సంకలనాలు
Telugu

మిమ్మల్ని నమ్ముకున్న పనిమనుషులకు మీరే పెన్షన్ ఇవ్వొచ్చు !

• నిత్యం శ్రమిస్తూ వృద్ధ్యాప్యంలో ఎలాంటి భరోసా లేని వారి కోసం ‘గిఫ్ట్ ఎ పెన్షన్’ • యజమాని సహకారంతో పాటు చిన్నపాటి సేవింగ్స్‌తో పెన్షన్ అందుకునే సౌకర్యం.

ABDUL SAMAD
8th May 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

డెబ్భై ఏళ్ల దేశ్ రాజ్ మా ఇంట్లో డ్రైవర్‌గా గత రెండు దశాబ్దాల నుండి సేవలు అందిస్తున్నారు. సుధీర్ఘకాలంగా మాతో ఉంటూ, మాలో ఓ కుటుంబ సభ్యుడిగా ఉంటారు. రిటైర్ అయ్యి ప్రశాంతంగా గడపాల్సిన సమయంలో ఇంకా ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. ఆయన జీవితంలో రిటైర్మెంట్ అనే పదానికి అర్ధమే లేకుండా పోయింది. రిటైర్మెంట్ విషయాన్ని ఓ రోజు ఆయనతో చెప్పగా, నాపై నవ్వి, బహుషా జోక్ చేస్తున్నారేమో అని అన్నారు దేశ రాజ్, “నేను చనిపోయేంత వరకు ఉద్యోగం చేస్తూనే ఉండాలి, లేకపోతే మా కుటుంబం బతికేదెలా అని అడిగారు”.

image


దేశ్‌రాజ్ లాంటి వారిపై ఎంతో మంది నిత్యం ఆధారపడుతూనే ఉంటారు. అది ఎంతగా అంటే హఠాత్తుగా వారు రావడం మానేస్తేనే వారి విలువ, అవసరం గురించి తెలిసొస్తుంది.

అలాంటి వారందిరికి మనం జీతాలు కూడా ఇస్తున్నాము, కాని అవి సరిపోతాయా ? వారందరు కూడా వృధ్ధాప్యంలో పెన్షన్ష తీసుకుంటూ ప్రశాంతంగా బతికే అవకాశం లేదా..?

బడుగు జీవితాల కోసం ప్రారంభమైన ‘గిఫ్ట్ ఎ పెన్షన్’ స్కీం

వృధ్ధాప్యంలో ఆర్ధికంగా స్ధిరపడటం మన దేశంలో ఎంతో మంది ఎదురుకుంటున్న సమస్య. మరీ ముఖ్యంగా... శ్రమిస్తున్న 487 మిలియన్ భారతీయుల్లో 90 శాతం మందికి ఎలాంటి సామాజిక భద్రతా లేదు. ఇంట్లో పనివాళ్లు, గార్డెనింగ్ చేసే వారు, వంట మనుషులు, డ్రైవర్లు, గార్డులు వంటి ఉద్యోగాలు చేస్తున్న చాలా మంది ఈ సమస్యను ఎదురుకుంటున్నారు.

ఇలాంటి వర్గం కోసం టెక్నాలజీ సహకారంతో పాటు వినూత్న పద్ధతుల్లో సామాజిక భద్రతను కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పడిందే ‘మైక్రో పెన్షన్ ఫౌండేషన్’. దేశంలో సుమారు 40 మిలియన్ల మంది, ఇళ్లలో పనిచేసే వారిగా గుర్తించారు. ఏదో విధంగా ఎంతో కొంత దాయాలనే ఆలోచన ఉన్నా.. అవగాహన లేకపోవడము, అలాంటి విషయాలు తెలియని వారి కోసమే గిఫ్ట్ ఎ పెన్షన్ ప్రారంభించారు.

మిమ్మల్ని నమ్ముకున్న వారికి పెన్షన్‌ను బహుమతిగా ఇవ్వండి

మిమ్మల్ని నమ్ముకున్న వారికి పెన్షన్‌ను బహుమతిగా ఇవ్వండి


వెబ్‌బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ అయిన ‘గిఫ్ట్ ఎ పెన్షన్’, యజమానులు తమ దగ్గర ఉద్యోగం చేస్తున్న వారి కోసం నమోదు చేసుకోవచ్చు. దాని వల్ల వాళ్లంతా రిటైర్ అయ్యే సమయానికి స్ధిరపడదగ్గ పెన్షన్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇందులో లబ్ధిదారులకు మూడేళ్ల వరకూ ప్రభుత్వం తరపున ‘జాతీయ పెన్షన్ స్కీమ్’ ఆధ్వర్యంలో ప్రతీ ఏటా వెయ్యి రుపాయల ఆర్ధిక సహాయం అందుతుంది. దానితో పాటు ‘ఎస్.బి.ఐ. లైఫ్’ ద్వారా రూ. 30 వేల జీవిత బీమా కూడా ఉంటుంది. ఎంతో సులువైన పద్ధతుల్లో కిస్తీ కట్టుకునే సౌకర్యమూ లభిస్తుంది.

యజమానులు ఎవరైన ఆన్‌లైన్లో తమ పనివారి కోసం సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చు. ఇక లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు సర్వీస్ ఇచ్చే బాధ్యత ఈ సంస్ధది. “ ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఒక్క వారంలో సుమారు 10 లక్షల మంది లబ్దిదారులను స్వశక్తులను చేసే సామర్థ్యం మాలో ఉందంటున్నారు ‘మైక్రో పెన్షన్ ఫౌండేషన్’ అసోసియేట్ డైరెక్టర్ పరుల్ ఖన్నా.

2014 సెప్టెంబర్ లో ప్రారంభమైన M.P.F. ఎన్నో ప్రశంసలను అందుకున్నప్పటికీ, దానికి రావాల్సినంత గుర్తింపు దక్కలేదు. ఓ మంచి ఉద్దేశంla ప్రారంభమైన ఈ సంస్ధను చాలా మంది సమర్ధించారు. కానీ పనిమనషులను ఈ స్కీమ్ లో నమోదు చేయడం పెద్ద సవాలుగా మారింది.

బెంగుళూరులో బ్యాంకర్ గా పని చేస్తున్న అతుల్ వైద్య, ఈ స్కీమ్ గురించి తెలుసుకుని, తమ 20 ఏళ్ల పనిమనిషికి సహయపడాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని ఆ అమ్మాయి తల్లి దండ్రులకు నచ్చజప్పే ప్రయత్నం కూడా చేసారు,

“ముందు ఈ స్కీమ్ వారికి నచ్చినప్పటికీ, కొంత భాగం వారు కూడా కట్టాలనే అంశంపై పెద్దగా శ్రద్ధ చూపించలేదు, మరో సారి ఓ ప్రెజంటేషన్ ద్వారా వారికి అందే సౌకర్యాలు, వెసులుబాటు గురించి తెలుపగా, అప్పుడు వారి తరపున 300 రుపాయలు జమ చేయడం ప్రారంభించారు, దానికి తోడు నేను 200 రుపాయలు మా వంతుగా ప్రతీ నెల జమ చేసే వాళ్లమంటున్నారు అతుల్”, ఆ డబ్బు మాకు ఓ పిజ్జా తిన్నంత కూడా కాదని, దాని వల్ల ఒకరి జీవితంలో అవసరమున్న సమయంలో సహాయపడ్డమన్నసంతోషం ఉంటుందని అంటున్నారు.

ఈ స్కీమ్ లో ఇలా డబ్బులు కడుతూ ఉంటే, ఆ అమ్మాయి సుమారు 7600 రుపాయలు ప్రతీ నెల పెన్షన్ రూపంలో తీసుకునే అవకాశం ఉంది.

ప్రారంభంలో సభ్యత్వ సమోదు ప్రక్రియ మొత్తం కూడా ఆన్ లైన్‌లో జరుగుతుంది. నాలుగు రోజుల్లో డాక్యుమెంట్లు కొరియర్ ద్వారా వస్తాయి. యజమాని తమ పనిమనిషి సంతకాలు తీసుకుని పెడితే చాలు, మళ్లీ ఆ డాక్యుమెంట్లు కొరియర్ ద్వారా వెనక్కి వెళ్లి ఆ ప్రక్రియ మొత్తం సులువుగా జరిగిపోతుంది.

ఈ సంస్ధ ను ప్రారంభించిన ఆరునెలల్లో ఎన్నో ప్రశంసలను అందుకున్న గిఫ్ట్ ఏ పెన్షన్, ఇప్పుడు వారి వెబ్ సైట్ ప్రతీ రోజు సుమారు 500 నుండి వెయ్యి హిట్స్ అందుకుంటుంది.

ఇప్పటికీ ఆశించినంతగా జరగపోయినా, 1400 యజమానులు రిజిస్టర్ చేసుకోగా, 450 మంది సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు.

“బెంగుళూరు, ముంబయిలో మంచి స్పందన ఉన్నందుకు సంతోషిస్తున్న ఈ సంస్ధ సభ్యులు, డిల్లీలో కూడా ఇలాంటి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నారు.”

ఇప్పటి వరకు సభ్యత్వాన్ని నమోదు చేసుకున్న వారిలో 55 శాతం మంది మహిళలే ఉన్నారు, అందులో 63 శాతం ఇప్పటికే పూర్తి కాగా, కొంత మంది యజమానులు క్రెడిట్ కార్డు ద్వారా కూడా ఈ సభ్యత్వాన్ని కోరుతున్నారంటున్నారు పరుల్.

ఇక తమ ఫ్యూచర్ ప్లాన్ గురించి మాట్లాడుతున్న పరుల్, వీలైనంత మందికి ఈ స్కీమ్ లో చేర్చాలని అంటున్నారు. అంతే కాకుండా భవిష్యత్తులో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రారంభిస్తామంటున్నారు.

ఇంత చేసినా తమ డ్రైవర్ దేశ్ రాజ్ కు పెన్షన్ సౌకర్యం కల్పించలేకపోయాననే బాధపడుతున్న పరుల్, 20 ఏళ్ల ఆయన మనవడు మోను తన సభ్యత్వాన్ని సమోదు చేసుకుంటున్నందుకు సంతోషిస్తున్నారు.
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags