సంకలనాలు
Telugu

జేబులో 50 రూపాయలు.. గుండెల్లో కొండంత ధైర్యం.. యువ్ శాలా విజయ ప్రయాణం

ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు.. ఇక జీవితమే లేదని కుంగిపోతుంటారు చాలా మంది. కానీ క్షితిజ్ మెహ్రా అలాంటి వ్యక్తి కాదు.. ఎన్నో అవమానాలు, ఒడిదుడుకులకు ఎదురీది అనుకున్న లక్ష్యం సాధించారు.. సమాజం మొత్తం వెలేసినా తాను ఏమాత్రం వెనుదిరగకుండా ఉన్నత శిఖరాలు అధిరోహించారు.

CLN RAJU
6th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఓసారి కళ్లుమూసుకుని వెనక్కి ఆలోచిస్తే... నా గత జ్ఞాపకమొకటి నన్ను కిందకు తీసుకెళ్తుందంటూ తన గతాన్ని నెమరువేసుకున్నాడు క్షితిజ్ మెహ్రా. ‘‘ జిరక్ పూర్ లోని నా ఫ్లాట్ గదిలో ఒంటరిగా కూర్చున్న రోజులవి. రాత్రి భోజనానిక్కూడా డబ్బుల్లేని పరిస్థితులు. జేబులో కేవలం 50 రూపాయలు. అదే అప్పటి నా గతం. అప్పులకు, గది అద్దెకు డబ్బులు చెల్లించలేని దీనస్థితి. ఇంటి యజమాని దయతో వారమో, రెండువారాలో డబ్బు కట్టేందుకు సమయం దొరికేది. నా సెల్ ఫోన్‌కు వచ్చే కాల్స్ భయపెట్టేవిధంగా వుండేవి. నాతోటి వాళ్లంతా నన్ను వెలేశారు. చాలామంది నన్నో మూర్ఖుడికింద జమకట్టేశారు.

క్షితిజ్ మెహ్రా,

క్షితిజ్ మెహ్రా,


“వాళ్ల దారే సరైనదని అనుకోవడం నాకు ఆశ్చర్యంగా అనిపించేంది. నేను నిజంగా చాలా వెర్రివాడనే. ఓ మంచి ఉద్యోగం, ఆశించినంత జీతం వస్తుంటే దాన్ని వదిలి.. ఎందుకు నేను వ్యాపారం చేయాలని అనుకోవాలి..? నాకు సుఖవంతమైన జీవితం వుండేది. కానీ ప్రస్తుతం నాది ఆకలి రాజ్యం. ఏది కొనాలన్నా జేబులు ఖాళీ.. డబ్బుల్లేవు. నా చేతిలో వున్న 50 రూపాయలే అపురూపం. దాన్ని తినేందుకు ఖర్చు చేయబుద్దికాలేదు. మరుసటి రోజు ఉదయం రాజ్‌పురాలో ఓ స్కూల్ కోఆర్డినేటర్‌ను కలవాలి. అదే నా గమ్యాన్ని నిర్దేశించే ప్రయాణం. అక్కడే నేను ఉచితంగా పరిచయ శిక్షణా తరగతులు నిర్వహించాలి. దానికోసం పాఠశాల సమన్వయకర్తకు ముందుగా డబ్బులు చెల్లించడమెలా..? అనే ఆలోచనలే నన్ను చుట్టుముట్టాయని’’ గతాన్ని చెప్పుకొచ్చాడు క్షితిజ్.


మళ్లీ ఆయనే కొనసాగిస్తూ... ‘‘మరుసటి రోజు ఉదయం ఆరుగంటలకు అలారమ్ పెట్టి పడుకున్నా. తెల్లవారాక ఇవాళ అంతా బాగుంటుందనే ఆశతో లేచా. హనుమాన్ చాలీసా పారాయణం చేసి దేవుడిని కనికరించమని, బలాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వమని కోరా. 2 కిమీ దూరమున్న బస్ స్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నా. అలా అయితేనే కొంచెం డబ్బు ఆదా అవుతుంది. నడవడానిక్కూడా శక్తి లేదు. కానీ గుండెలో చిన్న ఆశ. ఏదో సాధించగలననే నమ్మకం. నేను నిర్వహించబోయే సమావేశంపైనే దృష్టి కేంద్రీకరించాను.


బస్సులో కూర్చుని జేబులోని 50 రూపాయల నోటుతో రాజ్ పురాకు టికెట్ తీసుకున్నా. టికెట్ కు 35 రూపాయలు పోను 15 రూపాయలే జేబులో మిగిలాయి. పాఠశాల పట్టణానికి శివారుప్రాంతంలో వుంది. స్కూల్ గేటు ముందే బస్సు ఆగుతుందని ఊహించా. కానీ దురదృష్టం వెన్నంటే వుంది. మధ్యలోనే బస్సును వేరే దారివైపు మళ్లించాడు డ్రైవర్. కండక్టర్‌ను అడిగితే ఇక్కడి నుంచి దిగి నడుచుకుంటూ వెళ్లమన్నాడు. అందుకే ఇక్కడున్నా. నేను వెళ్లాలనుకున్న పాఠశాలకు ఇప్పుడు మూడు కిలోమీటర్ల దూరంలో వున్నాను. దారిలో నాగురించి బాగా తెలిసిన స్నేహితురాలు ఫోన్ కాల్ చేసింది. ఫోన్‌లో ఆమెకు నా పరిస్థితినంతా చెప్పుకుంటూ నడవడం ప్రారంభించా. ఆమె నా దయనీయ స్థితిని చూసి చాలా బాధపడింది. ఇన్ని కష్టాలను ఎలా భరిస్తూ వస్తున్నావనే సానుభూతిని చూపించింది.


క్షితిజ్ మెహ్రా ఆమెతో ఒకటే చెప్పాడు. ‘‘ స్కూల్ నిర్వాహకుడు డబ్బులు అడక్కుంటే మంచిదే. ఆయనే గనుక పరిచయ శిక్షణాతరగతులు నిర్వహించుకునేందుకు ముందే డబ్బు చెల్లించాలని అంటే వేరే దారిలేదు వచ్చిన దారిలోనే నడుచుకుంటూ చండీఘడ్ వరకు వెనక్కెళ్లాల్సిందే. తర్వాత ఏం చేయాలనేదాని గురించి ఆలోచించాల్సిందే..’’ అంటూ తన అవస్థలను ఫోన్‌లో స్నేహితురాలితో పంచుకున్నాడు.

image


అంతే.. ఆమె ఫోన్‌లోనే ఏడవటం మొదలు పెట్టింది. నేను సముదాయించాను. ఏం బాధపడొద్దని ఆమెకే తిరిగి ధైర్యం చెప్పాను. ఓ కిలోమీటరు దూరం నడిచాక స్కూటర్‌లో వెళ్లే ఓ మహానుభావుడు సహృదయంతో లిఫ్ట్ ఇచ్చాడు. ఆయనే పాఠశాల భవనం ముందు దిగబెట్టాడు. మహాశివుడిని ప్రార్థిస్తూ అన్నింటినీ అధిగమించాలనుకుని లోపలికి నడిచాను.


నా వ్యూహాలు, ఆలోచనలు నాకున్నాయి. ఒకవేళ పాఠశాల సమన్వయకర్త నన్ను డబ్బులు ఇవ్వమని అంటే.. అప్పుడు నా మనీ పర్స్ ఇంట్లో మరిచిపోయానని ఓ 5 వందల రూపాయలు ఆయన్నే తిరిగి అడుగుదామనుకున్నా. లేదా.. దగ్గర్లో ఏటీఎం లేదు కాబట్టి డబ్బులు ఇప్పుడివ్వలేనని చెబుదామనుకున్నా. కనీసం ఇంటికి తిరిగెళ్లేందుకు కొంచెం డబ్బును ఆయన్నే ఆడుగుదామని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచనలతోనే ఆయన గదిలోకి వెళ్లి స్కూల్ కోఆర్డినేటర్ కోసం వేచి చూశా. కానీ.. ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట మొత్తం నా కథనే మార్చేసింది. ఆయన లోపలికి వస్తూనే అన్నాడు..‘‘ క్షితిజ్ మెహ్రా.. నువ్వు చెప్పిన ఆలోచన చాలా చాలా బాగుంది. ఇదిగో ఈ 25 వేల రూపాయలు తీసుకో.. ఇప్పవరకు మేం 25 వేల రూపాయలు ఇలా వసూలు చేశాం’’ అన్నాడు. నా కళ్లవెంట నీళ్లు జలపాతంలా కారిపోయాయి.


క్షితిజ్ మెహ్రా ఔత్సాహిక విద్యారంగ పారిశ్రామిక వేత్త. విద్యారంగంలో ‘యువ్ శాల’ పేరుతో సంస్థను ప్రారంభించారాయన. దానిద్వారా విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్, శిక్షణా తరగతులను ఇస్తుంటారు క్షితిజ్ మెహ్రా. అలా ఆయన జీవితాన్ని ఓ ఆలోచన పూర్తిగా మార్చేసింది.


- గెస్ట్ రైటర్ - క్షితిజ్ మెహ్రా, యువ్‌శాలా

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags