సంకలనాలు
Telugu

ఐఐటి విద్యార్థుల షార్ట్ ఫిల్మ్స్ ప్రాజెక్ట్ ‘ఎమోషనల్ ఫుల్’

ashok patnaik
11th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

సినిమాను తీయాలనుకున్నారు. అంతే తీసిపడేసారు. ప్రస్తుతానికైతే అవి లఘు చిత్రాలే. కానీ భవిష్యత్తులో సిల్వర్ స్క్రీన్‌పై తళుక్కుమనగలం అనే ధీమా మాత్రం వారిలో కనిపిస్తోంది. ఇష్టంతో చేసే పని కనుక దానిలో ఆనందం ఉందంటున్న ఆ ఇద్దరు మిత్రుల కథే ఈ ఎమోషనల్ ఫుల్స్. అవును మీరు చదివిన పేరు కరెక్టే. అది 'ఎమోషనల్ ఫుల్స్'. సమీర్ మిశ్ర, సందీప్ ఝా లకు సినిమా అంటే పిచ్చి. వీళ్లిద్దరూ కలసి ప్రారంభించిందే ఎమోషనల్ ఫుల్స్. ఇది ఒక యూట్యూబ్ చానెల్. 50,000 పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు దీనికి. ఈ ఛానెల్‌లో షార్ట్ ఫిలిమ్స్ అందుబాటులో ఉంటాయి. ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మంచి క్వాలిటీతో కూడిన కంటెంట్ ఇందులో ఉంటుంది.

image


“ఫిల్మ్ మేకర్‌గా మేం ఏం తీయాలనుకున్నామో దాన్నే తీస్తాం. జనం ఏం చూడాలనుకుంటున్నారో దాని గురించి మాకు అవసరం లేదు. ఇలా చేయడం వల్ల చివరికి క్రియేటివ్‌గా తీశామనే సంతృప్తైనా మిగిలి ఉంటుంది.” అంటారు సమీర్.

image


ఎమోషనల్ ఫుల్స్ ఎలా పుట్టిందంటే

సమీర్ ఐఐటి బాంబే నుండి డిగ్రీ పూర్తి చేశారు. ఐఐటి బాంబేలో ఉన్నప్పుడు లఘు చిత్రాల నిర్మాణానికి సిల్వర్ స్క్రీన్ అనే ఓ చిన్న సంస్థను ప్రారంభించారు. అప్పట్లో చాలా రకాలైన షార్ట్ ఫిల్మ్స్ తీసారు. కాలేజీ, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. కాలేజి పూర్తయ్యాక సమీర్ హైదరాబాద్‌లోని ఓ ఐటి కంపెనీలో జాయిన్ అయ్యారు. కానీ సినిమా తీయాలనే అతని వ్యాపకం ఉద్యోగంలో ఎంతోకాలం ఉంచలేదు. దీంతో ఉద్యోగం వదిలేసి తన ప్యాషన్‌ని ఫాలో అయ్యారు. ఇలాంటి భావాలే ఉన్న తన స్నేహితుడు సందీఫ్ ఝా కూడా తనతో కలిసారు. సందీప్ కొన్ని కార్పొరేట్ సినిమాలు తీయడమే కాదు, ఈఎస్పిఎన్ , స్టార్ స్పోర్ట్స్‌లో పనిచేశారు. వీళ్లిద్దరూ కలసి షార్ట్ ఫిల్మ్ లను తీయడం మొదలు పెట్టారు. 

'2013 వేసవిలో రెండు లఘుచిత్రాలను తీసాం. వాటిని మా స్నేహితులకు చూపించాం. ఆన్ లైన్లో అప్ లోడ్ చేయమని వారు మమ్మల్ని ప్రోత్సహించారు. మేం ఒక యూ ట్యూబ్ చానెల్‌తో అసోసియేట్ అయ్యాం. తర్వాత మా చిత్రాల రీచ్ ఎక్కువగా ఉండటంతోపాటు కమర్షియల్ యాంగిల్‌లో ఆలోచించి అదే ఏడాది ఆగస్టులో యూట్యూబ్ చానెల్ ప్రారంభించాం' అని సమీర్ గుర్తు చేసుకున్నారు. ఎమోషనల్ ఫుల్స్ ప్రారంభమైంది అప్పుడే. సీరియస్ కంటెంట్‌ని యూ ట్యూబ్‌లో చూసే వారి సంఖ్య ఎక్కువగానే ఉందనే విషయం గుర్తించారు. ఇంటర్నెట్ యూజర్లు ప్రధానంగా యూత్ తమ వీడియోలను ఇష్టపడుతున్నారా లేదా అని ప్రశ్నించుకున్నప్పుడు .. ఎమోషన్స్ వారికి సమాధానంగా కనిపించిందట. 

‘బదల్తే జమానే’ అనేది వీరి మొదటి లఘుచిత్రం. ఓ పోస్ట్ మ్యాన్ జీవిత సంఘటన్ని ఇందులో చూపించారు. మ్యూజిక్, ఎడిటింగ్ ఇలా చాలా విషయాలపై సమీర్ జాగ్రత్తలు తీసుకునేవారు. ఒక్కొక్కటిగా లఘుచిత్రాలు తీయడమే మాకు పనిగా మారిపోయింది. సమీర్,సందీప్ తోపాటు వారి టీం సైతం ఎమోషనల్ ఫుల్స్ కి మరింత విలువను తీసుకొస్తోంది. ప్రస్తుతం టీంలో గంజీత్ సింగ్, ఆతిష్ కుమార్,పాండ్యాలు ఉన్నారు. అశాయ్ గంగ్వార్,విక్రాంత్ సింగ్ కిరార్ లు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ(డిఓపి) చూసుకుంటున్నారు. వింజు జాకబ్ థామస్ బ్రాక్ గ్రౌండ్ స్కోర్ చూసుకుంటున్నారు. గూంజా గాంధి పాటలను కంపోజ్ చేస్తున్నారు. సమీర్ స్క్రిప్ట్ చూసుకుంటున్నారు.

image


పూర్తి స్థాయి వనరులు ఉండటంతో చిన్న టీంతోనే పెద్ద బడ్జెట్ అవసరం లేకుండా సినిమా తీయడం సాధ్యమవుతోంది. దీంతో ఔట్ డోర్ షూటింగ్ మాత్రం నిర్వహించి, సహజ సిద్దమైన లైటింగ్‌లో పని పూర్తి చేస్తున్నారు. గగన్ జీత్ టీంలో జాయిన్ అయిన తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా షూటింగ్ వెసులుబాటును పొందగలిగారు.

ప్రత్యేక రోజుల కోసం వీడియోలు ప్లాన్ చేయడంతో ఎమోషనల్ ఫుల్స్‌కు ఫ్యాన్ బేస్ పెరిగింది. ఫ్యాన్స్ నుంచి వచ్చిన పొగడ్తలు,మద్దతులో మాలో ఆత్మవిశ్వాసం డబులైందని సందీప్ ఆనందం వ్యక్తం చేశారు. తామేం ఇష్టపడ్డామో అదే చేయడం ఎంతో సంతోషించదగిన విషయం. మా ప్యాషన్‌ని మా శక్తిగా మలుచుకోవడే కాదు. దీన్నో విజయవంతమైన వ్యాపారంగా మార్చగలిగామంటారు సమీర్.

భవిష్యత్ ప్రణాళికలు

డ్రామాబాజ్‌ పేరుతో సరికొత్త కామెడీ చానెల్‌ను ప్రారంభించాలని టీం కసరత్తు చేస్తోంది. నాన్ ఫిక్షన్ ఫిలిమ్స్ కోసం మరో కొత్త వెంచర్ మొదలు కానుంది. కొన్నాళ్లకు దీన్నో పెద్ద సినిమా పరిశ్రమగా మార్చాలనుకుంటున్నారు. మనసుకు ఆనందాన్నిచ్చేవే కళలు తప్పితే దాన్నొక వ్యాపార వస్తువుగా మార్చకూడదు. కళా వ్యాపకం పోనంత వరకూ వ్యాపారం చేస్తే కళకు జీవం ఉంటుంది. నిర్జీవ కళ వల్ల ప్రయోజనం లేదనేది ఎమోషనల్ ఫుల్స్ అభిప్రాయం. ఇప్పటికే ఓలా, పేపర్ బోట్, బేవకూఫ్ డాట్ కామ్ లాంటి క్లయింట్స్ మద్దతు లభించింది. సమీప భవిష్యతులో షార్ట్‌ ఫిల్మ్ మార్కెట్ 20కోట్ల మార్కెట్ దాటుతుందని అంచనా. దీనిలో ఎమోషనల్ ఫుల్స్ భాగస్వామి కావడం విశేషం.

https://www.youtube.com/user/emotionalfullsvideos

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags