సంకలనాలు
Telugu

గోడు తీర్చాలకున్న సాయం ఓడ దగ్గరే ఆగిపోయింది..

vennela null
1st Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మనసుంటే మార్గముంటుంది. లక్ష్యం మంచిదైనప్పుడూ ఆచరణ సాధ్యమవుతుంది. వీటన్నింటికి నిదర్శనం ఓ ప్రవాస భారతీయురాలు. పుట్టిన గడ్డకు కష్టం వస్తే....చూసి చలించిపోయింది. వేలమైళ్ల దూరంలో ఉన్నా ... ఆమె అడుగులు చెన్నై వైపు కదిలాయి.

ఆమె పేరు రాధికారావు. సొంత ఊరు చెన్నై. విద్యాభ్యాసాన్ని శంకర నేత్రాలయలో పూర్తి చేశారు. ఉన్నత చదువులోసం అమెరికా వెళ్దామనుకున్నా మూడు సార్లు వీసా రిజక్ట్ కావడంతో ఇండియాలోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1997ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికా వెళ్లారు రాధికారావు. మూడు సంవత్సరాల పాటు బ్రెస్సెల్స్ లో నివాసమున్నారు.

చెన్నయ్ ని వరదలు ముంచెత్తాయన్న వార్త ఆమెను కలవర పెట్టింది. కన్న ఊరు కష్టాల్లో ఉందని తెలిసి చలించిపోయింది. ఉన్నదంతా కోల్పోయిన తనవారికోసం సాయం చేయాలనుకుంది. అనుకున్నదే ఆలస్యం స్నేహితుల సాయంతో.. వరద బాధితుల కోసం బట్టలు సేకరించింది. స్నేహితులతో పాటు, సోషల్ మీడియా సహకారంతో పదిరోజుల్లోనే భారీగా చీరలు, చిన్నారులకు దుస్తులు, అండర్ గార్మెంట్స్ పోగుచేసింది. బాధితులకోసం పంపేవే అయినా నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడలేదు.

imageపదిరోజుల పాటు నిరంతరం శ్రమించి రాధికా రావు....చివరకు 700 బాక్సులతో ఓ కంటెయినర్ నిండా బట్టలను తమిళనాడుకు పంపించింది. విరాళాల ద్వారా వచ్చిన 4 లక్షల రూపాయల డబ్బునీ పంపింది. కానీ ఆమె సాయం ఆ కంటెయినర్ నుంచి బైటకు రాలేదు. ఓడ తమిళనాడు చేరినా ఒడ్డు దిగలేదు. రాధిక పంపిన బట్టల బాక్సులన్నీ కంటెయినర్ లోనే మగ్గుతున్నాయి. కారణం కస్టమ్స్ అధికారుల నిర్వాకం.

సాయం చేయడానికి చట్టాలుండవు.. కానీ అడ్డుకోవడానికి మాత్రం ఉంటాయి. జనవరి 27న తమిళనాడులోని పొన్నేరి పోర్టుకు చేరిన కంటెయినర్ ఇప్పటికీ అక్కడే ఉంది. సమస్య పరిష్కారం కోసం స్వయంగా రాధిక.. వర్జీనియా నుంచి ఇండియా వచ్చింది. కానీ రూల్స్ పేరుతో కంటెయినర్ ని మాత్రం కదలనివ్వలేదు అధికారులు. వారితో పోరాడి పోరాడి అలసిపోయి.. తిరిగి అమెరికా చేరుకుంది. ఇప్పటికీ తాను పంపిన సాయాన్ని బాధితులకు అందేందుకు ఫైట్ చేస్తునే ఉంది.. 

image


Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags