సంకలనాలు
Telugu

ప్రపంచ రైతుల పాలిట పెన్నిధి ఈ తెలంగాణ బిడ్డ

అన్నదాత కోసం సామాజిక పారిశ్రామికవేత్తగా మారిన వెంకట్

ashok patnaik
24th Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


ఒక్క ఇంగ్లీష్ ముక్క రాని స్థాయి నుంచి ప్రపంచ ప్రతిష్టాత్మక ఎంఐటిలో ఎంబీఏ చేయడం.. ప్రసిద్ధ బోస్ లాంటి సంస్థలో ఉద్యోగం సంపాదించడం.. దాన్ని ఒక కాజ్ కోసం వదిలేయడం.. ఇదంతా ఆషామాషీ విషయం కాదు. దాని వెనుక ఎంతో స్ట్రగుల్ ఉంది. ఆ మానసిక సంఘర్షణ ఎవరి కోసమో కాదు.. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతు కోసం. అతని కష్టం కోసం. అతను చిందించే చెమట కోసం. అతను పడే బాధలు తీర్చడం కోసం. అన్నదాతకు అండగా నిలవడం కోసం. రైతుకు ఏదో చేయాలనే తాపత్రయంమే ఈరోజు అతడిని సామాజిక పారిశ్రామికవేత్తను చేసింది. 

image


వెంకట్ మారోజు. అతనిప్పుడు అంతర్జాతీయ సామాజిక సంస్ధలో ఓ ట్రెండ్ సెట్టర్‌. కష్టపడిపనిచేసే తత్వం అతడిని గ్లోబల్ లీడర్‌గా నిలిపింది. పుట్టిన గడ్డ నుంచి మూడు ఖండాల్లో (ఆసియా,ఆఫ్రికా, దక్షిణ అమెరికా) రైతుల కష్టాల గురించి...వాటి సమస్యల పరిష్కారానికి ఎలా కృషి చేస్తున్నాడో వెంకట్ హిస్టరీ చూస్తే అర్ధమవుతుంది. సోర్స్ ట్రేస్(ESE ) ఈ సర్వీసెస్ ఎవిరివేర్ అనే టెక్నాలజీని డెవలప్ చేశారు. అన్ని వర్గాలకు అవసరమైన సూచనలు, సలహాలు అందించే ఓ వేదికకు రూపకల్పన చేశారు. మారుమూల ప్రాంతాలకు తగిన సమాచారం ఇవ్వడం ద్వారా వారికి అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలపై అవగాహన కల్పించే పని చేస్తున్నారు.

"మేము మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, నైపుణ్యంతో ఆపిల్ మరియు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో యాప్ తీసుకురావడంతో ఈ రంగంలో సేవలు ప్రారంభించాం "-- వెంకట్ .

image


అయితే ఈ అభివృద్ధి అంతా ఒక్క రాత్రిలో పూర్తి కాలేదు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి తెచ్చామంటారు. సోర్స్ ట్రేస్ సంస్థను MIT, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కిలీ విశ్వవిద్యాలయాల పూర్వ విద్యార్థులు స్థాపించారు. ప్రారంభంలో కంపెనీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. SourceTrace, కోసం ఐదు సంవత్సరాల పాటు ఎన్నో మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. అయితే దానిపై ఎలాంటి ఆదాయం రాలేదు. అప్పటికే నేను భారతదేశం లో పలు సంస్థల్లో పెట్టుబడులకు సలహాదారుగా ఉన్నాను. సోర్స్ ట్రేస్‌కు ప్రధాన పెట్టుబడిదారుడు గ్రే గోస్ట్ వెంచర్స్, నన్ను కన్సల్ట్ చేసినప్పుడు సోర్స్ ట్రేస్ ను లాభాల బాటలో నడిపించాలంటే ఆర్థిక సలహాల నుంచి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని నేను సూచించాను. దీంతో నేను ప్రతిపాదించిన దానికి అంగీకరించడం, వెంటనే నన్ను కంపెనీకి నాయకత్వం వహించాలని వాళ్లు అడగటం వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే అప్పుడు సోర్స్ ట్రేస్ కంపెనీ చాలా నష్టాల్లో ఉండేది. దాన్ని టర్న్ అరౌండ్ చేయగలననే ధైర్యంతో ముందడుగేసా. బాధ్యత తీసుకున్నప్పుడు ఫర్వాలేదనిపించినా దాని లోతు ఊహించాక కొద్దిగ భయం వెంటాడిన మాట వాస్తవమే. అయితే జీవితంలో అవకాశాలు ఊరికే రావుకదా అంటారాయన. అలా గతాన్ని గుర్తు చేసుకున్నారు.

"ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు సోర్స్ ట్రేస్‌కు హెడ్‌గా మారిపోయాను. కానీ ఈ ఉద్యోగం ప్రతిపాదనలు అంత ఈజీగా రాలేదని... చెబుతుంటారు. గ్రామీణ తెలంగాణల్లో ప్రయాణాన్ని ఆరంభించిన వెంకట్...ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ప్రభుత్వ పాఠశాల్లోనే తెలుగు మీడియంలో చదువు పూర్తి చేశారు. దాదాపుగా వానాకాలం చదువులు. వాన వస్తే... స్కూళ్లకు సెలవులు ఇచ్చేవారు. అటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ పరీక్షలోఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ లో నాకు సీటు వచ్చింది. ఏమైనా, అదృష్టం కలసి రావడంతో ఒక్కసారిగా నా పరిస్థితి మారిపోయింది. ఎవ్వరూ ఊహించనట్లు నాకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీటు లభించడంతో.... మా ఊరిలో సెలబ్రిటీగా మారపోయాను.

కానీ ఉస్మానియాలో అడుగు పెట్టినాక నేను ఎంతో దూరం వెళ్లలేనని అనిపించింది. అక్కడ సీటు వచ్చినప్పటికి మూడు రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మారుమూల పల్లె నుంచి రావడం (గ్రామీణ నేపథ్యం) నాకు ఇంగ్లీషు రాకపోవడం కనీసం ఒక్క వాక్యం కూడా కచ్చితంగా మాట్లాడలేని పరిస్థితి నాది..( ఇంగ్లీషులో కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం) తో పాటు రిజర్వేషన్ అభ్యర్థి కావడం నన్ను ఇన్ఫిరియార్టీ కాంప్లెక్స్ కు గురిచేశాయి. అయితే అప్పుడు ఇంజనీరింగ్ పట్టా తీసుకొని... ఏదో ప్రభుత్వ ఉద్యోగం చేయాలని నిశ్చయించేసుకున్నా- వెంకట్

image


తన సుధీర్ఘ ప్రయాణం గురంచి వెంకట్ మాటల్లోనే..

'అయితే అనుకున్నది ఒక్కటి... అయినది మరొకటి అన్నట్లు.. ఒక్కసారి పరిస్థితులు మారిపోయాయి. ఇంజనీరింగ్ ఫైనలియర్ పూర్తయ్యే నాటికి గేట్ ఎగ్జామ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాను. వెంటనే ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూర్, ఆ అర్వాత అమెరికా వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. తర్వాత వెంకట్ పిహెచ్ డీ ప్రోగ్రామ్‌కు పూర్తి స్కాలర్ షిప్ లభించింది. 1994 లో వెంకట్ ఆటోమోటివ్ పరిశ్రమలో ప్రొఫెషన్ ప్రారంభించారు. నిర్వహణా రంగంలో ప్రతిభ చూపించడంతో అవకాశాలు వెతుక్కూంటూ వచ్చేశాయి. తర్వాత బోస్(bose) కార్పోరేషన్ గ్లోబల్ ఆటోమోటివ్ డివిజన్‌లో డివిజనల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గా పని చేశారు. అదే సమయంలో తన సంస్థ MIT స్లోన్ ఫెలోస్ ప్రోగ్రామ్ నుండి MBA చదువుకొనేందుకు సంస్థ స్పాన్సర్ షిప్ చేసింది. MIT లో పోస్టుగ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడే లక్ష్యాలను నిర్దేశించుకున్నట్టు వెంకట్ చెబుతారు.

''నా మూలాలు మర్చిపోకుండా ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యం. ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం, ప్రతి ఇబ్బందులను అధిగమించి ముందుకు వెళ్లాలన్న నిర్ణయంతో వెనుకబడిన ప్రాంతమైన తెలంగాణ నుంచి జీవితం ప్రారంభించాను. ఎల్లప్పుడూ అట్టడుగు వర్గాల అభివృద్ధి, భారతదేశంలో సామాజిక కారణాలు గురించి ఆలోచనే ఎక్కువగా ఉండేది. 1991-2005 మధ్య తెలంగాణలో కనీస నీరు లేక, అవకాశాలు తెలియక ప్రపంచంలోనే పెద్ద సంఖ్యలో రైతు ఆత్మహత్యలు నన్ను కలిచివేశాయి. వారి కోసం ఏదో చేయాలనే తపన నన్ను నిత్యం వేధించేది... దాంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నేను 2000 నుండి ఒక కార్యకర్తగా మారిపోయాను. రైతుల సమస్యలు లోతుగా అధ్యయనం చేయాలని.... చిన్న సన్నకారు రైతులకు అండగా నిలవడం కోసం ప్రయత్నం ప్రారంభించాను. వెంటనే అనుకున్నట్లుగానే నా అన్వేషణ ప్రారంభమైంది. నేను నా MBA కార్యక్రమంలో భాగంగా భారతదేశం వ్యవసాయంపై థీసిస్ రాశాను. ప్రతీ అంశాన్ని ప్రాక్టికల్‌గా పరిశీలించడంతో ... నా దృక్ఫదం మారిపోయింది. సామాజిక కారణాలు, కెరీర్ గ్రామీణ అభివృద్ధి కోసం కృషి చేయాలని నిర్ణయం జరిగిపోయింది. దీంతో 2009 లో ఉద్యోగాన్ని వదిలివేసి సన్నకారు రైతులు సాధికారికత కోసం వ్యవసాయం సొంత వెంచర్ ప్రారంభించటానికి తిరిగి భారత్ కి వచ్చేశాను.

image


తెలంగాణలోని ముల్కనూరు సహకార సంస్థ గురించి ఎంతో అధ్యయనం చేశాక, అదే పద్దతిలో ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. కానీ దాన్ని ఓ సామాజిక వ్యాపార సంస్థ( social enterprise) గా తీర్చిదిద్దితే చాలా మంది రైతులకు చాలా మేలు చేయొచ్చని భావించారు. అయితే గ్రామస్థాయిలో ఉన్న సమస్యలు... ఇబ్బందులుపై అవగాహన లేకపోవడంతో ఒత్తిడికి లోనయ్యారు. దీంతో తన వెంచర్ ప్రక్కన పెట్టారు. అప్పుడే అంటే 2012లో సోర్స్ ట్రేస్ కంపెనీలో సిఈఓగా అవకాశం రావడంతో అందులో చేరారు. కొన్నాళ్ల పోయాక స్వస్థలమైన వరంగల్ జిల్లాలో సామాజిక సంస్థ ను ఏర్పాటు చేశారు . మొదట విత్తనాలు ఉత్పత్తి వ్యాపారం ప్రారంభమైంది.2,3 ఏళ్లలోనే కార్గిల్, ఓలామ్‌తో సహా 10 దేశాలలో 30 మంది వినియోగదారులకు సేవలు అందించే స్థాయికి ఎదిగిపోయాం. ఓ ఏడాది వ్యాపారం అంతా బాగుందనే భావన పెరిగింది. అయితే అనుకోని పరిస్థితుల్లో మళ్లీ దిగులు... సోర్స్ ట్రేస్ రెండవ సంవత్సరంలో వ్యాపార అభివృద్ధి తగ్గిపోయింది. మేము ఊహించిన ప్రధాన వినియోగదారులు చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. మరి కొంత మంది నిరుత్సాహం వెలిబుచ్చారు. అయినా మేము అధైర్యపడలేదు. ధైర్యంతో ముందుకెళ్లాం. మా నమ్మకం ఆరు నెలల తరువాత, సోర్స్ ట్రేస్‌ను ఎట్రాక్టివ్ వెంచర్‌గా మార్చేసింది.

image


ఈరోజు 10 దేశాల్లో 2లక్షల మంది రైతులకు సేవలందిస్తున్నాం.వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడంతో పెద్ద వినియోగదారులు, పెట్టుబడిదారులు మద్దతుతో మార్కెట్ లో వీలైనంతగా మా వాటా పెంచుకోగలిగాము. సంస్థ వ్యాపార అభివృద్ధి తో మా ప్లేస్ వేగవంతం గా మారిపోయింది. భారతదేశం ,దక్షిణ ఆసియాలతో పాటు.. ఆఫ్రికా మాకు మరో ప్రధాన మార్కెట్ గా తయారైంది. సోర్స్ ట్రేస్ ఒక వేగవంతమైన పరిష్కారాలు కనుగొనడంలో ఒక ముందడుగు వేసింది. ముఖ్యంగా ఒక సామాజిక వెంచర్ కోసం, పెద్ద కల సాకారమైంది. వీటి మూలాల ఆధారంగా.... మా లక్ష్యం ప్రపంచంలో అతిపెద్ద రైతుల డేటాబేస్ సృష్టించేందుకు కారణమైంది. ఇప్పుడు మూడు ఖండాలు మరియు పది దేశాలలో 200,000 రైతుల వివరాలు సేకరించగలిగాము. సాధారణంగా కొన్నిసార్లు విఫలం కావచ్చు. జరిగిపోయిన కాలంలో తప్పులు నుండి తెలుసుకొని... దాన్ని మార్చుకుంటే.. చెడు కాదు, విజయం మనదే అవుతుందని' నవ్వుతూ అంటారు వెంకట్. భవిష్యత్ నిర్దేశాల గురంచి వివరిస్తూ... 2017 పది లక్షల మంది రైతుల వివరాలు సేకరించే పనిచేస్తామని....చెబుతున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags