సంకలనాలు
Telugu

మీ ఇంట్లోనే కూర్చుని ఏ కాన్సర్ట్ అయినా లైవ్‌లో చూడమంటున్న బీమ్‌ఇట్

లైవ్ కాన్సర్ట్‌లకు వెళ్లాలని, ప్రత్యక్షంగా చూడాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. అయితే సమయం, డబ్బు, దూరం.. లాంటి అంశాలు అలాంటివాటిని దూరం చేస్తూ ఉంటాయి. ఇలాంటివారికోసం లైవ్ కాన్సర్ట్‌లను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునేలా ఏర్పాటు చేసింది BeamitLive.

CLN RAJU
6th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మనం చాలాసార్లు లైవ్ షోలు చూస్తూ ఉంటాం. హాజరు కావాలనుకుంటాం. కానీ కొన్ని ఇబ్బందులు, ఒత్తిళ్లు, ప్రవేశ రుసుము ధర ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో దూరంగా ఉండిపోతాము. ఈ సమస్యకు గౌరవ్ బోరా చక్కని పరిష్కారం కనుగొన్నారు. గౌరవ్ బోరా ప్రారంభించిన వెబ్ సైట్‌తో ఇంటర్ నెట్ టీవీ పోర్టల్ ఉపయోగించి.. మీ వీలును బట్టి లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ పొందొచ్చు.

బీమ్ ఇట్ లైవ్  బృందం

బీమ్ ఇట్ లైవ్ బృందం


‘‘ఒకవేళ ప్రజలను ఈవెంట్ దగ్గరకు తీసుకురాలేకపోతే.. మనం ఈవెంట్ నే ప్రజల దగ్గరకు తీసుకెళ్దాము. వాళ్లు కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా వాళ్లేం చూడాలనుకుంటున్నారో అదే చూపిద్దాం’’ అంటారు గౌరవ్.


ప్రజల ఆదరాభిమానాలు పొందే అర్హత ఉన్న కళాకారులను ప్రోత్సహించడంతో పాటు వారికి ఒక వేదిక కల్పించడం ఈ వెబ్ సైట్ ప్రధాన ఉద్దేశం. అదే సమయంలో.. ఇష్టం ఉన్నా అనుకోని కారణాలతో తమకు నచ్చిన షోలు చూడలేని వారికి.. ఆ ఆనందాన్ని అందించేందుకే ఈ ప్రయత్నం. కళాకారులు, అభిమానుల మధ్య దూరం తగ్గించే ఉద్దేశంతో మొదలుపెట్టందే BeamitLive వెబ్ సైట్.


గౌరవ్ వ్యాపారవేత్త ఎలా అయ్యాడు..?

గౌరవ్ PESIT(PES Institute of Technology)లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ డిగ్రీ పొందాడు. చిన్నప్పటి నుంచే అతనిలో వ్యాపారవేత్త లక్షణాలు బాగా కనిపించేవి. అందుకు ఉదాహరణే అతని చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన. గౌరవ్ ఫస్ట్ క్లాస్‌లో ఉన్న సమయంలో.. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌లో పాల్గొన్నాడు. కాంపిటీషన్ లో భాగంగా గౌరవ్ బఠాణీలు అమ్మేవాడి వేషం కట్టాడు. కాంపిటీషన్ తర్వాత.. ఆ బఠాణీలను స్నేహితులతో పంచుకోమని గౌరవ్ వాళ్ల అమ్మ చెప్పింది. కానీ గౌరవ్ వాటిని అందరికీ అమ్మేసి 20 రూపాయలు సంపాదించాడు. తన వ్యాపార జీవితానికి అదే తొలి మెట్టు అంటాడు గౌరవ్.


ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్‌లో ఉన్న సమయంలో గౌరవ్.. తన స్నేహితుడితో కలిసి నాన్ వెజిటేరియన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభించాడు. బెంగళూరు శివారులోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర ఏర్పాటు చేసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాభసాటిగా సాగుతున్నా... రెస్టారెంట్ బిజినెస్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో దాన్ని మూసివేశారు.


BeamitLive ఆరంభం

తర్వాత గౌరవ్ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. కానీ ఆర్థికమాంద్యం దెబ్బతీసింది. ఆ కంపెనీ ఉద్యోగంలో చేరడానికి సమయం పొడిగిస్తూ ఉండటంతో గౌరవ్ విసిగిపోయాడు. ఖాళీగా ఉండి బోర్ కొట్టిన గౌరవ్.. బెంగళూరులోనే ఓ చిన్న రెస్టారెంట్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అలా బిజినెస్ ఆలోచనలు సాగుతున్న సమయంలో స్నేహితులు.. వేర్వేరు లైవ్ షోలకు హాజరుకావడం గమనించాడు. అతని ఫ్రెండ్స్ ఎక్కువగా స్టాండప్ కామెడీ షోలకు వెళ్లడాన్ని కూడా గమనించాడు. లైవ్ షోలకు వెళ్లాలని ఉన్నా.. కొన్ని కారణాల వల్ల గౌరవ్ కు కుదిరేది కాదు.

గౌరవ్, బీమ్ ఇట్ లైవ్ వ్యవస్థాపకుడు

గౌరవ్, బీమ్ ఇట్ లైవ్ వ్యవస్థాపకుడు


తనకు ఎంతో ఇష్టమైన లైవ్ షోలకు వెళ్లలేకపోవడంపై గౌరవ్‌కు బాధ కలిగించేది. దీని మీద బాగా రీసెర్చ్ చేసిన గౌరవ్ ఇండస్ట్రీ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాడు. దేశంలో 60 మిలియన్ల బ్రాడ్‌బాండ్ యూజర్స్ ఉన్నా.. లైవ్ స్ట్రీమింగ్ కేటగిరీలో మేజర్ ప్లేయర్స్ లేకపోవడాన్ని గమనించాడు. అప్పుడే గౌరవ్ మనసులో BeamitLive ఐడియా మెరిసింది. 2014 జూలైలో గౌరవ్ తన మొదటి లైవ్ షోను ఇంటర్ నెట్ లో స్ట్రీమ్ చేశాడు.


BeamitLive గురించి..

బెంగళూరు కేంద్రంగా మొదలైన BeamitLive ఇంటర్నెట్ వేదికగా పనిచేస్తుంది. వివిధ రంగాలకు చెందిన కళాకారుల ప్రదర్శనలు ఈ సైట్లో లైవ్ టెలికాస్ట్ అవుతాయి. వారి ప్రదర్శనలకు ఇంటర్నెట్‌లో లైవ్ కవరేజ్ ఇస్తుంది. ఈ సైట్ ప్రపంచవ్యాప్తంగా వీక్షించొచ్చు. ఉచితంగా సైట్ లోకి లాగిన్ ఆయి లైవ్ షోలు వీక్షించొచ్చు.

‘‘లైవ్ కంటెంట్ అనేది ఒక నగరంలో పరిమితమే కావొచ్చు. కానీ ఎక్కువ నగరాలను క్లబ్ చేయడం ద్వారా ఎక్కువ మంది వీక్షించేలా అపరిమితం చేయవచ్చు. మంచి నైపుణ్యం కలిగిన ప్రదర్శనలు అందించవచ్చు. BeamitLive ప్రపంచాన్ని ఒక చిన్న కుగ్రామంగా మారుస్తుంది’’ అంటారు గౌరవ్


ప్రస్తుతం BeamitLive లో ముగ్గురు సభ్యుల టీమ్ ఉంది. గౌరవ్, శిరీష్, మనీష్ లు ఇందులో సభ్యులు. శిరీష్ మెల్ బోర్న్ కు చెందిన RMIT University లో MBA చేశాడు. గతంలో ఆలయాలకు సంబంధించిన కమర్షియల్స్, INC లో పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం BeamitLive కు మార్కెటింగ్ హెడ్‌గా ఉన్నాడు. మనీష్ మాస్ కమ్యూనికేషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. ఈ సైట్‌కు సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ ఇతనే చూస్తున్నాడు.


BeamitLive అనేది రెండు సూత్రాల మీద ఆధార పడి పని చేస్తుంది. వాటి ద్వారానే ఆదాయం లభిస్తుంది. వీక్షకుల సబ్‌స్క్రిప్షన్ మోడల్, కమర్షియల్ యాడ్స్ ద్వారా ఆదాయం చేసుకుంటుంది. ఈ సైట్ ఎక్కువగా ఆదాయం కోసం సెకండరీ ఫార్మ్‌పై ఆధారపడి ఉంటుంది. వీళ్లు అడ్వర్టైజర్లకు.. టార్గెట్ ఆడియన్స్‌తో కనెక్ట్ అయ్యేలా సహాయం చేస్తారు.


మార్కెటింగ్ విషయానికొస్తే.. ఇప్పటివరకు ఉన్న కస్టమర్లంతా సోషల్ మీడియా ద్వారా, మౌత్ పబ్లిసిటీ ద్వారా వచ్చినవాళ్లే. కొన్నిసార్లు ఈవెంట్ ఆర్గనైజర్లు.. ఆడియన్స్‌కు చేరేలా సహాయం చేస్తారు. ప్రజలు ఒక్కసారి లైవ్ షో చూశారంటే.. వాళ్లే మళ్లీ మళ్లీ ఈ సైట్ కు వస్తారని, ప్రచారం కల్పిస్తారని గౌరవ్ నమ్మకం.


‘‘నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నదేంటంటే.. నీ దగ్గర మంచి ఉత్పత్తి ఉంటే.. ప్రజలు తరచూ దాని దగ్గరకు వస్తారు. నీ ఉత్పిత్తిలో నాణ్యత ఉంటే.. ఒక్కసారి మార్కెటింగ్ చేసుకోగలిగితే చాలు.. నీ కస్టమర్లే.. ప్రపంచానికంతటికీ తెలిసేలా ప్రచారం చేస్తారు’’ అంటారు గౌరవ్.


సవాళ్లు.. భవిష్యత్ వ్యూహాలు..

వీటి గురించి గౌరవ్ ఏం చెబుతాడంటే ‘‘ఈ సైట్ వ్యాప్తికి మొదట్లో ఇంటర్నెట్ చాలా పెద్ద సమస్యగా ఉండేది. కానీ నేను అవసరాలకు సరిపడా ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాను. తర్వాత నిధులు రావడంతో.. అనుభవం కలిగిన సిబ్బందిని నియమించుకొని కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించాను.’’ త్వరలోనే మరింత అభివృద్ధి చెందుతామని గౌరవ్ టీమ్ ఆశావహ దృక్పథంతో ఉన్నారు.

గౌరవ్ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. సవాళ్లను స్వీకరించే స్వభావం ఉన్నగౌరవ్ ప్రస్తుతం పెట్టుబడిదారుల కోసం చూస్తున్నాడు. అతను త్వరలో వ్యాపారాన్ని భారతదేశంలోని అన్ని నగరాలతో పాటు దక్షిణాసియాలో విస్తరించే ప్లాన్ లో ఉన్నాడు.

‘‘మేము 2 నుంచి 5 మిలియన్ డాలర్ల నిధుల సేకరణ కోసం చూస్తున్నాం. వివిధ రంగాలకు చెందిన కళాకారులను కూడా భాగస్వామును చేసుకుంటాం. తద్వారా వారి ప్రతిభను లోకానికి తెలిపే వేదిక తయారు చేస్తాం’’ అంటాడు గౌరవ్.

సంస్థ వ్యవస్థాపకుడు గౌరవ్ అంచనా ప్రకారం భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 230 మిలియిన్లు, బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 60 మిలియన్లు. ఇంటర్నెట్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరి ముందుకు BeamitLive ను చేర్చడమే గౌరవ్ లక్ష్యం.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags