సంకలనాలు
Telugu

ఆమె ఆకాశాన్ని జ‌యించింది

bharathi paluri
17th Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

దేశంలోని తొలి ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్‌లలో ఒకరు.

ప్రతీ నిమిషం ప్రాణాలతో చెలగాటం.

ఏమరపాటుకు అవకాశమే లేదక్కడ.

పదేళ్లపాటు ఏటిసిగా సమర్ధంగా బాధ్యతలు నిర్వహించిన డా.రమాదేవి


కొంద‌రికి ఎద‌గాల‌నే క‌ల వుంటుంది. మ‌రికొంద‌రికి ఎగార‌ల‌నే క‌ల వుంటుంది. కానీ ఏ క‌లా లేకుండానే ఎగిరే విమానాల‌ను నేల‌మీద‌నుంచే నియంత్రించేంత‌గా ఎదిగారు ర‌మాదేవి. డాక్ట‌ర్ కావాల‌నుకుని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్ గా మారిన రామాదేవి జీవితం... క‌ల‌లు గ‌నే వారికి.. ఆ క‌ల‌లు నెవ‌ర‌డం లేద‌ని బాధ ప‌డేవారికి ఓ ఉద్వేగభ‌ర‌తిమైన‌ పాఠం.

ఆ ఉద్యోగ‌మే అంత‌.. క్ష‌ణాల్లో నిర్ణ‌యాలు తీసుకోవాలి. ఒక్క క్ష‌ణం ఆల‌స్య‌మైనా వంద‌ల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. విమానాలు కుప్ప కూలిపోతాయి. ఆ ఉద్యోగం పేరే ఎటిసి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. క‌త్తిమీద సాములాంటి ఈ ఉద్యోగంలో ఓ మహిళ రాణించ‌డం అంటే మాట‌లు కాదు. పైగా ఈ ఉద్యోగంలో మొద‌టి మ‌హిళ‌గా చేరేట‌ప్పుడు ఆమె ఉద్విగ్న‌త ఎలా వుంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఎందుకంటే, 1992కి ముందు అస‌లు ఈ రంగంలో మహిళ‌ల‌కు ప్ర‌వేశ‌మే లేదు. 1992 జులైలో ఇండియ‌న్ నేవీ మొద‌టి బ్యాచ్ షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్డ్ మ‌హిళా అధికారుల‌ను నియ‌మించింది. కొన్ని ఎంపిక చేసిన బ్రాంచ్‌ల‌లో నియ‌మించిన కొద్ది మంది మ‌హిళ‌ల్లో ర‌మాదేవీ తొట్ట‌త్తిల్ కూడా ఒక‌రు. ఆ విధంగా ఎటిసి గేట్లు మొద‌టి సారిగా ఓ మహిళ కోసం తెరుచుకున్నాయి. అలా తెరిచిన గేట్ల‌లోకి రాజ‌సంగా అడుగుపెట్టారు ర‌మాదేవి.

కేర‌ళ‌లోని త్రివేండ్ర‌మ్ ద‌గ్గ‌ర ఓ మారుమూల ప‌ల్లె నేమ‌మ్. అక్కడ పుట్టి పెరిగిన ర‌మాదేవి, త్రివేండ్ర‌ంలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసారు. గ్రాడ్యుయేష‌న్ త‌ర్వాత ఏం చేయాలి..? ఈ ప్ర‌శ్న‌కు ఆమె ద‌గ్గ‌ర రెండు స‌మాధానాలున్నాయి. ఒక‌టి త‌న తండ్రి లాగా డాక్ట‌ర్ కావ‌డం.. రెండు.. పిజి చేసి విద్యారంగంలోకి వెళ్ళ‌డం. అయితే, అనుకున్న‌ట్టు జ‌రిగితే అది జీవితం ఎందుక‌వుతుంది. ర‌మాదేవి జీవితంలో కూడా అలాంటి అనుకోని ఘ‌ట‌నే జ‌రిగింది.

రమాదేవి తొట్టత్తిల్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్

రమాదేవి తొట్టత్తిల్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్


అనుకోకుండా పుట్టిన ఆలోచన ఇది

ఆ రోజు మ‌ధ్యాహ్నం ర‌మాదేవి సోద‌రుడు తెచ్చిన న్యూస్ పేప‌ర్ ఆమె జీవితాన్ని మ‌రో మ‌లుపు తిప్పింది. నౌకాద‌ళానికి చెందిన ఎయిర్ ట్రాఫిక్ స‌ర్వీసెస్‌లో మ‌హిళ‌ల‌ను నియ‌మిస్తున్న‌ట్టు ఓ నోటిఫికేష‌న్ కు సంబంధించిన పేప‌ర్ క‌టింగ్ అది. ఆమె సోద‌రుడికి ముందు నుంచి సైన్యంలో చేరాల‌నే కోరిక వుంది. అప్ప‌టికే ఎన్‌సిసిలో చేస్తున్న అతను , సైన్యంలో చేరి దేశానికి సేవ చేయ‌డం గురించి, యూనిఫాంలో వుండే గొప్ప‌త‌నం గురించి చెప్తుంటే, ర‌మాదేవి మ‌న‌సులో కూడా ఎలాగైనా యూనిఫాం జాబ్ చేయాల‌నే కోరిక బ‌ల‌ప‌డింది. దాంతో ఆమె ఆ ఇంట‌ర్వ్యూకి అప్లై చేసింది.

అంతే.. అనుకున్న‌దే త‌డ‌వుగా ఆమె భోపాల్ ట్రెైన్ ఎక్కేసింది. అష్ట‌క‌ష్టాలు ప‌డి, ర‌క‌ర‌కాల టెస్టులు, ఇంట‌ర్వ్యూలు దాటుకుంటూ చివ‌రికి అత్యంత కీల‌క‌మైన మెడిక‌ల్ టెస్ట్ కూడా క్లియ‌ర్ చేసి మెరిట్ లిస్ట్ లో చోటు సంపాదించారు. అంతే, ఆమె క‌ల‌గ‌న్న ఎటిసి ఉద్యోగం అపాయింట్‌మెంట్ లెట‌ర్ ఇప్పుడు ఆమె చేతిలో వుంది.

దేశంలో ఎటిసి గా నియ‌మితులైన మొద‌టి ముగ్గురు మ‌హిళ‌ల్లో ర‌మాదేవి కూడా ఒక‌రు. 1993 ఆగ‌స్టు 9న ఆమె గోవాలోని నావ‌ల్ అకాడెమీలో అడుగుపెట్టారు. ఆ మొద‌టి రోజు ఉద్వేగం మాట‌ల్లో చెప్ప‌లేం. అయితే, ఆ త‌ర్వాత ఆమె పొందిన‌ క‌ఠినాతి క‌ఠిన‌మైన క‌ఠోర శిక్ష‌ణ ఆమెను మ‌రింత శ‌క్తిమంత‌మైన మ‌హిళ‌గా తీర్చి దిద్ది, స‌రికొత్త ర‌మాదేవిగా మార్చి దేశ‌ర‌క్ష‌ణ‌కు ధీటైన సైనికురాలిగా నిల‌బెట్టింది.

అప్ప‌టి దాకా , ఈ ఎక్స‌ర్‌సైజులు, డ్రిల్స్, పెరేడ్స్, వెప‌న్స్ .. ట్రెయినింగ్ సెష‌న్స్ .. ఇవ‌న్నీ .. మ‌గమ‌హారాజుల కంచుకోట‌లు. ఆ కోట‌ను బ‌ద్ద‌లు కొట్టి వారితో స‌మానంగా రాణించింది.. ఈ మొద‌టి మ‌హిళా బ్యాచ్.

ఈ ట్రెయినింగ్ తరువాతి రోజుల్లో ఓ చ‌రిత్ర కాబోతోంద‌ని అప్ప‌ట్లో వారికి తెలియ‌దు. ఇప్పుడు గుర్తు చేసుకుంటే, అదంతా ఓ అద్భుత‌మైన క‌ల‌లా అనిపిస్తుంది. ప్రాక్టిక‌ల్స్‌లోఅత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచినందుకు ట్రోఫీ గెలుచుకోవ‌డం, అస‌లు గ‌త అనుభ‌వం ఏమాత్రం లేక‌పోయినా.. క్లాస్‌లో అంద‌రికంటే ముందుండ‌డం, .. ఇవ‌న్నీ ర‌మాదేవికి మ‌ర‌పురాని తీయ‌ని జ్ఞాప‌కాలు.

అక్కడ ప్రతీ క్షణం.. ప్రాణాలతో చెలగాటం

“ సైన్యంలో వుండే క్ర‌మ శిక్ష‌ణ అంటే ఏంటో గోవాలోని నావ‌ల్ అకాడెమిలో క‌ఠోర శిక్ష‌ణ నాకు నేర్పించింది. అక్క‌డి నుంచి ఎయిర్ ఫోర్స్ అకాడెమికి వ‌చ్చాక మ‌న ఆకాశం , దాన్ని అనుక్ష‌ణం కాపాడే మ‌న సైన్యం, వారు ఉప‌యోగించే యుద్ధ విమ‌నాలూ ప‌రిచ‌య‌మ‌య్యాయి. ఇక అక్క‌డ మొద‌టి మ‌హిళా కంట్రోల‌ర్ కావ‌డం ఓ ఉద్విగ్నఅనుభూతి. ఎందుకంటే, ఒక్క చిన్న పొర‌పాటుకూడా చేయ‌డానికి వీల్లేని ఆ వాతావ‌ర‌ణంలో ప్ర‌తిరోజూ ఓ కొత్త అనుభ‌వ‌మే. ఒక ప‌క్క ఆకాశంలో యుద్ధ‌విమానాలు ఎగురుతుంటే, ఇక్క‌డ కంట్రోల్ ట‌వ‌ర్‌లో ప‌రిస్థితి ఏ ఇంగ్లీష్ యాక్ష‌న్ సినిమాలో టెన్ష‌న్ కి తీసిపోదు. ఇటు రాడార్లు మిణుకు మిణుకు మంటుంటాయి. అటు కంట్రోల‌ర్, పైల‌ట్ల మ‌ధ్య అనుక్ష‌ణం కమాండ్స్ న‌డుస్తుంటాయి. ప‌రిస్థితి క్ష‌ణ‌క్ష‌ణానికి మారిపోతుంటుంది..”

image


ఏవియేష‌న్ అంటేనే పొర‌పాట్ల‌కు అవ‌కాశం లేని రంగం. ఇక్క‌డ ప్రోసెస్ ను పాటించ‌డం, ప్రాసెస్ ను గౌర‌వించ‌డం అత్యంత కీల‌క‌మైన విష‌యాలు. ఫైట‌ర్ ఎయిర్ క్రాఫ్ట్ ఆప‌రేష‌న్స్‌ను హ్యాండిల్ చేసే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్ ఉద్యోగమంటే, ప్ర‌పంచంలోనే అత్యంత ఒత్తిడికి గుర‌య్యే ఉద్యోగాల్లో ఒక‌టని చెప్తారు. ఎందుకంటే, ఇక్క‌డ క్ష‌ణ క్ష‌ణం జీవ‌న్మ‌ర‌ణ స‌వాలే. గంద‌ర‌గోళ ప‌రిస్థితుల్లో కూడా మ‌నో నిబ్బ‌రంగా వుండ‌డం, గ్రౌండ్‌లో ఎంత క్లిష్ట ప‌రిస్థితులు వున్నా.. అది పైల‌ట్ల‌కు తెలియ‌కుండా వారితో మాట్లాడ‌డం, కంట్రోల‌ర్ ముందుండే రెండు కీల‌క స‌వాళ్ళు. 1993 నుంచి 2003 వ‌ర‌కు ప‌దేళ్ళు ఈ స‌వాళ్ళ‌ను అత్యంత విజ‌య‌వంతంగా అధిగ‌మించి ఎటిసి గా రాణించారు ర‌మ‌దేవి.

అయితే, మహిళా అధికారుల‌ను దీర్ఘ‌కాలం కొనసాగించే అవ‌కాశాలు నౌకా ద‌ళంలో లేక‌పోవ‌డంతో, ప‌దేళ్ళ కాంట్రాక్ట్ ముగిసాక ర‌మాదేవి నేవీ నుంచి ఎక్స్ స‌ర్వీస్ విమెన్‌గా బ‌య‌టికి వ‌చ్చారు. నిజానికి పెన్ష‌న్, త‌దిత‌ర స‌దుపాయాలు వ‌దులుకుంటే, ప‌ద్నాలుగేళ్ళు ఉద్యోగంలో కొన‌సాగ‌వ‌చ్చ‌ని ఆమెకి ఓ ప్ర‌తిపాద‌న వ‌చ్చినా.. ఆమె దానిని కాద‌నుకుని, ఉద్యోగాన్ని వ‌దులుకోవ‌డానికే సిద్ధ ప‌డ్డారు.

నేవీ ఆఫీసర్ నుంచి హెచ్.ఆర్. మేనేజర్‌గా

సైన్యం నుంచి బ‌య‌టికొచ్చాక ఆమె కార్పొరేట్ ప్ర‌పంచంలో అడుగుపెట్టారు. ఒక యుకె బేస్డ్‌ మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీలో HR అధికారిగా ఆమె కార్పొరేట్ కెరీర్ మొద‌లైంది. ఆ త‌ర్వాత ఆమె ప‌లు IT, ITES కంపెనీల్లో హెచ్ ఆర్ బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఓ లిక్క‌ర్ కంపెనీలో హెచ్ ఆర్, ఇండ‌స్ట్రియ‌ల్ రిలేష‌న్స్ అధికారిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌డం ఆమె కెరీర్ లో అత్యంత చాలెంజింగ్ ఉద్యోగం అని చెప్పొచ్చు. ఇటు ఉద్యోగుల‌తో, అటు ప్ర‌భుత్వ ఎక్సైజ్ అధికార‌ల‌తో, డీల్ చేయడం.. అనేక కార్మిక చట్టాల‌తో ముడిప‌డిన అంశాల‌ను నిర్వ‌హించ‌డం ..అన్నీ క‌లిపి ఈ ఉద్యోగం ఆమె కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచింది.

ఆ త‌ర్వాత ఆమె మ‌ళ్ళీ ఐటి రంగానికి మారిపోయారు. ప్ర‌స్తుతం ఆమె బెంగ‌ళూరులోని ఐటిసి ఇన్ఫోటెక్ సంస్థలో గ్లోబ‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ విభాగాధిప‌తిగా వున్నారు.

నౌకాద‌ళానికే చెందిన క‌మాండ‌ర్ మోహ‌న్ రాజ్ (రిటైర్డ్) ను ఆమె వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వారికి ఇద్ద‌రు కుమార్తెలు. గ‌గ‌నాన్ని నియంత్రించ‌డం, మాన‌వ‌వ‌న‌రుల్ని నిర్వహించడం కాకుండా ఆమెకు పెయింటింగ్, సంగీతం, పుస్త‌కాలు చ‌ద‌వ‌డం లాంటి మ‌రికొన్ని అభిరుచులు కూడా వున్నాయి. విప‌రీతంగా చ‌దివే అల‌వాటున్న ర‌మాదేవి కెరీర్ ప‌రంగా అనేక బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. దీనంత‌టికీ ఆమె చెప్పే స‌క్సెస్ సీక్రెట్ ఒక‌టే. మ‌నసు చెప్పిన‌ట్టు విన‌డం. స్థల..కాల‌..శ‌క్తియుక్తుల‌ను స‌మ‌న్వ‌య ప‌రుచుకుని ఇటు ప‌నిని, అటు అభిరుచిని కూడా నెర‌వేర్చుకోవ‌చ్చ‌ని ఆమె నిరూపించారు. నిజానికి ఆమెకి ప‌ని, కుటుంబం, జీవితం ఇవ‌న్నీ వేరు వేరు కావు. అన్నిటినీ ఒకేలా చూసేవారు క‌నుక‌, వీటిని బేల‌న్స్ చేయ‌డ‌మ‌నేది ఆమెకు పెద్ద క‌ష్టం కాలేదు. 

“ నాకున్న బాధ్య‌త‌ల్లో దేంట్లోనూ నేనొక సూప‌ర్ విమ‌న్ గా ఫీల‌వ్వ‌ను. నా లోపాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ, వాటిని స‌రిదిద్దుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాను.” అంటారు ర‌మాదేవి.

ఇన్ని బాద్య‌త‌లు నెర‌వేరుస్తూ కూడా ఆమె ఆట‌విడుపుగా మ‌రో కిరీటాన్ని కూడా ధ‌రించారు. మిసెస్ చెన్నై 2008-విమెన్ ఆఫ్ స‌బ్‌స్టెన్స్ కాంపిటీష‌న్ లో పాల్గొని ర‌న్న‌ర‌ప్‌గా నిలిచారు..

నీకు నీ క‌ల‌లు నెర‌వేర‌డానికీ మ‌ధ్య అడ్డుగా నిలుస్తున్న‌ది నువ్వే.. అని ర‌మాదేవి నమ్ముతారు. “ క‌ల‌లు నెర‌వేర‌తాయి. మిగ‌తా ప్ర‌పంచం అంతా నిన్ను నిరుత్సాహ‌ప‌రిచినా, నిన్ను న‌మ్మ‌క‌పోయినా, నీ క‌ల మీద నీ న‌మ్మ‌కం స‌డ‌లిపోకూడ‌దు. నిరుత్సాహ‌ప‌డ‌కూడ‌దు.. క‌ల మీదే దృష్టి నిలిపి, దాన్ని సాకారం చేసుకోవ‌డానికి కృషి చేస్తే, అది నెర‌వేరి తీరుతుంది.” అంటారు ర‌మాదేవి. దానికి ఆమె త‌న జీవితాన్నే ఉదాహ‌ర‌ణ‌గా చెప్తారు.

image


“సాధార‌ణ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన నేనే మ‌గాళ్ళ కంచుకోట‌లోకి ప్ర‌వేశించి మ‌గ సైనికుల‌ను ముందుండి న‌డిపించి, ఫైట‌ర్ విమానాల‌ను కంట్రోల్ చేసానంటే, ఇక ఈ త‌రం అమ్మాయిలు త‌ల‌చుకుంటే, ప్ర‌పంచం కొమ్ములు వంచి తామ‌నుకున్న‌ది సాధించుకోగ‌ల‌రు. ”.. అంటారు ర‌మాదేవి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags