సంకలనాలు
Telugu

పెట్టెలో సంతోషం... ఎప్పుడు కావాలంటే అప్పుడు... ఓ యువ పారిశ్రామికవేత్త క్రియేటివిటి

ఒక్క క్లిక్ తో సంతోషంరిస్క్ లోనే ఉంది కిక్కుఆన్ లైన్లో ఐస్ క్రీమ్ లు , మిఠాయిలుమీ సంబరాలకు మేమిచ్చే సంతోషంమహిళా శక్తిపై అపార నమ్మకంనాన్నే స్ఫూర్తి

r k
24th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

విధి పన్సారి..21 ఏళ్ల ఔత్సాహిక యువతి. నేటి తరానికి నిఖార్సైన ప్రతినిధి. నలుగురి నడిచే దారిలో వెళ్లడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నాలుగు నెలల క్రితం 'హ్యాపినెస్ బాక్స్‌డ్' పేరుతో ఓ ఆన్ లైన్ షాప్‌ను ప్రారంభించారు. బహుతులు రుచికరమైన మిఠాయిలు ఆన్ లైన్లో తెప్పించుకోవాలనుకునే వారికి ఇదో అద్భుతమైన ప్లాట్ ఫాం. ఈ నిర్ణయం తీసుకోవడం తనకేం కష్టం కాలేదంటారు విధి. ఎందుకంటే వ్యాపారవేత్తగా ఎదగాలన్నది ఆమె చిరకాల వాంఛ. తన స్నేహితుల్లో చాలా మందిలా డిగ్రీ తర్వాత ఎంఎస్సీలో చేరడం ఆపై ఏదో ఒక ఫుల్ టైం ఉద్యోగం చూసుకోవడం తనకేమాత్రం నచ్చదంటారు.

" అలాంటి వాటికి దూరంగా ఉండాలని ముందే నిర్ణయించుకున్నా... నా జీవితంలో యుక్తవయసులోనే రిస్క్ తీసుకోవాలని నిర్ణయించుకున్నా.." .

ఈ నిర్ణయం తీసుకోవడంలో ఆమెకు ఎలాంటి బాధ లేదు.

రిస్క్ లోనే ఉంది కిక్కు

రిస్క్ లోనే ఉంది కిక్కు


పుట్టి పెరగడం అంతా ముంబైలోనే. సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సాహించే వాతావరణంలోనే పెరిగారు. ముంబైలోని రసల్ స్కేర్ ఇంటర్నేషనల్ కాలేజీలో ఎకానమిక్స్, మేనేజ్ మెంట్ విభాగంలో బీఎస్సీ డిగ్రీ చేశారు. లండన్ యూనివర్శిటీకి అనుబంధ విద్యాసంస్థ విద్యార్థిగా అకడమిక్ విద్యతో పాటు ఇంటర్న్‌షిప్ కూడా చేశారు. అందులో భాగంగా ఓ ప్రైవేటు బ్యాంక్, ఓ ఆన్ లైన్ మ్యాగజైన్‌ను ప్రారంభించడమే కాదు... తన కుటుంబ వ్యాపారంలో కూడా కొన్నాళ్లు పని చేశారు.

"నాకు నేనుగా ఓ సంస్థను ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకోవడం పెద్ద కష్టం కాలేదు. ఎందుకంటే అప్పటికే మా నాన్న అదే పని చేస్తున్నారు. సొంతంగా ఏదైనా చెయ్యాలన్న ఆలోచన ఎప్పటి నుంచో నా మదిలో ఉంది. అయితే దానిని ఇంత త్వరగా ప్రారంభిస్తానని మాత్రం అనుకోలేదు". -విధి

చాక్లెట్లు అంటే తెగ ఇష్టబడే విధికి బహుమతులు, రుచికరమైన స్వీట్లు కోసం ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన రావడంలో వింతేం లేదు. సిటిలో చాలా మంది బేకర్స్‌ను , వ్యాపారుల్ని చూసి ఫుడ్ అండ్ గిఫ్టింగ్ విషయంలో బాగా రీసెర్చ్ చేశారు. ఆ తరువాత ఫిబ్రవరిలో హ్యాపినెస్ బాక్స్‌డ్ పుట్టింది. చాక్లెట్స్‌కు వీరాభిమాని కావడం ఆమె వ్యాపారానికి బాగా పనికొచ్చింది. స్వీట్లు తినడంలో ఏ మాత్రం మొహమాటపడరు. అవి ఇండియన్ స్వీట్లయినా... లేదా వెస్ట్రన్ డెజర్ట్స్ అయినా...

"ఎప్పుడూ సీట్స్ తినడానికే ఇష్టబడతా.. అప్పుడప్పుడు చాక్లెట్స్ కూడా.."

మీ ప్రియనవారికి వారికి నచ్చే బహుమతులను, మిఠాయిలను పంపడానికి హ్యాపినెస్ బాక్స్‌డ్‌కు మించిన పోర్టల్ లేదంటే ఎలాంటి ఆశ్చర్యం లేదు.

ఇది వాళ్ల ట్యాగ్ లైన్...

" పుట్టిన రోజులకు, వార్షికోత్సవాలకు లేదా ఇంకే సంబరానికైనా నగరమంతా మీరు తిరగాల్సిన పన్లేదు. ఓ పెట్టలో భధ్రంగా మీకు మేం సంతోషాన్నిస్తాం. కచ్చితంగా.! "

ప్రస్తుతం ముంబై అంతా వాళ్ల సేవలు లభిస్తున్నాయి. త్వరలో క్యాష్ ఆన్ డెలివరీ కూడా మొదలుకానుంది.

లండన్ లో విధి

లండన్ లో విధి


మహిళా శక్తిపై అపార నమ్మకం

వెబ్ సైట్ మొత్తాన్ని తనకు నచ్చిన విధంగా తయారు చేసుకున్నారు విధి. తన వెంచర్‌ను సృజనాత్మక ప్రకటనల ద్వారా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకున్నారు. మహిళా శక్తిపై అపార నమ్మకం ఉన్న విధి.. అప్పుడే కాలేజీల నుంచి బయటకొచ్చి పట్టభధ్రుల్ని ఎంపిక చేసుకొని డిజిటల్ మార్కెటింగ్‌కు తొలిసారి అవకాశాలను కల్పించారు. ఆమె తన సంస్థకు బేకరి ఉత్పత్తులు, వివిధ బ్రాండ్ల బహుమతులు సరఫరా చేసే వాళ్లను కూడా మహిళల్నే ఎంపిక చేసుకోవడం విశేషం.

విధి... పక్కా ప్రణాళికలతో కూడిన ఆశావహ వ్యాపారవేత్త . ఆమె తండ్రే ఆమెకు ఆదర్శం. తెల్లవారు జామునే లేచి ఉదయం 6 గంటల కల్లా తన కార్యకలాపాలాల్లో నిమగ్నమవుతారు.

" విజవంతమైన వ్యాపారవేత్తగా 20 ఏళ్లు తర్వాత కూడా ఆయన విధానంలో మార్పు లేదు. సంతృప్తి పడితే ఎదగలేమన్న సత్యాన్ని ఆయన్నుంచి నేను నేర్చుకున్నా."

మహిళలు ఏం చెయ్యాలనుకున్నా పెళ్లైన తర్వాతే అన్న ఆలోచనలకు విధి ఏ మాత్రం ఒప్పుకోరు. మహిళలంటే ఆ... ఏముందిలే అనుకుంటే తప్పే. ఇన్నాళ్లూ అలా చూసే అణగదొక్కేశారు.

నా విషయంలో మాత్రం " ఇది నా జీవితం స్వేచ్ఛగా దేన్నైనా నేను ఎంచుకోగలను"

విభిన్న అంశాల పట్ల ఆసక్తి ఉన్న విధికి నాట్యం అంటే ప్రాణం. షైమాక్‌దేవార్ ఇనిస్టిట్యూట్ నుంచి పెర్ ఫార్మింగ్ ఆర్ట్స్‌లో ఇంటర్మీడియట్ లెవల్ కోర్సు చేశారు. ఈత కొట్టడం చాలా ఇష్టం. అన్వేణలతో కూడిన ప్రయాణాలు, వివిధ రకాల వంటలు చెయ్యడం ఆమె ఆసక్తుల్లో కొన్ని.

విధి ... కేవలం సీరియస్ వ్యాపారవేత్త అనుకుంటే పొరపాటే. ఆదివారం వస్తే చాలు తన రోజల్లా ఫ్యామెలీతోనూ, ఫ్రెండ్స్‌తోనే గడుపుతారు.అప్పుడే సోమవారం నుంచి ఆ వారమల్లా ఉత్సాహంగా పనిచెయ్యగలమన్నది ఆమె నమ్మకం. అయితే తాను పార్టీలో ఉన్నా... తన దృష్టి హ్యాపినెస్ బాక్స్ మీదే ఉంటుందన్నది వేరే విషయం. చాలా మంది అలాంటి సమావేశాల్లో పరిచయమైనవారే ఇప్పుడు తన హ్యాపినెస్ బాక్స్ డ్ లో భాగస్వాములయ్యారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags