సంకలనాలు
Telugu

యాప్స్‌లో టాప్‌కి చేరిన 'పర్పుల్ టాక్స్'

29th Sep 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

2008 అంటే మొబైల్ యాప్ విప్లవం ప్రారంభ దశ. అప్పటికి బహుశా యాప్స్ అంటే భారత దేశంలో చాలా మందికి పెద్దగా తెలియని పదం. అందుకు హైదరాబాద్ కూడా మినహాయింపేమీ కాదు. ఆండ్రాయిడ్ మొబైల్స్ ఇంకా మార్కెట్ లోకి రాలేదు. యాపిల్ ఐఫోన్ అప్పుడే లాంచింగ్ అయింది. అలాంటి సమయంలోనే యాప్స్ డెవలప్‌మెంట్‌లోకి ప్రవేశించిన కంపెనీ పర్పుల్ టాక్స్. భవిష్యత్‌లో జనం యాప్స్ లేకుండా నిమిషం కూడా గడపలేరనే విషయాన్ని గ్రహించిన స్టార్టప్ ఇది. ఇప్పుడు ఎన్నో దేశాల్లో పర్పుల్ టాక్స్ తయారు చేసిన యాప్స్‌ని కోట్లమంది యూజర్లు వాడుతున్నారు. ఈ సంస్థకు అమెరికాలోనే 90శాతం మంది క్లెయింట్స్ ఉన్నారు.

image


“మేమీ వ్యాపారం ప్రారంభించిన రోజుల్లో అసలు ఎకో సిస్టమ్ లేదు. మొదటి రోజుల్లో రెడీమేడ్‌గా యాప్ డెవలపర్స్ లేరు. కానీ ఈ ప్లాట్ ఫాం లో మొదటి తరం కంపెనీ మాదే అని చెప్పుకోడానికి గర్వంగా ఉంది” - సిఓఓ రవి కోరుకొండ.

స్ట్రాటజీ అండ్ ఐడియా

పర్పుల్ టాక్స్‌ని నడిపించింది స్ట్రాటజీ, ఐడియా అనే రెండు పదాలు మాత్రమే. ఏదైనా సంస్థ లేదా స్టార్టప్ ఈ కంపెనీ దగ్గరకు వచ్చి యాప్ డెవలప్ చేయాలని అడిగినప్పుడు, వాళ్ల గురించి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత వారికొక ప్రజెంటేషన్ పంపుతుంది. ఎలాంటి యాప్ ఆ కంపెనీకి పనికొస్తుందో అందుటో వివరిస్తారు. ఇందులో ప్రధానంగా స్ట్రాటజీ, ఐడియాలను అందిస్తారు. మార్కెట్లోకి ప్రవేశించే ఆలోచనని వివరించిన తర్వాత దాన్ని అమలు చేసే వ్యూహాన్ని సైతం అందిస్తుంది పర్పుల్ టాక్స్. ఇదే ఈ కంపెనీ ఈ స్థాయిలో ఎదగడానికి కారణం. ఏదో యాప్ ఒకటి అడిగారు.. కదా.. చేసి ఇచ్చేస్తే మన పని అయిపోతుంది చాలు అనుకుంటే.. ఈ రోజు ఈ స్థాయిలో ఉండేది కాదు అనడంలో సందేహం లేదు.

మార్కెట్ లో చాలా మంది యాప్స్ తయారు చేస్తారు. కానీ వారికీ మాకూ తేడా ఇదే. మేం చేసే యాప్స్‌లో ఈ రెండు విషయాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వీటితో పాటు 24x7 కస్టమర్ సపోర్టు ఉండటం తమకు అడ్వాంటేజ్ అని వివరిస్తారు రవి.

image


యాప్స్ అండ్ గేమ్స్‌కి కేరాఫ్

భారత్ , అమెరికాతో పాటు చాలా దేశాల్లో దాదాపు 600లకు పైగా యాప్స్ తయారు చేశారు. దీంతో పాటు మొబైల్ గేమ్స్‌కు లెక్కేలేదు. హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన గేమ్స్ తయారు చేసిన మొదటి కంపెనీ మన హైదరాబాద్‌కి చెందిన పర్పుల్ టాక్స్ అంటే నమ్ముతారా ? దీంతో పాటు ఎన్నో గ్లోబల్ ప్రాడక్టులను మొబైల్ ఫ్లాట్ ఫాంకి అందించిన సంస్థ ఇది. ఎక్స్ క్యూబ్ ల్యాబ్స్ ఈ సంస్థకు చెందని సంస్థే. గేమ్స్ తయారీలో ఎక్స్ క్యూబ్ నంబర్ వన్ బ్రాండ్. 2008లోనే డల్లాస్ డిజైనబుల్ అవార్డు తీసుకున్న ఈ సంస్థ ఆ తర్వాత 30కి పైగా అంతర్జాతీయ అవార్డులు అందుకుంది.

“ పర్పుల్ ల్యాబ్స్‌కి ఇప్పటికీ అవార్డులు వస్తున్నాయంటే. మా సెగ్నెంట్ లో ఉన్న పోటీకి తట్టుకొని టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో తామే ముందున్నామని అర్థం ” రవి

జీఈ, ఇంటెల్, ఐడియాతో పాటు ఎన్నో దేశీయ, అంతర్జాతీయ సంస్థలు తమ క్లెయింట్స్ లిస్టులో ఉన్నారు. మడగాస్కర్ గేమ్‌ని కూడా వీళ్లే తయారు చేశారు. ఇప్పటి వరకూ చేసింది ఒక ఎత్తైతే ఇంకా చేయాల్సింది మరో ఎత్తని అంటారు రవి.

ఐపిఈ ఏషియా పశిఫిక్ హెచ్ఆర్ఎం కాంగ్రెస్ అవార్డు తో రవి

ఐపిఈ ఏషియా పశిఫిక్ హెచ్ఆర్ఎం కాంగ్రెస్ అవార్డు తో రవి


పర్పుల్ టాక్స్ టీం

రవి కోరుకొండ పర్పుల్ టాక్స్ కో ఫౌండర్ , సీఓఓ. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంసిఏ పూర్తి చేసిన ఆయన మొబైల్ ఫ్లాట్ ఫాంలో యాప్స్‌ సహా ప్రొడక్టులపై ఆసక్తితో కంపెనీ ప్రారంభించారు. ఈయనతో పాటు మరో ఐదుగురు టీం ఉన్నారు. శ్రీధర్ ముట్టిడి గేమింగ్, నీలేష్ జహంగీర్ ధర్.. గేమింగ్ ప్రొడక్టుకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటారు. మిగిలిన వారిలో హరి పిఎస్ చీఫ్ ఆర్కిటెక్చర్,రామక్రిష్ణ చీఫ్ ఇంజనీర్. భరత్ లింగ్ కంపెనీ సిఈఓగా ఉన్నారు. సంస్థలో ఆన్ రోల్ ఉద్యోగులు 410మంది. పర్పుల్ టాక్ ఆఫీసంతా ఓపెన్ డెస్క్. క్యాబిన్లు కూడా అరుదు. అంతా ఓ కుటుంబంలా కలసి పనిచేస్తారు. ఒక్కోటీంకి ఒక్కో డెస్క్ ఇస్తారు. అంతా డిస్కస్ చేసుకొని పనిచేసే విధంగా ఆఫీస్ డిజైన్ చేశారు.

పర్పుల్ టాక్స్ సేవాకార్యక్రమాలు

సంస్థ మొదలు పెట్టిన రోజునుంచే సేవాకార్యక్రమాలు చేస్తోంది. ఎడ్యుకేషన్ ఫర్ ఫ్రీ అనే ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన పర్పుల్ టాక్స్ దీనికి అనుబంధంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లలో కేమెరా, ప్రొజెక్టర్, స్క్రీన్ లను ఈ సంస్థ అందిస్తుంది. దీని ద్వారా తమ సొంతూరులోని పాఠశాలలకు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా పాఠాలు చెప్పే వెసులు బాటు కల్పిస్తున్నారు. స్కూల్ చదువును మధ్యలోనే ఆపేసిన పేద విద్యార్థులకు తిరిగి స్కూల్లో చేర్పించడం, వారికి కంప్యూటర్ విద్య నేర్పించడం లాంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. భవిష్యత్ లో ఎడ్యుకేషన్ ఫర్ ఫ్రీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు రవి.

image


పర్పుల్ టాక్స్ అనుబంధ ప్రాడక్టులు

‘అప్ షాట్’ అనేది మొబైల్ ఎంగేజిమెంట్ ఫ్లాట్ ఫాం. తాము డెవలప్ చేసిన యాప్స్‌లో యూజర్లు యాప్‌ని వదిలి వెళ్లిపోయిన సందర్భంలో ..దానికి సొల్యూషన్ కోసం తయారు చేసిన ఫీచర్ ఇది. యాప్ లోపల ఇన్‌స్టాల్ అయి ఉండి యాప్‌కి యూజర్ ఎంగేజ్ అయి ఉండేలా చూస్తుంది.

‘నొక్కడ్ షాప్స్’ అనేది వీధిలో ఉండే కిరాణా షాపుల్లోని గ్రాసరీ, ఇతర ప్రాడక్టులు వివరాలను మనకు అందిస్తుంది. యాప్ లో చూసుకొని మనం కిరాణా తెచ్చుకోవచ్చు. చిన్న చిన్న కిరణా షాపులకు కస్టమర్లను ఎంగేజ్ చేయడం దీని ఉద్దేశం. ఇంటికింద, పక్కింటిలో ఉండే చిన్న చిన్న కిరాణా షాపులతో కస్టమర్లను కలపడం దీని ఉద్దేశం.

సవాళ్లు

తాము ఈ ఫ్లాట్ ఫామ్ లోకి అడుగు పెట్టినప్పుడు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం ఓ పెద్ద సవాలు. దాన్ని జయించి ముందుకుకొచ్చి టాప్ ప్లేస్ కి చేరుకున్నాం. అయితే ఇప్పుడు టెక్నాలజీ మరింత విస్తరించింది. మార్కెట్ లో యాప్ డెవలప్‌మెంట్ పై ఎన్నో కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. వెబ్ ప్రాడక్టులను కూడా తయారు చేస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు సవాళ్లుగానే ఉన్నాయి. అయితే తాము కస్టమర్లకు ఇచ్చే ఫీచర్స్ గానీ మరే ఇతర సేవల విషయానికొస్తే తమకెవరూ సాటి రాలేరని రవి ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. మొబైల్ ఫ్లాట్ ఫామ్ లోనే తాము ప్రారంభమై, అందులోనే కొనసాగుతున్నామని.. భవిష్యత్ లో కూడా మొబైల్ ఫ్లాట్ ఫామ్ లోనే మరిన్ని వండర్స్ క్రియేట్ చేస్తామంటున్నారు. దీంతో తమకు కాంపిటీటర్స్ ఎవరూ ఉండరని అంటున్నారాయన.

భవిష్యత్ ప్రణాళికలు

మోడీ డిజిటల్ ఇండియా మాకు ఓ అపురూప అవకాశం. యాప్స్ మార్కెట్ అమాంతం పెరుగుతుందనే సంకేతాలున్నాయి. ప్రస్తుతం ఉన్న మా టీం ని 1000మందిని చేయాలి. ప్రతి ఏడాది రెండు సరికొత్త ప్రాడక్టుల్ని లాంచ్ చేయాలనే లక్ష్యంతో ముందుకు దూసుకు పోతున్నామన్నారు రవి. పూర్తి స్థాయి బూట్‌స్ట్రాప్డ్ కంపెనీ అయిన తమకు ఫండ్ రెయిజింగ్ అవసరం లేదని తమ ఆదాయంపైనే ముందుకెళతామంటున్నారు. హైదరాబాద్‌లో స్టార్టప్ కల్చర్, ఎకో సిస్టమ్ ప్రారంభం కాని మొదటి రోజు నుంచి తామున్నామని, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో తామూ భాగస్వాములం అవుతామన్నారు.

image


Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags