సంకలనాలు
Telugu

వృద్ధులకు ఇంట్లోనే స్పా, సెలూన్ సేవలు వీళ్ల ప్రత్యేకత

ప్రతీ ఒక్కరికి ఇంట్లోనే స్పా, సెలూన్ సేవలువృద్ధుల కోసం ప్రత్యేక సేవలందిస్తున్న నొమడిక్ స్పాలొన్తల్లి దగ్గర స్పా, సెలూన్ వ్యాపారం నేర్చుకున్న సీమస్పా సేవలతో రోగులు త్వరగా కోలుకుంటారంటున్న నొమడిక్ ఫౌండర్

6th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

నొమడిక్ స్పాలొన్... పేరుకు తగ్గట్లుగానే ఇదో మొబైల్ స్పా, సెలూన్. ఇది మీ ఇంటికే స్పా, సెలూన్ సేవలను తీసుకొస్తుంది. ముఖ్యంగా స్పా, సెలూన్‌లకు వెళ్లేందుకు తగిన సమయం ఉండడం లేదని భావించే మహిళలకు ఇది చాలా ఉపయోగం.

image


“రోజువారి పనులు పూర్తి చేసుకుని, చివరి పని కూడా పూర్తయింది అనుకునేప్పటికే.. ఆరోజు గడిచిపోయి ఉంటుంది. సెలూన్‌కు వెళ్లాలనే ఆలోచన కంటే... రేపటి గురించి ఆలోచన అప్పటికే మొదలయిపోయే టైం అది. ఇక మహిళలకు సెలూన్ వంటి వ్యక్తిగత అవసరాలు ఎక్కడ గుర్తుంటాయి. ఇలాంటి వ్యక్తిగత అవసరాలకు ప్రొఫెషనల్ టచ్ ఇచ్చే సర్వీసే... నొమడిక్ స్పొలొన్” అంటున్నారు వ్యవస్థాపకురాలు సీమా నంద.

హోటల్ నుంచి స్పా వరకూ

హోటల్ వ్యాపారంతో తన కెరీర్‌ను ప్రారంభించిన సీమాకు.. నొమడిక్ స్పాలొన్ అంటే తన చిన్నతనంలోకి ప్రయాణమే. ఆమె తల్లికి హైద్రాబాద్‌లో స్పా & సెలూన్ ఉండేది. టీనేజర్‌గా ఉన్న సమయంలో స్కూల్ టైం తర్వాత తల్లికి సహాయం చేసేవారు సీమ. దీంతో ఈ వ్యాపార లోటుపాట్లు ఆమెకు బాగానే తెలుసు. అలాగే ఆర్థిక కార్యకలాపాల నిర్వహణపైనా కొంత పట్టుంది.

విద్యాభ్యాసం పూర్తి చేశాక... హోటల్ రంగంలోకి ప్రవేశించారు సీమ. ఓ హోటల్ యజమానినే పెళ్లి చేసుకుని ఢిల్లీలో స్థిరపడ్డారు. ఈ మెట్రో సిటీ ఆమెను మరింతగా ఆకర్షించింది. ఇంటర్ కాంటినెంటల్, రాడిసన్, ది పార్క్ వంటి స్టార్ హోటల్స్‌లో పని చేసే అవకాశం కల్పించింది. కానీ ఉదయం 9నుంచి సాయంత్రం 6వరకూ రోజూ పని చేసీచేసీ ఆమెకు బోర్ కొట్టేసింది. పనిలో మొనాటనీ రావడంతో దీన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నారామె.

అనుకున్నదే తడవుగా హోటల్ రంగం నుంచి బయటకు వచ్చిన సీమ... కోర్ వెల్‌నెస్ నుంచి స్పా కన్సల్టెంట్‌గా సర్టిఫికేషన్ చేసి... హెయిర్ &స్కిన్ విభాగంలో ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించారు. ఈ సమయంలో తన తల్లి మరణాన్ని తట్టుకోవాల్సి వచ్చింది. ఏడాదిలోపే తండ్రి కూడా కాలం చేయడంతో.. తల్లి సెలూన్‌ను నిర్వహించేవారు లేకుండా పోయారు. దాన్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఆ తర్వాత ప్రొవడో స్పా పేరుతో... ఒక స్పాను ప్రారంభించారు సీమ. ఏడాదిలోపే నొమడిక్ స్పాలొన్‌ను ప్రారంభించి... క్లయింట్లకు, కస్టమర్లకు వారికి అనుకూలమైన ప్రదేశంలో సర్వీసులు ఇవ్వడం ప్రారంభించారు. కస్టమర్లకు అనుకూలమైన సమయంలోనే సేవలు చేయడం దీని ప్రత్యేకత. “ఇప్పుడు నెలకు దాదాపు 250మంది క్లయింట్లకు సర్వీసులు అందిస్తున్నాం” అంటున్నారు సీమ.

వృద్ధుల కోసం ప్రత్యేక సర్వీసులు

వయసు పైబడిన కస్టమర్లకు నొమడిక్ అందించే సేవలు ప్రత్యేకమైనవి అంటారు సీమ. వృద్ధులతో సహా అందరికీ ఒకేతరహా సర్వీసులు అందిస్తున్నాయి ఇప్పుడున్న బ్యూటీ సెలూన్స్. అలా కాకుండా... బెడ్‌కే పరిమితమైన కస్టమర్లకు కూడా గోళ్లు కత్తిరించడం, హెయిర్ వాష్ వంటి బేసిక్ సర్వీసులు అందిస్తున్నారు. 

“మనం బాగా వయసున్న చెట్టులో కూడా అందం చూస్తాం. కానీ వృద్ధుల విషయంలో పెద్దగా పట్టించుకోం. పెరుగుతూ పెద్దవారమవుతూ మనం చాలా బిజీగా ఉంటున్నాం. మనతోపాటే... మనకు మించి వారు పెద్దవుతున్న విషయాన్ని విస్మరిస్తున్నాం” అంటున్నారు సీమ.

హెయిర్, నెయిల్స్, ఫేస్‌లకు సర్వీసులతో పాటు... వృద్ధులకు వెన్ను నొప్పు, తలనొప్పి వంటి సమస్యలకు థెరపీ మసాజ్‌లు కూడా చేస్తోంది నొమడిక్. దాదాపు వారికి అవసరమైన అన్ని సెలూన్ సేవలు అందిస్తున్నారు. గృహాల్లో నివసిస్తున్న వృద్ధులే కాకుండా... ఓల్డేజ్ హోమ్స్‌లో ఉండేవారు కూడా ఈ సేవలు వినియోగించుకోవచ్చు. "వృద్ధులకు సేవ చేయడాన్ని మేం ఎంజాయ్ చేస్తాం. వారు చిన్నపిల్లల్లాంటి వారు" అంటున్నారు సీమ.

నొమిడిక్ టీం ఇదే

ప్రస్తుతం ఈ టీంలో ఏడుగురు ఫుల్ టైం థెరపిస్టులతోపాటు... నలుగురు ఫ్రీలాన్సర్స్ ఉన్నారు. ఒక స్వచ్ఛంద సంస్థతోనూ కలిసి పని చేస్తున్నారు సీమ. ఈ సంస్థ స్పా & సెలూన్ విభాగంలో విద్యను అభ్యసించిన బాలికలను అందిస్తుంది. వీరికి తగిన ట్రైనింగ్ ఇచ్చి... ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది నొమడిక్. ఈ స్పా కంపెనీ దగ్గరున్న ప్రొఫెషనల్స్‌తో పాటుగా వీరు కూడా సర్వీసులు పొందే కస్టమర్ల దగ్గరకు వెళతారు. దీని ద్వారా తగిన ఫీల్డ్ ట్రైనింగ్ పొందడంతోపాటు.. వారికి కొంత ఫేమ్ కూడా వస్తోంది.

వ్యవస్థాపక రంగంలో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలకు సీమ అతీతం కాదు. అయినా ఒక ఫౌండర్, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌గా... తన టీంకు తగిన భద్రత అందించేందుకు సీమ చర్యలు తీసుకున్నారు. ఆమె టీం మొత్తానికి పికప్, డ్రాప్ ఫెసిలిటీ కల్పించారు. వీరిని విధులకు తీసుకొచ్చి, క్లయింట్స్ ఇళ్లకు తీసుకెళ్లి, తిరిగి ఇంటి దగ్గర దించే డ్రైవర్లందరూ చదువుకుని, ట్రైనింగ్ పొంది, మర్యాదపూర్వకంగా ప్రవర్తించేవారే.

నొమడిక్ విస్తరణపై సీమ దగ్గర ప్రత్యేక ప్రణాళికలున్నాయి. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శాఖలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారామె. ఎన్‌సీఆర్(నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో లగ్జరీ డే స్పా ప్రారంభించనున్నారు. హాస్పిటల్స్‌లో పేషెంట్లకూ... తగిన విధంగా సేవలందించేలా నొమడిక్ స్పాలొన్‌ను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని ద్వారా తన వ్యాపారం పెరగడంతోపాటు... రోగులు త్వరగా కోలుకుంటారని చెబ్తున్నారామె. వృద్ధులకు, రోగులకు సేవలందించడం ద్వారా.. బ్యూటీ సెలూన్ల సాంప్రదాయ వ్యాపారానికి భిన్నంగా దూసుకుపోతున్నారు సీమా నంద.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags