సంకలనాలు
Telugu

హలో డాక్టర్.. పేషెంట్ ఇక్కడున్నాడు

Krishnamohan Tangirala
1st Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

2010లో భారత దేశంలో ప్రతీ 10వేల మందికి ఒక సాధారణ వైద్యుడు అందుబాటులో ఉన్నాడు. 2012 నాటికి ఈ సంఖ్య కొద్దిగా పెరిగిందంతే. ఇవీ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుబంధ విభాగం గ్లోబల్ హెల్త్ వర్క్ ఫోర్స్ వెల్లడించిన గణాంకాలు.

వైద్యులకు, రోగులకు మధ్య ఎంత అంతరం ఉందో ఈ గణాంకాలతో స్పష్టమవుతుంది. 2010లో ప్రారంభమైన 'హలో డాక్టర్ 24x7 '.. ఒడిషాలో ఈ గ్యాప్‌ను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఇద్దరి మధ్య వారధిగా కార్యకలాపాలు సాగిస్తోంది.

ఔట్ పేషెంట్ విభాగంలో వైద్యుల కొరత సమస్యకు పరిష్కారం వెతకాలని.. మెడికల్ స్కూల్‌లో ఉన్నపుడే ఆలోచించారు డాక్టర్ లలిత్ మానిక్. ఔట్ పేషెంట్ విభాగాల చుట్టూ వందల కొద్దీ రోగులు తిరుగుతూ, సమాచారం అందించాల్సింగా డాక్టర్‌లని అడిగే సంఘటనలు ఆయనకు ఇంకా గుర్తున్నాయి. కేఐఐటీ యూనివర్సిటీకి చెందిన టెక్నాలజీ బిజినెస్ విభాగంలో ఈ వెంచర్ పురుడు పోసుకుంది. సహ వ్యవస్థాపకుడు సంజయ్‌దాస్ ₹20 లక్షల సీడ్ ఫండింగ్ చేశారు డాక్టర్ 24x7కి.

image


రోగులకు డాక్టర్ల సమాచారం అందించే వారధిగా 2010 నుంచి సేవలందిస్తోంది ఈ స్టార్టప్. వీరి మరో సర్వీస్ పేషెంట్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్. దీని ద్వారా.. ఆస్పత్రులకు అవసరమైన కాల్స్ తీసుకోవడం బ్యాక్‌ఎండ్ సేవలను నిర్వహించడం. తమ సేవలను మరిన్ని విభాగాల్లోకి విస్తరించాలని భావించారు లలిత్. ఈ వెంచర్‌కు సంబంధించిన అవకాశాలను తెలుసుకోవడం కోసం స్కాట్లాండ్‌లోని డూండీ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ హెల్త్ విభాగంలో మాస్టర్స్ పట్టా కూడా పొందారు. ఒకవైపు స్టార్టప్‌ను నడుపుతూనే.. ఈ కోర్స్ చేయడం విశేషం.

ప్రస్తుత కో ఫౌండర్ శశాంక్ సింఘాల్.. ఇక్కడే పరిచయమయ్యారు లలిత్‌కి. ఇంగ్లాండ్‌లోనే ఐదు రోజుల వరకూ కనీసం ఫిజీషియన్ అపాయింట్‌మెంట్‌ కూడా దొరకని పరిస్థితి ఉన్న టైంలో.. భారత్‌లో 24x7 టెలి కమ్యూనికేషన్స్ అందించాలన్న ఆలోచన శశాంక్‌కి వచ్చింది.

సగటున ప్రతీ డాక్టర్‌కి రోజుకు కనీసం 20 కాల్స్ అయినా వస్తుంటాయి. వీటిలో ప్రధానమైన 8 కాల్స్‌ను మిస్ అవుతూ ఉంటారు వైద్యులు. కొన్నిసార్లు ముఖ్యమైన పేషెంట్స్‌కు కూడా తిరిగి కాల్ చేసే విషయాన్ని మర్చిపోతుంటారు.

తమ వెంచర్‌లోకి అడుగుపెట్టాల్సిందిగా శశాంక్‌ను లలిత్ ఆహ్వానించారు. బోర్డ్‌లోకి ప్రవేశించి అదే వెంచర్‌లో టెలిఫోన్ ఆధారిత కన్సల్టేషన్ సర్వీసులను అందించడం ప్రారంభించారు. తొలి దశలో 200 మంది డాక్టర్లు, 500 మంది పేషెంట్లను కలిసి, స్వయంగా పరిశోధన చేశారు శశాంక్. ఈ అనుభవం అనేక విషయాలను నేర్పడంతోపాటు.. ఎంతో సరదాగా సాగిందని చెబ్తున్నారు శశాంక్. తమ సర్వీసులను భువనేశ్వర్‌లోనే అందించడానికి... ఈ వెంచర్ వ్యవస్థాపకుల దగ్గర తగిన కారణాలే ఉన్నాయి.

24×7 కన్సల్టేషన్ సర్వీసులు అందించే విభాగం 2015 జనవరిలో ప్రారంభమైంది. ఇప్పటికే 6వేల కాల్స్, 3 వేలమంది రిజిస్టర్డ్ పేషెంట్స్‌తో కొన్ని మైలురాళ్లను కూడా అధిగమించింది ఈ స్టార్టప్. వీరిలో 40 శాతం రిపీటెడ్ రోగులే కావడం విశేషం. వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్నవారు, డాక్టర్లను కలిసేందుకు తగిన సమయం లేనివారు, తీవ్రవ్యాధులతో ఇబ్బంది పడేవారు, గర్భిణ మహిళలు, వృద్ధులు... తమ ప్రారంభ కస్టమర్లలో వీరు ఎక్కువగా ఉన్నారని చెబ్తున్నారు హలోడాక్టర్ నిర్వాహకులు.

రోజుకు 42 ఇన్‌బౌండ్ కాల్స్ వస్తుండగా.. వీరిలో 40శాతం మంది కస్టమర్లు డాక్టర్లను కన్సల్ట్ చేస్తున్నారు. 12 మందితో మొదలైన ఈ వెంచర్.. ప్రస్తుతం 18 మందికి చేరింది. ప్రస్తుతం ఒడిషాలోని 10 జిల్లాల్లో సేవలు అందిస్తోంది ఈ కంపెనీ.

హలో డాక్టర్ ఎలా ?

ఈ సర్వీసులు ఉపయోగించుకునేందుకు.. యూజర్లు కొంత మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా చెల్లించి.. అప్పుడు హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. డయల్ చేసిన వ్యక్తిని, కాల్ రిసీవ్ చేసుకున్న ఆపరేటర్ కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వారి సమస్యను తెలుసుకుని, అర్ధం చేసుకోవడం ద్వారా.. ఏ డాక్టర్‌ను వారు సంప్రదించాల్సి ఉంటుందో ఓ అంచనాకు వస్తాడు ఆపరేటర్. ఆయా డాక్టర్లకు పేషెంట్‌ కాల్ లింక్ చేసే బాధ్యతని కూడా నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే హలోడాక్టర్ వెబ్‌సైట్‌లో పెద్ద మొత్తంలో ఆరోగ్య సంబంధిత సమాచారం.. ఉచితంగానే అందుబాటులో ఉండడం విశేషం.

ప్రతీ డాక్టర్‌కి స్పెషాలిటీని బట్టి టారిఫ్ ఉంటుంది. సాధారణ ఫిజీషియన్‌కు నిమిషానికి 20, గైనకాలజిస్ట్, డెంటిస్ట్ వంటి స్పెషలిస్ట్‌ల కన్సల్టేషన్‌కు ₹40, సూపర్ స్పెషాలిటీ డాక్టర్‌ను సంప్రదించేందుకు నిమిషానికి 60 ఛార్జ్ వసూలు చేస్తారు.

ఆన్‌లైన్ ద్వారా చెల్లించిన మొత్తం ఫీజు ద్వారా లభించిన ఆదాయం నుంచి తమ ఛార్జ్‌గా 40 శాతం వీరికి లభిస్తుంది. 2015లో మార్చ్-జూన్ కాలంలో ₹రూ. 1,95,400 ఆదాయం ఆర్జించగా.. ఇందులో 40 శాతం సేల్స్‌కు, మిగిలిన మొత్తం ప్రమోషన్స్‌కు ఉపయోగించారు.

image


హలో తర్వాత ఏంటి ?

రోజుకు 1,200 కన్సల్టేషన్ సర్వీసుల స్థాయికి ఎదగాలన్నది హలోడాక్టర్24x7 ప్రాథమిక లక్ష్యం. వీరు ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకున్నారు. తాజాగా రెండు డిజిటల్ హెల్త్ కియోస్క్‌లను ప్రారంభించారు. వీటి నుంచి డాక్టర్‌లను సంప్రదించి.. ప్రిస్క్రిప్షన్‌ను ప్రింట్అవుట్ రూపంలో పొందచ్చు. ఫార్మసీలు, ల్యాబొరేటరీలను ప్రారంభించడం ద్వారా..ఈ విభాగాన్ని వంద కియోస్క్‌ల స్థాయికి చేర్చాలని భావిస్తున్నారు. మరో ఆరు నెలల్లో దేశంలోని 4 రాష్ట్రాల్లో సేవలు విస్తరించాలని భావిస్తున్నారు హలోడాక్టర్ టీం. 3 లక్షల యూజర్ల మార్క్‌ను అందుకునే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు.

ఔషధాలను ఇంటింటికీ డెలివరీ చేసే విభాగాన్ని ప్రారంభించేందుకు ఈ స్టార్టప్ ప్రయత్నిస్తోంది. స్థానిక కెమిస్ట్‌లు, ఫార్మాస్యూటికల్స్‌తో ఒప్పందాలు చేసుకుని, ఈ సెగ్మెంట్‌ను సక్సెస్ చేయాలనే ప్రణాళికలున్నాయి. మెడికల్ షాప్‌లలో హెల్త్ కియోస్క్‌ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు.

సైఫ్ పార్ట్‌నర్స్, హెల్త్ స్టార్ట్, ఆక్యుమెన్ ఫండ్, ఐవీ క్యాప్ వెంచర్స్‌తో పాటు పలువురు ప్రైవేట్ ఇన్వెస్టర్లను, వెంచర్ కేపిటలిస్ట్‌లను కలిసి.. తమ ప్రాజెక్ట్‌పై ప్రెజెంటేషన్ ఇవ్వడం ద్వారా.. నిధుల సమీకరణకు ప్రయత్నిస్తున్నారు.

వెబ్‌సైట్

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags