సంకలనాలు
Telugu

సర్వీస్‌ అపార్ట్‌మెంట్ల వ్యాపారంలో తన సత్తా చాటుున్న '14 స్క్వేర్'

Sri
29th Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

కాళ్లకు చక్రాలు కట్టుకొని, చేతిలో సూట్ కేస్ పట్టుకొని, ఆఫీసు పనుల మీద వేర్వేరు ఊళ్లకు నిత్యం చక్కర్లు కొడుతూ ఉంటారా ? అయితే ఖర్చుకు వెనుకాడుతూనే.. తప్పదన్నట్టు భరిస్తూ వస్తున్నారా ? అయితే మీకు సర్వీస్ అపార్ట్‌మెంట్ల కాన్సెప్ట్ కొద్దోగొప్పో పరిచయం ఉండే ఉంటుంది. కానీ ఈ కాన్సెప్ట్ ఇండియాకు మాత్రం ఇప్పటికీ కొత్తే. సర్వీస్ అపార్ట్‌మెంట్ అంటే... ఫుల్లీ ఫర్నిష్డ్ అపార్ట్‌మెంట్. ఒకట్రెండు రోజులు ఉండాలన్నా, ఒకట్రెండు నెలలు ఉండాలన్నా హోటల్‌లో ఉండే సదుపాయాలన్నీ ఉంటాయక్కడ. ఎక్కువ రోజులు ఉండాలనుకునేవాళ్ల కోసం వంటపాత్రలు కూడా సిద్ధంగా ఉంటాయి. హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, పార్కింగ్ లాంటి సదుపాయాలూ సిద్ధం. ఈ ఖర్చులన్నింటినీ అద్దెలో వసూలు చేస్తారు. అయితే హోటల్‌తో పోలిస్తే సర్వీస్ అపార్ట్‌మెంట్ కు ఏంటీ తేడా అంటే... అద్దె తక్కువగా ఉండటమే. ఒకట్రెండు రోజులు కాకుండా నెలో, రెండు నెలలో క్యాంపు కోసం ఉండాలనుకునే వారికి ఇవి చాలా ఉపయుక్తం. పైగా ఇంట్లో ఉన్న ఫీల్ ఉంటుంది. 

image


ఐడియా ఇలా వచ్చింది !

గౌరంగ్ చంద్రానా, ప్రశాంత్.. ఇద్దరూ బిజినెస్ ట్రావెలర్స్. వ్యాపార వ్యవహారాల నిమిత్తం భారతదేశంలో, విదేశాల్లో వేర్వేరు ప్రాంతాల్లో చాలాసార్లు ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చేది. ఇలా ఊళ్లన్నీ తిరుగుతున్న వీరిని ఓ విషయం బాగా ఆశ్చర్యపర్చింది. విదేశాల్లో ప్రొఫెషనల్ సర్వీస్డ్ అపార్ట్‌మెంట్లు ఉన్నట్టుగా భారతదేశంలో అలాంటి సేవలు లేవని గుర్తించారు. ఇండియాలో ఇలాంటి వ్యాపారం చేస్తే తిరుగుండదని అర్థమైంది. ఈ ఐడియాపై బాగా కసరత్తు, లోతైన పరిశోధనే చేశారు. కార్పొరేట్స్‌ని కలిసి సర్వీస్డ్ అకామిడేషన్ గురించి వివరించారు. తమ కాన్సెప్ట్ ఎలా ఉండబోతోందో, తాము ఎలాంటి సేవలు అందించబోతున్నామో పూసగుచ్చినట్టు తెలిపారు. వీరి కాన్సెప్ట్‌కు మంచి రెస్పాన్స్ రావడం ఎంతో ప్రోత్సహాన్ని ఇచ్చింది. అదే ఉత్సాహంతో విదేశాల్లో, భారతదేశంలో గౌరంగ్, ప్రశాంత్‌లు మార్కెట్ రీసెర్చ్ చేశారు. డాటా సేకరించారు. భారతదేశంలో సర్వీస్డ్ అపార్ట్ మెంట్ కాన్సెప్ట్ ప్రారంభ దశలో ఉందని తెలుసుకున్న వీరికి... ఇలాంటి రూముల కొరత తీవ్రంగా ఉందని అర్థమైంది.

ఒకే గొడుగు కిందికి...

ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షల సర్వీస్డ్ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. భారతదేశంలో మాత్రం ఆ స్థాయిలో ఈ పరిశ్రమ పట్టాలెక్కలేదు. 25 వేల అపార్ట్‌మెంట్లలో 50 వేల గదులు అందుబాటులో ఉన్నా... ఇవన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి. వాటిని స్థానికులు నిర్వహిస్తుంటారు. అక్కడక్కడా ఆర్గనైజ్డ్ బ్రాండెడ్ ప్లేయర్స్ కూడా ఉన్నా... వాళ్ల టార్గెట్ హయ్యర్ సెగ్మెంట్ మాత్రమే. వీటన్నింటినీ ఒకే ట్రాక్ పైకి తెచ్చి, ఈ రంగానికి ఓ రూపు తీసుకురావాలనుకున్నారు వీరిద్దరూ. రాబోయే రోజుల్లో భారతదేశంలో లక్షకు పైగా బ్రాండెడ్ గదులు కావాల్సి ఉంటుందని అంచనా వేసి... ఆ స్థాయిలో పని మొదలుపెట్టారు. పరిశోధన పూర్తైన తర్వాత పనిచేయాల్సిన అవసరం ఉందనిపించింది. అందుకే కంపెనీని పూర్తి స్థాయిలో ప్రారంభించకముందే సేల్స్ మొదలుపెట్టేశారు. అలా 14 స్క్వేర్ ప్రారంభమైంది.

" స్థానికంగా ఇలాంటి సర్వీస్ అపార్ట్‌మెంట్లు మెయింటైన్ చేసే వాళ్లతో మాట్లాడాం. వారి సహకారంతో ఈ సర్వీసుని ఏకతాటిపైకి తీసుకొస్తున్నాం. ప్రామాణికమైన అపార్ట్‌మెంట్లు, సర్వీసులను తీర్చిదిద్దుతున్నాం. వీటిని కస్టమర్లకు పరిచయం చేస్తున్నాం. మారియట్, వెస్టిన్, నోవోటెల్‌లో బస చేసేందుకు ఎంతమంది వెళ్తారో... త్వరలో మా దగ్గరకు అంతేమంది వస్తారు" అని ధీమాగా చెబుతున్నారు అంటారు ప్రశాంత్.

ప్రశాంత్... కామర్స్ గ్రాడ్యుయేట్. పీజీ కూడా చేశారు. యూకేలో ప్రాపర్టీ లీగల్ సర్వీసెస్‌లో సుదీర్ఘ అనుభవం ఉంది. డబ్ల్యూఎన్ఎస్‌కి ఇండియాలో ఆపరేషన్స్ హెడ్‌గా పనిచేశారు. దాంతో పాటు యూకేలో ఫండెడ్ వెంచర్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2002లో బెంగళూరులో సొంతగా లీగల్ సంస్థ ఏర్పాటు చేశారు. ఈ సంస్థను ఇప్పటికీ ఆయన సోదరుడు నిర్వహిస్తున్నారు. గౌరంగ్‌కు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో 14 ఏళ్ల అనుభవం ఉంది. ప్రముఖ సంస్థల్లో సీనియర్ కేడర్‌లో, పలు విభాగాలకు హెడ్‌గా పనిచేశారు. బ్యాంకింగ్, మార్టిగేజ్, రిస్క్ మేనేజ్‌మెంట్ లో ఎక్స్‌పర్ట్. ప్రశాంత్, గౌరంగ్ ఇద్దరూ పూణేలో నాలుగేళ్ల క్రితం ఇంక్యుబేటర్ ఫోరంలో కలుసుకున్నారు. ఈ ఇద్దరు స్నేహితులూ కలిసి ఈ రంగంలో ఏదైనా కొత్తగా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. మొదట రియల్ ఎస్టేట్ పోర్టల్ కోసం ఔట్‌సోర్సింగ్ చేశారు. రియల్ ఎస్టేట్ వెల్త్ మేనేజ్‌మెంట్ అడ్వైజరీ ఏర్పాటు చేసి సేవలందించారు.

image


టీమ్ @ 14 స్క్వేర్

2014లో కేవలం ఇద్దరు ఉద్యోగులతో 14 స్క్వేర్‌ని ప్రారంభించారు. వీరికున్న ఇతర బిజినెస్ నుంచి వనరుల్ని వాడుకొని స్టార్టప్‌ని ముందుకు నడిపించారు. ఐడియాపై వర్కవుట్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ డిజైన్, బ్రాండ్ కన్సల్టెంట్‌గా శైలజా షాను నియమించుకున్నారు. ఇంటిగ్రేటెడ్ డిజైన్ వర్క్స్ ఫౌండర్, క్రియేటివ్ డైరెక్టర్ ఆమె. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో గ్రాడ్యుయేట్. న్యూయార్క్‌లోని పార్సన్స్‌లో పీజీ చేశారు. 12 ఏళ్ల అనుభవం ఉంది. మిగతా ఉద్యోగులు కస్టమర్ సర్వీస్, హాస్పిటాలిటీ, ఆపరేషన్స్‌లో రెండుమూడేళ్ల అనుభవం ఉన్నవాళ్లు. స్థానికంగా ఈ సర్వీసుని అందించే వారి ఆలోచనలు వేరుగా ఉండేవి. మార్కెట్లో ఉన్న అవకాశాల్ని అర్థం చేసుకోకుండా ఓ గిరి గీసుకొని అదే ప్రపంచం అనుకునేవాళ్లు. వారిని ఒప్పించడం వీరికి సవాలుగా మారింది.

ఫ్యూచర్ ప్లాన్స్

సవాళ్లను అధిగమిస్తూ ముందుకెళ్తోంది ఈ సంస్థ. ప్రతీ త్రైమాసికానికీ అమ్మకాలు రెట్టింపు అవుతున్నాయి. వచ్చే నాలుగైదు నెలల్లో రోజుకు 100 గదులు అద్దెకివ్వాలన్నది టార్గెట్. పూణేలో ప్రారంభమైన కంపెనీ ప్రస్తుతం 10 నగరాలకు విస్తరించింది. కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, పూణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి నగరాల్లో అడుగుపెట్టాలనుకుంటున్నారు. "ప్రస్తుతం మేం నెట్వర్క్ పార్ట్‌నర్స్‌ని ఉపయోగించుకుంటున్నాం. దాంతో పాటు మా టీంని పెంచుకుంటాం. సొంతగా బ్రాండెడ్ రూమ్స్ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం " అంటారు ప్రశాంత్. ఇప్పటివరకు 14 స్క్వేర్‌కు 35 లక్షల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. నలుగురూ వ్యక్తిగత పెట్టుబడిదారులే. మరో 3.25 కోట్ల నిధులు రానున్నాయి. తక్కువ వ్యవధిలోనే బిజినెస్‌కు మంచి ఊపు తీసుకొచ్చిన ఈ టీం.. వ్యాపారాన్ని పెద్దగా చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 24 నెలల్లో 30 నగరాల్లో10 వేల సొంత బ్రాండెడ్ రూమ్స్ ఉండాలన్నది టార్గెట్.

website

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags