సంకలనాలు
Telugu

ఇంటి వంట రుచిలో మునిగి తేలాలనే వాళ్లకోసమే పుట్టిన 'మీల్‌బోట్'

ఇంటి వంటకు పోటీగా నిలుస్తానంటున్న ఫుడ్ స్టార్టప్రుచికరమైన వంటకాలతో జననీరాజనాలుమంచి వంటపై జనానికున్న మక్కువే తమ సక్సస్ మంత్ర అంటున్న మీల్ బోట్

ashok patnaik
14th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

కొత్త కంపెనీ పెట్టాలన్న ఆలోచనకు దారితీసిన సంభాషణ పూర్తయి రెండు నిమిషాలు కూడా గడవలేదు. కానీ అది మరో ప్రపంచంలో .. ఎంత తిన్నా లావెక్కని ప్రపంచం అది. ఒక ఎక్స్, ఒక వై ( వాళ్ళు అలాగే పిలవమన్నారు లెండి ) మధ్య కూడా ఇలాంటి సంభాషణే జరిగింది. వాళ్ళూ ఒక సొంత కంపెనీ పెట్టాలనుకున్నారు. అది కూడా మరో ప్రపంచంలోనే. ఎట్టకేలకు మీల్‌బోట్ డాట్ కామ్ మొదలుపెట్టారు. ఇంటివంటగాళ్ళందరినీ ఒక చోటుకు చేర్చటం వీళ్లపని. ఇంటి వంట కోసం మొహం వాచినట్టు ఎదురుచూస్తున్నవాళ్ళు తమకు నచ్చిన వంటకాన్ని ఇక్కడ ఎంచుకొని కొనుక్కోవచ్చు. ఇదే వాళ్ల లాస్ట్ స్టాప్. రోజంతా పని చేసి అలసిపోయాక మంచి ఫుడ్ దొరికితే బాగుండుననుకుంటాం. అదే సమయంలో చాలా ఇష్టంగా వంటచేయటం తెలిసినవాళ్ళు చిన్న చిన్న హోటళ్ళు, కాటరింగ్ సర్వీసులు పెట్టాలనుకుంటారన్నది ఎక్స్ అభిప్రాయం

మీల్ బోట్ ఎలా పనిచేస్తుంది ?

ఈ వెబ్ సైట్ చాలా సులువుగా ఉంటుంది. మీరు ఆహారం కోసం చూస్తున్నట్టయితే, వంటమనిషిని, తను వండే వంటకాన్ని, వాళ్ళు పనిచేసే ప్రాంతాన్ని ఎంచుకొని ఆర్డర్ పెట్టవచ్చు. ఇంటిదగ్గరే డెలివరీ చేసేదాకా ఆగవచ్చు, లేదా స్వయంగా వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీరే ఇంటివంట తయారుచేసి అమ్మాలనుకునే వాళ్లయితే నమోదు చేసుకొని, ఎక్స్ లేదా వై మిమ్మల్ని సంప్రదించేదాకా వేచి ఉండండి.

మీల్ బోట్ లో లభించే వెజ్ రోల్

మీల్ బోట్ లో లభించే వెజ్ రోల్


“మేం ఇది మొదలు పెట్టి రెండు నెలలయింది. ఊహించిన దానికంటే చాలా వేగంగా ముందుకెళుతున్నాం. అటు వినియోగదార్లు, ఇటు చెఫ్‌ల నుంచీ స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటికి 20 మంది వంటవాళ్లను ఒప్పుకున్నాం. ఇంకా 70 మంది ఎదురు చూస్తున్నారు. “అని చెప్పారు ఎక్స్.

ఒక నవ్వొచ్చే నిజమేంటంటే, ఈ సైట్ లో ప్రస్తుతం ఇద్దరు, ముగ్గురే మగ వంటగాళ్ళున్నారు. మరి ఎవరైనా నాన్న చేతి వంటే కావాలంటే ఎలా మరి ?

సవాళ్ళు

ప్రస్తుతానికి ఈ ప్రయత్నం కేవలం నోటిమాటగా సాగే ప్రచారం మీద, ఫేస్ బుక్ మీదనే ఆధారపడుతోంది. బంధుమిత్రులే ఎక్కువగా దీన్ని వాడుకుంటున్నారు. ఈ మధ్యలోనే ఈ జంట తమకెదురవుతున్న సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నారు. ఇంటివంట పరిశ్రమ చెల్లాచెదురుగా ఉండి వ్యవస్థీకృతం కాకపోవటం వల్ల చాలా కష్టపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఎదురవుతున్న అవరోధాలను మెల్లగా తొలగించుకుంటూ వస్తున్నామంటారు ఎక్స్.

image


మీల్ బోట్ డాట్ కామ్ ఎందుకు ?

మీల్ బోట్ డాట్ కామ్ గొప్పదనానికి కారణం... కేవలం జనానికి బాగా వండిన మంచి ఇంటివంట మీద ఉండే అపారమైన ఇష్టమే. ఈ పోర్టల్‌లో జనం మెచ్చుకునే అనేక రకాల వంటకాలుంటాయి. ఎవరైనా పార్టీ ఇవ్వాలనుకున్నా ఇక్కడ తగిన వంటకాలుంటాయి. ఒకే వంటమనిషి చేసిన భోజనం పగలు గాని రాత్రిగాని కావాలంటే అందించే ఏర్పాటు కూడా చేస్తున్నారు. వంట చేసే వాళ్ళు తమకంటూ వెబ్ సైట్‌లో ఒక పేజ్ ఉండటం పట్ల చాలా ఆనందంగా ఉన్నారు. ఫుడ్ లవర్స్ తమ అభిప్రాయాలను నమోదు చేసేందుకు కూడా అందులో అవకాశం కల్పించారు. ఆహారం నాణ్యత, ఆ వంటవాళ్ళతో అనుభవం లాంటి అంశాలను అందులో పొందుపరుస్తారు. దీనివల్ల వంటవాళ్ళు మరింత ఆనందంగా మరింత జాగ్రత్తగా పోటాపోటీగా రుచికరమైన వంటకాలు తయారుచేస్తారు.

భవిష్యత్ ప్రణాళికలు

ఇప్పుడు మీల్ బోట్ డాట్ కామ్ దృష్టంతా చెఫ్‌ల వివరాలతో ఒక డేటా బేస్ తయారుచేయటమే. ఆ విధంగా బెంగళూరు నగరం అంతటా వంటవాళ్ళు ఉండేట్టు చూడాలన్నదే లక్ష్యం. ఆ లోపు గిరాకీని కూడా తగిన విధంగా పెంచుకోవటం. స్వయంగా కష్టపడటం, టెక్నాలజీని వాడుకోవటం, వ్యవస్థను అర్థం చేసుకోవటం, నిపుణులను సంప్రదించటం, తద్వారా సరైన నిర్ణయాలు తీసుకోవటం తమ లక్ష్యమంటారు ఎక్స్. గత కొద్దినెలలుగా ఎదుగుదల స్పష్టంగా కనబడుతోంది. ప్రస్తుతానికి ఒక్కో లావాదేవీకి ఇంత చొప్పున, సభ్యుల చందాల నుంచి వస్తున్నదే ఆదాయం. ఇంకాస్త ముందడుగు వేశాక పెట్టుబడి కోసం ఇన్వెస్టర్లతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ముందుగా బెంగళూరులో దీన్ని అమలు చేసి, మార్కెట్‌ను అర్థం చేసుకున్న తరువాత అప్పుడు దేశంలోని ఇతర నగరాలకూ విస్తరించాలనుకుంటున్నారు. ఇంట గెలిచాకే రచ్చ గెలవాలన్నది ఎక్స్, వై లక్ష్యం. ప్రస్తుతానికి ఒక కార్పొరేట్ ఉద్యోగం చేస్తూనే దీన్ని కూడా చూసుకుంటున్నారు. “ నిజానికి కాస్త పెట్టుబడి పెట్టి దిగాల్సి ఉంది. కానీ ఆలోచన రాగానే మొదలుపెట్టేశాం. మొదలెట్టినప్పటినుంచీ నిజంగా చాలా వేగంగా ముందుకు సాగుతోంది “ అంటూ ముగించారు ఎక్స్.

ఇక్కడ క్లిక్ చేస్తే ఓ ముద్ద రుచికరమైన ఇంటివంట దొరుకుతుంది మరి.

website

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags