సంకలనాలు
Telugu

గోల్డ్ స్కీమ్స్ అన్నింటికీ వేదిక ఈ సెంట్రల్

ఒకే వేదిక పైకి అన్ని గోల్డ్ సేవింగ్స్ స్కీములుపోల్చుకుని, నచ్చిన స్కీమును ఎంపిక చేసుకునే అవకాశంబంగారంపై దేశ ప్రజల మక్కువే స్కీమ్స్ సెంట్రల్ వ్యాపార రహస్యం

Poornavathi T
5th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మన దేశంలో ఇప్పుడైనా ఎప్పుడైనా సరే అత్యంత ఆకర్షణీయ పెట్టుబడి సాధనం బంగారమే. సొమ్మును బంగారం రూపంలో దాచుకునేందుకు మనవాళ్లు ఉవ్విళ్లూరుతారు. అప్పు చేసైనా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య కోట్లలోనే ఉంటుందంటే నమ్మడం కష్టమే అయినా... ఇది అక్షరాలా నిజం.

image


స్వామ్‌వర్స్... భారీ డేటాను విశ్లేషించి... ప్రతిఫలాలను, లాభదాయకతను అంచనా వేసే సంస్థ ఇది. ఈ సంస్థ నిర్వహిస్తున్న స్కీమ్స్‌సెంట్రల్ కస్టమర్లకు అనేక స్కీములపై అవగాహన కల్పిస్తుంది. అదే సమయంలో ప్రస్తుతమున్న స్కీముల మధ్య అంతరాలను, వాటి ప్రయోజనాలను పోల్చి... ఏది మంచిదో తేల్చుకునే అవకాశం ఇస్తుంది. కస్టమర్‌ని ఆకట్టుకునే స్కీముల ఆమూలాగ్ర వివరాలతో పాటు వాటికి సంబంధించిన జాయినింగ్, పేమెంట్ సంబంధిత కార్యకలాపాలు నిర్వహించడంతో... స్కీమ్స్ సెంట్రల్ వ్యాపారులకూ ఎంతో ఉపయోగంగా ఉంటోంది. స్కీమ్స్ సెంట్రల్ టీంలో మంజునాథ్ నంజయ్య, అరుణ్ కుమార్, ధారా దేశాయ్, విక్రం సలోత్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మంజునాథ నంజయ్య, స్కీమ్స్ సెంట్రల్ సీఈఓ

మంజునాథ నంజయ్య, స్కీమ్స్ సెంట్రల్ సీఈఓ


గోల్డ్ ఈజ్ గోల్డ్

నగల రూపంలోనూ, బిస్కెట్లు-కాయిన్ల రూపంలోనూ గోల్డ్‌లో పెట్టుబడులు అపారంగా ఉంటాయి. ఒకేసారి ఇన్వెస్ట్ చేయలేని వాళ్లు స్కీముల్లో దాచుకునేందుకు మొగ్గు చూపుతుంటారు. ప్రస్తుతం మన దేశంలో దాదాపు అన్ని గోల్డ్ చెయిన్ రిటెయిలర్లందరూ ఈ తరహా స్కీములు నిర్వహిస్తున్నారు. బంగారంలో ఈ తరహా ప్రీపెయిడ్ స్కీములు అందరికీ సుపరిచితమే. దీని తర్వాత టీవీలు, స్మార్ట్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్స్‌ను, వాషింగ్ మెషీన్, రిఫ్రిజిరేటర్ వంటి వినియోగ వస్తువుల కోసమూ స్కీములు ఎక్కువగా ఉంటాయి. అడపాదడపా వెకేషన్ టూర్లలోనూ ఈ తరహా స్కీమ్స్ కనిపిస్తుంటాయి.

image


గోల్డ్ స్కీములకు ఆన్‌లైన్ వేదిక

గోల్డ్ వ్యాపారాలకు సంబంధించిన స్కీములన్నిటికీ స్కీమ్స్‌సెంట్రల్ ఒక ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్. ఈ రంగంలోని వ్యాపారులకు తమ జ్యూవెల్లరీ సేవింగ్స్ స్కీముల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచేందుకు ఈ సంస్థ సహాయపడుతుంది. అంతే కాదు.. వాటికి సంబంధించిన అన్ని వివరాలను విశ్లేషిస్తుంది కూడా. అనేక కంపెనీలకు చెందిన అన్ని రకాల స్కీములు ఒక్క చోటే ఉండడంతో... కస్టమర్ ఎవరైనా సరే తమకు అనుగుణమైన స్కీమును ఎంపిక చేసుకునే సౌలభ్యం కలుగుతుంది. తమ బడ్జెట్‌కు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. కేవలం ఎంపిక చేసుకోవడమే కాదు... నచ్చిన స్కీముకు సబ్‌స్క్రయిబ్ అయ్యి, నెలవారీగా వాటికి చెల్లింపులు చేసే సౌకర్యం కూడా www.schemescentral.comలో ఉంది. ఒకవేళ ప్లాన్ పూర్తయిపోతే... చెల్లించిన మొత్తానికి సరిపడేంతగా ఆన్‌లైన్‌లోనే ఆర్నమెంట్స్ ఆర్డర్ చేసేయచ్చు. లేదా ఆయా కంపెనీల స్టోర్లకు వెళ్లి... మన సొమ్ముకు సమానంగా రెడీమ్ చేసుకోవచ్చు. అలాగే చేసిన పేమెంట్లకు సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్లు, ఇతర వినియోగదారులిచ్చి రేటింగులు, ఫీడ్‌బ్యాక్ వంటివాటిని కూడా వెబ్ సైట్‌లో పొందచ్చు. ఏదైనా సంస్థ సర్వీసు విషయంలో అసంతృప్తిగా ఉన్నా... ఆయా కంపెనీల పనితీరు బాగున్నా మనం కూడా రేటింగులు, ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చు. ఇలా www.schemescentral.com వెబ్‌సైట్ ఒక్క కస్టమర్లకే కాదు.. బంగారం వ్యాపారులకూ తమ టర్నోవర్ పెరిగేందుకు సహాయపడుతోంది.

స్కీమ్స్ సెంట్రల్ అందించే సౌకర్యాలు

 • మన చేతుల్లోనే అన్ని కంపెనీల గోల్డ్ సేవింగ్స్ స్కీముల వివరాలు
 • ఎప్పుడైనా, ఎక్కడైనా వివరాలు పొందే సౌలభ్యం
 • ఇతర కంపెనీల స్కీములతో పోల్చి ఎంపిక చేసుకునే అవకాశం
 • ఆన్‌లైన్‌లోనే సబ్‌స్క్రిప్షన్, పేమెంట్స్
 • డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపుల
 • ఇతర రాష్ట్రాల్లోనూ, దేశాల్లోనూ నడిచే స్కీములకు సంబంధించిన అప్‌డేట్స్
 • చెల్లింపులకు సంబంధించి ఈమెయిల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, రిమైండర్స్
 • కొత్త స్కీములకు సంబంధించిన నోటిఫికేషన్స్
 • రిఫరల్ ప్రోగ్రాంలో పాల్గొనడం ద్వారా లాభాలు పొందే ఛాన్స్
 • స్కీములు, వ్యాపారుల తీరుపై ఫీడ్ బ్యాక్, రేటింగ్స్, రివ్యూస్ ఇచ్చే-తెలుసుకునే అవకాశం
 • నచ్చిన గోల్డ్ సేవింగ్స్ స్కీముల వివరాలు ఇతరకు షేర్ చేసే సదుపాయం

అంటే స్కీమ్స్ సెంట్రల్‌లో సభ్యులుగా మారితే... ఆయా జ్యూవెలర్ల దగ్గరికి వెళ్లి పేమెంట్స్ చేయాల్సిన బాధ తప్పుతుంది. పేమెంట్స్ మిస్ అవకుండా అలర్ట్స్ అందుతాయి. ట్రాఫిక్ జంఝాటాలనుంచి తప్పించుకోవచ్చు. పాస్ బుక్స్, కార్డ్స్ వంటివి నిర్వహించాల్సిన పని ఉండదన్న మాట. 24/7 సర్వీసులతో కొత్త కస్టమర్లకు సేవలందిస్తామని స్కీమ్స్ సెంట్రల్ చెబ్తోంది. హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్‌కి, ఎన్ఆర్ఐలకీ.., ఈ తరహా ఎలక్ట్రానిక్ చెల్లింపుల విధానంతో ఎంతో సౌలభ్యంగా ఉంటోందని కంపెనీ అంటోంది. ప్రస్తుతం

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags