సంకలనాలు
Telugu

లైంగిక ఉత్పత్తుల అమ్మకాల్లో మనమెక్కడున్నాం?

కామసూత్ర పుట్టిన నేలమీద ఇప్పటికీ కండోమ్ కొనుక్కోవాలంటే సిగ్గు పడే పరిస్థితి వుంది. ఇక లైంగిక ఉత్పత్తులను కొనుక్కోవడం అనేది ఊహించడం కూడా కష్టమే. అయితే, ఆన్ లైన్ మార్కెట్ వచ్చాక ఈ పరిస్థితి మారింది. ఇప్పుడు ఇండియాలో సెక్సువల్ వెల్నెస్ ఉత్పత్తుల మార్కెట్ వెయ్యికోట్లకు పెరిగిందంటే నమ్మగలరా.. థాంక్స్ టు ఆన్‌లైన్

bharathi paluri
20th Jun 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఫిఫ్టి షేడ్స్ ఆఫ్ గ్రే సినిమా ఇండియాలో రిలీజ్ కాలేదు. కానీ, Imbesharam.com వెబ్‌సైట్‌లో మాత్రం అంతకు మించిన వస్తువులను కొనుగోలు చేయొచ్చు.

భారతదేశంలో లైంగిక అవగాహన, లైంగిక విషయాలపట్ల ఆసక్తి కొత్తేం కాదు. మనది కామసూత్ర పుట్టిన నేల. శృంగార కళ ఇక్కడ శిల్పాల్లో, శిల్పకళా చాతుర్యంలో కలగలిసివుంటుంది. అయినా ఇంకా లైంగిక, శృంగార పరమైన అంశాలంటే, ఏదో ఇబ్బంది, అదో నిషిద్ధాంశంగా చూస్తుంటాం. అయితే, ప్రపంచం చాలా మారిపోయింది. ఇప్పుడు లైంగిక అవగాహనకు, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలకు, వస్తువులకు అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ వుంది. 2020 నాటికి ఒక్క అమెరికాలోనే ఈ విభాగంలో అమ్మకాలు 5 వేల కోట్ల డాలర్లకు చేరుతాయని ఒక అంచనా.

Image credit - shutterstock

Image credit - shutterstock


న్యాయపరమైన చిక్కులు

ఈ వ్యాపారం నిర్వహించడంలో నిజంగానే కొన్ని న్యాయపరమైన చిక్కులున్నాయి. కస్టమర్లుగా పైకి కనపడడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వుంది. అయితే, ఇంటర్నెట్ పుణ్యమా అని ఈ ఇబ్బందులకు కొంత పరిష్కారం దొరికింది. ఇప్పుడు కస్టమర్ల పేరు ఊరు బయటకు రాకుండానే కొనుక్కోవచ్చు. అయితే, చట్టపరమైన ఇబ్బందుల వల్ల ఫ్లిప్‌కార్ట్ లాంటి భారీ ఈ కామర్స్ సైట్లు సెక్సువల్ వెల్నస్ కి సంబంధించిన క్యాటగరీని తొలగించాయి. ఫ్లిప్ కార్ట్ తోపాటు, మరో నాలుగు వెబ్ సైట్లపై పోలీసులకు ఫిర్యాదులు రావడంతో ఫ్లిప్ కార్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.

నిజానికి ఈ బిజినెస్‌లో రిస్క్ ఎంత ? ఈ రకమైన ఉత్పత్తులు అమ్మడం, కొనడంలో చట్టం స్పష్టంగా లేకపోవడం వల్ల రిస్క్ ఎక్కువే అని చెప్పాలి. అశ్లీలానికి సంబంధించి భారతీయ చట్టాల్లో స్పష్టత లేదని టీమ్ సెక్స్‌పిరేషన్ ప్రతినిథి ధ్రువ్ అంటున్నారు.

ఐపిసి సెక్షన్ 294 ప్రకారం

అశ్లీలం నిర్వచనం ఇలా వుంది.

1. బహిరంగ ప్రదేశాల్లో ఏవిధమైన అశ్లీలత ప్రదర్శించినా..

2. బహిరంగ ప్రదేశాల్లో లేక బహిరంగ ప్రదేశాలకు సమీపంలో అశ్లీల.. అసభ్యత వున్న పదాలతో కూడిన పాటలు పాడినా, మాట్లాడినా.. మూడునెలల వరకు జైలు శిక్ష, లేదా జరిమానా.. లేదా ఈరెండూ కలిపి విధించవచ్చు.

అయితే, ఏది అశ్లీలత, ఏది శృంగారం అనే విచక్షణ ఈ చట్టంలో లేదు.

సెక్సువల్ వెల్నెస్ మార్కెట్లో కేవలం సెక్స్ టాయ్స్, ఇతర లైంగిక వినోద వస్తువులే కాక, మామూలుగా మెడికల్ షాపుల్లో దొరికే కండోమ్స్, ల్యూబ్‌లు, జెల్‌లు కూడా అమ్ముతారు. మొత్తం మీద ఇండియాలో ఈ మార్కెట్ ఇప్పడు వెయ్యి కోట్లకు చేరుకుంది. ఇంకా పెరుగుతూనే వుంది.

ఈ-కామర్స్ దే హవా..

కొన్నేళ్ళుగా ఈ సెక్సువల్ వెల్నస్ మార్కెట్లో ఈ కామర్స్ సైట్ల హవా నడుస్తోంది. IMbesharam.com, That’s Personal, Shycart, PrivyPleasures, Its Muah Life and Team Sexpiration.. లాంటి సైట్లు ఈ మార్కెట్ లో నిలదొక్కుకుంటున్నాయి.

That’s Personal వ్యవస్థాపకుడు సమీర్ మాటల్లో చెప్పాలంటే, ‘ మనం ఆన్ లైన్ లో ఏదైనా కొనుక్కోవచ్చు. ఒక పేకెట్ కండోమ్స్ మాత్రం దొరకవనే విషయం నాకు చాలా ఆశ్చర్యంగా వుండేది. మా రీసెర్చ్‌లో ఓ వ్యక్తి తన అనుభవాన్ని చెప్పాడు. తన ఇంటి పక్కనే వున్న మెడికల్ షాప్ యజమాని తనకు చిన్నప్పటి నుంచి తెలుసు. కనుక కండోమ్ కావాలంటే, ఆ షాప్‌కి వెళ్ళలేడు. అలాంటి వాళ్ళకి ఆన్ లైన్ లో ఇవి దొరకడం చాలా అవసరం.’

మారుతున్న మార్కెట్ సరళి

ఇప్పుడు మార్కెట్ అంతా ఆన్ లైన్ కి వెళ్ళిపోవడం వల్ల కస్టమర్ల స్వభావం కూడా మారుతుంది. IMbesharam ప్రతినిథి రాజ్ అర్మానీ గమనించిన అంశాలను యువర్ స్టోరీకి వివరించారు.‘ మొదట్లో స్త్రీ పురుషులు 30 : 70 నిష్పత్తిలో సైట్ చూసే వాళ్ళు. కానీ కొనడంలో మాత్రం ఈ నిష్పత్తి 13 : 87 గా వుండేది. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. సైట్ చూసే వాళ్ళ నిష్పత్తి 36 : 64 కాగా కొనేవాళ్ళ నిష్పత్తి 38 : 72కి పెరిగింది. నిజానికి ఇది చాలా పెద్ద విజయమనే చెప్పాలి.’’

అలాగే, ఈ కొనుగోళ్ల మీద వాతావరణం కూడా ప్రభావం చూపిస్తోంది. షైకార్ట్ ప్రతినిథి వివేక్ చెప్పిందాన్ని బట్టీ, శీతాకాలంలో సెక్సువల్ ఎంటర్ టైన్ మెంట్ ప్రోడక్ట్స్ ఎక్కువగా అమ్ముడుపోతున్నeయి. సెక్సువల్ హైజీన్ ప్రోడక్ట్స్ అమ్మకాలు మాత్రం ఏడాదంతా ఒకేలా వుంటాయి.’

ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే ప్రభావం

ఇండియాలో సెక్సువల్ ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్లో BDSM, రోల్ ప్లేలకే ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. IMbesharam లో ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే కలెక్షన్ కి అత్యంత ఎక్కువ డిమాండ్ వచ్చింది. ‘మామూలుగా అయితే, ఇండియాలో సాధారణ సెక్స్ లైఫ్‌నే ఇష్టపడతారు. కానీ, సెక్సువల్ ఎంటర్‌టైన్‌మెంట్ కొచ్చేసరికి డామినేషన్, బాండేజి లాంటి ధోరణులను ఇష్టపడ్డం విచిత్రంగానే వుంటుంది.’’.

ఇక PrivyPleasures గమనించిన దాన్నిబట్టీ ఫెటిష్ వస్తువలకు కూడా గిరాకీ బాగానే వుంది. దాదాపు 40 రకాల జి స్ట్రింగ్స్ కొనే కస్టమర్లున్నారు. మరికొందరైతే, లెదర్‌లో ఏదుంటే అది బుక్ చేసేస్తుంటారు. ఇలాంటి కస్టమర్లు పదే పదే బుక్ చేయడం కూడా కనిపిస్తుంటుందని PrivyPleasures ప్రతినిథి భూపేంద్ర చెప్పారు.

ఇంతకు ముందు లూబ్రికెంట్లు, క్రీములు, లో దుస్తులు మాత్రం కొనేవాళ్ళు. కానీ రానురాను దీనికి సంబంధించిన అవగాహన కస్టమర్లలో పెరుగుతోంది. ఇప్పుడు ఇంటిమేట్ వాష్, జెల్, క్రీమ్, షేప్ దుస్తులు, లాంటివి కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇక బాడీ మసాజ్‌కి సంబంధించిన ఉత్పత్తుల గిరాకీ అయితే, అమాంతం పెరిగింది. ఇక జంటలు వాడే వస్తువులను కొనుగోలు చేసే ట్రెండ్ కూడా పెరిగింది. అంటే, సమాజం మారుతోందని.. జంటలు మరింత ఆనందకరమైన , ఆరోగ్యవంతమైన లైంగిక జీవితాన్ని కోరుకుంటున్నారనే చెప్పాలి. కొత్తగా పెళ్ళయిన జంటలు ఇలాంటి వస్తువలతో తమ దాంపత్య జీవితంలో కొత్త కొత్త ప్రయోగాలకు ఇష్టపడుతున్నారు.’’ అని చెప్పారు.. Itsmuahlife. వ్యవస్థాకుడు కరణ్ దీప్.

ఎవరెవరికి ఆసక్తి...

23 నుంచి 48 ఏళ్ళ మధ్య వయస్కులు ఈ ఉత్పత్తులకు ప్రధాన మార్కెట్. ఇక ఆడ మగ విషయానికొస్తే, 60శాతం మగాళ్లు, 30 నుంచి 40 శాతం స్త్రీలు ఈ మార్కెట్ లో కనిపిస్తున్నారు. అయితే, రాన్రాను ఆడవాళ్ళ సంఖ్య పెరుగుతోంది. మగాళ్ళు ఎక్కువగా పార్టీ గేమ్స్, లోదుస్తులు, ధ్రుఢత్వానికి సంబంధించిన వస్తువులు, కొంటే, మహిళలు మాత్రం జంటలకు ఉపయోగపడే ప్రోడక్ట్స్, లైంగిక ఆనందానికి సంబంధించిన ప్రోడక్ట్స్, లోదుస్తులు ఎక్కువగా కొంటున్నారు.

మొత్తం మీద చూస్తే, లైంగిక ఆరోగ్యం, ఆనందాలకు సంబంధించిన ఉత్పత్తుల్లో మహిళలకు సంబంధించిన వస్తువలకే గిరాకీ ఎక్కువ వుందని Shycart అనుభవం చెప్తోంది. చాలా సందర్భాల్లో మహిళలు తమ పేరు మీద కాక, భాగస్వాముల పేర్ల మీద కొంటుంటారు. దీని వల్ల మనకి సరైన లెక్క కనపడకపోవచ్చు. మగాళ్ళు అనుకోగానే కొనేస్తారు. పైగా వాళ్లు ఎక్కువ పరిమాణాల్లో కొంటుంటారు.

పెరుగుతున్న అవగాహన

ఈ రంగంలో భారతీయ మార్కెట్ ఇంకా మొగ్గదశలోనే వుంది. అయితే, అవగాహన మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. దీని మీద ఇంటర్నెట్ లో పరిశోధన, అధ్యయనం చేసే కస్టమర్లు కూడా వున్నారు. ఆన్ లైన్ మార్కెట్లు రావడం వీరికి చాలా ఉపయోగకరంగా మారింది.

సంకెళ్లు, ఈటింగ్ లోదుస్తులు, వినోద వస్తువులు, రోల్ ప్లే కాస్ట్యూమ్స్ లాంటి వాటికి డిమాండ్ పెరుగుతోంది. అడల్ట్ గేమ్స్ ను కొంటున్న కస్టమర్లు కూడా వున్నారు.

ఈ మార్కెట్ లో లింగబేధాలు, వయసు లాంటి అంశాలకు చాలా ప్రాధాన్యం వున్నప్పటికీ రాన్రానూ అవగాహన కూడా బాగానే పెరుగుతోందని సమీర్ చెప్తున్నారు. ఇక ఇండియాలో భౌగోళికంగా చూస్తే, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ కస్టమర్లు మొదటి ఐదు స్థానాల్లో వుంటారు. ఈ మధ్యే అమృతసర్, చండీగఢ్, సూరత్, అహ్మదాబాద్, జైపూర్, కోల్‌కతా లాంటి నగరాల నుంచి కూడా ఈ మధ్య కస్టమర్లు పెరుగుతున్నారు.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags