సంకలనాలు
Telugu

మన ఫోన్‌లో మన భాష! ఇదే 'ఫస్ట్ టచ్‌' అజెండా!!

Chanukya
20th Jan 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

22 ప్రధాన భాషలు, 13 రకాల లిపి, 720కి పైగా మాండలికాలు.. ఇదీ భారత్‌లో భాషా వికాసం. అందుకే దేశం మొత్తానికి ఏదో ఒక భాష పరిమితం కాదు. ఇక్కడ భిన్నత్వమే.. దేశంలోని ఏకత్వానికి కారణమైంది. అయితే ఇప్పుడు పుట్టుకొస్తున్న స్మార్ట్ ఫోన్ కల్చర్‌కు మాత్రం ఆ బేషా బేధాల్లేవు. 100 కోట్లమంది జనాభా ఉన్న ఈ దేశంలో 60 శాతం మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండనే ఉన్నాయి. కానీ వాళ్లలో అత్యధిక శాతం మంది మాత్రమే అందులోని ఫీచర్లను ఉపయోగించుకుంటారు. కారణం ఇంగ్లిష్‌పై పట్టులేకపోవడం, స్థానిక భాషలో సమాచారం లభ్యం కాకపోవడమే.

ట్వంటీస్ ఏజ్‌లో ఉన్నప్పుడు రాకేష్ దేశ్‌ముఖ్, ఆకాష్ డోంగ్రే, సుధీర్ బంగారం బండి ఆలోచలన్నీ తమ సీనియర్ల చుట్టూనే తిరిగేవి. ఐఐటి ముంబైలో చదువుతున్నప్పుడు.. తమ సీనియర్లు టెక్ ఐడియాలతో దూసుకుపోవడం, కొత్త కంపెనీలను ఏర్పాటు చేయడం వీళ్లలో ఉత్సాహాన్ని నింపేది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని స్మార్ట్ ఫోన్లను మరింత స్మార్ట్‌గా వాడుకునేలా జనాలకు వెసులుబాటు కల్పించాలని అంతా నిర్ణయించుకున్నారు. తమ అనుభవంతో ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని తాపత్రయపడ్డారు.

image


''స్మార్ట్ ఫోన్లు యూజర్లు.. ఫోన్ వాడేటప్పుడు పడే ఇబ్బందే 'ఫస్ట్ టచ్‌' ఐడియా వచ్చేందుకు కారణమైంది. ఇంగ్లిష్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఉండడం వల్ల వినియోగదార్లు పూర్తిస్థాయిలో ఉపయోగించలేకపోతున్నారనే విషయాన్ని మేం అర్థం చేసుకున్నాం. అందుకే భారతీయుల అవసరాలకు అనుగుణంగా ఫోన్ల డిజైన్, అందులోని భాష ఉండాలని మేం భావించాం'' అంటారు రాకేష్.

ఫస్ట్ టచ్‌ను ప్రమోట్ చేసిన మోఫస్ట్ సొల్యూషన్స్‌కు రాకేష్ సిఈఓ, కోఫౌండర్. ఆకాష్, సుదీర్ ఇద్దరూ సిఓఓ, సిటిఓ బాధ్యతలను మోస్తూ.. కోర్ టీంలో ఉన్నారు.

''ప్రస్తుతం భారత దేశంలోని ప్రతీ ప్రాంతానికీ, ప్రతీ వ్యవస్థకూ ఫస్ట్ టచ్ అవసరం ఎంతో ఉంది. టెక్నాలజీ ద్వారా స్థానిక భాషలను అందరికీ చేరువ చేయాలని అనుకుంటున్నాం. స్మార్ట్ ఫోన్లలో మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ వ్యవస్థ లేకపోవడం వల్ల అది మరింతగా చొచ్చుకుపోలేకపోతోంది. ఫోన్ వల్ల ఉన్న విస్తృత ప్రయోజనాలను కూడా ఉపయోగించుకోలేకపోతున్నాం'' అంటారు రాకేష్.

ఈ అవసరాలను అవకాశాలను మార్చుకునేందుకు టెక్నాలజీని వినియోగించుకున్న ఫస్ట్ టచ్.. వినూత్న ఫీచర్లతో ముందుకొచ్చింది. స్వైప్ చేస్తే చాలు మనం కోరుకున్న భాషలోకి అనువాదం జరగడం ఇందులోని ముఖ్యాంశం. 10 భాషల్లో మెసేజ్ రిసీవ్ చేసుకోవడంతో పాటు ఆ మెసేజ్ సారాంశాన్ని ఇంగ్లిష్‌లోకి, లేదా.. ఇంగ్లిష్‌లో ఉన్న దాన్ని మీకు నచ్చిన భాషలోకి మార్చుకునేందుకు వెసులుబాటు ఉంది. అది కూడా జస్ట్ స్వైప్ చేస్తే చాలు.. అనువాదం పూర్తైపోతుంది.

ఫస్ట్ టచ్ అందిస్తున్న మరో ఆకర్షణీయమైన ఫీచర్ .. కీ బోర్డ్. సులువుగా, అర్థవంతంగా, తప్పుల్లేకుండా టైప్ చేసేందుకు పది భాషల్లో ప్రెడిక్షన్స్‌తో సహా కీ బోర్డ్స్ డిజైన్ చేశారు. ఇందులో ట్రాన్స్‌లేషన్‌తో పాటు ట్రాన్స్‌లిటరేషన్‌ కూడా ఉంటుంది. ఉదా. how are you ? అని టైప్ చేసి స్వైప్ చేస్తే.. (మీకు నచ్చిన భాషలోకి) 'ఎలా ఉన్నారు ?' అని మారుతుంది.

ప్రస్తుతానికి కొన్ని ఫోన్ హ్యాండ్ సెట్ కంపెనీలు.. తమ ఫోన్లలో 9 నుంచి 15 భాషలు ఇన్ బిల్డ్ ఇస్తున్నాయి కానీ.. వాటి వల్ల మన వాళ్లకు పెద్దగా ప్రయోజనం ఉండడంలేదు. వాటిని వాడడం కూడా అంత సులువుగా లేదు. వాటికి భిన్నంగానే తమ ప్రోడక్ట్ ఉందని చెబ్తోంది ఫస్ట్ టచ్.

image


పేటెంట్ పొందిన ఫస్ట్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్.. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాం మీద రూపొందించారు. తెలుగు, గుజరాతీ, మరాఠీ, కన్నడ.. ఇలా 12 భాషల్లో ఇది లభ్యమవుతోంది. ప్రాంతీయ భాషల ప్రాముఖ్యత గుర్తించి రీజన్ ఆపరేటింగ్ వ్యవస్థను రూపొందించింది ఫస్ట్ టచ్. 'ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉండడం వల్ల ఎంతో మంది ఆసక్తిగా చూశారు. ఇండస్ట్రీ వ్యక్తులతో పాటు యూజర్స్‌ను కూడా మా ప్రోడక్ట్ ఆకట్టుకుంది. దీని వల్ల గ్రామీణ, నగరాల్లో ఉండే వాళ్లందరికీ స్మార్ట్‌ ఫోన్ మరింత స్మార్ట్‌గా మారుతుంది. వాళ్లకు స్థానిక భాషలో స్మార్ట్ అనుభూతిని ఇవ్వడమే మా ఉద్దేశం' అంటారు రాకేష్.

మొబైల్ ఫోన్స్ హెడ్‌గా, జెన్ మొబైల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా చేసిన వైభవ్ శాస్త్రిని ఈ మధ్యే వీళ్లు నియమించుకుంది. ఈ పేటెంటెడ్ టెక్నాలజీని మార్కెటింగ్ చేసి తమ ఆపరేషన్స్‌ను విస్తృత పరుచుకోవాలని చూస్తున్నారు. స్నాప్‌డీల్‌కు చెందిన కునాల్ బెహల్, రోహిత్ బన్సాల్‌ సహా క్వికర్ - ప్రణయ్ చూలెట్, ఇన్‌మొబి - నవీన్ తివారి, అమిత్ గుప్తాల నుంచి ఈ కంపెనీకి ఫండింగ్ అందింది. ప్రస్తుతం కంపెనీలో కొంత మంది భాషా నిపుణులు కూడా ఉన్నారు. వాళ్లు ఎప్పటికప్పుడు ప్రోడక్ట్‌కు అవసరమైన మార్పులు - చేర్పులపై దృష్టిసారిస్తూ ఉన్నారు.

ప్రపంచ ప్రఖ్యాత సెర్చ్ ఫర్మ్ ఈ-మార్కెటర్ అంచనా ప్రకారం 2016 నాటికి యూఎస్‌ స్థానాన్ని అధిగమించి రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ వినియోగదారుల జాబితాలోకి భారత్‌ చేరుతుంది. వీళ్లలో 60 శాతానికి పైగా ఇంగ్లిష్ ఏతర భాషలు మాట్లాడే వాళ్లే ఉంటారని అంచనా వేస్తోంది. మైక్రోమ్యాక్స్‌తో కూడా ఫస్ట్ టచ్ ఒప్పందం కుదుర్చుకుంది. లైసెన్స్ ఫీజ్, యాప్ ప్రీ లోడ్స్‌తో పాటు సొంతంగా ఫస్ట్ టచ్ హ్యాండ్ సెట్స్‌ తయారీ ద్వారా స్థిరమైన ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

వేగంగా విస్తరిస్తున్న ఈ మార్కెట్లో 2018 నాటికి కనీసం 50 కోట్ల మంది తమ భాష ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యేలా చేయడంతో పాటు 10 కోట్ల మందిని డిజిటల్‌గా అనుసంధానించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రస్తుతం మా లక్ష్యం ఏంటంటే ప్రోడక్ట్‌ను మరింత అభివృద్ధి చేయడం, టెక్నాలజీ, సేల్స్, మార్కెటింగ్ రంగాల్లో అవగాహన విస్తృతం చేసుకోవడం అంటారు రాకేష్.

ఫస్ట్ టచ్ ఈ మధ్యే బంగ్లాదేశ్‌లో కూడా తమ కార్యకలాపాలను ప్రారంభించింది. త్వరలో ఆసియా మార్కెట్లలో కూడా తన పరిధిని విస్తరించుకోవాలని ఎదురుచూస్తోంది.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags