ఇన్వెస్టర్ల దృష్టిలో గుడ్ బాయ్స్‌లానే ఉండండి

1st Nov 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

'' పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల దృష్టిలో ఆంట్రప్రెన్యూర్స్ మంచిగా ఉండాలంటున్న'' సిగ్నల్ హిల్ ఎండీ క్లాస్ ఓస్కామ్.

ఇన్వెస్టర్ల రికార్డుల్లో ఆంట్రప్రెన్యూర్ల ట్రాక్ రికార్డ్ బాగుండాలి - క్లాస్ ఓస్కామ్

సిగ్నల్ హిల్ సంస్థలో మిడిల్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో క్లాస్ ఓస్కామ్‌కి 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌‌వేర్, ఐటీ రంగం, ఇంటర్నెట్,డిజిటల్ మీడియా, విద్యా సంబంధిత సాంకేతికత వంటి టెక్నాలజీ కంపెనీల్లో 25కు పైగా డీల్స్‌ను విజయవంతంగా పూర్తి చేశారు క్లాస్. వీటికి అందించిన నిధుల విలువ బిలయన్ యూఎస్ డాలర్లకు పైగానే ఉంటుంది.

image


బెంగళూరులో జరిగిన టెక్‌స్పార్క్స్‌‌ 6వ ఎడిషన్‌లో సిగ్నల్ హిల్ మేనేజింగ్ డైరెక్టర్ క్లాస్.. కీలక ప్రసంగం చేశారు. “ ప్రస్తుతం భారత దేశ మార్కెట్‌లో మునుపెన్నడూ లేని ఉత్సాహం కనిపిస్తోంది. గత రెండేళ్లుగా చేసిన మొత్తం పెట్టుబడుల్లో 80 నుంచి 85 శాతం వినియోగదారుల ఇంటర్నెట్ రంగంలోకి మళ్లడం పెద్ద విషయం” అన్నారు క్లాస్.

“ మరింత లోతుగా విశ్లేషిస్తే.. గత 21నెలల్లో 11 బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత్‌‌కు వచ్చాయి. ఇందులో 9.5 బిలియన్ డాలర్లు కన్స్యూమర్ ఇంటర్నెట్ వైపే వెళ్లాయి. ఇందులో టాప్ 10 కంపెనీల వాటానే 75శాతం ఉంది.”-క్లాస్ ఓస్కామ్

భారత్ లో శరవేగంగా వృద్ధి చెందుతున్న బీ2సీ ఈ- కామర్స్ రంగం. ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ కేపిటలిస్టుల నుంచి.. పెద్ద మొత్తంలో నిధులు సేకరించగలిగిందని డెలాయిట్ రిపోర్ట్ చెబుతోంది. డిమాండ్, సప్లయ్ రంగాల నుంచి సానుకూల సంకేతాలు అందుతుండడంతో.. 2017నాటికి ఈ మార్కెట్ 60 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. వ్యవస్థీకృత రిటైల్ మార్కెట్‌తో పోల్చితే.. ఆన్‌లైన్ విభాగం వృద్ధి ఎక్కువగా ఉండనుంది. అయితే.. మొత్తం రిటైల్ సేల్స్‌లో 2018నాటికి ఆన్‌లైన్ మార్కెట్ వాటా 10.1 శాతానికి చేరనుంది. 2013లో ఇది 6.5శాతం కాగా.. 2008లో 3.5శాతం మాత్రమే. మొత్తం రిటైల్ రంగం కూడా గణనీయమైన క్రమానుగత వృద్ధి రేటు సాధించనుండడం విశేషం.

పెట్టుబడుల వరద

“గతేడాది స్టార్టప్ ఇండస్ట్రీ గణనీయమైన వృద్ధి సాధించింది. అనేక స్టార్టప్‌లు చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు సమీకరించగలిగాయి. దీనికంటే ముఖ్యంగా.. ప్రారంభస్థాయిలోని స్టార్టప్‌‌లు కూడా ఇన్వెస్టర్లను ఆకర్షించగలిగాయి. 2012, 2013 సంవత్సరాల్లో కన్స్సూమర్ ఇంటర్నెట్ రంగంలోని 45 కంపెనీలు సీడ్, సిరీస్ ఏ ఫండింగ్ పొందగలిగాయి. ఇలా నిధులు పొందగలిగిన కంపెనీలన్నీ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ బీ, సీ, డీ సిరీస్ ఫండింగ్ దిశగా అడుగులు వేస్తున్నాయి.”అంటూ భారతీయ స్టార్టప్ కంపెనీల్లోకి పెట్టుబడులు తరలివచ్చిన తీరును వివరించారు క్లాస్.

తమ కలలను, ఉత్పత్తులను రిటైల్ కస్టమర్లకు చేరువ చేసేందుకు.. ప్రారంభస్థాయి స్టార్టప్‌లకు మంచి టీం ఉండాలన్నారు క్లాస్. చివరి మెట్టుపైకి చేరేసరికి విజేతగా నిలిచేందుకు అన్ని అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే.. ఆ స్థాయిలో పరాజయం పొందడానికి ఆస్కారం తక్కువ. మధ్య స్థాయిలో ఉన్నపుడు సత్తా చాటాల్సిన అవసరం ఉంటుంది. అదే రంగంలోని మొదటి ఐదారు కంపెనీల్లో ఒకటిగా నిలిచేందుకు పాటు పడాలి. నిలకడగా అభివృద్ధి సాధించడం చాలా కీలకమైన విషయం అన్నారు క్లాస్.

స్తంభిస్తున్న మార్కెట్లు

ఇప్పటివరకూ మార్గదర్శకులుగా ఉన్నవారు కూడా మార్కెట్లోకి ఎంటర్ అయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. పెట్టుబడుల అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. కన్స్యూ మర్ ఇంటర్నెట్ కంపెనీలకు అభివృద్ధి సాధించేందుకు మరిన్ని నిధులు అవసరం కావడంతో.. ప్రస్తుతం అవి పెట్టుబడుల సమీకరణపై దృష్టి సారించాయి.

సాఫ్ట్ బ్యాంక్, టైగర్ గ్లోబల్‌ నుంచి ఫండింగ్ తీసుకోవాలని ప్రతీ ఆంట్రప్రెన్యూర్ అనుకుంటూ ఉంటారు. అయితే.. ఇవి రెండూ కాకపోయినా ఇప్పటికే పెట్టుబడులు చేసిన కంపెనీల రికార్డుల్లో మంచి కంపెనీగా.. స్టార్టప్‌‌లు నిలవాల్సిన అవసరం ఉంది.

“ కేవలం నిధుల సమీకరణతోనే అభివృద్ధి సాధిస్తామని కాకుండా.. తమ సొంత శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించాల్సిన సమయం ఇది. తమ కొత్త ప్రణాళికలతో మార్కెట్లో అమ్మకాలు పెంచుకునేందుకే పెట్టుబడులు సేకరించాలి. కష్టకాలాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. నిధుల కోసం 50 నుంచి 100మంది ఇన్వెస్టర్లతో మాట్లాడాల్సి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. వంద మందిలో 50 మంది రిజెక్ట్ చేసినా.. కుంగిపోకూడదు. ఎందుకంటే.. స్టార్టప్ షో మొత్తానికి స్టార్స్ ఆంట్రప్రెన్యూర్సే. మరిన్ని ఆవిష్కరణలతో భవిష్యత్ వైపు అడుగులు వేయాల”న్నారు క్లాస్ ఓస్కామ్.

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India