సంకలనాలు
Telugu

కళ్లు లేని కుర్రాడు.. యాభై కోట్ల వ్యాపారి అయ్యాడు!! 27 యేళ్ల శ్రీకాంత్ సక్సెస్ స్టోరీ!!

ఒకప్పుడు చూపులేదని ఈసడించిన సమాజం..27 ఏళ్ల తర్వాత అదే సమాజం చూపుని తనవైపు తిప్పుకున్న శ్రీకాంత్ !

Karthik Pavan
27th Dec 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

పుట్టగానే గొంతు నులిమి చంపేయండని కొందరన్నారు. ఇంకొందరైతే- జీవితాంతం ఎందుకు భారం.. వదిలించుకోండి అని సలహా యిచ్చారు. పొయిన జన్మలో ఏ పాపం చేసుకున్నాడో కళ్లు లేకుండా పుట్టాడని కూడా మరికొందరు ఈసడించుకున్నారు. ఎందుకూ పనికిరాడని- ఉపయోగం లేదని- చాలామందే అన్నారు. కానీ తల్లిదండ్రులు ఆ కుర్రాడిని భారంగా భావించలేదు. సమాజం ఎంత హేళన చేసినా పట్టించుకోలేదు. ప్రేమాభిమానాలతో పెంచుకున్నారు. చూపులేకున్నా తల్లిదండ్రుల చల్లని చూపులే ఆ చిన్నారికి ఆశీస్సులయ్యాయి. వెక్కిరించిన విధిని ధిక్కరించి గెలిచి నిలిచాడు. 23 ఏళ్ల తర్వాత, ఏ చూపైతే లేదని సమాజం చిన్నచూపు చూసిందో అదే సమాజం చూపుని తనవైపుకు తిప్పుకున్నాడు. నువ్వేం చేయలేవు శ్రీకాంత్ అనే మాటలను తిరగరాసి -శ్రీకాంత్ నువ్వేమైనా చేయగలవు శ్రీకాంత్ అనేదాకా తెచ్చాడు.

శ్రీకాంత్ బొల్లా.

శ్రీకాంత్ బొల్లా.


శ్రీకాంత్ ఇప్పుడు 50 కోట్ల టర్నోవర్ గల బొల్లాంట్ ఇంటస్ట్రీస్ అధినేత. చదువులేనివారు, తనలా చూపులేనివారు అందులో ఉద్యోగులు. పర్యావరణానికి ఏమాత్రం హానిచేయని డిస్పోసబుల్ ప్యాకింగ్ సంస్థను అంచెలంచెలుగా పైకి తీసుకొచ్చాడు. అలాంటి కంపెనీలు నాలుగు స్థాపించాడు. ఇంకోదానికి సన్నాహాలు చేస్తున్నాడు. అంతా దురదృష్టవంతుడని జాలిపడ్డారు. కానీ శ్రీకాంత్ దృష్ఠిలో తానొక గొప్ప అదృష్టవంతుడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, శ్రీకాంత్ పట్టుదల, ఆత్మవిశ్వాసం అతణ్ని ఈ స్థాయిలో నిలబెట్టాయి.

అదీ శ్రీకాంత్ నమ్మిన సిద్ధాంతం

సక్సెస్ కు షార్ట్ కట్ లేదు. కష్టపడాలి. ఫలితం దానంతట అదే వస్తుంది. శ్రీకాంత్ నమ్మిన సిద్ధాంతం అదే. కళ్లు లేకపోయినా తనకాళ్ల మీద తను నిలబడటమే కాదు –తనలాంటి వాళ్లను వందల మందిని నిలబెట్టాడు. అదీ శ్రీకాంత్ గొప్పదనం. కళ్లు లేకుండా పదిరూపాయలు సంపాదించడమే గగనమైన ఈ రోజుల్లో కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ చేయడమంటే మాటలు కాదు. అదికూడా కటిక పేదిరకంలో పుట్టి.

అడుగడుగునా ఎదురుదెబ్బలు

జీవితం పూలపాన్పేం కాదు. దారంతా ముళ్లూ రాళ్లూ. అంధకారం. దానికి తోడు పేదరికం. సమాజం కూడా అంతే. ఎదుటివాడి డబ్బును బట్టి వారి హోదాను బట్టి- గౌరవించాలో ఈసడించాలో ఆటోమేటిగ్గా డిసైడ్ చేస్తుంది. కొడుకును బాగా చదివించాలనేది తండ్రి ఆశయం. ఇంటి నుంచి బడి అయిదు కిలోమీటర్లు. నడుచుకుంటూ వెళ్లేవాడు. అలా రెండేళ్లు. స్కూల్ కి వెళ్లినా క్లాసులో ఈ కుర్రాడంటూ ఒకడున్నాడు అని గుర్తంచలేదు తోటి పిల్లలు. అలా లాస్ట్ బెంచ్ కే పరిమితమయ్యేవాడు. చాలా బాధపడ్డాడు. కళ్లు లేకపోతే సమాజంలో ఇంత చిన్నచూపా అని ఆవేదన చెందాడు. డబ్బుల్లేని తన పేదరికం గురించి కాదు. మనుషుల స్నేహం లేని పేదరికం గురించి చాలా ఆలోచించాడు. తండ్రి అది గుర్తించాడు. పిల్లాడు ఏం చదవడం లేదని బాధపడ్డాడు. స్కూల్లో అతన్ని ఎవరూ పట్టంచుకోవడం లేదని అర్ధం చేసుకున్నాడు. అతను అనుకున్న ఆశయం నెరవేరాలంటే శ్రీకాంత్ కు ఆల్టర్ నేట్ చూడాలనుకున్నాడు. అంధుల కోసం ప్రత్యేకంగా హైదరాబాదులో ఉన్న బడిలో చేర్పించాడు. అలా శ్రీకాంత్ చదువు బాట పట్టాడు. అటు ఆటలోనూ పుంజుకున్నాడు. క్లాస్ లో టాపర్ కూడా. లీడ్ ఇండియా ప్రాజెక్టు కోసం ఒకసారి మాజీ రాష్ట్రపతి దివంగంత అబ్దుల్ కలాంతో పనిచేసే అవకాశం వచ్చింది. శ్రీకాంత్ కు సైన్స్ సబ్జెక్ట్ అంటే ఇష్టం. కానీ టెన్త్ తర్వాత ఆ సబ్జెక్టు తీసుకుంటామంటే ఇంటర్ బోర్డు ఒప్పుకోలేదు. ఈవెన్ 90 శాతం మార్కులొచ్చినా వీలుకాదన్నారు. ఎందుకంటే చూపులేదు. ఆ ఒక్క కారణంతోనే బోర్డు ఒప్పుకోలేదు. కానీ శ్రీకాంత్ మనసెందుకో ఆర్ట్స్ మీద లేదు. సైన్స్ కోసం 6 నెలలు పట్టుబట్టాడు. చివరికి బోర్డు ఒప్పుకుంది. కానీ ఏమయినా నీదే రిస్కు అని షరతు పెట్టింది.

ప్రతీ అడుగూ రిస్కుతో కూడుకున్నదే

రిస్క్. ఈ పదం శ్రీకాంత్ కు కొత్తకాదు. జీవితంలో ప్రతీ అడుగూ రిస్కుతో కూడుకున్నదే. దాంతో పోల్చుకుంటే ఇదేమంత పెద్దది కాదు. తీసుకున్న నిర్ణయం సరైందే అని నిరూపించాలి. అందుకోసం ఏం చేయాలా అని లోచించాడు. మొదట పాఠ్యపుస్తకాలను ఆడియోలోకి కన్వర్ట్ చేసుకున్నాడు. రాత్రింబవళ్లు శ్రమించాడు. కష్ట ఫలించింది. ఇంటర్ లో 98 శాతం మార్కులు. కాన్ఫిడెన్స్ పెరిగింది. ఐఐటీ, బిట్స్ పిలానీ, టాప్ ఇంజినీరింగ్ కాలేజీలకు ట్రై చేశాడు. కానీ బ్యాడ్ లక్. కనీసం హాల్ టికెట్ కూడా రాలేదు. పైగా నీకు చూపులేదు.. కాబట్టి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయలేవు అని ఒక లెటర్ రాశారు.

MIT కాలేజీ చరిత్రలోనే తొలిసారి

అయినా శ్రీకాంత్ నిరుత్సాహ పడలేదు. యుద్ధం మొదలుపెడితే పొద్దు. అంధత్వం ముందు ఆత్మవిశ్వాసం ఓడిపోవద్దు. పోరాటానికి ఎక్కడా బ్రేక్ పడనీయలేదు. మొత్తానికి సాధించాడు. ఒకటి కాదు. నాలుగు కాలేజీల్లో సీటొచ్చింది. అది కూడా అమెరికాలో. ఎంఐటీ, స్టాన్ పోర్డ్, బెర్కెలీ, కర్నెగీ మెలాన్. అందులో శ్రీకాంత్ MIT ఎంచుకున్నాడు. స్కాలర్ షిప్ కూడా ఇస్తామన్నారు. శ్రీకాంత్ లాంటి అంధ విద్యార్ధి చేరడం MIT కాలేజీ చరిత్రలోనే తొలిసారి.

ఎన్నో ప్రశ్నలు నిద్రపట్టనీయలేదు

బ్యాచిలర్ డిగ్రీ అయిపోతుంటే తర్వాత ఏంటి అనే ప్రశ్న వేధించింది. దాంతో పాటు సమాధానం కోసం తపించే అంశాలు కూడా మస్తిష్కంలో ఎన్నో వున్నాయి. వైకల్యం వున్న ఏ పిల్లాడైనా స్కూల్లో బ్యాక్ బెంచీకే పరిమితం కావాలా? జనాభాలో పదిశాతం ఏదో ఒక వైకల్యంతో బాధపడేవారుంటే -వారిలో అందరికి అందరూ ఆర్ధికంగా అట్టడుగుకు పడిపోవాల్సిందేనా? వాళ్లంతా హుందాగా బతికే అవకాశమే లేదా? వాళ్లకు సమాజంలో హోదా దక్కెదెలా? ఇలాంటివెన్నో ప్రశ్నలు శ్రీకాంత్ ని నిద్రపట్టనీయలేదు.

image


సొంతంగా కంపెనీ పెట్టాలన్న ఆలోచన

ప్రశ్నలన్నిటికీ సమాధానం నేనిస్తాను. బంగారు భవిష్యత్ నేను ప్రసాదిస్తాను. అమెరికా నుంచి రాగానే చేయాల్సిన పని అదే అనుకున్నాడు శ్రీకాంత్. రకరకాల వైకల్యాలతో బాధపడేవారికి పునరావాసం కల్పించాలనుకున్నాడు. అందుకోసం ఒక వేదిక ఏర్పాటు చేశాడు. అందులో మూడువేల మంది చదువు, తదితర వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందారు. మళ్లీ ఇక్కడొక ప్రశ్న. శిక్షణ వరకు బాగానే వుంది. మరి వారి భవిష్యత్ మాటేమిటి? ఉపాధి ఉద్యోగం ఎవరిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానమే సొంతంగా కంపెనీ పెట్టాలన్న లోచనకు దారి తీసింది.

రచయిత పాలో కొయెల్హో అంటాడు.. యోధుడు వెనుకడుగు వేయకూడదు. కష్టకాలంలో రెట్టించిన సహనంతో ఉండాలి అని.

నాలుగు ప్రొడక్షన్ ప్లాంట్స్

శ్రీకాంత్ చేతిలో యిప్పుడు నాలుగు ప్రొడక్షన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటి హుబ్లిలో(కర్నాటక) రెండోది నిజామాబాద్‌లో(తెలంగాణ) ఇంకో రెండు హైదరాబాద్‌లో. మరొకటి సోలార్ ఆధారిత ప్లాంట్ త్వరలో శ్రీసిటీ(ఏపీ)లో నెలకొల్పబోతున్నారు. అది చెన్నయ్‌ కి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏంజిల్ ఇన్వెస్టర్ రవి మంతా రెండేళ్ల క్రితమే శ్రీకాంత్ ని కలిశాడు. అతని వ్యాపార తెలివితేటల్ని, అతడి విజన్‌ని చూసి ముగ్దుడయ్యాడు. అతని కంపెనీలో కొంత ఇన్వెస్ట్ కూడా చేశారు.

హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకప్పుడు చిన్న రేకుల షెడ్డు. అందులో మూడు మిషన్లు. ఎనిమిది మంది పనివాళ్లు. ఆ స్థాయి నుంచి వ్యాపారాన్ని కోట్లకు పరుగులు పెట్టించడం అంటే మాటలు కాదు. అదే అంటాడు రవి. 13 కోట్ల ఇన్వెస్ట్ మెంట్‌ లో భాగంగా ఆల్రెడీ 9 కోట్లు పెట్టాడాయన. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) దిశగా కంపెనీని తీసుకెళ్లాలనేది శ్రీకాంత్ ఆలోచన. 70 శాతం అంధులనే ఉద్యోగులుగా పెట్టుకుని కంపెనీ రన్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. శ్రీకాంత్ కు చూపు లేకున్నా ముందుచూపు ఉందంటాడు రవి. అది కంపెనీకి ఇన్ బిల్ట్‌ గా ఉందంటాడాయన.

ఎదుటివాడు బతకాలి అనుకోవడం దయాగుణం. ఎదుటివాడు కూడా వృద్ధిలోకి రావాలి అనుకోవడం మంచితనం. అందుకోసం మనవంతు సాయం కూడా చేయాలి. డబ్బుతో ఏనాటికీ ధనవంతులం కాలేం. ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో అంతకు మించిన ధనం మనకు అక్కర్లేదు. ఫస్ట్ టైం ముంబైలో పబ్లిక్ స్పీచ్‌ లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు శ్రీకాంత్ చెప్పిన మాటలివే.

ఆంట్రప్రెన్యూర్లు యోధుల్లాంటివారు

మంచి పనికి హద్దులుండవు. ఆంట్రప్రెన్యూర్లు యోధుల్లాంటివారు. వారి గుండె చాలా గట్టిది. రచయిత పాలో కొల్హోయో కోట్స్ శ్రీకాంత్‌ ని ఎప్పుడూ వెంటాడుతుంటాయి. ఆ మాటలే దేనికీ భయపడని తత్వాన్ని నూరిపోశాయి. అయితే ఇక్కడ స్వర్ణతల గురించి కూడా ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆమె ప్రస్తుతం శ్రీకాంత్ ఇండస్ట్రీకి కో ఫౌండర్. అంతేకాదు. స్కూల్లో అతనికి స్పెషల్ టీచర్ కూడా. ఒక మెంటార్‌ గా.. ఒక గైడ్‌ గా అతనితోపాటే జర్నీ చేసిందామె. శ్రీకాంత్ కంపెనీలో ఉద్యోగం చేసేవారందరికీ ఆమే ట్రైనర్‌.

శ్రీకాంత్ ఈరోజు బిలియనీర్. సిరిసంపదలు వస్తాయి పోతాయి. కానీ సంతోషం ఎప్పుడూ ఉండాలి. అంతకు మించిన రిచ్ నెస్ మరొకటి లేదు. ఒకప్పడు తల్లిదండ్రులు కూలీ, నాలి చేసి ఏడాదికి 20 వేలు కూడా సంపాదించలేని కటిక పేదవారు. అలాంటి నేపథ్యం నుంచి తమ కొడుకు ఈ స్ధాయికి వచ్చాడంటే ఏ తల్లిదండ్రులకైనా అంతకంటే ఆనందం ఇంకేముంటుంది?

ఎదుటివాడికి ఏదో ఒక మంచి చేయి. అది నీకు తిరిగి మంచే చేస్తుంది. ఇదే శ్రీకాంత్ నమ్మే సిద్ధాంతం

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags