సంకలనాలు
Telugu

విండో షాపింగ్‌లో వినూత్న విజయం - 'డిస్కౌంట్ బాక్స్'

Madhusri
25th Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడం అన్నది దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. నేడు ప్రపంచంలో డాట్ కామ్ బూమ్ చాలా పెద్దదిగా ఉందని మీరు అనుకోవచ్చు. కానీ వాస్తవంగా చూస్తే ఇందులో చాలా కొత్తదనం ఉంది. కొత్త వ్యాపారాలు, కొత్త వెంచర్లు, కొత్త వ్యక్తులు, నవీనమైన ఆలోచనలు... అన్నీ గోచరిస్తాయి. ఇలా కొత్త వ్యాపార ఆలోచనలను స్టార్టప్ వేదికగా మీకు పరిచయం చేస్తున్నాం. అలాంటిదే ఓ విన్నూత్న ఆలోచన మీ ముందుకు తెస్తున్నాం.

నేటి కాలంలో విండో షాపింగ్ అన్నది ప్రతి ఒక్కరికీ అలవాటైపోయిన వ్యవహారంగా మారింది. ఇన్నాళ్లూ ఒక వస్తువు కోసం పది షాపుల్లో తిరిగి, ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందో అక్కడ కొనుక్కునేవాళ్లం. ఇప్పుడు కూడా పది వెబ్ సైట్లలో తిరిగి ఎందులో తక్కువకు దొరుకుతుందో, ఏ సైట్లో ఎక్కువ డిస్కౌంట్ ఉందో తెలుసుకుని చివరికి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాం. కానీ ఈ ప్రక్రియలో పదేసి వెబ్ సైట్లు బ్రౌజ్ చేస్తూ ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాం. ఈ ఇబ్బందిని తప్పించడానికి వచ్చిన విన్నూత్న ఆలోచనే డిస్కౌంట్ బాక్స్ డాట్ ఇన్.

image


పుణే కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించిన డిస్కౌంట్ బాక్స్ డాట్ ఇన్ ఆన్ లైన్లో ఉన్న ఆఫర్లతో పాటు, మార్కెట్లో ఉన్న ఆఫర్లను కూడా కలగలిపి అవి అవసరమైన కస్టమర్ల కోసం ఒకే చోట చేర్చింది. దీనికోసం వాళ్లు అనుసరించిన విధానం కూడా సులువైనదే. ఆన్ లైన్ ఈ కామర్స్ సైట్లలో ఉన్న ఆఫర్లతో పాటు, మార్కెట్లో వివిధ సంస్థల వద్ద డిస్కౌంట్లను కూడా ఒకే చోట చేర్చింది. వినియోగదారులు ఈ సైట్ ను బ్రౌజ్ చేసి వారికి కావాల్సిన డిస్కౌంట్లు పొందవచ్చు. అంటే అది ల్యాప్ ట్యాప్ కావచ్చు. కారు కావచ్చు. ఫర్నిచర్ లేదా గ్రోసరీలు కావచ్చు. వినియోగదారులు డిస్కౌంట్ బాక్స్ ను బ్రౌజ్ చేయడం ద్వారా... ఏ స్టోర్, మాల్ లేదా ఏ వెబ్ సైట్లో తాము కోరుకుంటున్న వస్తువుకి ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుందో ఇట్టే తెలిసిపోతుంది. అంతేకాదు ఆ వస్తువు వివరాలతో పాటు, సదరు షాప్ లోకేషన్, ఇతర వివరాలు కూడా అక్కడే ఉంటాయి. ఈ డిస్కౌంట్ బాక్స్ సైట్లో ఆన్ లైన్ , ఆఫ్ లైన్ లలో ఉన్న ప్రత్యేక ఆఫర్లతో పాటు, సాధారణ ఆఫర్ల వివరాలు కూడా ఉంటాయి.

అమోల్ గోర్మడే అనే కంప్యూటర్ ఇంజినీర్, యామిని ధోటే అనే టెక్నాలజీ పిపాసులిద్దరూ కలసి దీనికి ప్రాణం పోశారు. యామిని తన వివాహం అయ్యాక ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ కొనేందుకు పడ్డ శ్రమ నుంచి ఈ ఆలోచనకు బీజం పడింది. ఆ రోజు యామిని... ఫర్నిచర్ కొనేందుకు హోమ్ టౌన్, హోమ్ స్టాప్, హౌస్ ఫుల్ వంటి షాపులన్నీ తిరిగింది. అయినా ఆమెకు మంచి ధరలో ఎక్కడ దొరుకుతున్నాయో లేదో అర్థం కాలేదు. అలా కాళ్లరిగేలా తిరిగిన నాటి నుంచి ఇప్పుడు ఆమె దగ్గర సిటీలో ఉన్న 700 షాపులు, వ్యాపారులు ఆఫర్లతో ఈ సైట్లో రిజిస్టర్ అయి ఉన్నారు.

యామిని ధోటే

యామిని ధోటే


ఇప్పుడీ స్టార్టప్ కంపెనీ... డీల్స్ విషయంలో ముందంజలో ఉంది. ఎందుకంటే... ఈ సైట్లో అపెరల్స్ అండ్ యాక్ససరీస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్, హోమ్ అప్లయన్సెస్, హోటల్స్, రెస్టారెంట్స్, స్పోర్ట్స్ అండ్ ఫిట్ నెస్, ట్రావెల్ ఇలా ఎన్నో ఆప్షన్లున్నాయి. అమర్ చిత్రకథ, హోళి, ఆస్తేకర్ జ్వెల్లర్స్, ఫ్లిప్ కార్ట్, సాయి ఇన్వెస్ట్ మెంట్స్, థైరోకేర్, మార్వెల్ సాఫ్ట్ టెక్నాలజీస్ తో పాటు మరింత మంది వాళ్లకు కస్టమర్లుగా ఉన్నారు.

ఈ డిస్కౌంట్ బాక్స్ ముఖ్య లక్ష్యం ఏంటంటే... సాధారణ షాపులు, షోరూంలలో ఉన్న ఆఫర్ల పూర్తి సమాచారాన్ని సేకరించి ఓ క్రమపద్ధతిలో ఇవ్వడమే. ఇప్పుడు మనం షాపుల్లో కొనుగోలు చేస్తున్న ఆఫర్ల గురించి ఆన్ లైన్లో ఎక్కడా పెద్దగా సరైన సమాచారం ఉండటం లేదంటారు అమోల్. 

ప్రస్తుతం కేవలం ఇద్దరు ఉద్యోగులతో పుణెలో ఈ సంస్థను నడిపిస్తున్నారు ఈ వ్యవస్థాపకులిద్దరూ. ఈ బృంద సభ్యులు ఆన్ లైన్, ఆఫ్ లైన్, రిటైలర్లను సంప్రదించి...ఈ వెబ్ సైట్ వారికి ఎలా ఉపయోగపడుతుందో, ఈ వెబ్ సైట్ ఎలా పనిచేస్తుందో వివరిస్తారు. ఇది చాలా విభిన్నమైన, కొత్త ఆలోచన కాబట్టి వాళ్లు కచ్చితంగా దీని మీద సైన్ చేస్తారు. ఇందులో తమ వివరాలు పెట్టిన కొందరు కస్టమర్లు వారి అనుబంధ కార్యక్రమాల గురించి కూడా ఇందులో వివరాలిస్తారు. అమోల్ చెప్పిన దాని ప్రకారం... డిస్కౌంట్ బాక్స్ అన్నది డీల్స్, కూపన్స్ ఇచ్చే వెబ్ సైట్లతో ఏ మాత్రం పోటీ పడదు. ఎందుకంటే అలా చేయడం ద్వారా అది శాప్‌లో రియల్ టైమ్ ఆఫర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో తమ పోటీని తగ్గించుకున్నట్లు అవుతుంది.

అమోల్ గోర్మడే

అమోల్ గోర్మడే


ఇలా ఆఫర్లను ప్రమోట్ చేయడానికి మేం ఒక కొత్త విధానం పరిచయం చేశారు. డీల్ వివరాలను అందించడంతో పాటు, కస్టమర్లు ఎంత మేర సంతృప్తి చెందుతున్నారన్న వివరాలు కూడా అందిస్తామంటున్నా అమోల్. ఇక రిటైలర్ కోణం నుంచి చూస్తే, డిస్కౌంట్ బాక్స్ అనేది క్లౌడ్ ఆధారిత ఆఫర్స్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ. దీంతో ఆఫర్లను మేనేజ్ చేసుకునే టూల్స్‌తో పాటు, వాటి గురించి పూర్తి విశ్లేషణలు కూడా అందుతాయి.

రిటైలర్లకు కూడా దీని నుంచి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎందుకంటే డిస్కౌంట్ బాక్స్ వారికి క్లౌడ్ ఆధారిత సేవలు అందిస్తుంది. దీనివల్ల వాళ్లిచ్చే ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి పూర్తి స్థాయి విశ్లేషణలు అందుతాయి. అంతే కాదు డిస్కౌంట్ బాక్స్... రిటైలర్లకు, బ్రాండ్ మేనేజర్లకు, వాళ్లిచ్చే ఆఫర్ల గురించి క్షేత్రస్థాయి వాస్తవాధారిత సమాచారం అందిస్తుది. దీనివల్ల వాళ్లు తమ డిస్కౌంట్ల గురించి కాలనుగుణంగా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం దక్కుతుందంటారు అమోల్.

image


డిస్కౌంట్ బాక్స్.. రిటైలర్లకు పాయింట్ ఆఫ్ సేల్ సాఫ్ట్‌వేర్ తో కూడిన REST API వంటి టూల్స్ కూడా డెవలప్ చేస్తోంది. అంతే కాదు.. ఒక మెబైల్ యాప్ ను కూడా తయారు చేస్తోంది.

ఈ స్టార్టప్ గుగూల్ యాడ్ వర్డ్స్, ఫేస్ బుక్ లపై ప్రకటనలు ఇవ్వడం ద్వారా ప్రతి నెలా దాదాపు నాలుగు లక్షల మంది విజిటర్స్‌ను సంపాదిస్తోంది. ఇందులో మూడు విధానాల్లో రెవెన్యూ వస్తుంది.

  • 1) సబ్ స్క్రిప్షన్ బేస్డ్ మోడల్ : ఇది డిస్కౌంట్స్ బాక్స్ ద్వారా కస్టమర్లకు చేరువై తమ ఉత్పాదనల గురించి ప్రమోషన్, విశ్లేషణ చేయడం ద్వారా పెద్ద బ్రాండ్స్, పెద్ద రిటైలర్స్ నుంచి రుసుం వసూలు చేస్తుంది
  • 2) కమిషన్ బేస్డ్ మోడల్ : మిగిలిన ఈకామర్స్ వెంచర్ల మాదిరిగా ఆన్ లైన్లో కూపన్లు అమ్మడం, ఈ విధానంలో సదరు ఆఫర్లను ఎవరైనా వినియోగించుకుంటే... డిస్కౌంట్ బాక్స్ ఆ సంస్థ నుంచి కొంత రుసుము వసూలు చేస్తుంది.
  • ౩) ఇక ఎవరైనా తమ ఆఫర్ల గురించి డిస్కౌంట్ బాక్స్ లో వివరాలు, ప్రమోషన్ చేయాలనుకుంటే అది ఉచితంగా చేసుకోవచ్చు.

అమోల్ చెప్పేదేంటంటే... ఈ డిస్కౌంట్ బాక్స్ అన్నది ఒకే వేదికపై ఎన్నో రకాల బ్రాండ్స్ మరియు రిటైలర్లకు వాళ్ల ఉత్పాతదన ప్రయోజితాలే కాకుండా, దానికి సంబంధించి విశ్లేషణలు కూడా అంది, వాళ్ల బ్రాండ్స్ ఎక్కువ పాపులర్ అవుతాయి. ఇందుకోసం కేవలం ఒక్కసారి వాళ్ల ఉత్పతాదన వివరాలు అప్ లోడ్ చేస్తే చాలు.. మా దగ్గరున్న డేటాబేస్ ఆ వివరాల ఆధారంగా ప్రమోషన్లు, ఇతర విశ్లేషణలు చేస్తుందంటారు అమోల్. ప్రస్తుతానికి అమోల్ తమ ప్రాజెక్టుని మరింత అభివృద్ధి చేసేందుకు కావాల్సిన అదనపు ఫండింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags