సంకలనాలు
Telugu

క్లిక్ అండ్ పే ఉంటే చాలు..! కార్డులు, డబ్బులు అవసరం లేదు..!!

ashok patnaik
20th Jul 2016
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share


భవిష్యత్ లో క్రెడిట్ అండ్ డెబిట్ కార్డుల అవసరం ఉండదు. ఎందుకంటే వాటి స్థానంలో మొబైల్ వాలెట్లు వస్తున్నాయి. ఇప్పటికే పేటిఎం లాంటి సంస్థలు పెట్రోల్ బంక్ లలో పేమెంట్లను మొబైల్ నుంచే చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి. కొన్నాళ్లకు కార్డుల శకం ముగుస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఒక్క పేమెంట్ గే వేపైనే ఆధారపడి ప్రారంభమైన స్టార్టప్ లకు కష్టమే. దానికి మరిన్ని సేవలను కలపి అందించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే స్టార్టప్ అలాంటిదే. క్లిక్ అండ్ పే పేరుతో హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఈ సంస్థ నెల రోజుల్లోనే 2వేల మంది క్లయింట్స్ ని సంపాదించుకుంది.

image


ఏదైనా ఒక సమస్య తీవ్రత గుర్తించాలంటే ఆ సమస్య మనకు ఎదురైనప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. క్లిక్ అండ్ పే విషయంలో కూడా అదే జరిగింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన కల్యాణ్ సులేఖా డాట్ కామ్ అనే సంస్థలో పనిచేశారు. అది కూడా చెన్నయ్ లో. అప్పుడు ఎదురైన ప్రాబ్లం క్లిక్ అండ్ పే ఏర్పాటు చేయడానికి కారణమైంది. ఒకసారి కల్యాణ్ కారు మధ్యలో ట్రబులిచ్చింది. మెకానిక్ వచ్చాడు. రిపేర్ చేశాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ అతనికి డబ్బులు ఇవ్వాలంటే లిక్విడ్ క్యాష్ లేదు. కార్డులున్నాయి. దేవుడా అనుకుంటూ ఏటీఎం కోసం చాలాదూరం నడిచాడు. చివరికి ఒక ఏటీఎం దగ్గర ఆగాడు. తీరా చూస్తే అక్కడ చాంతాండంత క్యూ. నెల మొదటివారం కావడంతో ఉద్యోగులంతా ఏటీఎం దగ్గర బారులు తీరారు. పైగా ఎటిఎం సర్వర్ సమస్యతో మొరాయించింది. ఇక చేసేది లేక మరో స్నేహితుడికి ఫోన్ చేసి డబ్బులు తెప్పించుకున్నాడు. ఈ సంఘటన జరిగి సరిగ్గా రెండున్నరేళ్లైంది. అప్పుడు బుర్రలో క్లిక్కయిన సొల్యూషన్ క్లిక్ అండ్ పే గా అవతారమెత్తంది అంటాడు కల్యాణ్.

image


క్లిక్ అండ్ పే పనితీరు

1.క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ చేయడమనేది క్లిక్ అండ్ పే ప్రధాన ఉద్దేశం. మొబైల్ యాప్ ద్వారానే కస్టమర్లు అన్ని పేమెంట్స్ చేయొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే కరెన్సీ పోయి కార్డులొచ్చినట్లు, అవి కూడా పోయి డిజిటల్ పేమెంట్స్ వచ్చాయన్న మాట.

2.కస్టమర్లకు పేమెంట్ విషయంలో ఎంతో సాయం చేసే క్లిక్ అండ్ పే.. వారికి డీల్స్ అందించడం లో కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు డీల్స్ ల గురించి సమాచారం అందించడం క్లిక్ అండ్ పే మరో ఫీచర్.

3.ఆఫ్ లైన్ స్టోర్లకు కస్టమర్లను ఎంగేజ్ చేయడంతో దుకాణదారులకు కూడ ఈ స్టార్టప్ ఎంతగానో ఉపయోగపడుతోంది. యాప్ డౌన్ లోడ్ చేసుకున్న కస్టమర్.. షాపింగ్ లో ఉన్నప్పుడు దగ్గర్లో ఉన్న షాపుల్లో ఉండే డీల్స్ ని పుష్ నోటిఫికేషన్ ద్వారా అందిస్తారన్న మాట.

4. ఆఫ్ లైన్ స్టోర్లకు సైతం మొబైల్ వాలెట్ ద్వారా పేమెంట్ చేయడం దీని మరో ప్రత్యేకత.

5. ఎస్ బ్యాంక్ తో బిజినెస్ పార్టనర్ గా వాలెట్ సర్వీసును ఈ సంస్థ అందిస్తోంది. బ్యాంక్ తో కనెక్టు కావడంతో ఫుల్ సెక్యూరిటీ అని దీమాగా అంటున్నారు కళ్యాణ్.

ఇప్పటి వరకూ వేయికి పైగా బ్రాండ్ లు వీరితో టైప్ చేసుకున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 2వేల మంది కస్టమర్లకు సేవలను అందించారు. ఇదంతా 30 రోజుల్లోనే సాధ్యమైంది. మరిన్ని బ్రాండ్ లతో టై అప్స్ జరుగుతున్నాయి.

image


క్లిక్ అండ్ పే టీం

ఇక టీం విషయానికొస్తే కార్తీక్ కళ్యాణ్ దీనికి సీఈవో, ఫౌండర్. బిటెక్ పూర్తి చేసిన కళ్యాణ్.. సులేఖా డాట్ కామ్ లో రెండేళ్లు పనిచేశారు. సందీప్ దీనికి సీఎఫ్ఓ గా వ్యవహరిస్తున్నారు. నాగేంద్ర ఈ సంస్థకి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. అతను మర్కెటింగ్ వ్యవహారాలు చూస్తున్నారు. చందు దీనికి సీఓఓగా వ్యవహరిస్తున్నారు. దినేష్ ఈ స్టార్టప్ కి మరో కో ఫౌండర్. ఆయన సిటిఓ బాధ్యతలు చేపట్టారు. అందరూ ఇంజనీరింగ్ పూర్తి చేసి రెండు మూడేళ్లు అయినవాళ్లే. వీరితో పాటు ఆన్ రోల్, ఆఫ్ రోల్ మరో 25 మంది ఈ స్టార్టప్ లో పని చేస్తున్నారు.

ప్రధాన సవాళ్లు, పోటీదారులు

మొబైల్ వాలెట్ స్పేస్ లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. కానీ మార్కెట్ వాల్యూమ్ కూడా భారీగానే ఉంది. ఈ పోటీని తట్టుకొని నిలబడటం అనేది ఓ పెద్ద సవాల్. ఆన్ లైన్ మార్కెట్ ఎంత గ్రోత్ అయినప్పటికీ ఆఫ్ లైన్ మార్కెట్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు కనక, దీన్ని యుటిలైజ్ చేసుకొని పోవాలి. కానీ పేటీఎం, పేయూ లాంటి బడా సంస్థలు వీరు అందించే సర్వీసుల్లాంటివి ప్రారంభిస్తే పోటీ మరింతగా ఉంటుంది. దీన్ని అధిగమించాల్సి ఉంటుంది. ఒకటికంటే ఎక్కువ రెవెన్యూ సోర్స్ లు ఉన్న ఈ సంస్థకు వాటిని సస్టేయిన్ చేసుకోవడం మరో సవాలుగా చెప్పాలి. దీన్ని అధిగమించాల్సి ఉంది.

భవిష్యత్ లక్ష్యాలు

టీ హబ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్లిక్ అండ్ పే.. బెంగళూరు, చెన్నైలకు తమ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తోంది. ఈ ఏడాది ముగిసే సరికి 30 నుంచి 40 కోట్ల టర్నోవర్ పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. వచ్చే ఐదేళ్లలో 500 కోట్ల బిజినెస్ క్రాస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే కొంతమంది ఏంజిల్ ఇన్వెస్టర్లను సంప్రదించామని చెబుతున్న కళ్యాణ్ మరో రెండు నెలల్లో ఫండింగ్ సాధిస్తామని అంటున్నారు. ప్రస్తుతానికి బిటుసిలో ఉన్న క్లిక్ టు పే.. బిటుబి సెగ్మెంట్ లో కూడా విస్తరించాలని చూస్తోంది.

website

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags