ఐటిలో కాదు మనుషుల్లో విప్లవం రావాలి - విశాల్ సిక్కా

ఐటిలో కాదు మనుషుల్లో విప్లవం రావాలి - విశాల్ సిక్కా

Wednesday April 15, 2015,

3 min Read

‘‘ డిజిటల్ రూపాంతరం మా క్లయింట్ల వ్యాపార శైలినే మార్చేస్తోంది. మా వ్యాపారానికి కూడా అదే సూత్రం వాడాలని వ్యూహరచన చేస్తున్నాం. జీవిత కాల అధ్యయన ప్రక్రియకు… అర్థవంతమైన పనితీరుకు మా పని పద్ధతుల్లో వేగాన్ని పెంచేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. ’’.. ఇన్ఫోసిస్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విశాల్ సిక్కా అన్న మాటలివి..
విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సిఈఓ

విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సిఈఓ


విశాల్ సిక్కా బాధ్యతలు చేపట్టిన తొలి త్రైమాసికంలోనే ఇన్ఫోసిస్ రెవెన్యూలో 4.5 శాతం వృద్ధి రేటు నమోదైంది. నికర లాభం 7.3 శాతం పెరిగింది. కంపెనీతో పాటు తానూ సక్రమ మార్గంలోనే ఉన్నామని అప్పుడే విశాల్ సిక్కాకూ నమ్మకం కుదిరింది.

2014 జూన్లో విశాల్ సిక్కాను సీఈఓగా నియమించినప్పుడు కంపెనీ బోర్డ్ నిజంగానే అద్భుతాలను ఆశించింది. ఐబీఎంకు కొత్త ఊపిరి పోయడంలో లూ గెస్ట్‌నర్ చూపిన నాయకత్వ లక్షణాలను విశాల్ దగ్గర ఉన్నాయని నమ్మింది. రెండోసారి నారాయణ మూర్తి .. స్టీవ్ జాబ్స్ తరహాలో పనిచేయలేకపోయారని గుర్తించింది. అయితే వాళ్లందరి ఆశలకు మించి వంద రోజుల్లోనే విశాల్ సిక్కా కంపెనీ స్వరూపాన్ని మార్చేశారు. ఐటీ రంగంలో కొత్త అవగాహనకు నాంది పలకాలని.. మానవ విప్లవంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. దార్శనికుడు సిక్కా.. ఇన్ఫోసిస్‌తో పాటు ఐటీ రంగ భవిష్యత్తుపై సీబిట్ – ఇండియా ప్రతినిధితో పంచుకున్న అభిప్రాయాల్లో కొన్నింటిని తప్పకుండా తెలుసుకోవాల్సిందే.

ఆటమ్స్ నుంచి బిట్స్ వైపు మారుతున్నాం


మన చుట్టూ ఉన్న ప్రపంచం, మన సాఫ్ట్ వేర్…. ఐటీతోనే ఒక స్వరూపానికి వచ్చిందని సిక్కా నమ్ముతారు. బీయింగ్ డిజిటల్ అనే గ్రంధ రచయిత నికోలస్ నెగ్రోపాంటే కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తారు. ఈ సరికొత్త ఆలోచన విలక్షణమైన వేగంతో పరుగులు తీస్తోందని ఆయన చెబుతారు. వాద ప్రతివాదాలు ఇప్పుడు మానవుడి భుజస్కందాలపైనే ఉన్నాయి. అందులో మార్పులు ఖాయం. బహుళ సమాచార ప్రిక్రియలో మాట్లాడటం, చూపించడం, చూడటం కూడా భాగమే. ఇదీ ముఖాముఖీగా మనుషుల మధ్య మాటామంతీకి దారి తీస్తుంది.సమాచారంలోని అణుప్రాయమైన లక్షణం కూడా ఇలాంటిదే. గ్రాఫిక్స్‌లోని సూక్ష్మమైన పిక్సెల్ అదే తరహాలో పనిచేస్తుంది. దీన్నే బిట్ అని కూడా అంటారు. బిట్ కు రంగు, పరిమాణం, బరువు ఉండవు. ఇదీ కాంతి వేగంతో ప్రయాణిస్తుంది. సాఫ్ట్ వేర్.. ఐటీతో సాధికారమైన ఈ ప్రపంచం, నిర్ణయాలు తీసుకోవడంలోనూ, మేథో ప్రవర్తనతో సమర్థతను పెంచుకోవడంలోనూ బాధ్యత వహిస్తుంది.


టెడ్ టాక్‌లో విశాల్ సిక్కా

టెడ్ టాక్‌లో విశాల్ సిక్కా


సీఈఓగా వంద రోజులు

ఇన్పోసిస్ సీఈఓగా బాధ్యతలు చేపట్టేందుకు ముందు విశాల్ సిక్కా… శాప్ లో సీటీఓగా పనిచేశారు. ఐటీ ప్రపంచాన్ని ఆయన రెండు భాగాలుగా వర్గీకరిస్తారు. సాఫ్ట్ వేర్ రంగం ద్వారా ఈ ప్రపంచానికి కొత్త స్వరూపాన్నిచ్చి వేగం పెంచేందుకు అవకాశాలు కల్పించేది మొదటిది. ఐటీ పరిశ్రమ తిరోగమన మార్గంలో పయనిస్తున్న తీరు రెండోది. తక్కువ వేతనాలతో మిడిమిడి జ్ఞానమున్న ఉద్యోగులను తీసుకోవడమే ఇందుకు కారణం. వారికి శిక్షణ లోపించడం కూడా నాణ్యత తగ్గిపోవడానికి కారణమని సిక్కా అంటున్నారు. క్లయింట్స్ తో కలిసి పనిచేస్తే సేవలు మరింత మెరుగవుతాయని విశాల్ అంచనా వేస్తున్నారు. వేతనాల తగ్గింపు, సిబ్బంది పెంపు వల్ల ప్రయోజనం లేదని ఆయన విశ్లేషణ. సరికొత్త పద్ధతులు డిజైన్లతో కొత్తదనాన్ని సృష్టించడం ద్వారా సమస్యల పరిష్కారం సాధ్యమని ఆయన అంటారు. తక్కువతో ఎక్కువ కోసం ఎక్కువ పనిచేయాలి. భవిష్యత్తు ప్రపంచం… నాయకత్వం కోసం మాత్రమే భారత్ వైపు చూస్తుందే తప్ప చవకబారు ఆలోచనల కోసం కాదని సిక్కా ఘంటాపదంగా చెబుతున్నారు…

ఇన్ఫోసిస్ లో కొత్తదనమేంటి ?

ఎ) భాగస్వామ్యం – ఐటీ రంగంలో ఎన్నో ప్రాధమికమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మౌలిక సదుపాయాల రంగంలో సరికొత్త సమర్థతలతో…. ఐటీ రంగ విస్తరణ పరిమితులు పెరిగిపోవడంతో కొత్త వ్యవస్థలను నిర్మించే అవకాశం వచ్చింది. ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు హిటాచీ, అమెజాన్, మైక్రోసాఫ్ట్, హుఆవే లాంటి మార్కెట్ లీడర్స్ తో ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

బి) ఇన్ఫోసిస్ సమాచార ప్లాట్‌ఫాం – సాఫ్ట్‌వేర్‌తో జీవితాలు ముడిపడి ఉన్న ఫ్లాట్‌ఫాం ప్రపంచంలో మనం జీవిస్తున్నామని చెప్పేందుకు సందేహం అక్కర్లేదు. అనేక అనుసంధానాలతో పెట్టుబడిదారుల అవసరాలను తీర్చే ఓపెన్ సోర్స్‌ ఫ్లాట్‌ఫాంను ఇన్ఫోసిస్ రూపొందించింది. ప్రస్తుతం ఈ ఫ్లాట్‌ఫాంలో 4౦ మంది క్లయింట్స్, డజను ప్రాజెక్టులు ఉన్నాయి.

సీ) యాప్స్ – ఆఫ్ షోర్- ఆన్ షోర్ ఐటీ మోడల్ స్థానంలో త్వరలో అత్యుత్తమ సొల్యూషన్ మోడల్ వస్తుందని విశాల్ సిక్కా చెబుతున్నారు. ఒక్కో పరిశ్రమకు అవసరమైన యాప్స్‌తో బాటు ఇంతవరకూ యాప్స్‌ లేని పరిశ్రమలు కూడా రంగంలోకి వస్తాయి. ఐటీతో పాటు సేవల రంగాన్ని అందులో భాగమైన ఇన్పోసిస్‌ను శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు కొత్త పరిధులతో క్రియాశీలంగా పనిచేయడం ఖాయమై పోయింది.

ప్రపంచంలో మరింత మంది పెట్టుబడిదారులు కావాలని విశాల్ సిక్కా ఎదురు చూస్తున్నారు. ఆయన దృష్టిలో మెజార్టీ జనాభా వేరు, పెట్టుబడిదారులు వేరు. '' పెట్టుబడిదారుడు నమ్మిందే చూడాలి.. చూసిందే నమ్మడం వల్ల ప్రయోజనం లేదని సిక్కా అంటారు. పనితీరును మెరుగుపరుచుకునేందుకు, అవకాశాలను పొందేందుకు నిస్సంకోచంగా సలహాలివ్వాల్సిన మనం… ఎంతో నమ్రతగా ఆదేశాలు పాటిస్తున్నామని'' ఆయన విశ్లేషించారు.

విశాల్ సిక్కా తన నాలుగేళ్ల వయస్సులో హరిత విప్లవాన్ని కళ్లారా చూశారు. ఎం.ఎస్.స్వామినాథన్ నేతృత్వంలో హరిత విప్లవం మనకు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని ప్రసాదించింది. దానితో పాటుగా ఆహార ధాన్యాలను ఎగుమతులు చేసే స్థాయికి మనల్ని తీసుకెళ్లింది. అలాంటి విప్లవమే మళ్లీ రావాలని సిక్కా కోరుకుంటున్నారు. అయితే అది కొత్తదనాన్ని సృష్టించే విప్లవం కావాలని ఆకాంక్షిస్తున్నారు. మనం మానవ విప్లవం వైపు అడుగులు వేయాలని సిక్కా పిలుపునిస్తున్నారు. డ్రోన్లు లేదా ఇతర గాడ్జెట్స్‌తో నింపేసే విప్లవం అవసరం లేదంటున్నారు. మెరుగైన టెక్నాలజీని వృద్ధి చేసుకునే విప్లవం కావాలంటున్నారు.