సంకలనాలు
Telugu

ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ఇంటికే తెచ్చే 'తందురుస్త్'

పోషక విలువల్ని కొలిచి, కేలరీలను లెక్కించి మరీ ఆహారం అందిస్తారుషోషకాహారమే పరమ ఔషధమంటున్న తందురుస్త్ టీమ్కొంచెం ఖరీదైనా .. వైద్యం ఖర్చులు తగ్గిస్తుంది

Lakshmi Dirisala
1st Sep 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

పుష్పేశ్ దత్తు, సుధాంశు శర్మ అనే ఇద్దరు యువకులు ఫిట్‌నెస్ మీద ఆసక్తితో డిసెంబర్ 2014న ప్రారంభించిన సంస్థ తందురుస్త్. పోషక విలువల్ని లెక్కించి, కేలరీలను కొలిచి మరీ ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ఇంటికే అంధించాలని కోరుకునే వైవిధ్యమైన గ్రూప్ కోసం ఈ సంస్థను బెంగళూరులో ఏర్పాటు చేశారు.

మనస్సు, శరీరం రెండూ ఆరోగ్యవంతంగా ఉంటే జీవితాన్ని సంతోషకరంగా ఆస్వాదించగలమని ఈ ఇద్దరి నమ్మకం. ఈ ఇద్దరూ ఆరంభంలో తమ తోటి ఉద్యోగులు, స్నేహితులతో కలసి కొన్ని ప్రయోగాలు నిర్వహించారు, చివరికి అత్యుత్తమ రీతిలో తందురుస్తును ప్రారంభించారు.

తందురుస్త్‌ను ప్రారంభించకముందు, సుధాంశు ఒక వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతి వ్యాపారాన్ని మరికొందరితో కలిసి ప్రారంభించాడు. అందుకు అతడు ఎంఫసిస్ అనే సంస్థలో బిజినెస్ ఎనలిస్టుగా పనిచేశాడు. పుష్పేశ్ ఇందులోకి రాకముందు హెచ్ఎస్‌బిసిలో ఈక్విటి రీసెర్చ్ ఎనలిస్టుగా పనిచేశాడు.

తందురుస్త్ పేరుతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆరు నెలల ముందు నుంచి పుష్పేశ్ చాలా కష్టపడి పెద్ద సంఖ్యలో ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలను రూపొందించాడు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్ లకు సంబంధించి ఆరోగ్యవంతమైన ఆహారపదార్ధాలు ఇందులో ఉన్నాయి.

పుష్పేశ్ దత్తు, సుధాంశు శర్మ

పుష్పేశ్ దత్తు, సుధాంశు శర్మ


‘‘ మన జీవన శైలికి సరైన పోషకాహారాన్ని జతచేస్తే పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరుతుంది. పోషకాహారానికి సంబంధించి పూర్తి విజ్ఞానాన్ని నేను సంపాదించాను. సమతుల్యమైన ఆహారం, సరైన వ్యాయామంతో మూడు నెలల్లో 12 కిలోల బరువు తగ్గొచ్చు’’ అంటారు పుష్పేశ్.

సుధాంశు, పుష్పేశ్ ఇద్దరూ కలిసి సొంతంగా, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి 13 లక్షలు సేకరించి ఈ వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టారు.

వ్యాపారాన్ని ముందుకు నడిపించడం

సాధారణంగా మనం రోజులో ఆరు సార్లు ఆహారం భుజిస్తాం. తమ కస్టమర్లకు రోజులో నాలుగు సార్లు ఆహార పదార్ధాలను అందించేందుకు తందురుస్త్ కృషి చేస్తోంది. ప్రస్తుతం వాళ్లు రోజుకి 170-180 మీల్స్ సరఫరా చేస్తున్నారు. హెచ్ ఎస్ బిసి, గోల్డ్ మెన్ సాక్స్, సిస్కో, నారాయణ హృదయాలయ వంటి పేరొందిన సంస్ధల్లో వీరికి కస్టమర్లు ఉన్నారు. మళ్లీ , మళ్లీ వీరి ఆహారం కావాలంటూ ఆర్డర్ ఇచ్చేవారు 80 శాతానికి పైగా ఉన్నారు.

మొదటి ఏడు నెలల్లోనే తందురుస్త్ 10,000 కంటే ఎక్కవ అర్డర్లను అందుకుంది. ఈ ఫుడ్ టెక్ స్టార్టప్, సభ్యత్వ తరహా విధానాన్ని అవలంభిస్తోంది. వినియోగదారులు వారానికి, నెలకుగాని (ఇందులో ప్రతిరోజు ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ ఉంటాయి) సభ్యత్వం తీసుకోవాలి. ఒక్కో మీల్ ధర 60 నుంచి 120 వరకు ఉంటుంది.

‘‘ ఆరు సమత్యులమైన భోజనాలతో కూడి మన మెటబాలిజం స్థాయిల్ని అత్యుత్తమంగా ఉంచేదే ఆరోగ్యవంతమైన ఆహారం. పోషకాలకు సంబంధించిన పరిజ్ఞానం లేకపోవడం, పోషకాలతో కూడిన ఆహారం అందుబాటులో లేకపోవడం, తగినంత సమయం లేకపోవడం మొదలైన అంశాలు చాలా మందికి తమ ఆహారానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం లేకుండా చేస్తున్నాయి. మేం సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్వహిస్తున్నాం, ఒక క్రమపద్ధతిలో తయారు చేసిన వంటకాల డాక్యుమెంట్లను ఉపయోగించి నాణ్యతను పరీక్షిస్తున్నాం. ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా చూసుకుంటున్నాం ’’ అంటారు సుధాంశు. జిమ్‌కి వెళ్లేవారు, తదితర కొన్ని ప్రత్యేక వర్గాలకు లక్ష్యంగా చేసుకుని బిజినెస్ టూ బిజినెస్ చానల్స్ ద్వారా కస్టమర్లను చేరుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు ఆయన చెప్పారు. దీని వల్ల వాళ్లకు ఓ నమ్మకమైన భాగస్వామి తందురుస్త్ రూపంలో లభిస్తుంది. మా సాయంతో వారు తమ తమ ఫిట్ నెస్ గోల్స్ ను చేరుకోగలుగుతారంటారు సుధాంశు.

పోషకాహారం, ఆరోగ్యం, జీవనశైలి కి సంబంధించిన విలువైన సమాచారాన్ని ఈ ఫుడ్ టెక్ స్టార్టప్ తమ ఫేస్ బుక్,వెబ్ సైట్, క్విజ్ తదితర కార్యక్రమాలు, వేడుకల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

‘‘ప్రజలు చాలా వరకు అనారోగ్యకరమైన పదార్ధాలైన పిజ్జా లాంటి వాటి మీద ఖర్చుపెడుతున్నారు. కానీ మీరు ఒక ఆరోగ్యవంతమైన, పుష్కలమైన పోషకాలున్న ఓ భోజనానికి 20 రూపాయలు అదనంగా చెల్లించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఈ విషయం చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే మనలో చాలా తక్కువ మంది మాత్రమే ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లను అనుసరించడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రజలు తాము రోజువారి ఆహారం కోసం ఖర్చుపెట్టేదానికి కాస్త అదనంగా ఖర్చుపెట్టేలా చైతన్యం తేగలిగితే ప్రస్తుతం ఎదురవుతున్న ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బులు వంటి వాటిని దూరం పెట్టొచ్చు. అంతేకాదు భవిష్యత్తులో వైద్యం కోసం భారీ ఖర్చుపెట్టాల్సిన ముప్పు నుంచి తప్పించుకోవచ్చు’’ ఇవే పుష్పేశ్ చెప్పే మాటలు.

ఫుడ్ టెక్ పరిశ్రమ

భారతదేశంలో ఆహార పరిశ్రమ 2016 నాటికి 18 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. బాగా కష్టపడి అలసిపోయిన భారతీయులు ఆరోగ్యకరమైన ఆహారం తాము పనిచేస్తున్న చోటుకి లేదా తమ ఇంటికి రావాలని కోరుకుంటారు. ఆ అవసరం ఆన్ లైన్ ఫుడ్ స్టార్టప్స్ కు మంచి అవకాశం.

అంతేకాదు, సెంట్రలైజ్డ్ కిచెన్ సెటప్ వల్ల ఖర్చు తగ్గుతుంది, ఈ విధానం వల్ల కార్యకలాపాలను ఒక క్రమపద్ధతిలో నిర్వహించడం ద్వారా మంచి నాణ్యతతో కూడిన ఆహార పదార్ధాలు తయారు చేయడానికి అవకాశం కలుగుతుంది.

ఏది ఏమైనా, ఈ పరిశ్రమలో ఎదురయ్యే కొన్ని క్లిష్టమైన సమస్యల్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆహార పదార్ధాలు సహజంగానే పాడైపోతాయి. రవాణ వ్యవస్థ చాలా వేగవంతంగా, సమర్ధవంతంగా ఉండాలి. ఎందుకనో, ఈ రెస్టారెంట్లు ధరల విషయంలో తీవ్రమైన పోటీని సృష్టించలేకపోయాయి. కానీ ఈ కామర్స్ మాత్రం దానిని సాధిస్తుంది. దాంతో ఫుడ్ టెక్ వ్యాపారులకు, స్థానికంగా ఉండే రెస్టారెంట్ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. అటువంటి పరిస్థితుల్లో ఒక ట్రిప్‌లో డెలివరీ చేసే సంఖ్య మీల్స్ సంఖ్యను బట్టి రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతుంది. ఎందుకంటే రవాణా ఖర్చే అధికంగా ఉంటుంది.

అందుబాటులో ఉన్న మార్గాలు

బెంగళూరు ఇతర నగరాల్లో అనేక ప్రాంతాల్లో వంటగదుల ఏర్పాటుకు తందురుస్త్ ప్రయత్నిస్తోంది. 2017లో రెండు, 2018లో నాలుగు వంటగదులను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వచ్చే పన్నెండు నెలల్లో రోజుకి 1000 ప్యాకెట్లను డెలివరీ చేయడమే లక్ష్యంగా వీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

‘‘మేం ఒక పారదర్శకమైన వ్యాపార సంస్ధను ఏర్పాటుచేయాలనుకుంటున్నాం. సమతుల్యమైన పోషకాహారం తినడం ద్వారా ప్రజలు తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ, ఒత్తిడి లేని జీవనశైలిని అలవర్చుకునేలా ప్రేరేపించడం మా ఉద్దేశం. ఆరోగ్యవంతమైన ఆహారం అందించడంతో పాటు పోషకాల విలువను తెలియజేస్తూ ప్రచారం కూడా చేస్తాం.’’ అంటున్నారు సుధాంశు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags