సంకలనాలు
Telugu

ఇకనుంచి ఆన్ లైన్ లో హీరో సైకిల్! ఫ్లిప్ కార్ట్ తో టైఅప్!!

ఫ్లిప్ కార్ట్ తో జతకట్టిన హీరో సైకిల్!!

HIMA JWALA
10th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఇప్పుడంటే సపోర్టింగ్ వీల్ సైకిల్స్ వచ్చాయిగానీ, ఒకప్పుడు సైకిల్ నేర్చుకోవడమంటే చిన్నపాటి యజ్ఞం లాంటిది! నాన్న జేబులోంచి రూపాయి గాయబ్ చేసి, అద్దె సైకిల్ కోసం నానా హైరానా పడ్డ రోజులు..!! బ్యాలెన్స్ చేయడం రాక మోకాలి చిప్పలు పగలగొట్టుకున్న గురుతులు..!! ట్యూబులో గాలి నింపడం కోసం ఎగిరెగిరి పంపు కొట్టిన క్షణాలు..!! నిజంగా అదొక నోస్టాల్జియా! సైకిల్ నేర్చుకోవడం వెనుక ఎన్నిన్నె మరిచిపోలేని ఇన్సిడెంట్సో!! టెన్త్ ఫస్ట్ క్లాసులో పాసైతే నీకు హీరో సైకిల్ కొనిపెడతారా అని మామయ్య చేసిన ప్రామిస్ ఇంకా జ్ఞాపకాల దొంతరలో పదిలంగానే ఉండే ఉంటుంది అందరికీ!! అంతెందుకు అప్పట్లో అత్తగారిచ్చే కట్నకానుకల్లో, హీరో సైకిల్ మస్ట్ అండ్ షుడ్. సైకిల్ కొనివ్వలేదని అల్లుడు అలిగి వెళ్లిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.

image


హీరో సైకిల్. ఇప్పుడా అప్పుడా..! 60 ఏళ్ల ప్రస్థానం! పెడల్ దగ్గర్నుంచి బెల్ వరకు ప్రతీ పార్ట్ మనసులో గాఢమైన ముద్రవేసింది! నలుగురు ముంజాల్ బ్రదర్స్ చేతుల మీదుగా మొదలైన హీరో సైకిల్ ప్రయాణం అప్రతిహతంగా సాగింది! కమాలియా అనే చిన్న పట్టణం నుంచి మొదలై, దేశంలోని ప్రతీ మారుమూల పల్లెదాక, చివరికి పాకిస్తాన్ వరకు హీరో సైకిల్ దౌడు తీసింది. స్పేర్ పార్ట్స్ బిజినెస్ 1944 నుంచి మొదలైతే.. 1956లో యూనిట్ లుధియానాకు షిఫ్టయింది. అలా అంచెలంచెలుగా బిజినెస్ ఎదిగింది. అందరి అవసరాలకు తగ్గట్టు సైకిల్ డిజైన్ చేశారు. పిల్లలు, పెద్దలు అందరూ మోజుపడేలా తీర్చిదిద్దారు. కొత్త మోడల్స్ విడుదల చేస్తూనే- పేదోడికి కూడా సోషల్ స్టేటస్ను క్రియేట్ చేశారు.

అలా, 1975కల్లా హీరో కంపెనీ ఇండియాలోనే అతిపెద్ద సైకిల్ తయారీ సంస్థగా మారింది. ఎంతగా అంటే, రోజుకి కనీసం ఎంతలేదన్నా 7,500 సైకిళ్లు తయారు చేసేవారు. పదేళ్ల తర్వాత ఆ సంఖ్య 18,500కి పెరిగింది. ఈ నంబర్ ఎంటైర్ గ్లోబల్ మార్కెట్లోనే పెద్దది. ఇండియన్ మార్కెట్ లో హీరో సైకిల్ వాటా 48 శాతం అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే లార్జెస్ట్ సైకిల్ మానుఫ్యాక్చరర్ గా హీరో కంపెనీ పేరు సగర్వంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది.

కాలం మారింది. టెక్నాలజీ స్పీడందుకుంది. ప్రజల అభిరుచులు మారాయి. వాటికి అనుగుణంగా హీరో సైకిల్ తన స్వరూపాన్ని మార్చుకుంది. ఇంకా పాత డొక్కు సైకిల్ ఏంటి.. అనే మాట రాకుండా- వారెవా ఏం సైకిల్ అనేలా చేసింది! ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని టెక్నాలజీ హంగులను కలగలిపింది! అలాంటి లేటెస్ట్ సైకిల్స్ లో ఒకటి Hero Mega Star 26” (18 Speed). దానిరేటు రూ. 8,999. మరో సైకిల్ Studd 26T (18 Speed). దీని ధర 8,555. Studd 26T (S.Speed) దీని ప్రైస్ రూ.6350. అడ్వెంచర్లంటే ఇష్టపడేవారు, ఆఫీస్ కోసం సైకిల్ ప్రిఫర్ చేసేవారు, సైక్లింగ్ హాబీ ఉన్నవారంతా ఈ రేంజ్ సైకిల్స్ వాడుతారు. అట్ ద సేమ్ టైం.. పర్యావరణ సమతౌల్యం కూడా కాపాడటంలో సైకిల్ పాత్ర ఎంతైనా ఉంది.

ఇవాళ రేపు పిడకలు కూడా ఆన్ లైన్ లో దొరుకుతున్నాయి!! మరి అందరికీ ప్రియమైన సైకిల్ మాత్రం ఎందుకు ఉండొద్దు..? అందుకే, గత ఏడాది జులైలోనే హీరో సంస్థ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ గురించి అనౌన్స్ చేసింది. ప్రస్తుతానికి మూడు మోడల్స్ ను పరిచయం చేయాలని నిర్ణయించింది. ఆన్ లైన్ స్పోర్ట్స్ స్టోర్, స్పోర్ట్స్ 365తో కలిసి కస్టమర్ల ముందుకు రాబోతోంది. 18 నుంచి 36 నెలల్లో అట్లీస్ట్ లక్ష సైకిల్స్ సేల్ చేయాలనేది సంస్థ టార్గెట్. ఇప్పటికే బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ హీరో సైకిల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.

మెట్రో, టైర్ 1, టైర్ 2 సిటీల్లో సైకిల్ ప్రాధాన్యతను మరింత తెలియజేయాలని వీపీ ఫ్యాషన్స్ రిషి వాసుదేవ్ కోరుతున్నారు. ఫ్లిప్ కార్ట్ –హీరో సైకిల్ భాగస్వామ్యం పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, ప్రజల్లో హెల్త్ కాన్షియస్ కూడా తేవాలని వాసుదేవ్ ఆకాంక్షిస్తున్నారు.

పట్టణీకరణ పెరిగిన నేపథ్యంలో సైకిల్ ప్రాధాన్యత, దాని వాడకం మరింత పెరగాలి. పర్యావరణానికి ఎంతోకొంత మేలు జరగడంతోపాటు, ప్రజల ఆరోగ్యం కూడా కొన్నాళ్లు భద్రంగా ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ తో జతకట్టడం వల్ల మా కస్టమర్ల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నా - రోహిత్ శర్మ, చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్.

హీరో సైకిల్ పరపతి పెంచుకోవడం కోసం ఫ్లిప్ కార్ట్ వేదికగా, క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇస్తోంది. 30 రోజుల్లో రిప్లేస్మెంట్ పాలసీ సేమ్, డే గ్యారెంటీ కూడా ఉంది. ఇది ప్రస్తుతం 13 నగరాలకు మాత్రమే పరిమితం. ఇటు ఫ్లిప్ కార్ట్ కూడా హీరో భాగస్వామ్యంతో సేల్స్, డెయిలీ విజిట్స్ పెంచుకోవాలని చూస్తోంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags