సంకలనాలు
Telugu

బికాం చదివి ఫుట్‌వేర్ డిజైనర్లుగా మారిన అమ్మాయిలు

16th Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మహిళల అభిరుచులకు అనుగుణంగా ఫుట్ వేర్.

డిజైనర్ ఫుట్ వేర్ తయారుచేసిచ్చే మింక్.

ఇద్దరు స్నేహితులు ప్రారంభించిన సంస్థ మింక్.

కాలేజీ చదువులు అయిపోగానే వ్యాపారంలోకి ప్రవేశం.


చాలా మంది మహిళలకు హష్ పప్పీస్ (HushPuppies), ఇంక్5(Inc5), క్యాట్ వాక్ (Catwalk) లాంటి బ్రాండ్స్ లేకుండా షాపింగ్ పూర్తి కాదు. అదే సమయంలో చేత్తో తయారుచేసిన వస్తువులు, ప్రత్యేకంగా రూపొందించిన చెప్పులపై కూడా ఈ మధ్య మహిళలు మోజు కనబరుస్తున్నారు. అందమైన డిజైన్లతో తయారు చేసిన కొల్హాపురి చెప్పులంటే ఎవరకి ఇష్టముండదు చెప్పండి..? ఫంకీ ఫ్లిప్ ఫ్లాప్స్, లూజుగా ఉండే ప్యాంట్స్ పై కూడా మనసు పారేసుకుంటున్నారు. వాళ్ల ఆసక్తి తగ్గట్టు వస్తువులు తయారు చేసి ఇచ్చేందుకు చాలా మంది వ్యాపారస్తుల అవతారం ఎత్తుతున్నారు.

MINK వ్యవస్థాపకులు

MINK వ్యవస్థాపకులు


మింక్ వెనుక కథ

చెన్నైలోని వైష్ణవ్ కాలేజీ నుంచి దివ్య, హర్ష బీకామ్ పట్టా పుచ్చుకున్నారు. వాళ్లు చదివిన చదువును పూర్తిస్థాయిలో ఆచరణలో పెట్టాలనుకున్నారు. డిజైనింగ్ చెప్పులు తయారు చేసే వ్యాపారం చేయాలనుకున్నారు. ఓ చెప్పులు తయారు చేసే అతణ్ణి కలిసారు. సలహాలు తీసుకున్నారు. అలా కాలేజీ చదువు అయిపోగానే MINK ప్రారంభమైంది. కాలేజీలో ఉన్నప్పుడే స్నేహితులకోసం, తెలిసినవాళ్లకోసం శాండల్స్, క్రాక్స్, మెడికల్ షూస్ తయారుచేసి ఇచ్చేవారు. ఇది 2010లో ప్రారంభమైంది. “మాకిద్దరికీ చెప్పులంటే చాలా ఇష్టం. నాకేమో స్టైల్ గా ఉండేవి నచ్చుతాయి. ఇక హర్షకు కంఫర్ట్ గా ఉండాలి. అలా స్టైల్, కంఫర్ట్ రెండింటినీ కలిపి తయారు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి మా వ్యాపారం ప్రారంభమైంది” అని తెలిపింది దివ్య.

“ హర్షకు, నాకు బోర్ కొట్టినప్పుడు మా తల పిన్నులు, స్కార్ఫ్ లను తీసుకుని మా చెప్పులను అలంకరించుకునేవాళ్లం. అవి ఎలా ఉన్నాయో చూసేవాళ్లం. అలా మా అభిరుచిని పరీక్షించుకునేవాళ్లం. అలాగే మా కంపెనీకి ఓ ఆసక్తికరమైన పేరు పెట్టాలనుకున్నాం. అలా పుట్టుకొచ్చిందే మింక్ (MINK)” అని గుర్తు చేసింది దివ్య.

వ్యాపార ప్రయాణం

దివ్య, హర్ష అనుకోకుండా వ్యాపారవేత్తలయ్యారు. వాళ్లకు ఏది ఇష్టమో అదే చేశారు.. తెలిసిన విద్యను మరింత మెరుగ్గా చేస్తున్నారు. “మా ఆలోచనలను మేం ఆచరణలో పెట్టాం. మా వస్తువులను చూసి మార్కెట్ ఎలా స్పందిస్తుందో చూశాం. మా వినియోగదారులకు మంచి ప్రాడక్టులను ఇచ్చే ప్రయత్నం చేశాం” అని చెప్పింది దివ్య. పాకెట్ మనీతో ప్రారంభమైన మింక్ ఇప్పుడు ఆ కష్టాల నుంచి బయటపడింది.

వీళ్లందరికీ వినియోగదారులను పొందడం కష్టమేం కాలేదు. కాలేజీలో ఏం చేసి పాపులర్ అయ్యారో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. సోషల్ మీడియానే వాళ్లకు ప్రధాన ప్రచార ఆయుధం.

వ్యాపారానికి సవాళ్లు

దివ్య మింక్(MINK) గురించి వాళ్ల ఇంట్లో చెప్పినప్పుడు నవ్వారట. “డిజైనర్ ఫుట్‌వేర్ బిజినెస్ చేస్తామని ఇంట్లో చెప్పినప్పుడు మా తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోలేదు. అదొక పనికిరాని ఆలోచన” అన్నారని చెప్తోంది దివ్య. కానీ ఇప్పుడు మింక్ అభివృద్ధిని చూసి వాళ్లు చాలా సంతోషంగా, గర్వంగా ఫీలవుతున్నారని చెప్పింది దివ్య.

రెండేళ్లుగా వ్యాపారం చేస్తున్న దివ్యకు ఇదేమంత సులవుకాదని అర్థమైంది. “ చాలా మంది వినియోగదారులు.. ముఖ్యంగా పెద్ద కస్టమర్స్, ఉత్పత్తిదారులు మనల్ని అస్సలు పట్టించుకోరు. మనం డబ్బు ఖర్చు చేసేందుకు సిద్ధపడినా కొత్తగా తయారు చేసివ్వడానికి ఉత్పత్తిదారులు సిద్ధంగా లేరు. అందుకే మేం సొంతంగా తయారీ సంస్థను ప్రారంభించాలనుకున్నాం. అప్పుడే మాకు నచ్చిన రీతిలో వాటిని తయారు చేయగలం. సంప్రదాయ తయారీదారులు కొత్తగా తయారు చేసేందుకు, మార్పు చూపించేందుకు సిద్ధంగా లేరు” అంటోంది దివ్య. యువ పారిశ్రామికవేత్తలను ఆదరించాలని వినియోగదారులను కోరుతోంది.

యువకులకు విస్తృత అవకాశాలు

“ పురుషుల కంటే మహిళలు వ్యాపారం చేయడానికి అనేక అవకాశాలున్నాయి. మహిళలు చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తారు. పురుషులు ప్రయోగాలకు మాత్రమే పరిమితమవుతారు. కానీ మహిళలు ఆలోచనను ఆచరణలో పెట్టి అది సాధ్యమయ్యేవరకూ వదిలిపెట్టరు. వాళ్ల ఆలోచనలను ఆచరణలో పెట్టి వాటిని సాధ్యం చేసేవరకూ వదిలిపెట్టరు చాలా మంది మహిళలు” అని వివరించింది దివ్య.

దివ్య, హర్ష ఎంబీఏ చదవాలనుకున్నారు. కానీ ఎంబీఏ కంటే ఇప్పుడు మింక్‌ను అభివృద్ధి చేయడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని ఆగిపోయారు. వ్యాపార రంగంలోకి ప్రవేశించాలనుకునే యువకులకు మీరిచ్చే సలహా ఏంటని అడిగితే దివ్య సెకను కూడా ఆలోచించకుండా “దీనికి చాలా సమయం అవసరం.. అనుకున్నది సాధించేవరకూ సమయం కేటాయించే ఓర్పు అవసరం. చాలా మంది కంపెనీలు ప్రారంభిస్తారు. కానీ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతుంటారు. మళ్లీ ప్రారంభించే సమయానికి మార్కెట్లో అలాంటి అవకాశాలు ఉండకపోవచ్చు” అని చెప్తుంది.

వ్యాపారవేత్తగా విజయం సాధించడాన్ని మీరు ఎలా ఫీలవుతున్నారు అని అడిగినప్పుడు దివ్య చాలా ఉత్సాహంగా సమాధానమిచ్చింది. “ ఇది చాలా అద్భుతంగా అనిపిస్తోంది. కానీ ఇది చాలా ఒత్తిడితో కూడుకున్నది. అర్ధరాత్రి 12 గంటలకు కూడా కాల్స్ వస్తుంటాయి. ప్రతిసారీ ప్రజలు చాలా కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. న్యూ ట్రెండ్స్‌కి అనుగుణంగా మనం కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి.”

షాపింగ్‌కు, మహిళలకు విడదీయరాని అనుబంధం ఉంది. చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మహిళలు మరిన్ని ఆప్షన్స్ కోసం వెతుకుతూ ఉంటారి. అందుకే కొత్తగా వ్యాపారంలోకి వచ్చే వాళ్లకు చాలా సవాళ్లు ఉంటాయి. యువ వ్యాపారవేత్తలకు ఆలోచనలకు అనుగుణంగా పని చేసేందుకు ఉత్పత్తిదారులు ముందుకు రావడం లేదు. ఎందుకంటే వాళ్లకు గంపగుత్తగా ఆర్డర్స్ కావాలి. ఈ అంతరాన్ని కనుక పూడ్చినట్టయితే MINK లాంటి ఎన్నో సంస్థలు పుట్టుకురావడం ఖాయం.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags