సంకలనాలు
Telugu

రెండు ఎదురుదెబ్బల తర్వాత నష్టాలంటే ఏంటో తెలియని రూ.2 వేల కోట్ల జైపూర్ కంపెనీ

విదేశాల్లో ఉద్యోగం చేసి ఇండియాలో వ్యాపారం చేయాలనే మోజుఇద్దరు అన్నాదమ్ముల అత్యుత్సాహంరెండు వ్యాపారాల్లో చేతులు కాల్చుకున్నారుఆ తర్వాత తమకు వచ్చిన సాఫ్ట్‌వేర్‌, టెక్నాలజీనే నమ్ముకున్నారు1000 మంది ఉద్యోగులకు నిలయంగా ఇప్పుడు గిర్నర్ సాఫ్ట్కార్ దేఖో, ప్రైజ్ దేఖో కూడా వీళ్ల సంస్థలేఇప్పుడు గిర్నర్ వేల్యుయేషన్‌ రూ.2000 కోట్లుమెంటారింగ్‌కు ఒప్పుకున్న రతన్ టాటా ఇద్దరు జైపూర్ కుర్రాళ్ల సక్సెస్ స్టోరీ

Poornavathi T
7th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఒక దాని తర్వాత మరో కంపెనీ చాపచుట్టేసే పరిస్థితి. ఐఐఎంలో చదువులు,విదేశాల్లో ఉన్నత పదవులు, మంచి జీతం వదులుకుని ఉన్న ఊరు వచ్చి పరువు పోగొట్టుకున్న పరిస్థితి. తండ్రి బిజినెస్‌లో వేలుపెట్టి అక్కడా చీవాట్లు తిని ఇక ఏం చేయాలో దిక్కుతోచక తమకు వచ్చిన విద్యనే నమ్మకున్నారు ఇద్దరు అన్నాదమ్ములు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు రెండు పాపులర్ బ్రాండ్ పోర్టళ్లకు అధినేతలయ్యారు. ఆ కంపెనీ గిర్నర్ సాఫ్ట్ అయితే ఆ సంస్థల బ్రాండ్స్ కార్ దేఖో, ప్రైజ్ దేఖో. ఆ బ్రదర్స్ ఇద్దరూ అమిత్ జైన్, అనురాగ్ జైన్. ఇంతకీ ఏంటి వీళ్ల జర్నీ. జైపూర్ నుంచి ఆ స్థాయి బ్రాండ్‌ను ఎలా సృష్టించగలిగారు ? ఎదురుదెబ్బలతో వచ్చిన అనుభవమేంటి ?

అమిత్ జైన్, అనురాగ్ జైన్ ఇద్దరూ అన్నాదమ్ములు. సొంతూరు జైపూర్. ఇద్దరిలో పెద్దవాడైన అమిత్ ఐఐటి ఢిల్లీ నుంచి 1999లో ఇంజనీరింగ్ పట్టా పొందారు. రెండేళ్ల తర్వాత అతని తమ్ముడు అనురాగ్ కూడా అన్నయ్య బాటే పట్టాడు. చదువు తర్వాత అమిత్ టిసిఎస్‌లో చేరి ట్రైలాజీ సంస్థకు మారారు. మెల్లిగా యూఎస్ చేరి అక్కడ భారత ఆపరేషన్స్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. ట్రైలాజీ ఇంటర్నల్ ఇంక్యుబేషన్ సెంటర్‌లోనూ చురుగ్గా పాల్గొన్నారు. అంతా సాఫీగా సాగిపోతోంది అనుకుంటున్న తరుణంలో అమిత్‌కు వ్యాపారం చేయాలని కాంక్ష నానాటికీ బలపడింది. ఎనిమిదేళ్ల కార్పొరేట్ అనుభవం, వివిధ స్థాయిల్లో పనిచేసిన అనుభవం సరిపోతుందని భావనలో 2007లో ఇండియా వచ్చి తన తమ్ముడితో కలిసి గిర్నర్ సాఫ్ట్ అనే సంస్థ ఏర్పాటు చేశారు.

అమిత్ జైన్, అనురాగ్ జైన్ - గిర్నర్ సాఫ్ట్ వ్యవస్థాపకులు

అమిత్ జైన్, అనురాగ్ జైన్ - గిర్నర్ సాఫ్ట్ వ్యవస్థాపకులు


నష్టాల ఊబిలోకి..

కొన్ని వ్యక్తిగత కారణాలు, పుట్టిపెరిగిన ఊరిపై మమకారాన్ని చంపులోకి అమిత్ జైపూర్‌లోనే వ్యాపారం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. 'అప్పుడప్పుడూ మా నాన్న నిర్వహించే జ్యూవెల్రీ వ్యాపారంలో తలదూర్చేవాడిని. వ్యాపారం ఎలా చేయాలో చెప్పడంతో పాటు విస్తరణపై మా నాన్నకు లెక్చర్లు ఇచ్చేవాడిని. కానీ తీరా వ్యాపారంలోకి అడుగుపెట్టిన తర్వాత తెలిసింది. చెప్పినంత ఈజీ కాదు బిజినెస్ చేయడం అని' అంటారు అమిత్. ఆన్‌లైన్ జ్యువెల్రీ పేరుతో మొదలెట్టిన వ్యాపారం అట్టర్ ఫ్లాప్ అయింది. ఆశలు, అంచనాలన్నీ గల్లంతయ్యాయి. అలా ఒకటి రెండు కొత్త ఆలోచనలతో వ్యాపారం చేసినా అవీ తుస్సుమన్నాయి.

తెలిసిన విద్యనే నమ్ముకున్నారు

అవసరాలు, పరిస్థితులు ఇద్దరినీ పాతవిద్యవైపే మళ్లించాయి. తమకు అనుభవం ఉన్న రంగంలోకి కాలుమోపేందుకు గిర్నర్ సాఫ్ట్ అనే సంస్థను స్థాపించారు. ''మేం ఐటి ఔట్‌సోర్సింగ్ కంపెనీ ఏర్పాటు చేశాం. ఎందుకంటే క్యాష్ ఫ్లో చాలా ముఖ్యమనిపించింది'' అంటారు అమిత్. కొత్త వ్యాపారానికి అదే సరైన సమయమని భావించారు. ఆలస్యమయ్యే కొద్దీ బాధ్యతలు, అప్పులు పెరిగిపోయి ఇక రిస్క్ తీసుకోవడానికి అవకాశాలన్నీ అడుగంటిపోతాయనే గుర్తించారు.

జైన్ బ్రదర్స్ ఇద్దరూ ఒక చిన్న రూమ్‌లో కూర్చుని కంప్యూటర్లను ముందరేసుకుని క్లైంట్లను మెయిల్స్ పంపడం మొదలుపెట్టారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక్క దానికీ సమాధానమే లేదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చేస్తాయని, ఇక ఫ్యూచరంతా మనదేననే భావనతో ఉన్న వాళ్లకు తత్వం బోధపడింది. చివరకు చేసేదిలేక అవసరార్థం రూ.50 వేలకు ఓ ప్రాజెక్ట్ చేశారు.

ఆ చిన్ని ప్రాజెక్టే వాళ్లకు కలిసొచ్చింది. చిన్న వ్యాపారస్థుల నుంచి ఆర్డర్లు మొదలయ్యాయి. ఏప్రిల్ 1,2007లో మొదటి ఉద్యోగిని తీసుకున్నారు. అదే ఏడాది వాళ్ల ఉద్యోగుల సంఖ్య 40కి చేరింది. జైపూర్‌లో ఉన్న టాలెంట్ పూల్‌నే వాళ్లు వాడుకున్నారు. ఫ్రెషర్స్‌ను తీసుకుని తమకు అనుకూలంగా ట్రైన్ చేసుకున్నారు. ఒక దశలో తమపైనా, ఉద్యోగులపైనా భరోసా వచ్చిన తర్వాత కొత్త ప్రొడక్ట్స్‌పై గిర్నర్ సాఫ్ట్ దృష్టి సారించింది.

సేవలు - ప్రొడక్ట్స్ మధ్య సమతుల్యం

ఏ టెక్నాలజీ కంపెనీకైనా సర్వీసులు, ప్రొడక్ట్స్ రెండూ ముఖ్యమే. ఒకవేళ సర్వీసెస్‌పై దృష్టిసారిసే ప్రొడక్ట్స్ కస్టమర్లు ఇబ్బందిపడ్తారు. ఎందుకంటే సర్వీసెస్ రంగం బాగా టైం తినేస్తుంది. ఎటూ తేల్చుకోలేక అనేక కష్టాలు పడిన తర్వాత వాళ్లకు 'కార్‌దేఖో' ఐడియా తట్టింది. అమిత్ 2010లో ఒక సారి ఇంటర్నేషనల్ ఆటోఎక్స్‌పో షోకు హాజరైనప్పుడు ఈ ఆటోపోర్టల్ ఆలోచన తట్టింది. ఇప్పుడా పోర్టల్ మెరుగైన ట్రాఫిక్‌ను ఆకర్షించగలుగుతోంది.

దీనితోపాటే సర్వీసెస్ బిజినెస్‌నూ కొనసాగించారు. కొత్త ప్రొడక్ట్ తీసుకురావడం, దాన్ని మెరుగుపర్చడం అనేది ముఖ్యమే అయినప్పటికీ కంపెనీకి ఆదాయం కూడా అత్యవసరం. అందుకే కార్‌దేఖోతో పాటు ప్రైజ్‌దేఖో‌ను మొదలుపెట్టారు. ఈ రెండూ పోర్టల్స్ మాతృసంస్థైన గిర్నర్ సాఫ్ట్‌కు మంచిపేరునే తెచ్చిపెట్టాయి. ఈ కంపెనీకి ఇప్పుడు 1000 మందికి పైగానే ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 800 మంది కార్‌దేఖోకే పనిచేస్తున్నారు. అమిత్ టీమ్ నిర్వాహణ, వృద్ధి వ్యవహారాలు చూసుకుంటే, అనురాగ్ ప్రైజ్ దేఖో, సర్వీసెస్ విభాగ బాధ్యతలు మోస్తున్నారు. కార్‌దేఖో ఇప్పటివరకూ ప్రోత్సాహకర బాటలోనే నడుస్తోంది. మొదట ఆదాయం యాడ్ల రూపంలో వచ్చేది కానీ ఇప్పుడు మోడల్ పూర్తిగా మారిపోయింది. వీళ్లకు ఉండే ఆన్ గ్రౌండ్ టీమ్ కార్ తయారీదార్లు, డీలర్లతో కలిసి పనిచేస్తుంది. కార్ ఎంపిక నుంచి కొనుగోలు వరకూ కస్టమర్‌ వ్యవహారాలు చూసుకుంటుంది కార్ దేఖో.

image


వృద్ధి, ఫండింగ్

ఆరేళ్లకాలంలో గిర్నర్ సాఫ్ట్ ఎప్పుడూ నగదు లభ్యత కొరతను, నష్టాలను చవిచూడలేదు. 2012 నాటికే కార్ దేఖో ఇండియాలో నెంబర్ ఒన్ ఆటోపోర్టల్‌గా పేరుతెచ్చుకుని నెలకు 70 లక్షల మంది కస్టమర్లను ఆకర్షించగలిగింది. ''మేం ఓ అతిపెద్ద మార్కెట్‌లో ఉన్నామని గ్రహించాం. అయితే ఇక్కడితో ఆగిపోకుండా తర్వాతి స్థాయి వృద్ధికి నిధుల సమీకరణ అవసరం. అందుకే మెల్లిగా ఆ వేటలో పడ్డాం'' అంటారు అమిత్. వీళ్లు వృద్ధి చెందుతున్న సమయంలో ఒకటి రెండు ఆఫర్లు వచ్చినప్పటికీ వీళ్లు తిరస్కరించారు. చివరకు సెకోయాతో జట్టుకట్టేందుకు నిర్ణయించుకున్నారు. 2013లో మొదటి రౌండ్ కింద 15 మిలియన్ డాలర్లను (దాదాపు రూ.90 కోట్లు) కంపెనీ సమీకరించింది. గిర్నర్ సాఫ్ట్‌ను కన్సాలిడేట్ చేసి వ్యాపారాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లడమనేది వీళ్ల లక్ష్యం. 2015 జనవరిలో సెకెండ్ రౌండ్ కింద కంపెనీ మళ్లీ 50 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.300 కోట్లు) సమీకరించింది. చైనీస్ ఫండ్స్ హిల్ హౌస్ క్యాపిటల్, టైబోర్న్ క్యాపిటల్ ఈ సారి ఇన్వెస్టర్లు. పెట్టుబడుల తర్వాత కంపెనీ వేల్యుయేషన్ 300 మిలియన్ డాలర్లుగా (రూ.2000 కోట్లు) నిర్ణయించారు. సమీకరించిన నిధులను బ్రాండ్ బిల్డింగ్, మార్కెటింగ్ కోసం ఖర్చు చేయనున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి కార్ దేఖో మరో పెద్ద సక్సెస్ సాధించిందనే చెప్పొచ్చు. టాటా సన్స్ ఛైర్మన్ -ఎమిరిటస్ రతన్ టాటా ఈ సంస్థకు మెంటార్‌కు వ్యవహరించేందుకు ఒప్పుకున్నారు. టాటా తన వ్యక్తిగత హోదాలో పెట్టుడులు కూడా పెట్టారు. కానీ ఎంత మొత్తమ్మనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. బోర్డులో అధికారికంగా లేకపోయినప్పటికీ జైన్ బ్రదర్స్‌కు కావాల్సిన సలహాలు ఇచ్చేందుకు సిద్ధమని రతన్ టాటా వెల్లడించారు.

రతన్‌టాటాతో  అమిత్ జైన్, అనురాగ్ జైన్

రతన్‌టాటాతో అమిత్ జైన్, అనురాగ్ జైన్


తాజా లెక్కల ప్రకారం కంపెనీ దగ్గర 1800 మంది యూజ్డ్ కార్ డీలర్ల నెట్వర్క్ ఉంది. ఎనిమిది ఆటో తయారీదార్లతో ఒప్పందం కుదిరింది. కంపెనీ చెబ్తున్నదాని ప్రకారం నెలకు 1.1 కోట్ల పేజ్ వ్యూస్ ఉన్నాయి.

చూశారుగా ఇదీ ఉత్సాహభరితమైన గిర్నర్‌సాఫ్ట్ ప్రయాణం. ఎలా అయినా సాధించాలనే తపనే జైపూర్ వంటి చిన్నపట్టణం నుంచి ఇద్దరు యువకులను ఈ స్థాయికి చేర్చింది. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని, తమకు పట్టున్న రంగంలో నిలదొక్కుకోగలిగితే విజయం సాధ్యమని వీళ్లు రుజువు చేశారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags