సంకలనాలు
Telugu

లైంగిక వేధింపుల నుంచి బ‌య‌టప‌డటం ఎలా..? మహిళలంతా తప్పక చదవాల్సిన ఆర్టికల్ !!

ఉద్యోగినులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవి !

13th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

"వర్క్ ఫ్రం హోం","ఆఫ్ సైట్ క‌న్స‌ల్టెంట్‌", "ఫ్లెక్సీ వ‌ర్కింగ్ మోడ్‌". ప‌ని అంటే ఆఫీసుకి వెళ్లే చేయాల‌నే పాత‌త‌రం రూల్స్‌ని బ్రేక్ చేసి పుట్టిన ప‌దాలు. ఇప్పుడు ప‌ని అంటే ఎక్క‌డి నుంచైనా చేయొచ్చు. ఎలాగైనా చేయొచ్చు. ఫైన‌ల్‌గా ఇవ్వాల్సిన ఔట్‌పుట్ ఇవ్వాలంతే. టైమ్‌, ప్లేస్‌తో ప‌నిలేదు.

అనువైన ప్ర‌దేశం నుంచి ప‌నిచేయాల‌నే ఈ కాన్సెప్ట్‌.. ఇండియా వ‌ర్క్‌స్పేస్‌లో కొత్త ట్రెండ్ తీసుకువ‌చ్చింది. షీరోస్‌, ఫ్లెక్సీ కెరీర్స్‌లాంటి సంస్ధ‌లు ఏకంగా పార్ట్‌టైమ్ వ‌ర్క్ చేసేవాళ్ల‌ను, వ‌ర్క్ ఫ్రం హోం చేసేవాళ్ల‌ను బేస్ చేసుకునే మొద‌ల‌య్యాయి. ముఖ్యంగా స్క్రాప్ కాకుండా క్వాలిఫైడ్ మ‌హిళ‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నాయి. ఇంట్లో ఉండే ప‌నులు ఏమాత్రం డిస్ట‌ర్బ్ కాకుండా ఇండియ‌న్ వ‌ర్క్‌ఫోర్స్‌లో మ‌హిళ‌ల సంఖ్య పెర‌గ‌డానికి ఇలాంటి కాన్సెప్ట్‌లు ఎంత‌గానో దోహ‌ద‌ ప‌డుతున్నాయి,

ఇలా ఆఫీసుల‌కు వెళ్ల‌కుండా ఫ్లెక్సిబుల్ వ‌ర్క్ చేస్తున్న మ‌హిళ‌ల‌తో పాటు.. ఫుల్‌టైం ఎంప్లాయీస్‌గా ఉండి కూడా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఇంటి నుంచి ప‌నిచేస్తున్న మ‌హిళ‌ల‌ద‌రూ త‌ప్ప‌కుండా ఈ ఆర్టిక‌ల్ చ‌ద‌వాలి. ప‌నిప్ర‌దేశంలో మ‌హిళ‌లు త‌మ‌ హ‌క్కుల గురించి తెలుసుకుని తీరాలి. లైంగిక వేధింపుల‌కు గురికాకుండా త‌మ‌ను తాము కాపాడుకోవ‌డానికి కొన్ని చ‌ట్టాలు, నియ‌మాలు ఉన్నాయ‌న్న విష‌యాన్ని గుర్తించాలి.

image


షాపింగ్‌మాల్‌కు వెళ్లినా.. సినిమాకు వెళ్లినా.. రెస్టారెంట్‌.. ఇల్లు, ఆఫీస్‌, కాలేజ్‌, స్కూల్, హోట‌ల్‌.. ఇలా ఎక్క‌డ‌కు వెళ్లినా ప్రొటెక్ష‌న్ ఆఫ్ సెక్సువ‌ల్ యాక్ట్ కింద మీరు క‌వ‌ర్ అవుతారు. ప‌ని ప్ర‌దేశంలో మ‌హిళ‌లు లైంగిక వేధింపుల‌కు గురికాకుండా.. తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, ఆయా కంపెనీలు చేప‌ట్టాల్సిన ప‌నుల‌ను ఈ యాక్ట్ వివ‌రిస్తోంది.

ఒక వ్య‌వ‌స్ధ‌తో ప‌నిచేయ‌డం మొద‌లుపెట్టిన‌ప్పుడు లైంగిక వేధింపుల‌కు సంబంధించి మీ హ‌క్కుల‌ను తెలుసుకోవాలి.

1. మీరు ఒక కంపెనీలో భాగం అన్న విష‌యాన్ని గుర్తుపెట్టుకోండి:

ఇంటి నుంచి ప‌నిచేసినా ఎక్క‌డి నుంచి చేసినా కూడా.. మీరు ఆ కంపెనీలో భాగ‌మే. లైంగిక వేధింపుల‌కు సంబంధించి ఆ కంపెనీ తీసుకుంటున్న నిర్ణ‌యాలు, నిబంధ‌న‌ల‌ను స‌ద‌రు కంపెనీ మీకు తెలియ‌ జేయాలి. ఉద్యోగంలో చేరే స‌మ‌యంలో మీతో చేసుకునే ఒప్పందంలో స్ప‌ష్టంగా వివ‌రించాలి. ఈ చ‌ట్టాల‌న్నీ మీ భ‌ద్ర‌త కోస‌మే. మీరు ప‌నిచేసే కంపెనీలో ఈ విధంగా చేయ‌క‌పోతే అది చట్ట‌విరుద్ధం అవుతుంది. అంటే.. ఆ కంపెనీ. మ‌హిళ‌ల భద్ర‌త‌కు, వారిపై లైంగిక వేధింపులు జ‌రగ‌కుండా చూసేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని చ‌ట్టం భావిస్తుంది. లైంగిక హింస అనేది కేవ‌లం ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య భౌతిక‌ప‌ర‌మైన అంశానికి సంబంధించిన‌ది కాదు.అది ఫోన్ , ఈమెయిల్ ద్వారా కానీ.. మ‌రే విధంగా అయినా జ‌ర‌గ‌చ్చు. ఆఫీస్ పార్టీల్లో, గెట్ టుగెద‌ర్ స‌మ‌యాల్లో.. జ‌ర‌గ‌చ్చు. దీనితో పాటు.. ప్ర‌తీ మ‌హిళ కూడా ప‌నిచేస్తున్న కంపెనీని.. కోడ్ ఆఫ్ కండ‌క్ట్ గురించి విచారించాలి.

లైంగిక వేధింపుల చ‌ట్టంలో మీ హ‌క్కుల‌ను తెలుసుకోండి :  

ప‌ని ప్ర‌దేశాల్లో మీ భ‌ద్ర‌త కోసం త‌యారుచేయ‌బ‌డిన చ‌ట్టం ఇది. మామూలుగా చాలామందికి చ‌ట్టాల గురించి అవ‌గాహ‌న ఉండ‌దు. అంత‌కుమించి పెద్ద‌గా ఇంట్రస్ట్ ఉండ‌దు. కానీ.. ముందుగా ఆ విష‌యాల‌ను తెలుసుకోవ‌డం వ‌ల్ల వేధింపుల‌కు గురికాకుండా మిమ్మ‌ల్ని మీరు కాపాడుకోవ‌డంతో పాటు.. ఒకవేళ గుర‌యితే ఏం చేయాల‌నే అంశాల‌పై క్లారిటీ వ‌స్తుంది. ఈ చ‌ట్టం కింద మీ కంపెనీకి ఉండే బాధ్య‌త‌ల‌తో పాటు.. అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నియ‌మించే ఇంట‌ర్న‌ల్ కంప్ల‌యింట్స్ క‌మిటీ( ఐసీసీ) విధివిధానాలు, మెంబ‌ర్ల గురించి స‌మాచారం తెలుసుకోవాలి. మీరు కంప్ల‌యింట్ చేయాల‌నుకుంటే దాని ప‌ద్ధ‌తిని తెలుసుకొవాలి. ఉదాహ‌ర‌ణ‌కు.. ఘ‌ట‌న జ‌రిగిన 90 రోజుల లోపు కంప్లయింట్‌ను ఫైల్ చేయాలి. ఒక‌వేళ కంపెనీని వ‌దిలేసినా.. ఘ‌ట‌న జ‌రిగి 90 రోజులు కాక‌ముందే కంప్ల‌యింట్ చేయ‌వచ్చు. ఇలాంటి అంశాల‌ను ముందుగా తెలుసుకుంటే మంచిది.

ఈ స్టోరీ కూడా చదవండి

దీనితో పాటు.. మీరు ఇచ్చే కంప్ల‌యింట్ వివ‌రాల గోప్య‌త‌ను పాటించ‌డంలో ఐసీసీ, కంపెనీ మేనేజ్‌మెంట్ బాధ్య‌త ఉంటుంది. ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత కానీ.. ఇన్వెస్టిగేష‌న్ జ‌రుగుతున్న స‌మ‌యంలో కానీ.. కౌన్సిలింగ్‌కు డిమాండ్ చేసే హ‌క్కు ఉంది. ఇచ్చిన కంప్ల‌యింట్‌పై విచార‌ణ ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చిందో తెలుసుకోవ‌చ్చు. కంప్ల‌యింట్ ఇచ్చిన 90 రోజుల్లో విచార‌ణ పూర్తిచేసి.. 10 రోజుల్లో మేనేజ్‌మెంట్‌కు ఐసీసీ రిపోర్ట్ ఇవ్వాలి.

ఇంటి నుంచి కానీ.. ఆఫీస్‌కు వెళ్లి కానీ.. ఒక ఆర్గ‌నైజేష‌న్‌తో ప‌నిచేస్తున్నంత కాలం.. మ‌రికొన్ని కీల‌క విష‌యాల‌ను మీరు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంది.

ఈ విష‌యాల‌ను తెలుసుకోవ‌డంతో పాటు మ‌రికొంత‌మందికి అవ‌గాహ‌న కల్పించాల‌న్న కోరిక ఉన్న‌వాళ్ల‌కు కొన్ని సంస్ధ‌లు త‌ర్ఫీదు ఇస్తున్నాయి. కోల్‌క‌తాలోని నేష‌న‌ల్ యూనివ‌ర్శిటీ ఆఫ్ జ్యుడీషియ‌ల్ సైన్సెస్‌.. లైంగిక వేధింపుల నివార‌ణ చ‌ట్టంపై మూడు నెల‌ల ఆన్‌లైన్ కోర్సును నిర్వ‌హిస్తోంది. అది చేయ‌డం వ‌ల్ల చ‌ట్టంలోని ప్ర‌తీ సున్నిత‌మైన అంశంపై ప‌ట్టు సాధించ‌వ‌చ్చు.

ఇవి మీ హ‌క్కులు. మీ భ‌ద్ర‌త కోసం త‌యారుచేసిన చ‌ట్టాలు. వీటి గురించి ప‌ట్టించుకోవ‌డం, లేక‌పోవ‌డం మీ ఇష్టం. వీటిపై మీరు జ్ఞానాన్ని సంపాదించ‌డండి. అన్నీ తెలుసుకోండి. అవ‌స‌ర‌మైన చోట అవ‌స‌ర‌మైన విధంగా ఈ చ‌ట్టాల‌ను వినియోగించుకోండి.

3. లైంగిక వేధిపుల చ‌ట్టాల గురించి ఉద్యోగులంద‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించేలా ప్ర‌తీ కంపెనీ స‌ద‌స్సుల‌ను ఏర్పాటు చేయాలి. అంత‌ర్గ‌తంగా నియ‌మించిన ఐసీసీపై కంపెనీ పాల‌సీని ప్ర‌క‌టించాలి. ఫుల్‌టైమ్‌, పార్ట్‌టైం, ధ‌ర్డ్ పార్టీ ఎంప్లాయీస్ అంద‌రికీ ఈ స‌ద‌స్సులు వ‌ర్తిస్తాయి. ఆన్‌లైన్ కానీ.. ఆఫ్‌లైన్ ద్వారా కానీ.. వీటిని కంపెనీ నిర్వ‌హించ‌వ‌చ్చు. ఇందుకు సంబంధించిన పాల‌సీల‌ను కచ్చితంగా చ‌దువుకోవ‌డంతో పాటు ఇలాంటి ట్రైనింగ్‌ల‌కు హాజ‌రుకండి. ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోడి.

4. మీరు ప‌నిచేస్తున్న కంపెనీ ఐసీసీ(ఇంట‌ర్న‌ల్ కంప్ల‌యింట్స్ క‌మిటీ) గురించి తెలుసుకోండి: ఆఫీసుల్లో ఏర్పాటుచేయ‌బ‌డిన నోటీస్‌ బోర్డుల ద్వారా ఈ స‌మాచారాన్ని కంపెనీ ఉద్యోగుల‌కు చేర‌వేయాలి. అలాగే.. ఈమెయిల్‌లో కానీ.. కంపెనీ అధికారిక వెబ్‌సైట్లో కానీ.. డిస్‌ప్లే చేయాలి. అలా చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య వ‌స్తే.. ఉద్యోగులు నేరుగా ఐసీసీని సంప్ర‌దించ‌డానికి ఈజీ అవుతుంది.

5. ముఖ్య‌మైన అంశం:

ఈ చ‌ట్టంలో లైంగిక వేధింపులు అనే ప‌దం యొక్క ప‌రిధిని తెలుసుకోవాలి. స‌మ‌స్య తీవ్ర‌త‌ను బ‌ట్టి.. అది ఈ చ‌ట్టం ప‌రిధిలోకి వ‌స్తుందో లేదో నిర్ణ‌యించుకోవాలి. అందుకోసం అస‌లు చ‌ట్టం ప్ర‌కారం లైంగిక వేధింపులు అంటే ఏంటో తెలుసుకోవాలి.

  • ఆమోద‌యోగ్యం కాని భౌతిక సంబంధం ఏర్పాటుచేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం
  • అశ్లీల్ల దృశ్యాలు చూపించ‌డం, అశ్లీల్ల సంభాష‌ణ‌లు చేయ‌డం
  • లైంగిక అంశాల‌ను స్ప్ర‌శిస్తూ మాట్లాడ‌టం
  • ప‌నిచేసేచోట ప్ర‌తికూల వాతావ‌ర‌ణాన్ని సృష్టించ‌డం
  • లైంగికప‌ర‌మైన కోర్కెలు కోర‌డం

వీటిలో ఏ ఒక్క‌టి మీతో జ‌రిగింద‌ని అనిపించినా కూడా వెంట‌నే ఐసీసీ స‌భ్యుల దృష్టికి తీసుకురావాలి. ఇందులో హెచ్ఆర్ పాత్ర ఏ మాత్రం ఉండ‌ద‌న్న విష‌యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక‌వేళ మీ కంపెనీలో ఐసీసీని నియ‌మించ‌క‌పోతే.. అందుకోసం డిమాండ్ చేసే హ‌క్కు మీకు ఉంటుంది.

6. మీరు ఐసీసీలో భాగ‌మైతే, చ‌ట్టం గురించి విస్తృత ప్ర‌చారం కోసం మీవంతు సాయం చేయండి: సివిల్ కోర్టుకు ఉండే అధికారాల‌న్నీ ఒక కంపెనీ నియ‌మించే ఐసీసీకి ఉంటాయి కాబ‌ట్టి నిర్ణ‌యాలు తీసుకునే స‌మ‌యంలో ఆచిచూచి వ్య‌వ‌హ‌రించాలి. అందుకే, చ‌ట్టంలో ఐసీసీ స‌భ్యులు త‌ప్ప‌నిస‌రిగా అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని, అందుకే వారికి అవ‌స‌ర‌మైతే ట్రైనింగ్ ఇవ్వాల‌ని అని ప్ర‌స్తావించ‌బ‌డింది. చ‌ట్టం గురించి పూర్తిగా తెలిస్తే త‌ప్ప‌.. నిర్ణ‌యాలు తీసుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. ప్ర‌తీ కంపెనీ.. ఐసీసీని నియ‌మించ‌డంతో పాటు అందులోని స‌భ్యుల అవ‌గాహ‌న‌పై కచ్చితంగా దృష్టిపెట్టాలి.

ఈ చ‌ట్టం గురించి ప్ర‌చారం క‌ల్పించేందుకు మీరు చేయ‌గ‌లిగిన కొన్ని ప‌నులు..

  1. ప‌నిచేసే చోట జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఒక క‌న్నేసి ఉంచాలి. ఐసీసీ స‌భ్యుల వివ‌రాల‌ను కంపెనీ ప్ర‌ద‌ర్శించేలా చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు. అందుకోసం ప‌ద్ధ‌తిగా కంపెనీని ప్ర‌శ్నించ‌వ‌చ్చు.
  2. ఈ అంశంపై ఏర్పాటుచేసిన సెమినార్ల‌కు అటెండ్ అవ్వాలి. ఉద్యోగుల మ‌ధ్య సఖ్య‌త‌కు ఇది ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది
  3. ఒక‌వేళ మీ సంస్ధ‌.. 2013 సెక్సువ‌ల్ హెరాస్‌మెంట్ చ‌ట్టాన్ని పూర్తిస్ధాయిలో అమ‌లుచేస్తున్న‌ట్టు అయితే.. దానికి విస్తృత ప్ర‌చారం క‌ల్పించ‌డంలో మీరు భాగ‌స్వామ్యం కండి.

ఇంకా ఏమైనా సందేహాలంటే.. ఈ ట్విట్టర్ అకౌంట్‌కు పంపవ‌చ్చు.

ఈ స్టోరీని కూడా చదవండి

ఈ స్టోరీని కూడా చదవండి

ఈ స్టోరీని కూడా చదవండి

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags