సంకలనాలు
Telugu

హెరిటేజ్ బిల్డింగులో ఇదోరకం లగ్జరీ వెకేషన్.. సరికొత్త మార్కెట్ సృష్టించిన యువతి

SOWJANYA RAJ
2nd May 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


పచ్చగా అల్లుకున్న తోటలో సువిశాల భవనం..!

అందులో కుటుంబంతో వారం రోజుల పాటు ఆనందంగా గడిపాడు రిత్విక్ వర్మ . ఫార్మా హౌస్ లో మొక్కల మధ్య పిల్లల ఆనంద కేరింతలు..! సూర్యోదయం కాక ముందే పచ్చని ప్రకృతి మధ్య భార్యతో నడక...! సాయంత్రం స్విమ్మింగ్ పూల్ లో ప్రశాంతంగా సేదదీరడం...! ఇలాంటి ఆనంద జ్ఞాపకాలతో తన వెకేషన్ ఇంతకు ముందెన్నడూ జరగనంత లగ్జరీగా పూర్తి చేశాడు.

నిజానికి రిత్విక్ కు ఫామ్ హౌస్ లేదు..! మిత్రుడిది అంతకంటే కాదు..! కార్పొరేట్ అధిపతులు ఇచ్చిన ఆతిథ్యం అంతకన్నా కాదు..!

మరి అదంతా ఎవరు సృష్టించినది..? ఎవరి ఐడియా..?

"సఫ్రాన్ స్టేస్" లగ్జరీ

ఉరుకులు, పరుగులు, ఒత్తిళ్ల జీవితంలో ఎవరూ డిస్ట్రబ్ చేయని లగ్జరీ వెకేషన్ కోరుకునేవారి కోసం వచ్చిన స్టార్టప్ "సఫ్రాన్ స్టేస్".

కళ్లు తిరిగిపోయే ఫామ్ హౌస్ లు, హెరిటేజ్ బిల్డింగ్స్ లో ఆతిధ్యం ఈ "సఫ్రాన్ స్టేస్" స్పెషాలిటీ

ఒకసారి ఏం జరిగిందంటే..

సఫ్రాన్ స్టేస్ ఫౌండర్ తేజాస్ పరులేకర్. బ్యాంకింగ్ రంగంలో చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న తేజాస్ కు తరచూ వెకేషన్ కు కొత్త ప్రాంతాలకు వెళ్లడం అలవాటు. తేజాస్ భర్త యర్నెస్ట్ అండ్ యంగ్ లో కీలక బాధ్యతల్లో ఉండటంతో తరచూ విదేశాలకూ పయనమయ్యేవారు. అలా యూరప్ పర్యటనకు వెళ్లినప్పుడు స్పెయిన్ లో ఒక ఫామ్ హౌస్ లో బస చేశారు. ఎవరూ డిస్ట్రబ్ చేయని, ఎంతో ఆహ్లాదంగా ఉన్న ఆ వాతావరణం తేజాస్ కు పిచ్చపిచ్చగా నచ్చింది. ఆ తర్వాత ఫ్రాన్స్ కు వెళ్లినప్పుడు అక్కడి ఓ హెరిటేజ్ భవనంలో ఆతిధ్యం తీసుకోవడం మరింత ఆనందాన్నిచ్చింది. గతంలో చాలా టూర్లు తిరిగినా దొరకని ఆనందం.. ఈ సారి యూరప్ టూర్ లో దొరికింది అతనికి. దానికి కారణం తాము స్టే చేసిన ప్రదేశాలే అని గుర్తించింది. అలాంటివి భారత్ లో లభించవా..? అన్న ఆలోచనే... సఫ్రాన్ స్టేస్ స్టార్టప్ ప్రారంభానికి దారి తీసింది.

ముంబై కేంద్రంగా ప్రారంభమైన సఫ్రాన్ స్టేస్ లగ్జరీ వేకేషన్ కు బ్రాండ్ అంబాసిడర్ లాంటింది. లగ్జరీ హౌస్, ఫార్మ్ హౌస్, హెరిటేజ్ బంగ్లాల్లో బస చేసేందుకు ఈ సఫ్రాన్ స్టేస్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

సఫ్రాన్ స్టేస్ నిర్వహణలో ఉన్న గోవా లగ్జరీ విల్లా<br>

సఫ్రాన్ స్టేస్ నిర్వహణలో ఉన్న గోవా లగ్జరీ విల్లా


ప్రాపర్టీ ఓనర్లకు బహుళ ప్రయజనాలు

దేశంలో చాలా మంది ధనవంతులకు ఫార్మ్ హౌస్ లు ఉంటాయి. కొంత మంది బిలియనీర్లకు హెరిటేజ్ బిల్డింగులు సొంత ఆస్తిలా పడి ఉన్నాయి. మరికొందరికి లగ్జరీ విల్లాస్ ఉంటాయి. కానీ వీరంతా వాటిని తమ వెకేషన్లకు వాడుకునేది చాలా తక్కువ. పైగా ఒకే ప్రదేశానికి పదే పదే వెళ్లడం వారికి కూడా బోర్ కొడుతుంది. పైగా వాటి నిర్వహణ పెద్ద తలనొప్పి. అందుకే ఇలాంటివి చాలా వరకు పెద్దగా మెయింటెనెన్స్ లేకుండా పడి ఉంటూంటాయి. అదే సమయంలో ఏడాదిలో ఇలాంటి ప్రశాంత వాతావరణం ఉన్న వాటిల్లో కొన్ని రోజులు స్టే చేస్తే లైఫ్ లో రీచార్జ్ కావచ్చని భావించని మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి కుటుంబాలు ఉండవు. అయితే వీరికి ఉన్న సమస్య సొంతంగా ఫాంహౌసో, లగ్జరీ విల్లానో లేకపోవడం. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న గ్యాప్ ను ఫిల్ చేసేలా ఈ సఫ్రాన్ స్టేస్ కు తేజాస్ పరులేకర్ రూపకల్పన చేశారు.

లగ్జరీ విల్లాలు, ఫార్మ్ హౌస్ లు, హెరిటేజ్ బిల్డింగుల ఓనర్లకు "సఫ్రాన్ స్టేస్" రెండు రకాల ప్రయోజనాలు కల్పించింది. నిరుపయోగంగా పడి ఉన్న తమ ఆస్తులకు మంచి ఆదాయం తెచ్చిపెట్టడంతో పాటు వాటిని ఎప్పుడూ.. నిత్యనూతనంగా ఖర్చు లేకుండా ఉంచడం. సఫ్రాన్ స్టేస్ లో తమ లగ్జరీ ప్రాపర్టీని ఉంచేందుకు అంగీకరించివారికి ఉండే మరో బంపర్ ఆఫర్ కూడా ఉంది. దేశ వ్యాప్తంగా సఫ్రాన్ స్టేస్ లో ఉన్న ఫామ్ హౌస్, లగ్జరీ విల్లాల్లో దేంట్లోనైనా వీరు స్టే చేసే అవకాశాన్ని పొందుతారు. అంటే స్థిరంగా ఒక చోట ఉండే వీరి ప్రాపర్టీ.. దేశవ్యాప్తంగా అలాంటి లగ్జరీని పొందే అవకాశం కల్పిస్తుందన్నమాట.

"మాది భారతదేశంలో మొట్టమొదటి లగ్జరి వెకేషన్ హోమ్ నెట్ వర్క్. విల్లాలు, ఫామ్ హౌసులున్నవారికి బహుళప్రయోజనకారిగా ఉంటుంది. ట్రావెలర్స్ లగ్జరీ అనుభూతి కల్పిస్తుంది. లగ్జరీ విల్లాస్, ఫామ్ హౌస్ , హెరిటేజ్ బంగ్లాల్లో లగ్జరీ వెకేషన్ కల్పించడం కొత్త రకం మార్కెట్ ను సృష్టించడమే" తేజాస్ పరులేకర్

తేజాస్ పరులేకర్, సఫ్రాన్ స్టేస్ ఫౌండర్<br>

తేజాస్ పరులేకర్, సఫ్రాన్ స్టేస్ ఫౌండర్


నిర్వహణ కూడా..!

ఏప్రిల్ 2014 లో సఫ్రాన్ స్టేస్ స్టార్టప్ ను ప్రారంభించారు తేజాస్. మొదట హోమ్ స్టేస్ అగ్రిగ్రేటర్ గానే దీన్ని నడిపారు. ఆరు నెలల్లో వెయ్యికిపైగా లిస్టింగ్స్ రావడంతో మరికొంత కసరత్తు జరిపి... 2015 ఫిబ్రవరి నుంచి వాణిజ్య పరంగా కార్యకలాపాలు ప్రారంభించారు. కొంత కాలం నడిచిన తర్వాత అగ్రిగ్రేటర్ రోల్ తో తాము ఆశించిన లగ్జరీని వినియోగదారులకు అందించలేకపోతున్నామనే భావనకు వచ్చారు. కొన్ని అంశాల్లో కస్టమర్లు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ కూడా వీరిని ఆలోచనల్లో పడేసింది. దాంతో తామే ఆ ప్రాపర్టీ బాధ్యతలను చూస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించారు. కస్టమర్లకు లగ్జరీ అనుభూతి రావాలంటే తామే నిర్వహణ తీసుకోవాలని భావించారు. ప్రాపర్టీ ఓనర్లను సంప్రదించారు. అలా మొదటిసారి మహారాష్ట్రలోని మాథెరాన్ అనే హిల్ స్టేషన్ లో ఉన్న "ద పార్శి మనార్" అనే బిల్డింగ్ ను నిర్వహణ కోసం తీసుకున్నారు. 120 ఏళ్ల నాటి బ్రిటిష్ పాలకులు నివాసం ఉన్న ఆ భవనాన్ని లగ్జరీ స్టేయింగ్ కు అనుగణంగా తీర్చి దిద్దారు. ఐదు నెలల కాలంలో పదకొండు లగ్జరీ హోమ్స్ ను మ్యానేజ్ చేయడానికి సఫ్రాన్ స్టేస్ కు యజమానులు అప్పగించారు. ఇందులో రెండు హెరిటేజ్ భవనాలు కూడా ఉన్నాయి.

భారత్ లో ఇప్పుడు రెండు లక్షలకుపైగా కుబేరులు ఉన్నారు. ఇంకా కోట్లకు పడగలెత్తినవారు కొన్ని లక్షల మంది ఉంటారు. వీరిలో చాలా మందికి ఫామ్ హౌసులు, లగ్జరీ విల్లాలు ఉన్నాయి. వీరి సంఖ్య 2020 కల్లా రెండింతలవుతుందని అంచనా. వచ్చే ఐదారేళ్లలో ఇలాంటి వెయ్యి లగ్జరీ వెకేషన్ హోమ్స్ ను సఫ్రాన్ స్టేస్ నెట్ వర్క్ లోకి తేవాలని తేజాస్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

మతెరన్ లోని ద పార్సీ మేనర్ విల్లా<br>

మతెరన్ లోని ద పార్సీ మేనర్ విల్లా


సవాళ్లు కూడా ఉన్నాయి..!

అయితే ఈ మోడల్ లో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయని సఫ్రాన్ స్టేస్ బృందం అంచనా వేస్తోంది. ప్రాపర్టీ అప్పగించిన వారికి సంతృప్తిపడేలా నిర్వహణ చేయడంతో పాటు వారికి తగిన ప్రతిఫలం వచ్చేలా చేయగలగడం. దాంతో పాటు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా విల్లాలను ఎంపిక చేసుకోవడం. అలాగే వారికి అప్పగించిన ప్రాపర్టీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. ఆ హెరిటేజ్ బిల్డింగులకు ఎలాంటి నష్టం వాటిల్లకు వినియోగదారులకు లగ్జరీ అనుభూతి కలిగించడం కూడా.. ఓ మాదిరి సవాల్ గానే భావిస్తున్నారు. ఏ చిన్న విషయంలో తేడా జరిగినా అటు ప్రాపర్టీ ఓనర్లు.. ఇటు వినియోగదారులు కూడా అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రతీ విషయంలోనే శ్రద్ధ తీసుకుంటున్నారు.

పోటీ పెద్దగా లేదు..!

అంతర్జాతీయంగా వన్ ఫైన్ స్టే, లగ్జరీ రిట్రీట్స్ లాంటివి సఫ్రాన్ స్టేస్ తరహాలో లగ్జరీ వేకేషన్ సేవలు అందిస్తున్నాయి. కానీ భారత్ లో మాత్రం ఇదే మొదటిది. అయితే ఇతర పర్యాటక సేవలు అందించే స్టార్టప్ లు మాత్రం చాలా ఉన్నాయి. ట్రిప్ విల్లాస్, ఎయిన్ బీఎన్బి, గెస్ట్ హౌసర్, స్టేజిల్లా లాంటివి వీటిలో ప్రధానమైనవి. అయితే వ్యాపార పరంగా చూస్తే వీటి సేవలు ఒకటే కానీ... సఫ్రాన్ స్టేస్ మార్కెట్ మాత్రం పూర్తిగా డిఫరెంట్. లగ్జరీ హోమ్ వెకేషన్ నెట్ వర్క్ ఉన్న ఏకైక స్టార్టప్ సఫ్రాన్ స్టేస్. సెంట్రలైజ్డ్ రిజర్వేషన్ సిస్టమ్ , ప్రాపర్టీ మేనేజ్ మెంట్ దీని స్పెషాలిటీ. నిర్వహణ కోసం ప్రాపర్టీని అప్పగించిన వారి కోసం ప్రత్యేకయాప్ ను తయారు చేశారు. వారి ప్రాపర్టీకి సంబంధించిన ప్రతీ విషయాన్ని వారికి ఎప్పటికప్పుడు తెలిసేలా ఏర్పాట్లు చేశారు.

గోవాలోని ది ఇన్నర్ టెంపుల్ విల్లా<br>

గోవాలోని ది ఇన్నర్ టెంపుల్ విల్లా


భవిష్యత్ ప్రణాళికలు

ప్రస్తుతం తేజాస్ పరులేకర్ తో పాటు ఆరుగురు సభ్యుల బృందం సఫ్రాన్ స్టేస్ కోసం పనిచేస్తోంది. దేశ వ్యాప్తంగా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంతర్జాతీయంగానూ దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి ప్రయత్నించి, పరీక్షించి, విజయవంతం అయిన మోడల్ నే ఫాలో అయి బిజినెస్ ను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఫండింగ్ కోసం తేజాస్ చూస్తున్నారు. కానీ పెట్టుబడి దృష్టితో మనీ ఇన్వెస్ట్ చేసేవారు అవసరం లేదని నిర్మోహమాటంగా చెబుతున్నారు. టెక్నికల్, మార్కెటింగ్ రంగాల్లో అనుభవం ఉన్నవారు.. సుదీర్ఘ కాలం సఫ్రాన్ స్టేస్ తో ప్రయాణం చేయాలనుకునేవారు పెట్టుబడులతో వస్తే స్వాగతిస్తానంటున్నారు.

వెబ్ సైట్

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags