సంకలనాలు
Telugu

కథలతో విద్యావ్యవస్థకు కౌన్సిలింగ్ చేస్తున్న అపర్ణ ఆత్రేయ

ఈ విద్యావ్యవస్థ సరైనదేనా ?మనం మన పిల్లలకు ఏం నేర్పుతున్నాం ?భయమా... భరోసానా... పిల్లల మనసులో ఏం నిండాలి ?చిన్నారులు, తల్లిదండ్రులకు వ్యక్తిత్వ వికాసం

ABDUL SAMAD
30th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

సాంప్రదాయ విద్యావ్యవస్థ తన పిల్లలపై చూపుతున్న ప్రభావాన్ని అపర్ణ ఆత్రేయకు వచ్చిన ఆలోచనే కిడ్ & అండ్ పేరెంట్ ఫౌండేషన్. ఆమె స్వతహాగా వృత్తిరీత్యా సైకాలజిస్ట్, రచయిత కూడా. తానే స్వయంగా నిధులు సమకూర్చుకుని కిడ్ & పేరెంట్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు అపర్ణ. ఇప్పటి విద్యారంగం పిల్లలకు ఏం నేర్పలేకపోతోందనే అభిప్రాయంతో... వారిని మరింత చైతన్యవంతులు చేయడానికి, అలాగే తల్లిదండ్రుల్లో సానుకూల ఆలోచనలు పెంపొందించే ప్రయత్నం చేస్తుంది ఈ ఫౌండేషన్. ప్రతీవారిలోనూ బాల్యాన్ని కాపాడుకోవడం, సక్సెస్‌కు చిరునామాగా మారడం చాలా ముఖ్యం. ఇందుకోసం కథలు వారిపై కీలక ప్రభావాన్ని చూపుతాయి. ఇదే అత్రేయను ఓ స్టార్టప్ వైపు నడిపించింది.

కిడ్ & పేరెంట్ ఫౌండేషన్ ఏం చేస్తుంది ? దీని వెనుక ఉన్న కథేంటి ?

పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్ల కోసం వికాస వ్యక్తిత్వ కార్యక్రమాలు నిర్వహిస్తుంది కిడ్ & పేరెంట్ ఫౌండేషన్. క్రియేటివ్ ప్రొఫెషనల్స్, ఒక్కో కాన్సెప్ట్‌పై బోధించేవారు, ఆయా రంగాల్లో నిపుణులు, ఓ ప్రత్యేక విభాగంపై పట్టున్నవారు,.. ఇలా పలురకాల వ్యక్తులు మ్యూజిక్, స్టోరీ టెల్లింగ్, థియేటర్, యాక్టివిటీ ఆధారిత కార్యక్రమాలతో ట్రైనింగ్ ఇస్తారు.

అపర్ణ ఆత్రేయ, కిడ్ అండ్ పేరెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు

అపర్ణ ఆత్రేయ, కిడ్ అండ్ పేరెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు


"ఎ హోలిస్టిక్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్(AHAM)ఈ ఫౌండేషన్‌కు ప్రత్యేకమైన కార్యక్రమం. చిన్నారులకు అవసరమైన సామాజిక, మానసిక ఆలోచనల్లో పరిపక్వత కోసం దీన్ని రూపొందించాం. ఇది సీబీఎస్ఈ సిలబస్‌కు తగినట్లుగానే ఉంటుంది. నేనీ సంస్థను ప్రారంభించడానికి నా ఆలోచన, పిల్లలు, దైవ చింతనే కారణాలు. కథలు రాయడం, చెప్పడం నా ప్యాషన్. ప్రస్తుత విద్యావ్యవస్థలో ఉన్న లోపాలు తెలుసుకోడానికి నా పిల్లలే మూలకారణమయ్యారు. అలాగే పాండిచ్చేరిలోని శ్రీ అరబిందో ఆశ్రమంలో అమ్మవారి విగ్రహం ఎదురుగా నేను అనుభవించిన మానసిక ప్రశాంతత కూడా నన్నీ ఫౌండేషన్ వైపు నడిపించింది."-అపర్ణ ఆత్రేయ

స్టార్టప్‌లకు స్టార్టింగ్ ట్రబుల్స్ మామూలే

కిడ్ అండ్ పేరెంట్ ఫౌండేషన్‌కు ప్రారంభంలో కష్టాలు తప్పలేదు. ఈరంగంలో ఇప్పటికే కొన్ని సంస్థలు ఉండడంతో... వినూత్న కార్యక్రమాలు రూపొందించాల్సి వచ్చింది. అలాగే ఇవి పాత విధానాల ఆధారంగా కాకుండా ప్రస్తుత తరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకున్నారు. విద్యాసంస్థల నిర్వాహకులకు స్వయంవృద్ధిపై ప్రతీ ఒక్కరూ పెట్టుబడి పెంచడం, అవగాహన పెంచుకోవాల్సిన అవసరంపై ఒప్పించడం పెద్ద సవాల్ అయింది మాకు అంటారు అపర్ణ. ఇప్పటి విద్యావ్యవస్థకు అనుగుణంగానే కొత్త విధమైన కరికులం తయారు చేయడం ఛాలెంజ్ అయినా... దీని రూపకల్పనలో ఎంజాయ్ చేశామని చెబ్తారామె. ఆలోచనల్లో మార్పుల విషయంలో పిల్లలకు తగిన శిక్షణ ఇవ్వాలనే అంశానికి పేరెంట్స్ కూడా ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు.

image


"బాల్యాన్ని తగిన విధంగా అనుభవించారీ ఇప్పుడు సృజనాత్మకత గల పెద్దవారు. మనలోని సృజనాత్మకతను మన విద్యావ్యవస్థ నాశనం చేసేసింది. ఇప్పుడు తల్లిదండ్రులు వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరముందం"టారు ఉర్సుల కె. లె గ్విన్.

విద్యంటే నేర్చుకోవడం మాత్రమే కాదు

“విద్య అంటే నిజాలను నేర్చుకోవడం మాత్రమే కాదు. మన మెదడుకు ఆలోచించే శక్తిని నేర్పే సాధనం.”- ఐన్‌స్టీన్

ప్రపంచ కార్పొరేట్ రంగంలో టాప్ పొజిషన్‌లో ఉన్నవారిలో చాలామంది భారతీయులున్నారు. కానీ మన దేశంలో విద్యారంగం సృజనాత్మకను ప్రోత్సహించే విధంగా లేదు. చిన్న పిల్లల్లో పెరిగే ఆలోచనలకు ప్రోత్సాహమిచ్చేదిగా ఉండాల్సిన విద్యా వ్యవస్థ అందుకు భిన్నంగా ఉంటోంది. ప్రస్తుతం పెద్దవారిలో ఎంతమందికి తమ ఆలోచనలను బైటకి చెప్పగలిగే ధైర్యం ఉంది ? ఎంతమంది భయపడకుండా మాట్లాడగలరు ? ఎంతమందికి కొత్తవాటిని సష్టించగలిగే నమ్మకం ఉంది ? అందుకు తగిన స్వేచ్ఛ లభించిందా ? వీటన్నిటికీ సమాధానం ఒకటే. అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మన చిన్నారులకు మనం ఏం అందించాలో పై ప్రశ్నలను ఓసారి తరచి చూసుకుంటే తేలిగ్గా అర్ధమవుతుంది.

image


పిల్లలకు వారికేం నచ్చుతుందో చెప్పేందుకు కిడ్ అండ్ పేరెంట్ ఫౌండేషన్ అవకాశం కల్పిస్తుంది. బోర్ కొట్టేలా చేస్తుంది... అలాగే దాన్ని అధిగమించడానికి ఏం చేయాలో నేర్పిస్తుంది. తప్పులు చేసేందుకూ అనుమతిస్తుంది, అలాగే వాటిని సరిదిద్దుకోవడాన్ని నేర్పిస్తుంది. స్వేచ్ఛ.. పిల్లల్లో సృజన పెరగడానికి తగిన సాధనం అంటుందీ సంస్థ.

వ్యక్తిగత అభివృద్ధి అంటే మార్పులకు నిరోధం లాంటిది. కానీ క్రమమైన అభివృద్ధిలో తప్పనిసరి మార్పు ఉంటుంది. ఇప్పుడు పెద్దలుగా ఉన్నవారంతా... చిన్నపిల్లలుగా ఉన్న సమయంలో అనేక నిబంధనలకు లోబడి ఉండాల్సి వచ్చింది. రిస్క్ చేసే మెంటాలిటీ చాలా మందికి నేర్పించేవారు కూడా కాదు. నేను చెప్పాను కాబట్టి చెయ్యాల్సిందే అనే వ్యక్తిత్వాన్ని... అప్పటి పెద్దలంతా కలిసి రుద్దేవారు. ఇలాంటి వ్యవస్థలో మార్పులు రావాలంటే మూలాల నుంచి కలికల రావాల్సిందే అంటారు అపర్ణ. అందుకే మార్పపైనే ప్రయోగం మొదలుపెట్టానంటారు.

"వ్యక్తిగత వద్ధి కోసం నేను నేర్పించే మంత్రి 3సీ ప్రాసెస్(కనెక్ట్, ఛేంజ్, కాన్‌సీక్వెన్స్), 3ఆర్ ప్రాసెస్(రీడ్, రీఇన్వెంట్, రెస్పాన్సిబిలిటీ)". నీకు నువ్వు చదువుకుంటూ ఉండు. ఏదైనా కొత్త విషయాన్ని కనిపెట్టడమో, ఉన్నదాన్ని కొత్తగా రూపకల్పన చేయడమో చేయాలనే ఆలోచన ఉండాలి. నిన్ను నువ్వు మార్చుకునే బాధ్యత నీకే ఉంటుంది" అని చెబ్తున్నారు అపర్ణ ఆత్రేయ.

స్వయంవృద్ధిలో కష్టనష్టాల పాత్ర

కష్టాలు, ప్రతికూలతలు ఎప్పుడూ మన జీవితాలకు సహ ప్రయాణికుల లాంటివి అంటారు అపర్ణ. మన దారిలో మనతో ఎప్పుడూ ప్రయాణం చేస్తూనే ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాల్సి ఉంటుంది. వాటికి ఎదురునిలిచి జీవితాన్ని జయించాలనే ఆలోచన కలగాలి. ప్రతీ చిన్నారిలోనూ అపజయం ఎదురైనా తిరిగి సాధించగలననే నమ్మకాన్ని ఏర్పరచాలి. ఒక పరాజయం విజయానికి ఒక మెట్టులాంటిదనే ఆలోచనా దృక్పథం పిల్లల్లో ఏర్పడాలి. ఫెయిల్యూర్ అనేది శాశ్వతం కాదనే విషయాన్ని చిన్నతనంలోనే మనసులో నాటాల్సిన అవసరముందంటారు అపర్ణ.

కథలు చెప్పడంతో మార్పులు సాధ్యమేనా ?

స్టోరీ టెల్లింగ్... మానసిక పరిపక్వత సాధించడం కోసం మనకు తెలిసిన ప్రాచీన విద్య ఇది. సమాచారాన్ని పెంపొందించుకోవడం, తరతరాలకు చరిత్ర అందించడంలో దీని ప్రభావం చాలానే ఉంది. యుగాలు గడిచినా దీనికి మించిన సాధనం ఇంకా రాలేదనే చెప్పుకోవాలి. ఈ సకల చరాచర సృష్టిపైనా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది కిడ్ అండ్ పేరెంట్ ఫౌండేషన్. పార్వతీదేవికి శివుడు ఏ విధంగా సృష్టి గురించి బోధించాడో.... ఆ సమాచారాన్ని చెప్పేందుకు కూడా ఈ సంస్థ ప్రయత్నిస్తోంది.

చరిత్రకు సంబంధించినవో, ఇతరమైనవో.... ఏవో కొన్నిటిని తీసుకుని పాఠాలుగా చేసి నేర్పించినంత మాత్రాన సరిపోదు. దీనితో మన మెదడు ఒకోసారి స్తంభించిపోతుంటుంది. అదే సమయంలో ఒక కథగా దాన్ని వింటే అందులో చాలా మార్పు కనిపిస్తుంది. మనం అర్ధం చేసుకోవడం, గుర్తు పెట్టుకోవడంలోనూ చాలా తేడా ఉంటుంది. మనకు అదో అనుభవం మాదిరిగా ఉంటుంది. అందుకే కథకు చాలా మన జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

ఒక కథ చెప్పేటప్పుడు... చెప్పేవ్యక్తి, వినే వ్యక్తి ఇద్దరూ దానికి కనెక్ట్ అవుతారు. అందులో పాత్రధారులుగా భావింపచేసే శక్తి కథకి మాత్రమే ఉంటుంది. అందుకే స్టోరీ చాలా పవర్‌ఫుల్ సాధనం అంటారు అపర్ణ.

విద్యార్థులకు కథలు చెప్తున్న ఆత్రేయ

విద్యార్థులకు కథలు చెప్తున్న ఆత్రేయ


సంస్థను స్వయంగా నిర్వహించడం కత్తి మీద సామే !

"నేను చదువిన ఒక కథ నాకు చాలా ఇష్టం, స్ఫూర్తిదాయకం కూడా. తనను విపరీతంగా ప్రేమించే భర్త... యుద్ధం నుంచి వచ్చాక కోపిష్టిగా మారిపోవడంతో ఓ మహిళ చాలా బాధపడుతుంది. అతనితో ఎలా ప్రవర్తించాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడో మంత్రగాడి మాదిరి స్థానిక వైద్యుడి దగ్గరకు వెళ్లి తన సమస్యను చెప్పుకుంటుంది. అప్పుడతను ఆ మహిళ భర్తకు ట్రీట్‌మెంట్ చేయాలంటే.... సింహం మీసాలు కావాలని, అవి తీసుకురావాలని చెబ్తాడు. దీంతో ఆ మహిళ సింహంతో సావాసం చేసి, దాన్ని మచ్చిక చేసుకుని చివరకు సింహం మీసాలను సంపాదిస్తుంది. ఇందుకోసం కొన్ని నెలలపాటు కష్టపడుతుందామె. చివరకు వాటిని తీసుకుని ఆ వైద్యుడి దగ్గరకు వెళ్లాక... అతను వాటిని మంటల్లో విసిరేసి ఇలా అంటాడు. ఓ కోపిష్టి సింహాన్ని మచ్చిక చేసుకోవడం తెలిసినపుడు... నీ భర్తతో ఎలా మెలగాలో నీకు ఖచ్చితంగా తెలిసే ఉండాలి. వెళ్లి ప్రయత్నించు అని. ఈ స్టోరీకి నేను బాగా కనెక్ట్ అయ్యా. "అంటారు అపర్ణ ఆత్రేయ.

ఏదైనా కొత్తది ప్రారంభించినపుడు నీలో ఉన్న చిన్నారిని ఎప్పటికీ మర్చిపోకు అని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సలహా ఇస్తున్నారు అపర్ణ. విజయాలు, పరాజయాలను చిన్నప్పటి మాదిరిగానే తీసుకుని జీవితంలో ముందుకు వెళ్లాలంటున్నారు.a

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags