ఈ టీ షర్ట్ తొడుక్కుంటే చాలు అదే మిమ్మల్ని నడిపిస్తుంది

హైదరాబాదీ సరికొత్త ఆవిష్కరణ సిగ్నల్ టీ షర్టు

ఈ టీ షర్ట్ తొడుక్కుంటే చాలు అదే మిమ్మల్ని నడిపిస్తుంది

Saturday February 18, 2017,

3 min Read

మార్కెట్లో ఫిట్‌ నెస్ ట్రాకర్లు చాలానే ఉన్నాయి. కానీ వాటిని చేత్తో హ్యాండిల్ చేయాలి. లేదంటే రిస్ట్‌ కు కట్టుకోవాలి. కానీ టీ షర్టునే హెల్త్ ట్రాకర్‌ గా మార్చారు హైదరాబాదీ ఆంట్రప్రెన్యూర్ అయ్యప్ప నాగుబంది.

అయ్యప్ప తన బృందంతో మూడు నెలలు కష్టపడి సరికొత్త ఫిట్ నెస్ ట్రాకర్‌ను డిజైన్ చేశారు. టీ షర్టు లోపలే హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ అమర్చి ఉంటుంది. టీ షర్టు వెనక వైపు ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. అవి మీరు ఎంత దూరం నడిచారు, ఎంత సేపు రన్నింగ్ చేశారు, ఎన్ని మెట్లు ఎక్కారు, ఎన్ని క్యాలరీలు ఖర్చు చేశారో క్యాప్చర్ చేస్తాయి. టీ షర్టును యాప్‌కి కనెక్ట్ చేయగానే డేటా అంతా మొబైల్‌లోకి అప్‌ లోడ్ అవుతుంది.

image


సిగ్నల్ టీ షర్టులో రెండు ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. ఉదాహరణకు కారులో బేగంపేట్‌ నుంచి హైటెక్ సిటీకి వెళ్లాలనుకోండి. మొబైల్‌లో మ్యాపింగ్ ఓపెన్ చేసి డ్యాష్ బోర్డు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేస్తాం. కానీ బైక్‌ మీద అలా వెళ్లడం కష్టం. జీపీఎస్ ట్రాకింగ్ వర్కవుట్ కాదు. ఫోన్‌లో డైరెక్షన్స్ సెట్ చేసుకొని హెడ్ సెట్ పెట్టుకోవచ్చు గానీ.. అదంత సేఫ్ కాదు. సిగ్నల్ టీ షర్డుతో అలాంటి ఇబ్బందులేమీ ఉండవు. టీ షర్టు రెండు షోల్డర్స్ దగ్గర రెండు వైబ్రేటర్స్ ఉంటాయి. కుడి వైపు తిరగాలంటే రైట్ షోల్డర్ వైబ్రేట్ అవుతుంది. లెఫ్ట్ టర్న్ తీసుకోవాలంటే ఎడమ వైపు వైబ్రేషన్ వస్తుంది. డెస్టినేషన్ రీచ్ అయ్యాక రెండు వైపులా సెన్సర్లు వైబ్రేట్ అవుతాయి.

ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే.. జిమ్‌లో ట్రెడ్ మిల్ మీద రన్నింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ తీసి పక్కన పెట్టేస్తుంటాం. ఆ సమయంలో మెసెజ్ వచ్చినా, ఫోన్ రింగ్ అయినా.. టీ షర్ట్ షోల్డర్లు రెండూ వైబ్రేట్ అవుతాయి. వెంటనే వ్యాయామం ఆపేసి ఫోన్ అటెండ్ చేయొచ్చు.

టీ షర్టు కొన్న తర్వాత ముందుగా యాప్ డౌన్ లోడ్ చేసి పెయిర్ చేయాలి. ప్రతి టీ షర్టుకి ఒక యునిక్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్‌ని ఫోన్‌లో ఎంటర్ చేస్తే టీ షర్టు పెయిర్ అవుతుంది. రిజిస్ట్రేషన్ సమయంలో జెండర్, ఏజ్, వెయిట్ వివరాలు నమోదు చేస్తే.. యాప్ ఆటేమేటిగ్గా కేలరీలను కాలిక్యులేట్ చేస్తుంది. ఎప్పటికప్పుడు హెల్త్ డేటాను అప్‌ డేట్ చేస్తుంటుంది. ఇవాళ ఎంత సేపు వాకింగ్ చేయాలి, ఎన్ని క్యాలరీలు బర్న్ చేయాలి, ఎంత బరువు తగ్గాలో కూడా చెప్తుంది. ఈ టీ షర్టుని కాటన్‌తోపాటు డ్రై ఫిట్ అనే ప్రత్యేకమైన బట్టతో తయారు చేశారు. ఎంత చెమట పట్టినా అబ్జార్బ్ చేసుకోవడం దీని ప్రత్యేకత.

సిగ్నల్ టీ షర్ట్ ఆవిష్కర్త అయ్యప్ప

సిగ్నల్ టీ షర్ట్ ఆవిష్కర్త అయ్యప్ప


కొత్త ఐడియాలతో వచ్చే యువతకు తెలంగాణలో అవకాశాలకు కొదవ లేదంటున్నారు సిగ్నల్ టీ షర్టు సృష్టికర్త అయ్యప్ప. ఆంట్రప్రెన్యూర్లకు తెలంగాణ ప్రభుత్వం చక్కటి ప్రోత్సాహం అందిస్తోందని.. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగానికి ఇక్కడ మంచి అవకాశాలున్నాయని చెప్తున్నారాయన.

సిగ్నల్ టీ షర్టులకు హైదరాబాద్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. సేల్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎన్నో ఫిట్‌ నెస్ గాడ్జెట్లు చూశాం గానీ ఇలాంటి ఫిట్‌ నెస్ టీ షర్టును ఇంతవరకు చూడలేదంటున్నారు కస్టమర్లు. హెల్త్ ట్రాకింగ్‌తోపాటు డ్రైవింగ్‌ చేయడానికీ టీ షర్టు ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు.

సిగ్నల్ టీ షర్టు పేటెంట్‌ కోసం అయ్యప్ప దరఖాస్తు చేసుకున్నారు. పేటెంట్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్‌గా బ్రాండ్‌ని ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. దీనికంటే ముందు డిజిటల్ టీ షర్టు తయారుచేశాడు.

image


అయ్యప్ప పుట్టి పెరిగిందంతా హైదరాబాదులోనే. నాన్న రిటైర్ ఆర్మీ. టెన్త్ వరకు ఆర్మీ స్కూల్లో చదివాడు. ఉస్మానియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. మొదట సత్యంలో రిసెప్షనిస్టుగా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ప్రమోషన్. వెబ్ డిజైనర్ గా కొన్నాళ్లు. వెబ్ డెవలపర్ గా మరికొన్నాళ్లు. తర్వాత టీం లీడర్ అయ్యాడు. సింగపూర్ యూకే యుఎస్ఏలో కూడా వర్క్ చేశాడు. వరల్డ్ బ్యాంకులో ఏడాదిన్నర పనిచేశాడు.

అక్కడే డిజిటల్ టీ షర్టు ఐడియాను చాలామందికి చెప్పాడు. అందరికీ నచ్చింది. అమెరికా నుంచి కొంతమంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు. దాంతో జాబ్ కి రిజైన్ చేసి ఇండియాకి వచ్చాడు. డిజిటల్ టీ షర్టు మీద వర్కవుట్ చేయడం మొదలుపెట్టాడు. ఐదు నెలల సుదీర్ఘ ప్రయత్నం తర్వాత- టీ షర్ట్ ఒక రూపుకొచ్చింది. రెస్పాన్స్ చాలా బాగుంది. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎక్స్ పోర్ట్ అసోసియేషన్ ఈ మధ్యనే ఒక ఈవెంట్ కండక్ట్ చేసింది. దాంట్లో పార్టిసిపేట్ చేస్తే.. బెస్ట్ గాడ్జెట్ అవార్డు దక్కింది. దాన్ని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల అందుకోవడం మెమరబుల్ ఫీలింగ్ అంటాడు అయ్యప్ప.