సంకలనాలు
Telugu

ఆన్‌లైన్‌ డైరీ ఈ 'లైఫ్ బకెట్'

team ys telugu
30th Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


“డైరీ ఓ అమూల్య సంపద. అయితే అది రాయడంలో నిజాయతీ ఉండాలి. అప్పుడే తనను తాను సంస్కరించుకునేందుకు డైరీ ఎంతగానో ఉపయోగపడుతుంది” - మహాత్మా గాంధీ “హరిజన బంధు” పత్రికలో రాసిన మాటలు.

పూర్వకాలం నుంచీ కూడా డైరీకి అంత ప్రాముఖ్యం. ఎంతో మంది ప్రముఖులు తమ అనుభవాలు, భావాలు, లక్ష్యాలు, ఉద్దేశాలు, జీవితంలో ఎదురైన కష్టసుఖాలు... ఇలా ఎన్నో విషయాలను డైరీల ద్వారా మనకందించారు. న్యూ ఇయర్ వచ్చిందంటే ఇప్పటికీ మార్కెట్లో ఎన్నో వెరైటీల డైరీలు మనకు కనువిందు చేస్తుంటాయి.

మనం మన భావాలను షేర్ చేసుకునే ప్లాట్ ఫాం ఆధారంగా మన భావాల వ్యక్తీకరణ కూడా ఆధారపడి ఉంటుంది. అంటే... ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో స్నేహితులతో ఓ రకంగా మాట్లాడతాం. అదే ఇంట్లో వాళ్లు, బంధువులు ఉంటే ఒక రకంగా మాట్లాడతాం. మరి మన పర్సనల్ డైరీలో అయితే... !!???

“ఆ… ఇప్పుడు డైరీలు ఎవరు రాస్తున్నారు” అని అంటారా! ఆగండాగండి. డైరీ రాయడం అనేది ఇంకా పూర్తిగా ఆగిపోలేదు. ఇంకా ఎంతోమంది తమ దైనందిన కార్యక్రమాల్లో డైరీని భాగంగా చేసుకుని జీవిస్తున్నవాళ్లు ఉన్నారు. మీ భావన కూడా నిజమే. స్మార్ట్ ఫోన్లు, అప్లికేషన్లే జీవితంగా మారిపోయిన ఈ రోజుల్లో డైరీ రాయడం ఓ పాతకాలపు అలవాటుగానే మిగిలిపోయింది. అయినా ఇప్పటికీ చాలామంది చిన్న చిన్న పాకెట్ డైరీలను మెయింటెయిన్ చేస్తూ తమ ఆలోచనలను, భావాలను అందులో రాస్తూ ఉంటారు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలనుకున్నారు లైఫ్ బకెట్ టీమ్. “డైరీని ఆన్ లైన్ లోకి మార్చి అందిస్తే ఎలా ఉంటుంది? ” అనే ఆలోచనకి రూపమే ఈ “లైఫ్ బకెట్”.

image


లైఫ్ బకెట్ వ్యవస్థాపకులు షైలీ పరేఖ్, నైపుల్ పరేఖ్

లైఫ్ బకెట్ వ్యవస్థాపకులు షైలీ పరేఖ్, నైపుల్ పరేఖ్


“లైఫ్ బకెట్” ఓ ప్రైవేటు సోషల్ నెట్‌వర్క్ ప్లాట్ ఫాం. ఇక్కడ ఎవరైనా ఏదైనా రాసుకోవచ్చు. ఆ భావాలను, ఆలోచనలను తనకు నచ్చినవారితో షేర్ చేసుకోవచ్చు. ఇది ఓ పర్సనల్ డైరీ. ఇక్కడ మన కుటుంబ జీవితంలో జరిగే ఏ సంఘటననైనా షేర్ చేసుకోవచ్చు. దాన్ని అందరితో కాకుండా అవసరమైన కొద్దిమందితో పంచుకోవచ్చు. లైఫ్ బకెట్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ (ఐఫోన్), అమెజాన్ కిండిల్‌లో లభిస్తోంది. దీనిలోని మరో ప్రత్యేకత ఏంటంటే... ఎలాంటి ప్రకటనలూ ఉండవు. కస్టమర్ల ప్రైవసీకి అధిక ప్రాధాన్యముంటుంది.

ఈ జ్ఞాపకాల బకెట్‌లో తడిసి ముద్దైపోవాల్సిందే

ఈ జ్ఞాపకాల బకెట్‌లో తడిసి ముద్దైపోవాల్సిందే


ఏమిటి దీని ప్రత్యేకత ?

మిగిలిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల మాదిరిగా దీనిలో కూడా ఫొటోలు, వీడియోలను సైతం అప్ లోడ్ చేయవచ్చు, షేర్ చేయవచ్చు. గ్రూప్స్ క్రియేట్ చేయవచ్చు. అయితే మరి దీనికీ ఫేస్‌బుక్ వంటి వాటికి తేడా ఏమిటి? అనేగా మీ సందేహం. “ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సైట్లలో మనకు ఎన్ని లైకులు వచ్చాయి, ఎంతమంది ఫాలో అవుతున్నారు అనే దానిపైనే ధ్యాస కానీ, సమాచారంపై కాదు. ఇక్కడ భావాలను పంచుకోవడం, అనుభూతులను వ్యక్తపరచడం జరుగుతుంది... అది కూడా కేవలం మనకు నచ్చినవారితో, మనకు కావలసిన వారితో మాత్రమే. తెలియని వాళ్ల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు రావు. అన్ వాంటెండ్ మెస్సేజ్ లు మనల్ని విసిగించవు”... అని లైఫ్ బకెట్ ప్రత్యేకతలను వివరిస్తారు కో-ఫౌండర్ నైపుల్.

ఇతర సోషల్ మీడియా అప్లికేషన్లలో లేని విశిష్టతలు లైఫ్ బకెట్లో చాలానే ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా!

  • లైఫ్ లెట్: ఈ ఫీచర్ ద్వారా మనం ఏదైనా ఒక అంశంపై నోట్స్ రాసుకోవచ్చు. దానికి అనువైన ఫొటోలు, వీడియోలను ఆ నోట్స్‌కి జతచేయవచ్చు. లైఫ్ లెట్ ప్రధాన ఉద్దేశం... యూజర్ తనకి ఏది రాసుకోవాలనిపిస్తే అది అక్కడ టైప్ చేసుకునే వెసులుబాటు కల్పించడమే.
  • విడ్ స్టేషన్: యూజర్ తన స్మార్ట్ ఫోన్ ద్వారా రికార్డ్ చేసిన వీడియోలను లైఫ్ బకెట్ లోకి అప్ లోడ్ చేసి తర్వాత తనకు అవసరమైనప్పుడు చూసుకునే అవకాశాన్ని విడ్ స్టేషన్ ద్వారా పొందవచ్చు.
  • కాన్వాస్: ఇది కూడా విడ్ స్టేషన్ లాంటిదే. అయితే ఇక్కడ వీడియోలకు బదులు ఫొటోలు అప్ లోడ్ చేయాలి. తర్వాత ఓ పర్సనలైజ్డ్ బోర్డ్ తయారుచేసి కుటుంబ సభ్యులకు షేర్ చేయవచ్చు.
  • బకెట్ లిస్ట్: యూజర్స్ తనకు నచ్చిన అంశాలను పోస్ట్ చేసుకునేందుకు ఇది ఓ టైమ్ లైన్ లాగా ఉపయోగపడుతుంది.
  • గ్రూప్స్: లైఫ్ బకెట్లో రిజిస్టర్ అయిన తర్వాత గ్రూపులు క్రియేట్ చేయవచ్చు. అందులోకి మనకు కావలసిన వారిని ఆహ్వానించి, మనం షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు, మన ఆలోచనలను వారికి చూపించవచ్చు. ఇందులో వేరేవారికి అవకాశం ఉండదు. గ్రూప్ మెంబర్స్ మాత్రమే చూడటం, కామెంట్, షేరింగ్, చాటింగ్ చేయగలరు. అంటే పూర్తి ప్రైవసీ ఉంటుంది.

ఇన్ని ప్రత్యేకతలున్న ఈ అప్లికేషన్ కి అసలు మూలం ఏమిటి ?

షైలీ పరేఖ్, నైపుల్ పరేఖ్... వీరిద్దరి ఆలోచనలకూ రూపమే లైఫ్ బకెట్. వీరిద్దరూ కలసి ప్రైవేట్ ఐ అనే ఓ కంపెనీని ప్రారంభించారు.

న్యూయార్క్‌లోని బఫెలో యూనివర్శిటీ నుంచి మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నైపుల్... ఫెడరల్ నేషనల్ మార్టిగేజ్ అసోసియేషన్ అనే ఓ అమెరికా ప్రభుత్వ సంస్థలో బిజినెస్ ఎనలిస్ట్‌గా పనిచేసేవాడు. ఆ పనిలో భాగంగా తను ఫ్యామిలీ ఈఆర్పీ అప్లికేషన్ల రూపకల్పనలో కూడా భాగమయ్యేవాడు. పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలకి వెళ్లినప్పుడు అతనికి అనిపిస్తూ ఉండేది... “ఇలాంటి సంఘటనలను పంచుకోవడానికి ఓ ప్రైవేట్ సోషల్ నెట్ వర్క్ ఉంటే బాగుటుంది. అప్పుడు ఇలాంటి వేడుకల విశేషాలన్నీ కుటుంబ సభ్యులతో సులభంగా షేర్ చేసుకోవచ్చు కదా!” అని. ఆ ఆలోచనే ఇప్పుడు నైపుల్‌ని లైఫ్ బకెట్ టెక్నాలజీ హెడ్‌గా నిలబెట్టింది.

ఇక షైలీ పరేఖ్... లైఫ్ బకెట్‌కి మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీ హెడ్. ఈమె కామర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి, బర్మింగ్‌హామ్‌లోని ఆస్టన్ యూనివర్శిటీ నుంచి మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ పొందారు. ఈమెకు మార్కెటింగ్‌లో ఎలాంటి అనుభవమూ లేదు. కానీ ఈరోజు లైఫ్ బకెట్ మార్కెటింగ్‌లో షైలీ పాత్ర ఎంతో కీలకం.

ఆదాయం ఎలా?

లైఫ్ బకెట్ ఆప్‌ని ఎవరైనా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అదనపు ఫీచర్లు కావాలంటే మాత్రం కొంత డబ్బు వెచ్చించాల్సిందే. ఉచితంగా అందరికీ 20 జీబీ స్పేస్ లభిస్తుంది. అంతకన్నా ఎక్కువ కావాలంటే ఏదో ఒక ప్లాన్‌కి సబ్‌స్క్రైబ్ కావాలి. అలాగే యూజర్లు తాము అప్‌లోడ్ చేసిన ఫొటోలను ఓ చిన్న ఆల్బమ్‌లా రూపొందించుకుని ప్రింట్ చేసుకునే అవకాశం కూడా ఈ యాప్ కల్పిస్తోంది. ఎవరైనా పెట్టుబడులతో ముందుకొస్తే దీన్ని మరింత అభివృద్ధి చేయవచ్చనేది నైపుల్, షైలీల ఆలోచన. దీనికి విస్తృత ప్రచారం కల్పించడానికి ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సైట్లను ఉపయోగించుకుంటున్నారు.

పోటీ, సవాళ్లు

ప్రైవేట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం, క్లౌడ్ స్టోరేజ్, ప్రింటింగ్... ఈ మూడూ లైఫ్ బకెట్ ప్రధాన ఫీచర్లు. మార్కెట్లో ప్రస్తుతం ఇలాంటి అప్లికేషన్ ఏదీ లేకపోవడం వీరికి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్.

“డైరీ స్పేస్, సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వరకూ ఎవర్‌నోట్ తో మేం పోటీపడుతున్నామని అనుకోవచ్చు. స్టోరేజ్ పరంగా డ్రాప్ బాక్స్ వంటివి మాకు ప్రధాన పోటీ. విస్టా ప్రింట్ వంటి ప్రింటింగ్ వెబ్ సైట్లు కూడా మాకు గట్టి పోటీదారులే. కానీ ఈ ఫీచర్లన్నింటినీ ఒకే చోట అందించడం మాకు మాత్రమే సాధ్యం”... అంటారు నైపుల్.

2014 మేలో ప్రారంభమైన లైఫ్ బకెట్ అప్లికేషన్ రూపొందించే పని ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంది. ఇన్ని ఫీచర్లను ఒక్క అప్లికేషన్‌లో లింక్ చేయడం చాలా కష్టతరమైంది. ఎలాగైతేనేం... దాన్ని సాధించారు నైఫుల్ బృందం. 2015 జనవరి 15న వెబ్ సైట్, మొబైల్ అప్లికేషన్ రెండూ ఒకేసారి ప్రారంభమయ్యాయి. అయితే ఎలా వినియోగించాలో చాలామందికి అర్థం కాలేదు. దీంతో ఓ బ్లాగ్ ప్రారంభించి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం ప్రారంభించారు. కానీ చాలామంది యువత తమకు ఏది నచ్చితే అది సోషల్ సైట్ల ద్వారా అందరితో పంచుకోవాలి అనుకుంటారు. ఎవరో కొద్ది మంది మాత్రం ఫిల్టర్లు పెట్టుకుని అవసరమైనవారితో మాత్రమే షేర్ చేస్తారు. ఇది ప్రస్తుతం ట్రెండ్. మరి లైఫ్ బకెట్‌ను ఈ యూత్ ట్రెండ్‌ని తట్టుకుని విజయతీరాలకు చేర్చడం నైపుల్, షైలీల ముందున్న అతి పెద్ద సవాల్. గుడ్ లక్ లైఫ్ బకెట్.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags