సంకలనాలు
Telugu

మహాభారతాన్ని మరింత మహత్తరంగా చూపించే ప్రయత్నం చేస్తున్న '18డేస్'

అడ్వాన్స్డ్ గ్రాఫిక్స్ తో అదిరిపోయే కురుక్షేత్రంభారతీయ చరిత్రలో ఉండే కథలతో మరిన్ని సినిమాలు, సిరీస్ లుఉత్కంఠతో తెరకెక్కనున్న మహాభారతంవాసుదేవుడి చక్రం, అర్జునుడి అస్త్రాలు, ఇంకా మరెన్నోకంప్యూటర్లు, ఇంటర్నెట్ ఇతర హంగులు

ashok patnaik
24th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మన ఇతిహాసాల్లో ఒకటైన మహాభారతం గురించి తెలియని వారెవరూ ఉండరు. అందులో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం ఎన్నిసార్లు విన్నా అందులో కొత్త విషయం తారస పడక మానదు. ఇప్పుడు ఉన్నట్లు ఎలాంటి టెక్నాలజీ అందుబాటు లేని ద్వాపర యుగంలోనే కురుక్షేత్రం జరిగింది. అయితే ఆ యుద్ధంలో న్యూక్లియర్ బాంబ్‌లు, నిప్పులతో కూడిన బాణాలు ఉపయోగించినట్లు రాసి ఉంది. అప్పట్లో ఏ టెక్నాలజీ వాడారంటే సమాధానం దొరకదు. కానీ అదొక అద్భుత ఘట్టం. రెండు వర్గాల మధ్య జరిగిన పోరులో గెలుపోటములు సమానంగా స్వీకరించాలనే ధర్మం ఇందులో ఇమిడి ఉంది. చెడుపై మంచి ఎప్పటికైనా పైచేయి సాధిస్తుంది. భగవంతుడు శిష్ట రక్షకుడనే సార్థకతను భగవద్గీత చెబుతుంది. దీనిపై గతంలో ఎన్నో సినిమాలొచ్చాయి. కాని వాటన్నింటికీ భిన్నంగా తీస్తోన్న 18డేస్ సిరీస్ సరికొత్త అంచానాలను పెంచుతోంది. ఆ వివరాలు తెలియాలంటే ఈ కథ చదవాల్సిందే.

గ్రాంట్ మోరిసన్స్ - 18 డేస్ ప్రాజెక్ట్

గ్రాంట్ మోరిసన్స్ - 18 డేస్ ప్రాజెక్ట్


18డేస్ గురించి తెలుసుకునే ముందు భారతీయ యానిమేషన్ గురించి ముందుగా తెలుసుకోవాలి. భారత దేశంలో యానిమేషన్ అనుకున్న స్థాయిలో ఎదగలేదనే చెప్పాలి. టివిలు, సినిమాలలో సరైన గ్రాఫిక్స్ యానిమేషన్ లేకపోవడం పిన్న వయస్కుల నుంచి పెద్దవారిదాకా అందరినీ అప్సెట్ చేస్తోంది. దశాబ్దాలుగా భారత దేశ ఎంటర్‌టైన్మెంట్ యానిమేషన్ మిస్ కావడం వల్ల సతమతమవుతోంది. టామ్ అండ్ జెర్రీ లాంటి బొమ్మలను తయారు చేయలేకపోయామంటే.. మన వ్యవస్థలోనే ఏదో లోపం గుర్తించవచ్చు.

కోఫౌండర్, సీఈఓ శరత్ దేవరాజన్

కోఫౌండర్, సీఈఓ శరత్ దేవరాజన్


ఇండియాలో యానిమేషన్ సినిమా గతి మార్చడానికే

ఇండియన్ సబ్సిడియరీ ఆఫ్ లిక్విడ్ కామిక్స్ (యూఎస్), సీఏ మిడియా ఎల్పి, లతో ది ఏషియన్ ఇన్వెస్ట్ మెంట్ ఆర్మ్ ఆఫ్ కెర్నిన్ గ్రూపు, ఏల్సిసి(టిసిజి) కలసి 2012లో గ్రాఫిక్ ఇండియాను ఏర్పాటు చేసాయి. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసే ఓ మహత్తర కార్యాన్ని చేపడుతుందీ సంస్థ. మూడువేల శతాబ్దం నాటి రామాయణం, షోలే, గబ్బర్, గర్ల్ పవర్, బుద్ధ లాంటి వాటిని తయారు చేసి తనదైన మార్కును చూపించింది. బ్యాట్ మ్యాన్ లాంటి నాటికను రాసిన గొప్ప రచయిత గ్రాంట్ మారిసన్‌తో కలసి పనిచేశాం. యూట్యూబ్ సాయం తీసుకున్నాం. 18డేస్‌ను జనం ముందుకు తీసుకురాగలిగాం అని శరత్ దేవరాజన్ చెప్పుకొచ్చారు. ఆయన సంస్థకు కో ఫౌండర్‌గా వ్యవహరిస్తూ సిఈఓ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మహా భారతంలోని కురుక్షేత్ర సంగ్రామంపై తీసిన వెబ్ సీరీస్ ఇది. ఎంతో అద్భుత మైన కళాఖండంగా తీర్చి దిద్దడానికి అవకాశాలున్న ఎన్నో క్యారెక్టర్లు కురుక్షేత్రంలో ఉండటాన్ని మనం విశేషంగా చెప్పుకోవాలి. ఇక మొరిసన్ విషయానికి వస్తే.. డిసి కామిక్స్ లో ఆయన దాదాపు రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ఆ సమయంలో ఎన్నో గొప్ప గొప్ప క్యారెక్టర్లకు తనదైన విశేష ప్రతిభను అందించారు. తన అనుభవాన్నంతిటినీ మా ఈ సిరీస్ కోసం రంగరించారు. వెబ్ సిరీస్‌కి ముందు గ్రాఫిక్ ఇండియా ఓ గ్రాఫిక్ నవలను విడుల చేసింది. మోరిసన్ సంబంధించిన యానిమేట్ స్క్రిప్ట్‌లకు ముఖేష్ వేసిన బొమ్మలు జత చేసిన నవల ఇది. అమెరికాలో ఇప్పటికే అమ్మకాల జోరందుకున్న ఈ నవల భారత మార్కెట్ లో ఇంకా అందుబాటులోకి రాలేదు. 

‘మహాభారతం’ అనేది ఓ గొప్ప కావ్యం. భారతీయ(హిందూ) తత్వాన్ని మహాభారతం చెప్పినట్లు ఇంకెవరూ చెప్పలేరు. ఒడిసే, ఇలియాద్ లను వెస్ట్రన్ తత్వాన్ని ఎంత చక్కగా చెప్పాయో అంతకు మించింది ఈ కావ్యంలో ఏదో ఉంది. భారతీయ పురాణాల గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా గుర్తొచ్చేది మహాభారతం అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి దాన్ని తెరకెక్కించాలంటే ఎంత సులభమో, అంతే కష్టం కూడా. 18డేస్ లో ఎంతో కలర్ ఫుల్గా, కళాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాం. భారతీయ టెలివిజన్ కు సరిపోయేలా సంభాషణలు తెరకెక్కించాం. ఈ ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు దేవరాజన్, మొరిసన్ కొన్నేళ్లు వెనక్కి వెళ్లిపోయారు. మేం మహాభారతం కోసం సంప్రదింపులు జరిపేటప్పుడు, ఇంతకంటే గొప్ప పాట్నర్ దొరకడేమో అనిపించేది అని దేవరాజన్ చెప్పుకొచ్చారు. మహాభారతం అంటే వసుదేవుడి చక్రానికి ఎవరైనా బలికావల్సిందే. దానికుండే శక్తి అసమానమైనదే అభిప్రాయం తనకి కలిగిందని' అన్నారాయన.

మహాభారతంలోని ఓ సన్నివేశం

మహాభారతంలోని ఓ సన్నివేశం


నా చిన్నతనంలో మన పురాణాలు నాపై ఎంతగానో ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా అప్పట్లో మహాభారతాన్ని పీటర్ బ్రూక్ స్టేజ్ వెర్షన్ లో చూడటం మర్చిపోలేని అనుభూతి. రెండు వర్గాల మధ్య పోరును ఓ మహత్తర శక్తి నడిపించడం. చివరికి చెడుపై మంచి విజయం సాధించడం మనం మహాభారతంలో చూడొచ్చు. ఇండోనేషియాకు చెందిన ఓ తోలుబొమ్మలాటలో దీన్ని మరింత అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. ఇండియాలో చాలా ప్రాంతాలను సందర్శించా. ముఖ్యంగా ఉత్తర భారతంలోని పర్వత ప్రాంతాలను చూశాను. ప్రధానంగా దిల్లీ, ఆగ్రా, లఢక్ లో కొన్నాళ్లున్నాను. వర్షాకాలంలో గోవాలో ఉండటం మాటలకు అందని అనుభూతినిచ్చింది. ఇది సాంస్క్రతికంగా ఎంతో మెరుగైన సమాజం. ఇక్కడి ప్రజల జీవన విధానం నాన్ను ముగ్ధుడిని చేసింది. వారి జీవన శైలి నాలో స్పూర్తిని నింపిందని దేవరాజన్ అభిప్రాయపడ్డారు.

18 డేస్ ఓ యునిక్ ప్రాజెక్ట్. ప్రపంచ ప్రేక్షకుల కోసం తెరకెక్కిన సిరీస్ ఇది. గతంలో 300(త్రీ హండ్రడ్) ను ఎంతగా ఎంజాయ్ చేశారో అంతకు మించిన ఎన్నో రకాలైన విశేషాలు దీనిలో ఉన్నాయి. ఇందులో క్యారెక్టరైజేషన్, స్టోరీ టెల్లింగ్ లాంటివి ఓ నవలను చదినంత సులభంగా జనానికి అర్ధం అవుతాయి. యానిమేషన్ అనే ఫీలింగ్ ఎక్కడా కనపడదని వివరించే ప్రయత్నం చేశారు దేవరాజన్. మహాభారతం లాంటి గొప్ప పురాణాన్ని ఎంచుకొని, దాని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న గ్రాండ్ మొరిసన్, జీవన్ జె కాంగ్ లాంటి కళాకారుల తెరకెక్కిండం అన్న మాట. అది సరిహద్దులను చెరిపేసి అందరినీ తన వైపు తిప్పుకోగల ఓ కళాఖండంగా మారాలనేదే మా లక్ష్యం అని దేవరాజన్ అన్నారు. మోరిసన్ సైతం దీన్ని ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కథ మొత్తాన్నీ ఫ్యాంటాస్టిక్ అప్రోచ్ లాగ కాకుండా.. సైంటిఫిక్ జానర్ లా చూపించాలనుకుంటున్నారు. 300 మూవీ అనేది చారిత్రాత్మక నేపథ్యంగా కాకుండా కళాత్మక సినిమాలాగ ఉంటుంది. అలానే చేయాలని యోచిస్తున్నామన్నారు.

రీఫెమిలియరైసింగ్ చేయడానికి ముందు తాను కొన్ని గ్రాంథాలను చదివానని అన్నారు మొరిసన్. ఆర్కేనారాయణ రచనలు, రమేష్ మీనన్ మోడ్రన్ రెండింగ్ తో పాటు శ్రీశ్రీ పరమహంస యోగానంద గాడ్ టాక్స్ విత్ అర్జున, స్వామి రామా రాసిని భగవద్గీతను క్షుణ్ణంగా అవపోసనం పట్టారట. మహాభారత విషయానికొస్తే మూడోతరం టెక్నాలజీని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. గతంలో లాగ చేస్తే లాభం లేదనిపిస్తోంది. ఆలోచన్ని ఆచరణాత్మకంగా మార్చడంలో మరింత నైపుణ్యత అవసరమని అభిప్రాయపడ్డారు. మన హీరో , విలన్ లకు అందమైన డిజైన్ ఇవ్వడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. పీసీలు, ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్లు కూడా వారిదగ్గరున్నాయి. సిటీలో తిరగడానికి ‘విమానా’(విమానాలు) fun ఇచ్చాం. అస్త్రాలను కూడా సమకూర్చాం. పేలుళ్లు, బాంబులు, టాక్టికల్ న్యూక్లియర్ వెపన్లు, మైక్రో వేవ్ బీమ్స్ ప్రధాన అస్త్రాలుగా స్క్రిప్ట్ లో ఉన్నాయి. వాటిని ఉపయోగించాం. వీటిని తమ వర్షన్ లో వాడటం తమకు ఎంతగానో కలసొచ్చే విషయంగా ఆయన చెప్పుకొచ్చారు. భవిష్యత లో జరిగే యుద్ధం కనుక అది సరిగ్గా యాప్ట్ అవుతుందన్నారు.

గ్రాండ్ మొరిసన్, కామిక్ బుక్ రైటర్

గ్రాండ్ మొరిసన్, కామిక్ బుక్ రైటర్


మోరిసన్ , దేవరాజన్ ఇద్దరి అభిప్రాయం ఒకటే. కథలన్నీ మంచి కథలే. కానీ ఈ కథ మాత్రం గతంలో ఎన్నడూ చెప్పని ఓ గొప్ప కథ. చూసిన వారికి నేత్రానందం కలగక మానదు. వారు మమ్మల్ని పొగడకుండా ఉండలేరు. భారతీయ కల్చర్ తెలిసిన వారైతే మహాభారతాన్ని కళ్లకు కట్టారని అనుకుంటారు. క్యారెక్టరైజేషన్ లో మల్టి డైమెన్షనాలిటీ కనిపిస్తుంది. ఇదో సరికొత్త ప్రపంచం. దురాశ, హీరోయిజం, బాధ లాంటివి ఒకే వ్యక్తిలో ప్రతిబింభిస్తుంది. హీరో అంటే ఎప్పుడూ పోరాటే తత్వం ఉన్నవాడుగానే కోరుకుంటాం. అలాంటప్పుడు మనకి ఇక్కడ అందరూ హీరోలే అవుతారు. అని వివరించే ప్రయత్నం చేశారాయన. 

18డేస్ మా ప్రస్తుత ప్రాజెక్టు. దీనితోనే మా ప్రయాణం ఆగిపోదు. ఇది ఆరంభం మాత్రమే. మరికొన్ని టివి సిరీసులు, సినిమాలు, గేమ్స్, గ్రాఫిక్ నొవెల్స్, కంజూమర్ ప్రాడక్ట్ లు, డిజిటల్ కంటెంట్ ను కూడా గ్రాఫిక్ ఇండియా తయారు చేస్తుందన్నారు దేవరాజన్.

image


జనానికి విజువల్ తో కనువిందు చేయాలనేది మా ఉద్దేశం. గ్రాఫిక్ ఇండియా ఓ పబ్లిషన్ ఎప్పటికీ కాకూడదు అదొక స్టోరీ టెల్లర్- దేవరాజన్.

మేం 18డేస్ ని లైవ్ యాక్షన్, స్క్రిప్టెడ్ టీవీ షో చేయాలనుకున్నాం. ఉత్తర అమెరికా మార్కెట్ ను మేం టార్గెట్ చేశాం. దీని గురించి వివరాలను తొందరలోనే ఇస్తమని దేవరాజన్ ప్రకటించారు.“మా కంటెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేయడమే మా లక్ష్యం. 18డేస్ లో మేం తయారు చేసిన క్యారెక్టర్ బయటి జనాలు ఫాలో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బౌతికంగా అవి బయట లభించే అవకాశమూ లేకపోలేదు. ఎందుకంటే ‘చక్ర’ అనేది మేం లాంచ్ చేసిన ప్రాడక్టే. (దీన్ని కార్టూన్ నెట్ వర్క్ లో చూడొచ్చు). ఇది డిజిటల్ మార్కెటింగ్ లో బాగా ప్రచుర్యంలోకి వచ్చింది. భవిష్యత్ లో భారత్ లో మా ప్రాడక్ట్ లకు మంచి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాం. వచ్చే పదేళ్లలో భారత మార్కెట్ ను తమ ప్రాడక్ట్స్ టార్గెట్ చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయ యానిమేషన్ ఇండస్ట్రీలో ఏం మిస్సైందో గ్రాఫిక్ ఇండియా చూపించగలిగితే.. దీనిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లే. ఇక్కడ కంటెంట్ పుష్కలంగా ఉంది. లేనిదల్లా యానిమేషనే. గ్రాఫిక్ ఇండియాతో మార్పు కచ్చితంగా వస్తుందని భావిస్తున్నాం. భారత్ లో వేలమంది స్టోరీ టెల్లర్స్, కళాకారులు, యంగ్ ప్రొడ్యూసర్లు లార్డ్ ఆఫ్ రింగ్స్ లాంటి గ్రాఫిక్స్ నొవెల్స్ చదువుతూ, జస్టిస్ లీగ్ చూస్తూ ఎదుగుతున్నారు. జపాన్ వారిలాగానే భారతీయులు సైతం ప్రపంచ గ్రాఫిక్ ఇండస్ట్రీలో క్రియాశీలం కాగలరని ఆశిస్తున్నానన్నారు దేవరాజన్.

image


ఒకప్పుడు ఈ భూమండలం పూర్తిగా మైదాన ప్రాంతాలతో వ్యాపించి ఉంది. నిప్పు,నీరు,సూర్యుడు ముగ్గురు దేవతలు భూమాతకు పిల్లలు. వాళ్ల ఇళ్లకు వచ్చే క్రమంలో భూమాత చనిపోయింది. చిన్న కూతురు నిప్పు తన బాధ్యతగా పంటపొలాల్ని, పచ్చదనాన్ని కాల్చేసింది. దీంతో ఉన్న నదులన్నీ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అదేసమయంలో నీరు వర్షం రూపంలో కురవడంతో పరిస్థితి మార్పొచ్చింది. సూర్యని కాంతి కిరణాలతో వ్యవసాయం జరిగి పంటపొలాలు మళ్లీ పచ్చదనాన్ని ఆపాదించాయి. తిరిగి భూమాత బతికిందట. దీంతో కొండలు, గుట్టలు, లోయలు, నదులతో అందమైన భూమికి పునర్జన్మ లభించింది. మానవాళికి ఈ భూమి లభించింది. ఇది కాశీ ప్రాంత కథ. భారత ఖండం గొప్ప పౌరాణిక చారిత్రక నేపధ్యాన్ని కలిగి ఉంది. చాలా రాకాలైన నాగరికతకు సజీవ సాక్ష్యం. చరిత్రలో ఎన్నో రాజ్యాలను చవిచూసిని భూభాగాం. బ్రిటీష్ పాలనలో కూడా ఉంది. ఇలా చూసుకుంటే ఎన్నో రకాలైన స్థానిక కథలు, ఇతర సాంప్రదాయ స్టోరీలను మరోసారి చెప్పాల్సిన అవసరం ఉంది. వీటిని చెప్పడానికి ఇప్పుడు దేవరాజన్, మారిసన్ లాంటి వారు ముందుకొచ్చారు. భవిష్యత్ లో మరికొంతమంది రాబోతున్నారు.

మహాభారతం లాంటి గొప్ప కథ ఏ సంస్క్రతికి చెందింది కాదు. ఈ ప్రపంచానికి లభించిన వరం అని దేవరాజన్ ముగించారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags