సంకలనాలు
Telugu

ధోనీ నుంచి ఆంట్రప్రెన్యూర్లు నేర్చుకోవాల్సిన ఏడు విషయాలు.. !

team ys telugu
6th Jan 2017
Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share

మహేంద్ర సింగ్ ధోనీ. ఇండియన్ క్రికెట్ కెప్టెలన్లో మోస్ట్ ఐకానిక్. ఆ మాటకొస్తే ఇండియన్ స్పోర్ట్స్ లోనే కాదు.. ప్రపంచంలోనే సక్సెస్ ఫుల్ ఆటగాడు. నిజానికి ధోనీకి చిన్నప్పుడు క్రికెట్ కంటే, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్ మీదనే ఎక్కువ ఇంట్రస్ట్ ఉండేది. కోచ్ సలహా మేరకు క్రికెట్ ని ఎంచుకున్నాడు. మొదట్నుంచీ కీపింగ్ అంటేనే ఇంట్రస్ట్. లోకల్ క్రికెట్ క్లబ్ లో అయినా, బీహార్ అండర్ 19 అయినా, అస్సాం టీంకైనా వికెట్ కీపింగే చేశాడు. టీమిండియాలో కెన్యా ట్రై సిరీస్ నుంచి మొదలైన ప్రస్థానం 2004-05 బంగ్లాదేశ్ టూర్ మీదుగా నేటి దాకా వికెట్ల వెనుక గ్లోవ్స్ తో, వికెట్ల ముందు బ్యాటుతో వీరుడిలా నిలబడ్డాడు. 2008లో భారత ప్రభుత్వం రాజీవ్ ఖేల్ రత్నతో సత్కరించింది.

ధోనీ ఆట గురించి, అతని కెప్టెన్సీలో టీమిండియా సాధించిన విజయాల గురించి మరో మూడు తరాలపాటు ఇంట్రడక్షన్ అవసరం లేదు. ప్రస్తుతానికి కెప్టెన్సీ నుంచి మాత్రమే వైదొలగినా, అతడి సాధించిన విజయాలపై బాలీవుడ్ ఇప్పటికే సెలబ్రేట్ చేసుకుంది. జట్టు ఎంత విపత్కర పరిస్థితుల్లో ఉన్నా మనో నిబ్బరాన్ని కోల్పోని నాయకుడు ధోనీ. ఏ సందర్భంలోనూ ఆత్మస్థయిర్యం సడలకుండా దమ్మున్న లీడర్ గా జట్టుని ముందుడి నడిపించాడు. ఇలాంటి నాయకుడు ఒక స్టార్టప్ సీఈవో అయితే ఎలా వుంటుంది? ఇంత తక్కువ సమయంలో ధోనీ సాధించిన విజయ పరంపర నుంచి ఆంట్రప్రెన్యూర్లు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? ధోనీ నుంచి ఏడు సూత్రాలను అన్వయించుకుంటే వ్యాపారంలో ఎంతమేరకు సక్సెస్ కావొచ్చు..

image


1) గత వైఫల్యాల నుంచి ఏం నేర్చుకోవచ్చంటే..

ఒక కొత్త బిజినెస్ మొదలుపెట్టాం. ఎలాంటి రిఫరెన్సూ లేదు. ఫలితంగా ఫెయిల్ అయ్యాం. అలాగని వదిలేయకూడదు. ధోనీ కెరీర్ మొదట్లో అదే జరిగింది. 2011లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్ అట్టర్ ఫ్లాప్. అయినా ధోనీలో కించిత్ నిరాశ లేదు. ఆంట్రప్రెన్యూర్లలో ఇలాంటి పాజిటివ్ ఆటిట్యూడే కావాలి. ప్రతీ గేమ్ ని ఛాలెంజింగ్ గా తీసుకోవాలి.

2) అనేక కోణాల్లో ఆంట్రప్రెన్యూర్లు ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంది. అదృష్టం, తలరాత అని కూచుంటే కుదరదు. మైదానంలో ధోనీ కూడా అంతే..! గెలుపు పట్ల పాజిటివ్ సిగ్నల్స్ ఉంటే ఏమాత్రం సంశయించడు. అలాగని ఓడిపోయే సందర్భంలోనూ అటెంప్ట్ చేయడం మానడు. ఆంట్రప్రెన్యూర్లకు ఇది వందకు వందశాతం అప్లయ్ అవుతుంది.

3) ఎఫెక్టివ్ డెలిగేషన్

లీడర్ అనేవాడు ప్రతీ డెసిషన్ను ముందుండి నడపాల్సిన అవసరం లేదు. జట్టులో సమర్దులైనవారు ఉన్నారని పిస్తే వాళ్లకు సారధ్య బాధత్యలు అప్పగించడంలో ఏమాత్రం సంశయించొద్దు. ఏ సందర్భంలో అయినా నీకు నువ్వుగా అన్ ఫిట్ అని భావిస్తే పగ్గాలు వేరేవాళ్ల చేతికి అందించొచ్చు. అలాగని బాధ్యతల నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పుకుంటే మాత్రం చీట్ చేసినవాళ్లవుతారు.

4) పజిల్ ఛేదించడం

కొన్ని కంపెనీలు పదేపదే ఎదుటివాళ్లమీద గెలుస్తాయి? కారణం వేరే చెప్పక్కర్లేదు. ప్లాన్ నుంచి ఎగ్జిక్యూషన్ దాకా టీమంతా పక్కాగా ఉంటుంది కాబట్టి. ధోనీ కూడా అదే భావిస్తాడు. ఆడటానికి ఎవరో ఒకరు ఉంటే చాలు అనే మనస్తత్వం కాదు. జట్టు గెలుపు అంటే అతడి దృష్టిలో సమష్టి పోరాటం.

5) ఒత్తిడిని ఎదుర్కోవడం

ధోనీ మైదానంలోకి దిగితే.. అతడి బుర్రపై ఒక్కడి ఆలోచనే ఉండదు. వందకోట్ల మంది నమ్మకాన్ని నిలబెట్టాలని..వాళ్ల ఒత్తిడినంతా తన ఒక్కడి భుజస్కంధాలపైనే వేసుకుంటాడు. ఆంట్రప్రెన్యూర్లు కూడా అంతే. ఉద్యోగుల భారాన్ని, కుటుంబ సభ్యుల ఒత్తిడిని కొన్నిసార్లు భరించాలి.. తప్పదు.

6) బరువు బాధ్యతలు

లీడర్ అనేవాడు గెలుపుని ఎంతగా ఆస్వాదిస్తాడో.. ఓటమిని కూడా అదే స్థాయిలో అంగీకరించాలి. జట్టు కెప్టెన్గా ధోనీ మనస్తత్వమూ అదే. స్టార్టప్ విషయంలోనూ సీఈవోలకు ఇదే వర్తిస్తుంది. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు. ఓడిపోతే కుంగిపోకూడదు.

7) టీం బలాలు బలహీనతలు అర్ధం చేసుకోవడం

ఎంతో ఉత్సాహంతో స్టార్టప్ నెలకొల్పడంతోనే సరిపోదు.. దాన్ని విజయవంతంగా నడపగలగాలి. చేసే వ్యాపారానికి ఏది మంచో ఏది చెడో నిర్ణయించగలగాలి. ఒక కత్తిలాంటి ఐఐటీ కుర్రాణ్ని పెట్టుకున్నాం.. ఇక ఢోకా లేదు అనుకుంటే పొరపాటే. అతనొక్కడే మార్కెట్‌నీ, ప్రజలనీ శాసించలేడు. టాలెంటెడే కావొచ్చు. అంతమాత్రం చేత ప్రతీదీ సాల్వ్ చేస్తాడనకుంటే పొరపాటే. అందుకే టీం బలాబలాలను అంచన వేసినప్పుడే బెస్ట్ అవుట్ పుట్ వస్తుంది. 

Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share
Report an issue
Authors

Related Tags