సంకలనాలు
Telugu

ఫ్యాషన్ క్లోత్స్‌ రెంట్‌కు ఇస్తున్న ఫ్లైరోబ్

GOPAL
21st Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


ఫ్యాషన్ రోజుకో రూపాన్ని సొంతం చేసుకుంటుంది. నిన్నటి ఫ్యాషన్ నేడు ఓల్డ్ అవుతోంది. ప్రతి ఒక్కరు రోజుకో రకమైన దుస్తులను ధరించాలనుకుంటారు. పెళ్లిళ్లకు ఒకరకమైన దుస్తులు, పార్టీలకు మరో రకమైన దుస్తులు. ఇలాంటి ట్రెండ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఒక్క రోజు ధరించేందుకు వేలు పోసి దుస్తులు కొనుగోలు చేసేకంటే.. అద్దెకు తెచ్చుకుంటే సరిపోతుంది కదా అన్న భావన చాలామందిలో వ్యక్తమవుతోంది. అలాంటి వారి కోసం ఫ్యాషన్ దుస్తులను తక్కువ ధరకే అందజేస్తోంది ఫ్లైరోబ్. పార్టీల అవుట్ ఫిట్సే కాదు.. సంప్రదాయ దుస్తులనూ రెంట్‌కిస్తోంది.

శుక్రవారం సాయంత్రం. వీకెండ్ మొదలైంది. పార్టీకి వెళ్లాలి. పార్టీకి ఏ డ్రెస్ వేసుకెళ్లాలి. వార్డ్ రోబ్ నిండా దుస్తులే. కానీ అవన్నీ రొటీన్‌గా వేసుకునేవే. వెరైటీ ఒక్కటి లేదు. అప్పటికప్పుడు కొనుక్కుందామంటే టైమ్ లేదు. ఇలాంటి వారికి ఫ్లైరోబ్ ఆన్‌లైన్ ఫ్యాషన్ రెంటల్ పోర్టల్ సేవలందిస్తోంది. ముగ్గరు బాంబే ఐఐటీ గ్రాడ్యుయేట్స్ శ్రేయా మిశ్రా, ప్రణయ్ సురానా, తుషార్ సక్సేనాలు ఈ స్టార్టప్‌కు అంకురార్పణ చేశారు. మంచి క్వాలిటీ ఫ్యాషన్ దుస్తులను అద్దెకు ఇస్తున్నారు.

గత ఏడాది (2015) సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఫ్లైరోబ్.. ఔట్ హౌజ్, మసాబా గుప్తా, రీతు కుమార్, షీలా ఖాన్ వంటి డిజైనర్ల లేబుల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఫ్లైరోబ్ వ్యవస్థాపకులు తుషార్, శ్రేయ, ప్రణయ్

ఫ్లైరోబ్ వ్యవస్థాపకులు తుషార్, శ్రేయ, ప్రణయ్


స్ఫూర్తి ఎయిర్ బీఎన్‌బీ..

అది 2012. శ్రేయ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఆంట్రప్రెన్యూర్ చేస్తున్నారు. సమ్మిట్‌లో భాగంగా ట్రైనింగ్ కోసం ఎయిర్ బీఎన్‌బీ కార్యాలయాన్ని విజిట్ చేశారు. ఆ సమయంలోనే ఫ్యాషన్ దుస్తులను అద్దెకు ఇవ్వాలన్న ఆలోచన శ్రేయకు వచ్చింది. ‘‘నిత్యం మనకు అవసరమున్నప్పటికీ, కొనుక్కోవాల్సిన అవసరం లేనివి ఏంటీ అన్న అంశంపై మేం ముగ్గురం చర్చించాం. గంటపాటు వినియోగానికి కొనుగోలు చేయాల్సిన అవసరం ఎందుకు అన్నప్పుడు మా మదిలో ఈ ఫ్యాషన్ దుస్తుల ఐడియా వచ్చింది. అలా ఆన్ లైన్ వార్డ్ రోబ్ ప్రారంభించాం అని శ్రేయ వివరించారు.

కావాలనుకున్నప్పుడు తమకు నచ్చిన దుస్తులను కొనుగోలు చేయకుండానే వాడుకోవచ్చు. ఈ అంశంపై 200 మందితో సర్వే నిర్వహించారు. అందులో 80% మంది పాజిటివ్‌గా స్పందించారు.

వెబ్‌సైట్ లాంచింగ్..

ఐడియాను కార్యరూపంలో పెట్టారు. గత జూన్‌లో బీటా వెర్షన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్‌లో యాండ్రాయిడ్ యాప్‌ను లాంచ్ చేశారు. అక్టోబర్‌లో అధికారికంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

ఫ్లైరోబ్‌లో ప్రస్తుతం 30 మంది ఇంజినీరింగ్, మార్కెటింగ్, బిజినెస్ డెవలప్‌మెంట్, ప్రాడక్ట్, ఆపరేషన్ ఉద్యోగులున్నారు. బాసిన్ అండ్ కో, ఇన్‌మొబీ, క్యాడబరీ, టిన్యోల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలను వదులుకుని వీరి కంపెనీలో చేరినవారున్నారు. ఇటీవలే శ్రీజిత దేబ్ సీబీఓగా సంస్థలో చేరారు. 

 ఫ్లైరోబ్ టీమ్..

ఫ్లైరోబ్ టీమ్..


వర్కింగ్ స్టయిల్..

కస్టమర్ల ఆన్ డిమాండ్‌పై వెస్ట్రన్ వియర్‌ను మూడు గంటల్లో హోం డెలివరీ చేస్తుంది ఫ్లైరోబ్. సంప్రదాయ దుస్తులైతే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెంట్స్ రూపంలో ఎంత ఆదాయం వస్తుందో చెప్పేందుకు నిర్వాహకులు నిరాకరించినప్పటికీ, ఫ్యాషన్ సైట్లు ఆర్జిస్తున్న సగటు ఆదాయంతో తాము కూడా సంపాదిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 75 వేలమందికి పైగా తమ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని ఫ్లైరోబ్ నిర్వాహకులు అంటున్నారు. ప్లే స్టోర్‌లో ఈ యాప్‌కు 4.3 రేటింగ్ ఇచ్చారు కస్టమర్లు. దుస్తుల ధరలో 10 నుంచి 15 % ధరకే అద్దెకు ఇస్తున్నారు.

సంస్థకు మార్కెటింగ్‌ను కూడా వినూత్నంగా చేపట్టారు ఫ్లైరోబ్ నిర్వాహకులు. ‘ఏంజెల్ యూజర్ క్యాంపైన్’ పేరుతో ఓ ప్రచారాన్ని నిర్వహించారు. లాయర్ నుంచి డాక్టర్, కాలేజీ స్టూడెంట్ ఇలా విభిన్న రంగాలకు చెందిన 10 మంది మహిళలను ఎంపిక చేసి, ఫ్లైరోబ్ ఔట్‌ఫిట్స్‌తో ఫొటో షూట్ నిర్వహించారు. వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి రివ్యూలు తీసుకున్నారు.

ఇలాంటి ప్రచారంతో తొలి వారంలోనే 35 మంది కస్టమర్లు వచ్చారు. ఈ ప్రచారం బాగుందనిపించింది. వీటితోపాటు స్నేహితుల రెకమండేషన్స్‌తో చాలామంది దుస్తులను అద్దెకు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రతి మహిళా ఆన్‌లైన్ వార్డ్‌రోబ్‌లో మెంబర్ కావాలన్నదే మా లక్ష్యం అని శ్రేయ చెప్పారు.

వ్యాపార అవకాశాలు..

గత కొన్ని నెలలుగా ఆన్‌లైన్ ఫ్యాషన్ రెంటల్ స్పేస్ విస్తరిస్తోంది. గత పదేళ్లుగా ఈ ఫ్యాషన్ రంగంలో 166 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టారు. స్పైయోల్, రివాంప్ మై క్లోసెట్, వన్స్ అగైన్, ఎక్స్చేంజ్ రూమ్, ఎలానిక్, ఎటాషీ వంటి స్టార్టప్‌లు ఇప్పటికే ఈ రంగంలో ఉన్నాయి. ఇందులో కొన్నింటికి స్మాల్ సీడ్ ఫండ్ కూడా లభించింది.

ఈ రంగం ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటోంది. ఇందులో కూడా వివిధ రకాల బిజినెస్ మోడల్స్ ఉన్నాయి. రివాంప్ లార్జెస్ట్ ఇన్వెంటరీ మోడల్‌కాగా, ఎలానిక్ యాప్, సోషల్ నెట్‌వర్క్‌ మోడల్.

వేలకొద్ది డబ్బులు పెట్టి వస్తువులు కొనుక్కునే రోజులు పోయాయి. చాలామంది ఇప్పుడు యూజ్ అండ్ త్రోకే ప్రాధాన్యమిస్తున్నారు. పెద్ద మొత్తంలో దుస్తుల కోసం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండా, కొద్దిమొత్తంతోనే అద్దెకు తీసుకునే సౌకర్యం లభిస్తుండటంతో చాలామంది వీటిపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మరోవైపు ఇండియాలో సెకండ్ హ్యాండ్ టెక్స్‌టైల్స్‌కు మార్కెట్ ఎప్పుడూ ఉంటుంది. యూఎన్ కామ్‌ట్రేడ్ 2013 డాటా ప్రకారం182 మిలియన్ డాలర్ల విలువ చేసే యూజ్డ్ క్లోత్స్‌ను ఇండియా దిగుమతి చేసుకుంది. ఈ దిగుమతి రంగంలో ఇండియానే అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ రెంటల్ వార్డ్‌రోబ్ ఫ్లైరోబ్ మరింత విజయవంతం కావాలని యువర్‌స్టోరీ ఆకాంక్షిస్తోంది.

వెబ్‌సైట్:

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags