సంకలనాలు
Telugu

బూడిదతో కోట్ల సంపాదన..వాట్ ఎన్ ఐడియా సర్‌జీ !

25th Sep 2015
Add to
Shares
8
Comments
Share This
Add to
Shares
8
Comments
Share

బూడిదను మనమంతా చాలా చీప్‌గా చూస్తాం. దేనికి పనికిరాదు అనుకుని అంట్లు తోమడానికి ఉపయోగిస్తాం. (ఇది కూడా ఒకప్పటి జనరేషన్.. ఇప్పుడు బూడిద చూడడం కూడా ఓ వింతేనేమో) కానీ వారణాసి బీహెచ్ యూ ఐఐటీ పూర్వ విద్యార్థులు మాత్రం డబ్బు సంపాదించడానికి బూడిద చాలంటున్నారు. మీరు వింటున్నది నిజమే బియ్యం ఊక బూడిదతో కోట్లు సంపాదిస్తున్నారు.

బ్రిడ్జ్ డాట్స్.. సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలో కొత్త ఒరవడి సృష్టించిన సంస్థ. ఐఐటీ బెనారస్ హిందూ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు తన్మయ్ పాండ్య, నిఖార్ జైన్ ఈ బ్రిడ్జ్ డాట్స్‌ను ప్రారంభించారు.

చాలా కంపెనీలు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం వివిధ కళాశాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, సైంటిస్టులను సంప్రదిస్తుంటాయి. అయితే ప్రొఫెసర్లు, సైంటిస్టులను కన్సల్టెంట్లుగా కుదుర్చుకున్నా తాము కోరుకున్న ఫలితాలను మాత్రం సాధించలేకపోతాయి. అయితే కంపెనీలు కోరుకున్న ఫలితాలను అనుకున్నట్టుగా అందించేందుకు బ్రిడ్జ్ డాట్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థ ఇండస్ట్రీకి అకాడమీకి మధ్య వారధిగా నిలుస్తోంది.

పారిశ్రామిక రంగంలో తలెత్తే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఈ సంస్థ ప్రొఫెసర్లు, సైంటిస్టుల సాయంతో ఇన్నోవేటివ్ టెక్నాలజీని రూపొందించింది.

‘‘మా ప్రధాన దృష్టంతా కెమికల్స్, పాలిమర్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, వృధా అవుతున్న వేస్టేజ్‌ పైనే. ఈ ఏరియాలలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను మేం గుర్తిస్తున్నాం. ఇందుకోసం ప్రొఫెసర్లు, సైంటిస్టుల సాయంతో ఓ టెక్నాలజీని అభివృద్ధి చేశాం ’’ అని తన్మయ్ వివరించారు.

బ్రిడ్జ్ డాట్స్ కో ఫౌండర్ తన్మయ్ పాండ్యా

బ్రిడ్జ్ డాట్స్ కో ఫౌండర్ తన్మయ్ పాండ్యా


ఐఐటీ బీహెచ్‌యూ వారణాసి నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో తన్మయ్ బీటెక్ పూర్తి చేశారు. గ్లోబల్ ప్రొక్యూర్‌మెంట్ కన్సల్టెన్సీలో భాగంగా ఫార్చూన్ 500 కంపెనీల్లో పనిచేసిన అనుభవాన్ని ఈ బ్రిడ్జ్ డాట్స్ కు ఉపయోగిస్తున్నారు.

ఇంక్యుబేషన్..

ఐఐటీ బీహెచ్‌యూలో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యూబేటర్‌లో బ్రిడ్జ్‌డాట్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం సంస్థ నుంచి రూ.14 లక్షల సీడ్ ఫండింగ్ కూడా లభించింది. ఈ సంస్థకు ప్రస్తుతం యూనివర్సిటీలోని ఆఫీస్‌తోపాటు నోయిడాలో మరో కార్యాలయం కూడా ఉంది. అలాగే ఓ ల్యాబ్ కూడా ఉంది. ఇండియాతోపాటు అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియాలో ఈ సంస్థకు కస్టమర్లు ఉన్నారు. పారిశ్రామిక విసర్జకాలు, కెమికల్స్, అడ్వాన్స్డ్ కోటింగ్, కన్‌స్ట్రక్షన్ కెమికల్స్, కాస్మటిక్స్ వంటి ఉత్పత్తులతో డీల్ కోసం ఈ సంస్థ గత నాలుగేళ్లలో ఎన్నో ప్రాడక్ట్‌లను డెవలప్ చేసింది.

‘‘మా వెబ్‌సైట్‌లో కనిపించే వివిధ రకాల విభిన్న ఉత్పత్తులన్నీ మా సంస్థలో డెవలప్‌ చేసినవే. మా బృందంలో ఐదు నుంచి ఆరుగురున్నారు. ఎక్కువమంది ఐఐటీ చేసినవారే. గత నాలుగేళ్లలో మేం 10కిపైగా ప్రాడక్ట్స్, టెక్నాలజీ, సొల్యూషన్స్ ను డెవలప్ చేశాం. ప్రస్తుతం ఎనిమిది మంది క్లయింట్లకు ఆర్ అండ్ డీ సేవలు అందిస్తున్నాం’’ అని తన్మయ్ చెప్పారు.

ప్రాడక్ట్ డెవలప్‌మెంట్..

వాస్తవానికి ఆర్ అండ్ డీ సేవలే ఈ సంస్థ ప్రధాన బిజినెస్ మోడల్ కాదు. క్లయింట్ల కోసం టెక్నాలజీలను డెవలప్ చేయడంతో, ఏకకాలంలో వాణిజ్యపర అవకాశాల కోసం టెక్నాలజీలను సృష్టించడం వంటివి చేస్తుంది.

‘‘మేం రెండు టెక్నాలజీలను ప్రారంభించం. ఒకటి మునిసిపల్ సాలిడ్ వేస్ట్ ట్రీట్‌మెంట్, రెండు బియ్యం ఊక బూడిద రేణువులను సేకరించడం’’ అని తన్మయ్ తెలిపారు.

బియ్యం ఊక బూడిద నుంచి ఆధునిక గ్రేడ్‌లను సేకరించేందుకు బ్రిడ్జ్‌డాట్స్ ఓ వినూత్న సాంకేతికతను అభివృద్ధి పరిచింది. బియ్యం ఊకను బయోమాస్ ఆధారిత పవర్ ప్లాంట్లు, ఇండస్ట్రీ బాయిలర్లలో ఉపయోగించిన తర్వాత ఉత్పత్తి అయ్యే వేస్టే బియ్యం ఊక బూడిద. ప్రతి ఏటా 500 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుంది. తద్వారా వంద మిలియన్ టన్నుల బియ్యం ఊక వస్తున్నది.

అత్యున్నత ఆహార శక్తి, తక్కువ ధర ఉండటంతో ఈ బియ్యం ఊకను వివిధ రకాల పరిశ్రమల్లో బాయిలర్లకు, బయోమాస్ ఆధారిత పవర్ ప్లాంట్లకు శక్తివనరుగా ఉపయోగిస్తున్నారు. ఓ అంచనా ప్రకారం పది మిలియన్ టన్నుల బూడిద ప్రతి ఏటా ఉత్పత్తి అవుతోంది. వాణిజ్య పరంగా తక్కువ విలువ ఉండటంతో వాటిని బహిరంగంగానే వదిలిస్తున్నారు. ఇది పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

బ్రిడ్జ్‌డాట్స్ అభివృద్ధి చేసిన టెక్నాలజీ ప్రకారం ఉత్పత్తి అయిన ఈ బూడిద (సిలికా)ను టైర్లలో వినియోగిస్తున్నారు. తద్వారా వాహనాల ఇంధన వినియోగం ఐదు నుంచి ఏడు శాతం తగ్గుతోంది. ఇలా విభజించబడిన సిలికా అత్యున్నత గ్రేడ్ కలిగి ఉంటుంది. దీన్ని గ్రీన్ టైర్లలో సమర్థవంతమైన ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. ఈ రేణువులు టైర్ల రోలింగ్ రెసిస్టెన్స్‌ను నిరోధిస్తుంది. దీంతో వాహనాల ఇంధన వినియోగం తగ్గుతుంది. అలాగే వాహనాల గ్రిప్‌ను కూడా పెంచుతుంది. తద్వారా కాలుష్య ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు చేకూరుస్తుంది.

‘‘ఇది తక్కువ ఇంధనాన్ని వినియోగించడంతోపాటు పర్యావరణ హితంగా పనిచేస్తుంది. ప్రస్తుత ఉత్పత్తి ప్రక్రియతో ఈ సిలికా ఉపయోగం వల్ల 15-20% లాభదాయకత ఉంది. చెత్త నుంచి గ్రీన్ సిలికాను తయారు చేసేందుకు అవసరమైన టెక్నాలజీని తయారు చేసిన అతి కొద్ది కంపెనీల్లో మాదీ ఒకటి. ఈ రేణువులను ప్రసిద్ధ టైర్ల కంపెనీ పరీక్షించి చూసి, ఆమోదించింది. ఈ పీసీటీ పేటెంట్ అప్లికేషన్‌ను ఇప్పటికే ఫైల్ చేశాం’’ అని తన్మయ్ వివరించారు.

అవార్డుల పంట..

బ్రిడ్జ్‌డాట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎంతో గుర్తింపు వచ్చింది. డీఎస్‌టీ-లాకీడ్ మార్టిన్ ఇన్నోవేషన్ గ్రోత్ ప్రోగ్రామ్ అవార్డు-2015 బ్రిడ్జ్‌డాట్స్‌ను ఇప్పటికే వరించింది. టెక్సాస్ గ్లోబల్ కమర్షియలైజేషన్ గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీ నిర్వహించిన ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్‌మెంట్‌కు భారత్ నుంచి ఎనిమిది కంపెనీలు ఎంపికవగా, అందులో బ్రిడ్జ్‌డాట్స్ కూడా ఒకటి.

నిధుల సమీకరణ..

సంస్థను మరింత విస్తరించాలని యాజమాన్యం భావిస్తోంది. తొలి కమర్షియల్ స్కేల్ పైలట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు పలువురు ఇన్వెస్టర్లతో తన్మయ్ సంప్రదింపులు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే మూడేళ్లలో టెక్నాలజీని కమర్షియలైజ్ చేయాలని బ్రిడ్జ్‌డాట్స్ భావిస్తోంది. బియ్యం పండే దేశాలలో కూడా భాగస్వాములను ఏర్పర్చుకోవాలని చూస్తోంది.

100% అభివద్ధి..

ఈ సంస్థ అభివృద్ధి ప్రతి ఏటా వందశాతానికిపైగా నమోదవుతోంది. ఆదాయ పరంగా చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 60 లక్షల రూపాయలను ఆర్జించింది.

‘వచ్చే మూడేళ్లలో 7 వేల టన్నుల సామర్థ్యం కలిగిన ఉత్పత్తిని ప్రారంభించాలన్నదే మా లక్షం. తద్వారా రూ.50 కోట్ల ఆదాయం వస్తుంది’’ అని తన్మయ్ వివరించారు.

Add to
Shares
8
Comments
Share This
Add to
Shares
8
Comments
Share
Report an issue
Authors

Related Tags