సంకలనాలు
Telugu

మీ స్టార్ట‌ప్ కు బూస్ట‌ప్ కావాలా..!?

vennela null
22nd Mar 2016
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share


చదువు... ఆ తర్వాత కార్పొరేట్ ఉద్యోగం.. ఆరంకెల జీతం..

ఆ తర్వాత పెళ్లి.. పిల్లలు.. వాళ్ల చదువులు..

ఇదొక టిపికల్ కుటుంబరావ్ జీవితం. 

అదంతా గతం. ఇప్పుడు సీన్ మారింది.. 

చదువు అయిపోగానే ఉద్యోగం చేయాలనే ఉత్సాహం యువతలో లేదు. కొత్త ఐడియా కోసం మేథోమథనం చేస్తున్నారు. స్టార్టప్ అనే మంత్రాన్ని జపిస్తున్నారు. జీవితాన్ని వ్యాపారం అనే ఎస్కలేటర్ మీద నడిపించాలని తహతహలాడుతున్నారు. అయితే అదంత సామాన్యమైన విషయం కాదు. స్టార్టప్ ఆలోచన రావడం వేరు.. దాన్ని వటవృక్షంలా ఎదిగేలా చేయ‌డం వేరు. అలా అని.. అదేం సాధ్యంకాని పనేం కాదు. ఇప్పుడు మ‌న‌ముందు క‌నిపిస్తున్న బ‌డా కార్పొరేట్ సంస్థ‌ల‌న్నీ ఒక‌ప్ప‌టి స్టార్ట‌ప్‌లే. 

క‌ల‌లు క‌నండి వాటిని సాకారం చేసుకోండి అని అబ్దుల్ క‌లాం అన్నారు. ఆ మాట‌లే నేడు యువ‌త మంత్రంగా జపిస్తోంది. సరిగ్గా అలాంటి సలహాలు సూచనలే ఇస్తున్నారు అనిలీస్ పీర్స్. ఆమె పదిహేనేళ్ల క్రితం కార్పొరేట్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పి.. స్టార్టప్ మొదలుపెట్టి సక్సెస్ అయ్యారు. తను నేర్చుకున్న పాఠాలు.. తనకు ఎదురైన అనుభవాలను యువ ఆంట్రప్రెన్యూర్లతో పంచుకుంటున్నారు. అవేంటో ఆమె మాటల్లోనే చూద్దాం.. 

స్టార్టప్ లో ప్రముఖంగా కావాల్సింది ఒక గోల్. అది స్పష్టంగా కనిపించాలి. దాన్ని వాస్తవంగా మలుచుకోవాలన్న తపన ఉండాలి.

స్టార్టప్ బిజినెస్ అంత ఈజీ వ్యవహారం కాదు. ఇన్వెస్ట‌ర్ల‌ను వెతికి ప‌ట్టాలి. వారితో ఆలోచ‌న‌లు పంచుకోవాలి. వారికి మన ఐడియా నచ్చాలి. పెట్టుబడి పెట్టేలా ఒప్పించాలి. 

image


వ్యాపారంలో ముందుకు వెళ్లాలంటే మ‌న‌కు అనేక మార్గాలు క‌నిపిస్తాయి. అయితే అన్ని దారులూ మంచివి కాకపోవచ్చు. ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగే దారినే ఎంచుకోవాలి. దానికి ముఖ్యంగా కావల్సింది నిర్ణ‌యం. రెండోది కమ్యూనికేష‌న్‌. 

ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్యాపార‌వేత్త త‌న వ్యాపారాన్ని ఒక షిప్ అనుకుంటే.. ఆ ప‌డ‌వ‌కు కెప్టెన్ యజమానే. త‌న‌తో పాటు ప‌నిచేసేవారంతా పడవ న‌డిపేవారు. వారంద‌రూ ఒకేరకంగా ప‌నిచేసేలా చూడాలి. అప్పుడే ప‌డ‌వ సాఫీగా సాగుతుంది. అలా సాగాలంటే షిప్ లోని అన్ని విభాగాల‌పై యజమానికి అవ‌గాహ‌న ఉండాలి. అవసరమైతే ప‌డ‌వ తుడవాలి. ముంచుకొచ్చే ప్ర‌మాదాలను పసిగట్టాలి. 

ఒక వ్య‌క్తి త‌న వ్యాపారాన్ని ఒక ఆట అనుకుంటే.. అతడే త‌న టీంను త‌యారు చేసుకోవాలి. వ్యాపారాన్ని ఒక ఆట‌లా ఆడాలి. ఆట‌లో అత‌డు ఓన‌రూ అతనే.. సభ్యుడూ అతనే. మ్యాచ్ ఓడిపోతే ఓడిపోవచ్చుగాక. రెండోసారి గెలిచేందుకు తోటివారిని మోటివేట్ చేయాలి. 

సపోజ్.. స్టార్ట‌ప్ ప్ర‌పంచం ఒక చెస్ అనుకుంటే.. మ‌నం వేసే ప్ర‌తి అడుగు నిశితంగా చూసి వేయాలి. ఆచితూచి పావులు కదపాలి. అవే ఫ్యూచర్ ని నిర్ణ‌యిస్తాయి. అందుకే అంటాను.. వ్యాపారానికి కావాల్సింది స‌రైన పునాది అని. ఒక ఆర్కిటెక్ట్ భ‌వ‌నాన్ని ఎలా నిర్మిస్తాడో.. అలాగే మన వ్యాపారాన్ని మనమే నిర్మించుకోవాలి.

మొద‌టి వ్యాపారం ఎవ‌రికైనా తొలి కాన్పులో పుట్టిన బిడ్డ‌లాంటిది. చాలా జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి. అది పెరిగి పెద్ద‌య్యేకొద్దీ మ‌న బాధ్య‌త‌లు మారుతుంటాయి. మ‌నం అందించే పోష‌ణ‌ను బ‌ట్టే బిడ్డ ఎదుగుతుంది. మన గుండెలమీదనే శిశువు న‌డక నేరుస్తుంది. కొంత కాలానికి ప‌రిగెడుతుంది. బిడ్డకు విద్యాబుద్ధులు నేర్పించడం ఉంది చూశారూ.. అది మ‌న వ్యాపారానికి పెట్టే అద‌న‌పు పెట్టుబ‌డి లాంటిది. ఎంత జాగ్ర‌త్తగా చూసుకుంటేనే వ్యాపారం అంతగా ఎదిగివస్తుంది. మ‌న వెంట న‌డుస్తుంది. మనల్ని న‌డిపిస్తుంది. ముందుకు సాగుతుంది.

ఉదాహరణకు వ్యాపారాన్ని ఒక పంట అనుకుందాం.. అప్పుడు మనం రైతు అవ‌తారం ఎత్తాల్సి ఉంటుంది. ఒక్కో మొక్క‌ను పొందికగా చూసుకోవాలి. దాని రాబ‌డిని ముందే అంచ‌నా వేయ‌గ‌ల‌గాలి. పంట చేతికి వచ్చేదాకా కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అందుకే వ్యాపారంలో మ‌నతోపాటు పనిచేసే వారిని ఎంతబాగా చూసుకుంటే ఫ‌లితం అంత గొప్పగా ఉంటుంది.

మ‌నం చేసే వ్యాపారంలో కొత్త‌దనాన్ని ఆహ్వానించాలి. అది ఇంత‌కు మునుపు ఎన్న‌డూ చూడనిదై ఉండాలి. దాన్ని మార్కెటింగ్ కూడా అంతే. ఒక ప్ర‌ణాళిక‌, ఒక ఆశ‌యం, ఒక క్ర‌మ‌శిక్ష‌ణ‌, ఒక ముందుచూపు ఉండాలి. ఇలాంటివే స్టార్ట‌ప్ కు బూస్ట‌ప్‌గా మారుతాయి. 

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags