సంకలనాలు
Telugu

చవకైన 3D ప్రింటర్‌కు ప్రాణం పోసిన ఇద్దరు కుర్రాళ్లు

రెండు వ్యాపారాల్లో నష్టపోయినా తగ్గని ఉత్సాహం..ఎలాంటి అవగాహనా లేకుండా త్రిడి ప్రింటర్ తయారీలోకి ఇద్దరు యువకులు..

6th Apr 2015
Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share

చిత్తశుద్ధి.. అకుంఠిత దీక్షా దక్షతలకు.. నిత్యాన్వేషణ లక్షణం తోడైతే.. ప్రపంచానికి సరికొత్త ఆవిష్కరణలు పరిచయం అవుతాయి. బెంగళూరు యువ పారిశ్రామికవేత్తలు నిఖిల్ వేల్పనూర్, అరవింద్ నాడిగ్ లు సంయుక్తంగా రూపొందించిన 3-డి ప్రింటర్ ఈ కోవకే చెందుతుంది.

బెంగళూరుకు చెందిన నిఖిల్ వేల్పనూరు.. తన జీవితంలో అత్యధిక భాగం సాంకేతికతతో సహవాసం చేసిన వ్యాపారవేత్త. తన ఇరవయ్యవ ఏట, కాలేజీలో ఉండగానే, స్ట్రేంజ్ బ్ర్యూ అనే యువజన పత్రికను వెలువరించారు. తర్వాతి క్రమంలో..ఆహారం, పానీయాల డిస్కౌంట్ ల వ్యాపారానికి సంబంధించి, లెట్స్ హెడ్ టు ను ప్రారంభించారు. నిధుల లేమి కారణంగా ఈ రెండు సంస్థలూ ఆశించిన ప్రయోజనాన్ని ఇవ్వలేదు. అయితే.. నిఖిల్ లోని వ్యాపార వేత్త ఎప్పుడూ డీలా పడిపోలేదు. TED సహకారంతో INK కాన్ఫరెన్స్ బృందాన్ని ఏర్పాటు చేయడంలో నిఖిల్ చొరవ, INK ఫెలో ప్రోగ్రామ్ కు, ఇంక్ టాక్స్ డాట్ కామ్ వ్యవస్థాపనకూ దారితీశాయి.

అదే ఊపుతో నిఖిల్, బాయిల్డ్ బీన్స్ ఇంక్ పేరిట టెక్నాలజీ బిజినెస్ సంస్థను ప్రారంభించారు. ఏడాది క్రితం, భవిష్యత్తు ఆశాకిరణంగా కనిపిస్తున్న సాంకేతికతపై ఎక్కువ దృష్టిపెట్టాలన్న ఉద్దేశంతో.. తన సంస్థను, మిత్రుడు అరవింద్ నాడిగ్ కు చెందిన ఎల్ఐ2-ఇన్నోవేషన్స్ అనే విద్యాసంస్థ లో విలీనం చేయాలని నిర్ణయించారు. ఆక్రమంలోనే వారికి 3-డి ప్రింటింగ్ విధానం తెలిసి వచ్చింది. దాంతో.. మిత్రులిద్దరూ.. 3-డి ప్రింటర్ ను ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నారు.

బ్రహ్మ 3 - త్రీడి ప్రింటర్

బ్రహ్మ 3 - త్రీడి ప్రింటర్


స్ఫూర్తి...అన్వేషణ...అవసరం...

నిఖిల్ వేల్పనూర్, అరవింద్ నాడిగ్ లు తమ ఎదుగుదల క్రమంలో 3-డి ప్రింటర్ రూపకల్పన గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇద్దరూ వ్యాపార స్ఫూర్తితోనే ముందుకు సాగుతూ వెళ్ళారు. “ మేము నైపుణ్యం లేని వాళ్ళం.. తయారీదారులము.. హ్యాకర్స్.. శుద్ధ సంప్రదాయ రీతులు తెలియని వాళ్ళం. 3-డి ప్రింటర్ సహజంగానే మా స్ఫూర్తికి కొనసాగింపు అవుతుందని మాత్రమే భావించాము అని వేల్పనూర్ అంటారు. ఆరు నెలల క్రితం వరకూ.. వారి బృందంలోని ఒక్కరికీ 3-డి ప్రింటర్ పై ఏ మాత్రం ఆలోచన లేదు. ఎప్పుడైతే అలాంటి యంత్రాన్ని తయారు చేయాలని భావించారో.. తమ జీవితాలకు ఇదే ఏకైక లక్ష్యం అనే రీతిలో పనిచేయడం ప్రారంభించారు.

ఆన్ లైన్ లో విడియోలను చూసి.. దాని ఆధారంగా 3-డి ప్రింటర్ ని పరీక్షించాలని భావించారు. అయితే వారికి ప్రింటర్ అందుబాటులో లేక సమస్య ఎదురైంది. “మన దేశంలో 3-డి ప్రింటర్లు అందుబాటులో ఉండేవి కావు. దిగుమతి చేసుకుందామా అంటే.. భరించలేని వ్యయం. దీంతో, మాలోని నైపుణ్యాన్ని వెలికి తీస్తూ... సొంతంగా, 3-డి ప్రింటర్ తయారీకి సంబంధించిన ప్లాన్స్, డ్రాయింగ్స్, ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాము. కేవలం 15 రోజుల వ్యవధిలో మేము 3-డి ప్రింటర్ ని తయారు చేశాము” అంటూ తమ కృషిని వివరించారు వేల్పనూర్.

ఎప్పుడైతే స్థానికంగా లభ్యమయ్యే పరికరాలతో స్వంతంగా 3-డి ప్రింటర్ ను రూపొందించారో.. ఇద్దరు మిత్రులు సొంతంగా వాటిని ఉత్పత్తి చేసే దిశగా ఆలోచనలు, ప్రణాళికలకు పదును పెట్టారు. పనికిరాని పరికరాలు, మూలన పడేసిన వస్తువులతోనే వారు 3-డి ప్రింటర్స్ తయారు చేయడం మొదలు పెట్టారు. చూడ్డానికి అందంగా, వినియోగానికి ఎంతో సౌలభ్యంగా ఉండేలా ప్రపంచంలోనే అత్యుత్తమ 3-డి ప్రింటర్ ను తయారు చేయాలన్న ఆకాంక్షతో కాకుండా, స్వయంగా ఉత్పాదనను అందించాలన్న లక్ష్యంతోనే వారీ ప్రయత్నం చేశారు. కేవలం 3 నెలల కృషితోనే తాము తయారు చేసిన ‘బ్రహ్మా3 ఆన్విల్’ 3-డి ప్రింటర్ ని నిరుడు అక్టోబర్ లో కొచ్చిలో జరిగిన ఐ.ఎన్.కె సదస్సులో ఆవిష్కరించారు.


నిఖిల్ వేల్పనూర్, బ్రహ్మ 3 సహ వ్యవస్థాపకుడు

నిఖిల్ వేల్పనూర్, బ్రహ్మ 3 సహ వ్యవస్థాపకుడు


మేడ్ ఇన్ ఇండియా 3-డి ప్రింటర్ తయారీలో సవాళ్ళు

వేల్పనూరు గానీ, నాడిగ్ గానీ, అంతకు ముందెన్నడూ 3-డి ప్రింటర్ ను చూసి ఎరుగరు. దాని గురించి తెలుసుకొని, కేవలం తమ శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో.. భవిష్యత్తుపై విశ్వాసంతో 3-డి ప్రింటర్ ను అభివృద్ధి చేశారు. దీని తయారీకి అవసరమైన విడి పరికరాలను తెప్పించుకోవడమూ చాలాసార్లు వ్యయప్రయాసలకు గురి చేసింది. తక్కువ పరిమాణంలో పరికరాలు తెప్పించుకోవాలన్నా వేల రూపాయలయ్యేది. కాల పరీక్షకు నిలిచినప్పుడు.. మరే పనిపైనా మనసు నిలుపలేము. చేసిన పనిలో కూడా లోపాలు కనిపించినప్పుడో, కచ్చితత్వం కనబడనప్పుడో.. పదే పదే రూపొందించిన పరికరాన్ని మళ్ళీ విడదీయాల్సి వచ్చేది” అంటూ.. తొలినాటి బాలారిష్టాల గురించి వివరించారు వేల్పనూర్. పనికిరాని వస్తువులు, పరికరాలతో.. కేవలం మూడంటే మూడు నెలల్లో ఒక ఉత్పాదనను ఆవిష్కరించేందుకు ఈ మిత్రులు, వారి బృందం.. నిద్రాహారాలకు ఎంతగా దూరమై ఉంటారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సొంతంగా.. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు దీటుగా 3-డి ప్రింటర్ ను రూపొందించాలన్నదే అప్పట్లో వారి ముందున్న ఏకైక లక్ష్యం.


అర్వింద్ నాడిగ్, బ్రహ్మ 3 సహ వ్యవస్థాపకుడు

అర్వింద్ నాడిగ్, బ్రహ్మ 3 సహ వ్యవస్థాపకుడు


స్పందన -

“బ్రహ్మా3 ఆన్విల్” పేరిట 3-డి ప్రింటర్ ని రూపొందించాక.. ఇద్దరు మిత్రులు దాన్ని దేశ విదేశాల్లో నిర్వహించిన ఎన్నో ఎగ్జిబిషన్లలో ప్రదర్శించారు. వారి యంత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. దీన్ని మహత్తర ఆవిష్కారంగా వైర్డ్ మ్యాగజైన్ కితాబునిచ్చింది. “ మా కల ఫలించింది. అనుకున్నది నెరవేరింది. ఇప్పుడిక ప్రపంచ స్థాయి 3-డి ప్రింటర్ల సంస్థను ప్రారంభించాలని నిర్ధారణకు వచ్చాము” అని నాటి ఉద్వేగ క్షణాలను వేల్పనూరు వివరించారు.

బ్రహ్మా3, కొనుగోళ్ళ కోసం ముందస్తు ఆర్డర్లూ వచ్చాయి. దీన్ని చూసి పెట్టుబడిదారులూ.. సంస్థలో నిధులు పారించేందుకు సిద్ధమయ్యారు. అయితే, నాడిగ్, వేల్పనూర్ లు ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తమ బ్రహ్మా3 ని రూపొందించిన దృక్కోణాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే వారి నుంచే పెట్టుబడులు స్వీకరించాలని మిత్రద్వయం నిర్ణయించింది.

బ్రహ్మా3 వివరాలు -

240 x 240 x 240 మిల్లీమీటర్ల బరువుతో నిర్మించిన బ్రహ్మా3 ప్రింటర్, ఫుట్ బాల్ పరిమాణంలోని వస్తువులనూ ప్రింట్ చేయగలుగుతుంది. లేయర్ కి 50 మైక్రాన్ల హై రెజుల్యూషన్ తో పనిచేస్తుంది. పిఎల్ఏ (పాలీ ల్యాక్టిక్ యాసిడ్), ఏబిఎస్ (ఆక్రిలానిట్రైల్ బుటాడియెన్స్ స్టైరీన్), నైలాన్ తదితర ఎన్నో మూలకాలతో ఈ యంత్రం నిర్మితమైంది. 350 డిగ్రీల ఉష్ణోగ్రత స్థాయి వరకూ ఇది పనిచేస్తుంది. భారత్ లో దీని విలువ లక్ష రూపాయలు. బ్రహ్మా-3 కొనుగోలు దారులకు ఆరు నెలల వారంటీ, కొనుగోలు అనంతర సేవలు, రీప్లేస్ మెంట్ సదుపాయాలనూ అందిస్తున్నారు.

బ్రహ్మ3 తర్వాత ఏంటి..?

“మార్చ్ నెల్లో ఒకటి, సెప్టెంబర్ లో మరొకటి చొప్పున రెండు విప్లవాత్మకమైన ప్రింటర్ ని ఆవిష్కరించబోతున్నాము” అంటూ భవిష్యత్తు ప్రణాళికను వివరించారు వేల్పనూర్.

Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share
Report an issue
Authors

Related Tags