సంకలనాలు
Telugu

జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరపాలి- ప్రజాప్రతినిధులకు లేఖ రాసిన కేటీఆర్

11th Jul 2017
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరపాలంటూ తెలంగాణ జౌళి, చేనేత శాఖ మంత్రి కేటీఆర్- ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు లేఖ రాశారు. దేశ అర్ధిక, సామాజిక రంగాల్లో చేనేత పరిశ్రమ భాగస్వామ్యాన్ని తెలిపేందుకు, చేనేతలకు ప్రచారం కల్పించి, నేతన్నల అదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో అగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. ఈ మేరకు గత రెండేళ్లుగా తెలంగాణలోనూ చేనేత దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈసారి మరింత ఘనంగా, ప్రజలకు చేనేత వస్ర్తాల, పరిశ్రమ గురించి అవగాహన వచ్చేలా జరపాలని మంత్రి లేఖలో విజ్జప్తి చేశారు.

image


వ్యవసాయం తర్వత రెండో అతిపెద్ద ఉపాధి రంగమైన చేనేత పరిశ్రమతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతోంది. ఆ కార్యక్రమాలన్నీ మంత్రి లేఖలో వివరించారు. ప్రభుత్వం గత నెలలో శాస్ర్తీయంగా సర్వే నిర్వహించి 17వేల మగ్గాలను గుర్తించింది. చేనేతల అదాయం పెంచడమే లక్ష్యంగా చేనేత పొదుపు పథకం, యార్న్ సబ్సిడీ, పావలా వడ్డీ పథకం, బ్లాక్ లెవెల్ క్లస్టర్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. దీంతోపాటు చేనేత వస్ర్తాల వినియోగాన్ని పెంచేందుకు స్వయంగా మంత్రి కేటీఆరే ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలను ధరిస్తున్నారు. గత శాసనసభ సమావేశంలో ఎమ్మెల్యేలకు చేనేత వస్ర్తాల కిట్ ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ లేఖలో గుర్తు చేశారు.

జాతీయ చేనేత దినోత్సవాన్ని జిల్లాకేంద్రాల్లో ఘనంగా జరిపేందుకు పలు కార్యక్రమాలను చేపట్టాలన్నారు. అయా జిల్లాలో ఉన్న చేనేత సంఘాలు, కమిటీలు, సొసైటీల ప్రతినిధులకు ఆహ్వానం పంపాలని కలెక్టర్లను కోరారు. వీటితోపాటు చేనేత రంగంలో జాతీయ అవార్డు గ్రహీతలు, ప్రముఖ చేనేత కార్మికులు, డిజైనర్లకు సన్మానం, చేనేత వస్ర్తాల స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. చేనేత వస్ర్తాలను ధరించి చేనేత రన్/ర్యాలీలు తీయాలన్నారు. జిల్లా కేంద్రాల్లో నేత, డైయింగ్ ప్రక్రియలను నేరుగా తెలిపేలా లైవ్ డెమోలను ఏర్పాటు చేయాలన్నారు. చేనేత పరిశ్రమ, వస్ర్తాలపై విద్యార్ధులకు వ్యాసరచన లాంటి పోటీలను నిర్వహించాలని కోరారు. అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని చేనేత దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కేటీఆర్ లేఖలో కోరారు

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags