సంకలనాలు
Telugu

పెట్‌కేర్ రంగాన్ని శాసిస్తానంటున్న డాగ్ మై క్యాట్స్

ఈకామర్స్‌లో పెట్‌కేర్సేమ్ డే డెలివరీతో ఆకట్టుకుంటున్న డీఎంసీఅవసరాలకు ఇతర కంపెనీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటున్న వరుణ్సిటీ బేస్డ్‌గా పెట్ కేర్ ఈ-కామర్స్

ABDUL SAMAD
30th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

త్యాగం... స్టార్టప్ స్థాయిలో ప్రతీ పారిశ్రామికవేత్తకూ ఇది అనుభవంలోకి రావాల్సిందే. ఈకామర్స్ పెట్ కేర్ సంస్థ డాగ్ మై క్యాట్స్ వ్యవస్థాపకుడు వరుణ్ యగైన్ కథ కూడా ఇదే. ఈయన విషయంలో మార్పు అనేది అతని భార్య, 4నెలల చిన్నారి, అతని పెంపుడు కుక్కకు కూడా అనుభవంలోకి వచ్చాయి..

వరుణ్, డాగ్ మై క్యాట్స్ వ్యవస్థాపకులు

వరుణ్, డాగ్ మై క్యాట్స్ వ్యవస్థాపకులు


వరుణ్‌కు పెంపుడు జంతువుల విభాగంలోకి అడుగుపెట్టాలన్న ఆలోచన రావడానికి కారణం అతను పెంచుకునే కుక్కే. దాన్ని చూసుకునేందుకు తగిన సమయం లేకపోవడాన్ని గమనించిన వరుణ్... ఇదే సమస్య చాలామందికి ఉందని తెలుసుకున్నారు. దీంతో తానే స్వయంగా నిధులు సమకూర్చుకుని ఓ సంస్థ ప్రారంభించేశారు. ఈ సంస్థ పెట్ కేర్‌కు సంబంధించిన అన్ని వస్తువులు డోర్ డెలివరీ ఇస్తుంది. ఈ సంస్థ అభివృద్ధిపై ఇప్పుడాయన దృష్టి కేంద్రీకరించారు. ఓ సరైన సహ భాగస్వామికోసం అన్వేషిస్తున్న వరుణ్.. అన్ని ఇబ్బందులు, పరిమితులను అధిగమించగలననే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.

స్టార్టప్ కోసం త్యాగం

డాగ్ మై క్యాట్స్ కు ముందు ఏడేళ్లపాటు పెద్ద సంస్థల్లో ఉద్యోగం, ఆ తర్వత 4ఏళ్లపాటు స్టార్టప్ కంపెనీల్లో విధులు... ఇదీ వరుణ్ యగైన్ గతం. పెద్ద కంపెనీల్లో పని చేసేప్పుడే.. స్వంతగా ఏదైనా చేయాలనే ఆలోచన ఉండేదతనికి. టెక్నాలజీ సొల్యూషన్స్ విభాగంపై చాలా మోజు. అయితే రోజువారి జీవితంలో మార్పు లేకపోవడంతో విసుగు చెంది స్టార్టప్ వైపు దృష్టి మరల్చారు. దీంతో ఈ తరహా సంస్థల ఇబ్బందులు చాలా వరకూ తెలిసొచ్చాయి వరుణ్‌కు. వీటిన్నిటినీ అధిగమించగలననే నమ్మకంతోనే 2014మార్చ్‌లో డాగ్ మై క్యాట్స్‌కు నాంది పలికానంటారు వరుణ్.

image


"నా విశ్రాంతి సమయంలో నాకు నచ్చిన పని చేయడం నాకుచాలా ఇష్టం. నేను చేయగలిగే దాంతో పోల్చితే... నా సంపాదన చాలా తక్కువగా అనిపించింది. దీంతో జీవితంతో సర్దుబాటు తప్పడంలేదు. దీంతో స్టార్టప్‌వైపు వచ్చి త్యాగం చేయక తప్పలేదు. అన్నిటి కంటే పెద్ద త్యాగాలు ఏవిటంటే నేను అమితంగా ప్రేమించే నా భార్య, నాలుగు నెలల చిన్నారిలతో గడిపే సమయం చాలా తగ్గిపోయింది. చివరకు నా కుక్కతో వాకింగ్స్ కూడా బాగా తగ్గిపోయాయి"-వరుణ్

ఈకామర్స్‌లో పెట్ కేర్

ఇప్పుడు ఈ కామర్స్ శరవేగంగా విస్తరిస్తోంది. దీన్ని ఆధారం చేసుకుని ఏదైనా కొత్తగా చేయాలని భావించాను. ఇది ఆయా వ్యక్తులకూ లాభం చేసేదిగానూ, ప్రయోజనకారిగానూ ఉండాలని భావించాను. ఆన్‌లైన్ సర్వీసుల ద్వారా కొత్త మార్కెట్ సృష్టించగలననే నమ్మకం కలిగింది. ఇప్పుడున్న ఈకామర్స్ పోర్టల్స్‌కు విభిన్నంగా వెళ్లాలనే ఆలోచనే పెట్ కేర్ వైపు తీసుకెళ్లింది. దీనిపై వెబ్‌సైట్లలో ఎవరూ అంతగా దృష్టి పెట్టకపోవడంతో నేను స్టెప్ తీసుకున్నాను. నాకు వేరే ఆలోచనలు చాలానే ఉన్నా... ప్రస్తుతానికి అన్నీ ఫ్రీజ్ అయినట్లే అంటారు వరుణ్.

పెట్ కేర్‌లో ఇతర పోర్టల్స్‌తో పోలిక

సాధారణ గృహావసరాలతో పోల్చితే... పెంపుడు జంతువులు ఉండే ఇళ్ల వాటా చాలా తక్కువ. అందుకే ఈ రంగం అంత స్పీడ్‌గా లేదని చెప్పాలి. వాటికి కావాల్సిన ఆహారం వంటివి పెద్ద బ్యాగులు విక్రయానికే పోర్టల్స్ పరిమితం అయ్యాయి. అయితే... ఎంపిక చేసుకునేందుకు రకరకాల ప్రోడక్టులు, డెలవరీలో సౌలభ్యం డాగ్ మై క్యాట్స్‌కు సముచిత స్థానం లభించేందుకు కారణంగా చెప్పుకోవచ్చు.

image


సాధారణంగా పెట్ కేర్ ఉత్పత్తులను 3 రకాలుగా వర్గీకరించవచ్చు.

1- అవసరం, అర్జంట్... ఆహార సంబంధిత ఉత్పత్తులు

2- అవసరమైనా అర్జంట్ కానివి... షాంపూలు, కట్టేసే చెయిన్స్, బౌల్స్ వంటివి

3- ఇష్టపడి కొనేవి - బొమ్మలు, ఇతర యాక్సెసరీస్....

ఇప్పుడున్న పోర్టల్స్‌లో చాలా రకాలు చివరి 2 రకాలను బాగానే ట్రీట్ చేస్తున్నాయి. అయితే మొదటి వర్గం విషయంలో మాత్రం అవసరానికి తగినట్లుగా స్పందించడంలో వెనకబడ్డాయి. ఓ 15 కేజీల కిబుల్ కానీ బెంటోనైట్ శాండ్‌ని కానీ దేశం మొత్తం తిప్పి పంపాలంటే ఎంత కష్టమో ఓసారి ఆలోచించండి.ఇది డెలవరీ అవడానికి కనీసం వారం రోజులు పడుతుంది ఎవరికైనా. అది కూడా పూర్తి స్థాయిలో రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోగలిగితే. కానీ డాగ్ మై క్యాట్స్ మాత్రం ఈ విషయంలో చాలా అప్‌డేట్‌గా ఉంది. మధ్యాహ్నం లోపు ఆర్డర్ ఇచ్చిన ఏ వస్తువైనా అదే రోజు డెలివరీ చేయగలగడం వీరి స్పెషాలిటీ. మొదట బెంగుళూరులోనే ఈ సర్వీస్ ప్రారంభించినా... త్వరలో మరిన్ని నగరాలనూ కవర్ చేయనుంది డాగ్ మై క్యాట్స్.

సంస్థ పురోగమించిన తీరు

"ఈ సంస్థకు ప్రారంభం నుంచే అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రతీ నెలా ఆదాయం 20శాతం పైగా పెరుగుతోంది. మొదటినుంచి ఇప్పటివరకూ నెమ్మదించిన సందర్భం ఒకటి కూడా లేదు. ఇప్పటివరకూ సగటు విక్రయం విలువ రూ.1,650 అంటే.. మా విక్రయాల స్థాయి అర్ధం అవుతుంది. మాకొచ్చే ఆదాయంలో 68శాతం రిపీట్ కస్టమర్ల నుంచి వచ్చిందే. మేం సర్వీస్ చేస్తున్న విధానానికి ముగ్ధులై... మాకు మౌత్ పబ్లిసిటీ చేస్తున్నారు కస్టమర్లు."-వరుణ్ యగైన్

ఇబ్బందులు- ఎదుర్కున్న తీరు

పెట్ కేర్ రంగంలో డిస్ట్రిబ్యూషన్, రిటైలింగ్ అంచనాల కంటే చాలా తక్కువ. కొత్తగా ప్రవేశించేవారికి కస్టమర్లు లభించడం కష్టం. అయితే నిర్వహణ, సర్వీస్ విషయంలో ప్రత్యామ్నాయాలు లభించడం చాలా కష్టం. నిర్వహణలో ప్రతీసారీ ఎదురయ్యే ఇబ్బందుల కారణంగా ఎంతో ఓపిక పట్టాల్సి వస్తుంది. ఇదంతా క్రమంగా తెలుసుకుని, నేర్చుకున్నదే అంటారు వరుణ్. దీనితోపాటు డాగ్ మై క్యాట్స్‌కు ఎదురైన మరో ప్రధాన ఇబ్బంది... ఒకే వ్యక్తి ఫండింగ్‌తో ఏర్పాటు చేయడం. దీంతో కొన్ని పరిమితులు విధించుకోవాల్సి వచ్చింది. దీన్ని అధిగమించేందుకు ఉద్యోగుల నియామకం సమయంలోనే వారివారి విధుల విషయంలో స్పష్టంగా ఉన్నాననంటారు వరుణ్. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడంతోనే... చివరకు సక్సెస్ టేస్ట్ చేసే అవకాశం లభించింది ఈ సంస్థకు. కానీ సొంత ఆలోచనతో ఏర్పాటు చేసుకోవడంతో ఎన్ని కష్టాలైనా ఎదుర్కున్నానంటారు వరుణ్ యగైన్.

ప్రస్తుతం డాగ్ మై క్యాట్స్‌కు నిధులు వరుణ్ సమకూర్చుకున్నారు. ఓ సమయంలో భాగస్వాములను చేర్చుకుందామనుకున్నా.... సర్వీస్ విషయంలో వరుణ్ పట్టుపట్టడంతో వారు వైదొలగారు. దీంతో సొంతగానే మొత్తం చేసుకోవాల్సి వచ్చింది. ఓ ఆపరేషన్స్ మేనేజర్, ఓ డెలివరీ మేనేజర్‌ల సాయంతో.... ఒక్క కస్టమర్ కూడా మిస్ కాకుండా... సేవలందిస్తోంది డాగ్ మై క్యాట్స్.

స్టార్టప్ గురించి వరుణ్

పౌల్ గ్రాహం స్టార్టప్‌ల గురించి చెప్పినట్లుగా... ప్రతీ పనినీ కొలిచినట్లుగా చేయాలనుకోవద్దన్న మాటలను విశ్వసిస్తానంటారు వరుణ్. డెలివరీల విషయంలో తాము కట్టుబడి ఉండడమే తమ సంస్థ అభివృద్ధి కారణంగా చెబ్తారు. అన్నిటికంటే ముఖ్యంగా మేనేజ్మెంట్ టీం సరైనదిగా ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తారు.

ఫ్యూచర్ గురించి...

ఇప్పటి సేవలకు తోడుగా మరిన్ని సర్వీసులు జత చేసే యోచన ఉంది. ప్రస్తుతం ఉన్న ఈకామర్స్ పోర్టల్స్‌కు భిన్నంగా... ఆయా నగరాలే కేంద్రంగా చేసుకుని... ఈకామర్స్ నిర్వహించనున్నారు. అక్వేరియం క్లీనింగ్ కాంట్రాక్టుల నుంచి వెటర్నరీ డాక్టర్ అపాయింట్‌మెంట్లు, పెట్ పిక్నిక్స్, వాటికి అలంకరణలు... ఇలా ఇతర సర్వీసుల్లోకి ఎంటర్ కానుంది డాగ్ మై క్యాట్స్. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నిటికీ విస్తరించడం తమ దీర్ఘకాలిక ప్రణాళికగా చెబ్తున్నారు వరుణ్ యగైన్.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags