సంకలనాలు
Telugu

హాయ్ హైదరాబాద్! నేను మీ చిట్టీని..! మీరంతా మా పండక్కి రావాలి..!

26th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

గర్భంలో జనించే ప్రతీ జీవికి మృత్యువు ఉంటుంది! కానీ, మానవ మేథస్సులో పుట్టిన వాటికి చావు లేదు! రోబో గురించి ఓ సినీకవి చెప్పిన ఎటెర్నల్ ట్రూథ్‌. నిజమే కదా! రోబో అంటే చెడిపోని దేహం! రోబో అంటే చనిపోని ప్రాణం! మానవ మేథస్సు సృష్టించిన కండలు లేని, గుండెలు లేని రేపటితరం విజ్ఞాన సర్వస్వం!!

దేశంలో 90 శాతం స్టార్టప్ కంపెనీలు ఇంకా బాలారిష్టాల్లోనే ఉన్నాయి. పదిశాతం మాత్రమే తయారీరంగంలో ఉన్నాయి. ఈ లెక్కల్లో మార్పు రావాలి. అలా జరగాలంటే రోబో టిక్స్ వాడకం పెరగాలి. అప్పుడే సాధ్యపడుతుంది.

అలాంటి రోబో టిక్ ఫెస్ట్ కు భాగ్యనగరం వేదిక కాబోతోంది. మార్చి 12,13 తేదీల్లో టీ హబ్ లో ఈ ఫెస్ట్ జరగనుంది. దేశ విదేశాల నుంచి ఎందరో డెలిగేట్స్, స్పీకర్స్, రోబోటిక్స్ స్టార్టప్స్ ఇందులో పాల్గొంటున్నాయి. కాన్ఫరెన్స్, ఎక్స్ పో, ప్యానెల్ డిస్కషన్, రోబో ఇంటరాక్షన్‌ లాంటివి ఇందులో హైలైట్ గా నిలువబోతున్నాయి. ఐదు ఐఐటీలు నేరుగా ఇందులో పాల్గొంటున్నాయి. డెలిగేట్స్, ఎగ్జిబిటర్స్, విజిటర్లకు ఈ ఫెస్ట్ మరచిపోలేని అనుభూతి ఇస్తుందనడంలో సందేహం లేదు.

undefined

undefined


ఈవెంట్స్‌, కాన్ఫరెన్స్ అని ఫెస్ట్‌ ని రెండు సెట్లుగా విభజించారు. 14 మంది జాతీయ, అంతర్జాతీయ స్పీకర్లు ఇందులో ప్రసంగించబోతున్నారు. 10 రోబోలకు ప్రోగ్రామ్ చేసి పెట్టారు. అవి వచ్చిన విజిటర్లతో ఇంటరాక్ట్ అవుతాయి. మరో కొసమెరుపు ఏంటంటే- రోబోలు వచ్చిన అతిథులతో మాట్లాడటమే కాదు.. ఫుడ్ కూడా సర్వ్ చేస్తాయి. రోబో ఇకో సిస్టంకు మద్దతివ్వడమే మా లక్ష్యం అంటున్నారు ఆర్గనైజర్, ఫౌండర్ కిష్ణ.

సాధారణంగా రోబో ఈవెంట్స్ కాలేజీలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఆ ఆలోచనలు పూర్తిస్థాయి స్టార్టప్స్ గా మారడం లేదు. స్టార్టప్ ఇండియా- స్టాండప్ ఇండియా అంటూ దేశం మొత్తం స్టార్టప్ వైపు పరుగులు తీస్తున్న రోజులివి. అందుకే రోబో ఫెస్ట్ ఏర్పాటు చేయడానికి ఇదే సరైన సమయంగా భావించి.. ఐదేళ్ల పాటు దీనిపై వర్క్ చేసి ఇప్పుడొక రూపు తీసుకొచ్చారు నిర్వాహకులు. స్టార్టప్ క్యాపిటల్ గా మారుతున్న హైదరాబాదులో గతంలో ఇలాంటి ఫెస్ట్ జరగేదంటున్నారు కిష్ణ. ఆ మాటకొస్తే దేశంలోనే ఇలాంటి ఫెస్ట్ మొదటిది అంటారాయన.

undefined

undefined


బ్రాండ్ అంబాసిడర్ కిష్

రోబో ఫెస్ట్ లో కనపడే మరో ఆసక్తికరం అంశం కిష్. అదొక రోబో పేరు. వచ్చే అతిధులకు అది స్వాగతం పలుకుతుంది. రిసెప్షన్‌ లో కిష్ సందడి చేస్తుంది. క్రేజీ రోబో చేసే విన్యాసాలతోనే ఈవెంట్ ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ దగ్గరి నుంచి అన్నీ పనులూ ఈ రోబో చూసుకుంటుంది.

రోబో ఫెస్ట్ ప్రత్యేకతలు

ఏడు దేశాల నుంచి 50 రోబోటిక్ క్లబ్ లు వస్తున్నాయి. ఇప్పటి వరకూ దాదాపు వేయి మంది రిజిస్టర్ అయ్యారు. 50 రోబోటిక్ స్టార్టప్ లు పాల్గొంటున్నాయి. విద్యార్థులు, ఔత్సాహికులు, స్టార్టప్ ఫౌండర్లు, డెలిగేట్స్ అంతా కలసి 5 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. వచ్చిన డెలిగేట్స్, విజిటర్లకు రెగ్యులర్ ఐడీ కార్డుల బదులు ఆర్‌ఎఫ్‌ఐడీ ఇస్తారు. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అన్నమాట. లోపలికి ఎంటరవ్వాలంటే స్కానింగ్ పర్మిట్ అడుగుతుంది. ఇది రోబో ఫెస్ట్ యాప్ తో కూడా ఇంటిగ్రేట్ అయి వుంటుంది. ఇలాంటి ఐడీ కార్డుల వాడకం దేశంలో ఇదే మొదటిసారి. టెక్నాలజీని ఆస్వాదించడానికి మేమొక ప్లాట్ ఫామ్ కల్పిస్తున్నామని అంటున్నారు కిష్ణ.

ఆరేళ్ల క్రితం ఆలోచన

రోబో ఫెస్ట్ ఏర్పాటు చేయాలని ఆరేళ్ల క్రితం అనుకున్నారు కిష్ణ. ఢిల్లీలో కాలేజీ చదివే రోజుల్లో మొదలైన ఆలోచన కార్యరూపం దాల్చడానికి ఇన్నాళ్లు పట్టిందంటారు. ఇటీవలే 5 మెట్రో నగరాల్లో రోబోథాన్ ఏర్పాటు చేశారు. అలా ఐదుగురు ప్రతినిధులు ఈ సంస్థకు పనిచేస్తున్నారు. ఈవెంట్ కోసం ఎంతోమంది వాలంటీర్లు కూడా ఉన్నారు.

రోబోలు వాడకంతో ప్రాడక్టు తయారీ రెట్టింపవుతుంది. ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని ఫెస్ట్ భావిస్తోంది. టెక్నాలజీ రంగంలో రోబోటిక్స్ వాడకం ఎంత అవసరమో తెలియజెప్పడమే రోబో ఫెస్ట్ అంతిమ లక్ష్యం అంటున్నారు కిష్ణ.


ఈవెంట్ కు టికెట్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags