌కి కనెక్ట్ అవుతున్నారు. వీరి వెబ్ సైట్లో హెల్త్, ఉమెన్, ఫుడ్స్, ఫిట్నెస్ ఇలా రకరకాల అంశాలకు సంబంధించిన సమాచారం వీడియోలతో సహా లభ్యమవుతోంది.

వచ్చే ఐదేళ్లకు ఓ ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు అడుగులు వేస్తోంది ఎంఢిల్ ((mDhil). ప్రతి నెలా లక్షలాది కొత్త వీడియోలను భారతీయ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చే ఓ టూల్ లా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. ఆరోగ్య రంగ నిపుణులు లేదా డాక్టర్లు అందుబాటులోని భారతీయులందరికీ ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు.

ఆరోగ్య సంబంధమైన సమాచారాన్ని ఫోన్ ద్వారా పొందాలనుకుంటున్నారా? అయితే ఎంఢిల్ ((mDhil) మీద ఓ లుక్ వేయండి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags