సంకలనాలు
Telugu

సంగీతంలో సందేశం మిక్స్ చేస్తున్న శిబానీ

19th Dec 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఆమె పాట పాడుతుంటే అభిమానులు సంగీత ప్రపంచంలో ఓలాలాడుతారు. గిటార్ పట్టి మ్యూజిక్ వాయిస్తుంటే మరో ప్రపంచంలో అడుగుపెడతారు. సజ్నా అంటూ ఆమె పాట అందుకుంటే స్టేజ్ మొత్తం అరుపులు కేరింతలతో మార్మోగిపోతుంది. ఆమే శిబానీ కశ్యప్. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన శిబానీ ఇప్పుడు ప్రపంచ స్థాయి రాక్ స్టార్. సంగీతంతో సందేశాలను ప్రజల్లోకి చొప్పించిన ఆమె జీవితం ఓ తెరిచిన పుస్తకం.

శిబానీ తనను తాను సూఫీ ఆత్మగా చెప్పుకొంటారు. హృదయంతో మాట్లాడుతారు. తన వైఫల్యాల గురించి కూడా ఎలాంటి మొహమాటం లేకుండా నిర్భయంగా మాట్లాడం ఆమె నైజం. ఒకప్పుడు ఎయిర్ ఎఫ్ఎం జింగిల్‌తో కెరీర్‌ను మొదలుపెట్టిన సింగర్ కమ్ ఆర్టిస్ట్ . తనపై తనకున్న నమ్మకం కారణంగానే ఆమె ఇప్పుడు ప్రపంచ స్థాయి సింగర్‌గా మారగలిగారు..

బ్రాండ్ శిబానీ..

ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి పాప్ మ్యూజిక్ ప్రవేశిస్తున్న సమయంలోనే శిబానీ తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ వేవ్‌లోనే ఆమె సంగీత ప్రపంచంలోకి ప్రవేశించి అదేస్థాయిలో లైమ్‌లైట్‌లోకి దూసుకొచ్చారు. తన పాపులర్ హిట్ ‘సజ్నా అభీ జా’ సాంగ్‌తో సంగీతంలో అభిమానులను ఓలలాడించారు.

శిబానీ కశ్యప్..

శిబానీ కశ్యప్..


మార్కెట్‌కు తగ్గట్టుగా ఇండస్ట్రీ చేంజ్ అవుతుంటే, శిబానీ కూడా తనను తాను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునేవారు. ఆత్మవిశ్వాసంతోపాటు కొత్త అవకాశాలను అందిపుచ్చుకొనే నైపుణ్యామే ఏళ్లుగా ఆమెను మ్యూజిక్ ఇండస్ట్రీలో నిలబెట్టగలిగింది. ‘‘నేను స్వీయ నియంత్రణ కలిగిన మహిళను. నాకు నేనుగా సొంతంగా పాటలు రాసుకోవడమే కాదు సంగీతం కూడా సమకూర్చుకుంటాను. ఎవరో ఫోన్ చేస్తారని ఎదురుచూస్తూ కూర్చోను. బ్రాండ్‌ను అభివృద్ధి చేసుకోవడమంటే సొంత వ్యక్తిత్వం నుంచి ప్రొఫెషనల్ వ్యక్తిత్వాన్ని వేరుచేయడమే అని ఆమె వివరించారు. ఏదైనా పనిపై అభిరుచి, ఆసక్తి విజయం వైపు నడిపిస్తాయని శిబానీ బలంగా నమ్ముతారు.

సంగీతంతో సందేశం..

శిబానీ జీవితంలో సంగీతం ఓ ప్రయాణం. ఆమెపై తీవ్ర ప్రభావం చూపిన అంశం కూడా సంగీతమే. ఆమె దేన్నైతే బలంగా నమ్ముతుందో దాన్ని భయం లేకుండా చెప్పేందుకు సంగీతాన్ని ఉపయోగించుకున్నారు. ‘‘ప్రజలపై ప్రభావం చూపేందుకు, వారిని స్వతంత్రులుగా తీర్చి దిద్దేందుకు సంగీతం ఎంతో ఉపయోగపడింది. సంగీతమే నేనేంటో ప్రపంచానికి తెలియజేసింది’’ అని ఆమె వివరించారు. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, మహిళల సాధికారత గురించి, డ్రంకన్ డ్రైవింగ్‌కు వ్యతిరేకంగా, ఉగ్రవాదం గురించి తన సందేశాన్ని సంగీతంతోనే చెప్పారామె. ‘‘ప్రజలకు ఉచిత సలహాలు నచ్చవు. అందుకే నేను సందేశాన్ని సంగీతంతో కలిపి అందించాను’’ అని శిబానీ చెప్పారు.

ఫ్రీ స్పిరిట్..

‘‘ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తమలో దాగి ఉన్న కోరిక, కళ, టాలెంట్‌ను అర్థం చేసుకోవాలి. సూఫీ మ్యూజిక్ అన్న ట్యాగ్ పెట్టినప్పుడు చాలామంది నన్ను తిట్టిపోశారు. నా పాట స్టయిల్ జానపదంలా ఉంటుంది. మ్యూజిక్ మనసుకు హత్తుకునేలా ఉంటుంది. అదే రుహానీ మ్యూజిక్. ఈ రెండింటి కలయికే సూఫీ మ్యూజిక్. ఒక్క మాటలో చెప్పాలంటే సూఫీ మ్యూజిక్ అంటే దైవ శక్తులపై నమ్మకం కలిగి, ప్రపంచంలో ఒకరిగా మెలిగేందుకు ఇష్టపడే ఒకరి స్వేచ్ఛ.’’ అని శిబానీ వివరించారు. లైవ్ పెర్ఫార్మెన్స్‌లు ఇవ్వాలన్న ఆమె అభిరుచే శిబానీని మోటివేట్ చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించి ప్రదర్శనలు ఇవ్వడాన్ని ఆమె ఎంతో ఆస్వాదిస్తున్నారు. భారీ సంఖ్యలో ఆడియన్స్ ఎదుట గయానాలో శిబానీ ఇటీవలే ఓ ప్రదర్శన ఇచ్చి వచ్చారు. మ్యాజిక్ వరల్డ్‌లో సత్తా చాటాలంటే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండటం అవసరమని ఆమె అంటారు.

శిబానీ కశ్యప్

శిబానీ కశ్యప్


నిత్య విద్యార్థిని..

సంగీతం గురించి శిబానీ కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు. ఇప్పటికీ తాను విద్యార్థినేనని ఎలాంటి భేషజాలు లేకుండా స్పష్టం చేస్తారు. వెస్ట్రన్, క్లాసికల్, వోకల్ మ్యూజిక్‌ను ఢిల్లీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్‌లో నేర్చుకున్నారామె. అలాగే పియానోను కూడా గురువు ఆధ్వర్యంలోనే నేర్చుకున్నారు. గిటార్‌ను ప్లే చేయడం మాత్రం సొంతంగా ఇంట్లోనే నేర్చుకున్నారు.

ఇండియన్ క్లాసికల్ శిక్షణ మాత్రం పండిట్ పీఆర్ వర్మ పర్యవేక్షణలో నేర్చుకున్నారు. ఇప్పటికీ ఆయన వద్దే శిష్యరికం చేస్తున్నారామె.

ఆకాశమే హద్దు..

శిబానీ తండ్రి ఆర్మీ ఆఫీసర్‌. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో లిటరేచర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అప్పటివరకు ప్రొటెక్టెడ్ ఎన్వీరాన్‌ మెంట్‌ లో ఉన్న శిబానీ అనుకోకుండా ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అప్పుడే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. కానీ మ్యూజిక్‌తో స్వతంత్రంగా జీవించగలిగారు. ‘‘నా జీవితాన్ని, సంగీతాన్ని అన్వేషించాలనుకున్నాను. నా భావాలను నిర్భయంగా ప్రపంచానికి చాటి చెప్పేందుకు సంగీతం వేదిక కావాలనుకున్నాను’’ అని ఆమె వివరించారు.

ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారు. కారు కొనుక్కున్నారు. సొంతంగా ఏదైనా చేయొచ్చని, ఇంటినుంచి బయటకు వచ్చిన తర్వాత శిబానీకి అర్థమైంది.

హాఫ్ గ్లాస్.. ఫుల్ గ్లాస్..

‘‘మనతోపాటు సమస్యలు కూడా పెరిగి పెద్దవవుతుంటాయి’’ అని జీవితాన్ని ఒక్క మాటలో చెప్పేశారు శిబానీ. ఆర్టిస్టు కొత్తవారైతే ప్రేక్షకులు పెద్దగా అంచనాలు పెట్టుకోరు. అయితే కొంత విజయం తర్వాత ఆ ఆర్టిస్టుపై అంచనాలు అమాంతం పెరిగిపోతాయి.

విమర్శలను అంతగా పట్టించుకోరు శిబానీ. ఒక్క ఫ్లాప్ వచ్చినంత మాత్రాన ఆర్టిస్టు పనైపోయిందని చెప్పడం సరికాదంటారామె. అయితే వైఫల్యానికి మాత్రం ఆర్టిస్టే బాధ్యత వహించాలంటారు. వైఫల్యానికి కారణాలను తెలుసుకోవాలంటారు. కొన్నిసార్లు మంచి పని కూడా అంతగా ఆకట్టుకోదు. అందుకు సరైన మార్కెటింగ్, ప్రమోషన్ లేకపోవడం కూడా కారణం కావొచ్చు.

image


తన పాటలలో మూడవ వంతుమాత్రమే కమర్షియల్ గా హిట్టయ్యాయని శిబానీ అంటారు. తనకు ఎంతో ఇష్టమైన కూర్పు ‘‘కహెలే కహెలే దిల్ సే’’ పాట చాలా ప్రదర్శనల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘‘ప్రేక్షకులు ఆ సాంగ్‌ను ఎంతో మెచ్చుకున్నారు. కానీ ఆ పాటను అంతకుముందు ప్రజలు ఎందుకు వినలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సరైన మార్కెటింగ్ లేకపోవడం కారణంగా ప్రజలకు చేరువ కాకపోయిన పాటల్లో ఇది కూడా ఒకటి’’ అని శిబానీ వివరించారు.

పాజిటీవ్ థాట్స్..

కంపోజ్ ఒక పాటను మొదట్లో సినిమాలో చేర్చి, ఆ తర్వాత దాన్ని తొలిగించిన ఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో శిబానీ ఎంతో బాధపడ్డారు. అయితే అదంతా కొన్ని రోజులే. ఆ తర్వాత ఆత్మవిశ్వాసంతో మళ్లీ సంగీత ప్రపంచంలోకి వెళ్లిపోయారు. ‘‘జీవితమంటేనే ఆటుపోట్లు. కొన్ని సార్లు హిట్స్ వస్తాయి. మరికొన్ని సార్లు వైఫల్యాలు. జీవితమంటేనే అంతే’’ అని ఆమె అంటారు. అందుకే గ్లాస్‌ సగం ఖాళీగా ఉన్నా, సగం గ్లాసులో నీళ్లున్నాయన్న సానుకూల దృక్పథం చూస్తానని శిబానీ చెప్తారు.

ఫ్యామిలీ సపోర్ట్..

శిబానీ ప్రపంచంలో ఆమె తల్లి, సోదరుడు, భర్త మూడు పిల్లర్లు. తల్లి మార్గదర్శకత్వంలోనే ఆమె సంగీతంలో ఓనమాలు నేర్చుకుని ప్రపంచస్థాయి గాయకురాలు కాగలిగారు. ‘మా అమ్మ చెప్తుండేవారు. ఒక్క అవకాశం వస్తే చాలు. మిగతావన్నీ వాటంతటవే వస్తాయని’’ అని చిన్నప్పటి సంగతులను శిబానీ నెమరేసుకున్నారు. ఇక సోదరుడే శిబానీ తొలి విమర్శకుడు. పాట ఎలా ఉన్నా ఎలాంటి సంకోచాలు లేకుండా ఉన్నదున్నట్టుగా చెప్పేస్తారు. అతని సలహాల వల్లే శిబానీ విజయం సాధించగలిగారు. శిబానీ భర్త రాజీవ్ రుడా కూడా ఓ నటుడే. తన సంగీతానికి ఈ స్థాయి విలువ వచ్చిందంటే రాజీవే కారణమని ఆమె అంటారు.

క్రియేటివిటీ.. బిజినెస్..

సాధారణంగా ఆర్టిస్టులు అంత మంచి వ్యాపారస్థులు కాలేరు. ఇండియాలో మంచి మ్యూజిక్ మేనేజర్ లేకపోవడం కూడా పెద్ద లోటు అని శిబానీ అంటుంటారు. ఆరంభంలో ఓ పెద్ద మ్యూజిక్ కంపెనీకి పనిచేస్తున్నప్పుడు కేవలం సంగీతంపై మాత్రమే తాను దృష్టిపెట్టానని ఆమె చెప్పారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నటులే సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నారు. ‘‘మన మ్యూజిక్‌ను అర్థం చేసుకోగలిగిన బిజినెస్ స్పెషలిస్ట్‌ను వెతికి పట్టుకోవడం ఇప్పుడెంతో ముఖ్యం. మన హుందాకు, స్టయిల్‌కు తగ్గట్టుగా మార్కెట్ చేసి, మంచి గుర్తింపు తేగలగాలి’’ అని శిబానీ వివరించారు.

నిజాయితీగా ఉండండి..

ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ ఎదిగి ఉండే తత్వం శిబానీది. యువతకు కూడా అదే మంత్రాన్ని నూరిపోస్తున్నారామె. ఫేమస్ అవడం గురించి కాకుండా స్కిల్స్‌ను డెవలప్ చేసుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించాలని యువ ఆర్టిస్టులకు ఆమె సలహా ఇచ్చారు.

‘‘ఆర్టిస్టు అంటే ఎంతో షైన్ కావాల్సి ఉంటుంది. ఇలా షైన్ కావాలంటే ఎంతో ప్రాక్టీస్ చేయాలి. మనలో ఉన్న అసాధారణ, యూనిక్ క్వాలిటీని బయటపెట్టాలి. ఇతరులను ఫాలో అవడం కంటే మనలో ఉన్న మంచి నైపుణ్యాన్ని సాన పెట్టేందుకు ప్రయత్నించాలి’’ అని యువతకు సూచనలిచ్చారు శిబానీ.

గుర్గావ్ స్టోరీ వద్ద శిబానీని యువర్ స్టోరీ ఇంటర్వ్యూ చేసింది. గుర్గావ్ కోసం ప్రభుత్వం, ప్రజలు చేయి కలపాలని గుర్గావ్ స్టోరీలో ఆమె చెప్పారు. ఆమె మాటలు మరికొన్ని..


Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags