సంకలనాలు
Telugu

'టీ'తో 100 కోట్ల టర్నోవర్ చేస్తామంటున్న చాయోస్

షార్ట్‌టైమ్‌లో సక్సెస్ సాధించిన చాయోస్ ఫౌండర్ నితిన్ సలుజా  

18th Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


మందలో ఒకరిగా ఉండకుండా.. వందలో ఒకరిగా ఉండాలనుకున్నాడు. అందుకే కొత్తగా ఆలోచించాడు. ఓడిపోతానని భయంతో ప్రయత్నించకపోవడం కన్నా.. ప్రయత్నించి ఓడిపోవడం మేలనుకున్నాడు. అందుకే సరికొత్త పంథాలో చాయ్ బిజినెస్‌ను ఎంచుకున్నాడు.

నిజంగా ఒక ఐడియా జీవితాన్ని మార్చుతుందో లేదో కానీ... నితిన్ ఐడియా యాభై మందికి ఉపాధిని కల్పిస్తూ కొందరి జీవితాల రూపురేఖలను మార్చేసింది. ఛాయ్‌తో 100 కోట్ల టర్నోవర్ వ్యాపారాన్ని చేయొచ్చా? ఇది సాధ్యమేనా? అంటే అవుననే అంటున్నాడు నితిన్. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా.. శ్రమే దైవంగా నమ్మి కష్టపడ్డాడు. చిన్నతనంలో తన తల్లి నేర్పించిన టీ మెళుకువలు తనను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి అంటున్నాడు. 2012 నవంబర్‌లో ఢిల్లీలో పురుడు పోసుకున్న చాయోస్ సాధారణ జనాలకు కూడా దగ్గరైంది. అందుకే అనతికాలంలోనే దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో ఎనిమిది ఔట్‌లెట్లు తెరుచుకున్నాయి. భవిష్యత్తులో ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోనూ చాయోస్ విస్తరించాలనేది కంపెనీ ఆలోచన.

నితిన్ సలూజా, రాఘవ్ వర్మ

నితిన్ సలూజా, రాఘవ్ వర్మ


విజయం వెనుక కష్టం

తపనకు వయసుతో పనిలేదు. ఆ తపనకు కసితోడైతే అద్భుతాలే జరుగుతాయి. అలాంటి అద్భుతమే సృష్టించాడు నితిన్. ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చినా తిరస్కరించి సొంతంగా వ్యాపార సామ్రాజాన్ని విస్తరించాలనే పట్టుదలతో రంగంలోకి దిగాడు. 2007లో ఐఐటీ ముంబైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. మొదట అందరిలాగే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక ఎక్కడైనా జాబ్‌లో సెటిల్ అవ్వాలనుకున్నాడు. అందుకే రోబొటిక్ ఎడ్యుకేషన్ కంపెనీ(థింక్)ను స్నేహితులతో కలిసి కో ఫౌండర్‌గా ఐదేళ్లు పనిచేసి, ఒపెరా సొల్యూషన్స్‌లో జాయిన్ అయ్యాడు.

సరికొత్త ఐడియా

నా మదిలో ఎప్పుడూ చాయ్.. చాయ్ అనే పదం మెదిలేది. కానీ నాకు కావాల్సిన, నాకు నచ్చిన చాయ్ ఎక్కడైనా దొరుకుతుందా ? అంటే సమాధానం లేదు. ఇదే విషయం ఆలోచిస్తున్నప్పుడు రాఘవ వర్మతో పరిచయం ఏర్పడ్డది. రాఘవతో చర్చించి చాయ్ అవుట్‌లెట్ ప్రారంభించాడు. ఇది స్థాపించినప్పుడు ఇలాంటి అవుట్‌లెట్‌లున్నాయో లేవో కూడా నితిన్‌కు తెలియదు. అప్పటినుంచి ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ సప్లయింగ్ మరియు తయారీ వంటివి నితిన్ చూసుకునేవాడు. రాఘవ్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ చూసుకుంటున్నాడు. 

చాయోస్ ఇంటీరియర్స్

చాయోస్ ఇంటీరియర్స్


రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఢిల్లీ ప్రజలకు దగ్గరయ్యారు. ఒక ప్రణాళిక ప్రకారం ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఏడు అవుట్‌లెట్లు తెరిచి మొత్తంగా సుమారు 50 మందికి ఉపాధి కల్పించి ఉద్యోగుల ఇండ్లల్లో వెలుగులు నింపుతున్నారు. క్వాలీటి విషయంలో కాంప్రమైజ్ కాకుండా మంచి ప్రొడక్ట్‌ను అందించడమే వీళ్ల టార్గెట్. మేరీ చాయ్ వాలా అనుభూతిని పంచడం వల్లే సక్సెస్ సాధించామని చెబుతున్నాడు నితిన్. మేరి వాలి చాయ్ 25 రకాల టీలను 12,000 రకాలుగా అందిస్తున్నారు. 


image


ఒక్కో అవుట్‌లెట్ సంవత్సరానికి కోటి రూపాయల టర్నోవర్‌తో నడుస్తుంది. సంపన్నులకే కాదు.. సామాన్యులకు కూడా ధరలు అందుబాటులో ఉండటమే చాయోస్ ప్రత్యేకం.

100 కోట్ల టర్నోవర్ సాధ్యమేనా ?

జిషాన్ హయాత్ నుంచి మొదటి దశ ఫండింగ్‌ను సమీకరించిన చాయోస్ విస్తరణ ప్రణాళికల మీద తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. చాయ్ వ్యాపారానికి కూడా పెట్టుబడులు వస్తాయా... ? పెట్టుబడిదార్లు దీన్ని కూడా ఓ వ్యాపారంలా చూస్తారా అని అనుకునేవాళ్లకు నితిన్ మతిపోయే సమాధానం చెబ్తాడు. వంద శాతం రాబడి మీకు అక్కర్లేదా అంటూ రివర్స్‌లో వాళ్లనే కన్‌ఫ్యూజ్ చేస్తాడు.

కిక్కిచ్చే లెక్కలు

  • మార్కెట్ ఉందా ? చాయ్‌ గురించి తెలియని వాళ్లుండరు. దానికి ప్రత్యేక మార్కెటింగ్ మనం చేయాల్సిన పనిలేదు
  • ఒక్కో ఔట్‌లెట్ కోటి రూపాయల టర్నోవర్ చేస్తోంది. రెండేళ్లలో సింపుల్‌గా వంద కోట్ల టార్గెట్ చేరుకోవచ్చు. 

(అరవై స్టోర్లు x 1.5 కోట్ల టర్నోవర్ = 90-100 కోట్ల టర్నోవర్ సింపుల్)

  • చాయ్ అనేది భారత్‌కు మాత్రమే పరిమితం కాదు. అందుకే దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా విస్తరించే యోచనలో ఉన్నాం. 

ఈ ఏడాది చివరికల్లా 60 అవుట్‌లెట్‌లను ప్రారంభించే యోచనలో ఉన్నాడు నితిన్. విస్తరణలో భాగంగా చాయ్ డెలివరీ కోసం కార్పొరేట్లతోనో చర్చలు జరుపుతున్నారు. అతి త్వరలో చాయోస్ మొబైల్ అప్లికేషన్ కూడా అందుబాటులో రానుంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags