సంకలనాలు
Telugu

యాక్టరే కాదు.. ఓ ఆంట్రప్రెన్యూర్ కూడా..

వెడ్డింగ్ ప్లానర్ అవతారమెత్తిన హీరోయిన్..'ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ' పేరుతో స్టార్టప్..మల్టీ టాస్కింగ్‌తో రాణిస్తున్న నటి..

Sri
4th Sep 2015
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share

తాప్సీ... సినీనటిగానే అందరికీ తెలుసు. తెరపైనే ఆమె హీరోయిన్. సినిమా కెరీర్ కాకుండా ఆమెలో మరో యాంగిల్ కూడా ఉంది. ఆమె వెడ్డింగ్ ప్లానర్ అనే సంగతి అతికొద్ది మందికే తెలుసు. సవాళ్లను మనస్ఫూర్తిగా ఆహ్వానించే తాప్సీ... ఆంట్రప్రెన్యూర్‌షిప్ ఛాలెంజ్‌ని స్వీకరించారు. ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న సవాళ్లేంటీ ? అనుభవాలేంటీ ? సెకండ్ కెరీర్‌లో ఎలా రాణిస్తున్నారు ? ఆమె టీమ్ మెంబర్స్ ఎవరు ? తెలుసుకుందాం...

పెళ్లి గురించి మాట్లాడుకోవాలి

తాప్సీ పన్ను... ఇంజనీర్, మోడల్, నటి, ఆంట్రప్రెన్యూర్, వెడ్డింగ్ ప్లానర్... ఇలా అనేక రంగాల్లో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. తన స్నేహితురాలు ఫరా పర్వరేష్, సోదరి షగున్ పన్నుతో కలిసి ది వెడ్డింగ్ ఫ్యాక్టరీని ప్రారంభించారామె. పెళ్లికి వచ్చిన వాళ్లంతా అమ్మాయి, అబ్బాయి గురించి లేదా భోజనాల గురించి మాట్లాడుకుంటారు. కానీ మొత్తం పెళ్లి అనే వేడుక గురించి అతిథులు మాట్లాడుకోవాలి. ఆ వివాహాన్ని అంత గొప్పగా చేయాలి. పెళ్లికి వచ్చిన అతిథులు అక్కడి వాతావరణాన్ని చూసి మైమరచిపోవాలి. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మనసులో ముద్రవేసుకోవాలి. ఇదీ తాప్సీ ఆలోచన. తన ఆలోచనకు తగ్గట్టుగానే ది వెడ్డింగ్ ఫ్యాక్టరీని నడిపిస్తున్నారు. క్లైంట్లకు వారి బడ్జెట్ లోనే అంతర్జాతీయ ప్రమాణాలు కనిపించేలా పెళ్లిని చేసివ్వడమే తమ లక్ష్యం అంటారు.

ప్రవాహంలో పడి వెళ్లిపోవడమే

అసలు తాప్సీ ప్రయాణమే విచిత్రం. ఏదీ అనుకున్నట్టు జరగలేదు. ప్రవాహంలో పడి కొట్టుకుపోయినట్టు ముందుకు వెళ్లిపోవడమే ఆమెకు తెలుసు. ఢిల్లీలో పుట్టి పెరిగిన తాప్సీ... చిన్నప్పట్నుంచీ చురుకైన అమ్మాయి. స్కూల్లో ఔట్‌డోర్ స్పోర్ట్స్‌లో రాణించడం ఓ వైపు... పుస్తకాలతో కుస్తీ పట్టడం మరోవైపు... అందుకే పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేవి. కానీ చదువుల కన్నా... నిత్యం ఏదో ఒక కాంపిటీషన్ కోసం ప్రిపేరవ్వడంలోనే బిజీగా ఉండేదట. అటెండెన్స్ తక్కువున్నా... గ్రేడ్లు ఎక్కువగానే వచ్చేవి. డ్యాన్సులు, పబ్లిక్ స్పీకింగ్ లాంటి కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేసేవారు. కాలేజీ చదువుల తర్వాత ఇంజనీరింగ్‌లో చేరారు తాప్సీ. ఇంజనీరింగ్ చదువుతూనే మోడలింగ్ పై ఆసక్తి పెంచుకున్నారు. షాపింగ్, సినిమాలకు పాకెట్ మనీ సంపాదించుకోవడం కోసం మోడల్ అవతారం ఎత్తారు. ఆరు నెలలు మోడలింగ్ నేర్చుకున్న తర్వాత స్వతంత్రంగా జీవించగలనన్న ఆత్మవిశ్వాసం ఆమెలో పెరిగింది. అవసరమైనప్పుడు ఒంటరిగా జీవించగలననే నమ్మకం పెరిగింది, అయితే రెగ్యులర్‌గా ఉండే 9 టూ 5 జాబ్ తనకు సూట్ కాదనిపించింది. అందుకే ఇన్ఫోసిస్ ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టింది. ఎంబీఏ చేయాలనుకుంది. కానీ విధి మరోలా రాసిపెట్టుంది. అప్పుడే దక్షిణాది సినిమాలో మంచి ఆఫర్లొచ్చాయి. అప్పట్నుంచి వెనుతిరిగి చూడలేదు. ఇప్పటివరకు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో 17 సినిమాల్లో నటించారు.

"నా జీవితం గురించి ప్లాన్ చేసుకోవడం మానేశాను. ఎందుకంటే నేను ప్లాన్ చేసుకున్నట్టుగా ఏదీ జరగలేదు. కానీ నాకేమీ బాధ లేదు. ఎందుకంటే నా విధి నా కెరీర్ ని చక్కగాప్లాన్ చేసింది. అందుకే నేను అలా ముందుకెళ్తూ ఉండిపోయాను" అంటారు తాప్సీ.
తాప్పి, ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ కో ఫౌండర్

తాప్పి, ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ కో ఫౌండర్


ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ

ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ ప్రారంభించాలనే నిర్ణయం వెనుకా ఏ ప్లాన్ లేదు. సినిమాల్లో అవకాశం వచ్చినట్టుగానే... వెడ్డింగ్ ప్లానర్‌గా మారాలన్న ఆలోచనా వచ్చింది. ఈ కెరీర్‌లోకి రావాలనుకోవడం స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమే. అయితే ఈ వెంచర్‌లో ఉన్న ఇద్దరూ తనకు తెలిసినవాళ్లే కావడంతో అంతా సులువైంది. వెడ్డింగ్ ప్లానింగ్ రంగంపై తాప్సీకి అంత నమ్మకం ఎందుకంటే... ఎలాంటి మాంద్యం ఉన్నా పెళ్లిళ్లు మాత్రం ఆగవు. క్రియేటీవ్ స్పేస్ ఉండటమే కాదు... తెలివిగా, వ్యూహాత్మకంగా ఆలోచిస్తే సక్సెస్ అవొచ్చన్నది తాప్సీ సక్సెస్ మంత్ర.

"క్లైంట్ బడ్జెట్ కి సరిపోయేలా వెడ్డింగ్ ప్లాన్ చేయాలి. మా డిమాండ్లతో క్లైంట్ల బడ్జెట్ ను అమాంతంగా పెంచడం మాకు ఇష్టం లేదు. అప్పుడే ఆ క్లైంట్ల ద్వారా మరికొందరు క్లైంట్లు మాకు వస్తారు" అంటారు తాప్సీ.

ఆ ముగ్గురు

తన ఇద్దరు పార్ట్నర్స్ గురించి మాట్లాడుతూ... "ఫరా ఈ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తోంది. ఆమె నాకు ఎనిమిదేళ్లుగా తెలుసు. నాకు తెలిసినవాళ్లలో తను అద్భుతమైన, సృజనాత్మకమైన మహిళ. నా సోదరి షగున్‌కి ఈవెంట్ మేనేజ్‌మెంట్లో అనుభవం ఉంది. అలా ఈ వెంచర్ కి మేం ముగ్గురం పర్ఫెక్ట్ చాయిస్ అయ్యాం" అంటారు తాప్సీ. తనకున్న మార్కెటింగ్, ప్లానింగ్ స్కిల్స్ తో పాటు డెకరేషన్ పై ఫరాకు ఆసక్తి ఎక్కువ. ఈ వెంచర్ లో సృజనాత్మకమైన నిర్ణయాలు, మార్కెటింగ్ వ్యవహారాలను తాప్సీ చూసుకుంటున్నారు. వాటిని అమలుపర్చడంలో తాప్సీ బాధ్యతేమీ లేదు. మిగతా సమయమంతా తన యాక్టింగ్ కెరీర్ పై దృష్టి పెడుతున్నారు. ఏ పనైనా ఈ ముగ్గురూ చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అందుకే తాము చేసే పనిలో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్ ఉంటుందంటారు తాప్సీ.

షగుణ్, తాప్సీ, ఫరా

షగుణ్, తాప్సీ, ఫరా


ఆకాశమే హద్దు

శక్తియుక్తుల్ని ప్రదర్శించాలనుకుంటే మహిళకు ఆకాశమే హద్దు అంటారు తాప్సీ. నిరంతరం సవాళ్లను స్వీకరిస్తుండాలి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్లకు మీరేంటో చూపించాలి. ప్రతిఘటించాల్సిన సమయం వచ్చినా మీపై మీరు నమ్మకం ఉంచి ముందుకెళ్లాలి. ఏది సరైనదో, ఏది కాదో మహిళకు బాగా తెలుసు అంటూ స్ఫూర్తిని నింపుతారామె. సినిమా ఇండస్ట్రీలో తన తండ్రి అనుకుంటున్నట్టు ఉండదని ఆమెకు అర్థమైంది. "కానీ నేను దీర్ఘకాలిక ఆనందం కోసం ఆలోచించాను. అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం సరైనదని నాకు సంతోషంగా ఉంది" అంటారామె. ఓ ఇంజనీర్ ఒక నెలలో ఎంత సంపాదిస్తారో... అంతకంటే ఎక్కువ తాను ఇంజనీరింగ్ పూర్తి చేయకముందే సంపాదించానని గర్వంగా చెబుతారు తాప్సీ. ఎన్ని సాధించినా, ఎన్ని మైలురాళ్లను అధిగమించినా ఆ సంపాదన ఇప్పటికీ సంతృప్తినిస్తుందంటారు. ఇంట్లోంచి బయటకు వచ్చి... కొత్త నగరంలో అడుగుపెట్టి... అన్నీ సొంతగా చూసుకొని, సొంతగా ఇంటిని తీర్చిదిద్దుకొని, సొంత కష్టంతో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నారు తాప్సీ. ఆ ధైర్యంతో, ఆ స్ఫూర్తితో ఇప్పుడు ది వెడ్డింగ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. తన యాక్టింగ్ కెరీర్ తో సంబంధం లేకుండా వెంచర్ నడుస్తుంది. లివ్ లైఫ్ క్వీన్ సైజ్ అంటారు తాప్సీ. "

మీరేం పనిచేస్తున్నారన్నది ముఖ్యం కాదు. సంతోషాన్ని పొందడం, రోజు ముగిసే సరికి కంటి నిండా నిద్ర పోవడం ముఖ్యం. బాగా కష్టపడేది అందుకోసమేగా" అంటారు తాప్సీ.

ఆమెకు ప్రయాణించడమంటే ఇష్టం. తనలో కొత్త కోణాల్ని ఆవిష్కరించేందుకు, తనను చైతన్యపర్చుకోవడానికి ట్రావెలింగ్ ఉపయోగపడుతుదంటారు. జీవితంలో ఎప్పుడైనా డీలాపడ్డట్టు అనిపిస్తే... ఓసారి వెనక్కి చూసుకొని, గతంలో తానెలా ఉండేదాన్ని... ఇప్పుడెలా ఉన్నానని బేరీజు వేసుకొని తిరిగి తన ప్రయాణాన్ని మొదలుపెడతారు.

Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags