సంకలనాలు
Telugu

కామిక్స్ రూపంలో భార‌త చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న క‌లిగిస్తున్న లాటూన్స్‌

చ‌ట్టాల‌పై పిల్ల‌ల‌కు సుల‌భంగా, అర్థ‌మ‌య్యేలా వివ‌రిస్తున్న లాటూన్స్‌కామిక్ రూపంలో హ‌క్కులు, చ‌ట్టాల గురించి వివ‌ర‌ణ‌పుగ్లూ క్యారెక్ట‌ర్ ద్వారా చ‌ట్టాల‌ను వివ‌రిస్తూ కామిక్ సిరీస్ విడుద‌ల‌మ‌రిన్ని పుస్త‌కాల‌ను విడుద‌ల చేసేందుకు నిధులు స‌మీక‌రిస్తున్న క‌నన్‌, కెల్లి

GOPAL
12th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

భార‌తీయ పౌరుల‌కు అండ‌గా నిలుస్తున్న చ‌ట్టాలు సామాన్యుడికి అస్స‌లు అర్థం కావు. ప్రాథ‌మిక హ‌క్కుల, వ్య‌క్తిగ‌త హ‌క్కులేంటీ అన్న విష‌యాలు కూడా ఎవ‌రికీ తెలియ‌దు. అందుకు కార‌ణం చ‌ట్టాల్లో ఉన్న సంక్లిష్ట‌తే. ఈ అడ్డంకుల‌కు తెర‌దించి సుల‌భంగా అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా చ‌ట్టాల‌ను కామిక్ పుస్త‌క రూపంలోకి తీసుకొస్తున్నారు ధ్రు సిస్ట‌ర్స్‌.

భార‌త న్యాయ వ్య‌వ‌స్థ‌ను సులభంగా అర్థం చేసుకునేందుకు ఓ మిష‌న్‌ను ప్రారంభించిన క‌న్న‌న్ ధ్రు, కెల్లీ ధ్రుల‌కు వాస్త‌వం ఎంత క‌ఠినంగా ఉంటుందో తెలిసొచ్చింది. చ‌ట్టాల‌పై భార‌త పౌరులెవ్వ‌రికీ అవ‌గాహ‌న లేక‌పోవ‌డానికి కార‌ణం అవి అర్థం కాక‌పోవ‌డ‌మేన‌ని వీరికి బోధ‌ప‌డింది. అందుకే ప్ర‌జ‌లు త‌మ‌కు అన్యాయం జ‌రుగుతున్నా ప‌ట్టించుకోకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలుసుకున్నారు. దీంతో చ‌ట్టాల‌ను సుల‌భంగా ప్ర‌జ‌లంద‌రికీ అర్థ‌మ‌య్యేలా తెలియ‌జేయాల‌ని వారు ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ ల‌క్ష్యంతోనే లాటూన్స్ ప్రాజెక్ట్‌ను మొద‌లుపెట్టారు. లాటూన్ అంటే లా+ కార్టూన్స్ అన్న‌మాట‌. కార్టూన్ల రూపంలో చ‌ట్టాల‌ను సామాన్యుల‌కు అర్థ‌మ‌య్యేలా రూపొందించేందుకు వీరు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు.

లాటూన్స్ వ్య‌వ‌స్థాప‌కులు ధురు సిస్ట‌ర్స్ కన‌న్‌, కెల్లి

లాటూన్స్ వ్య‌వ‌స్థాప‌కులు ధురు సిస్ట‌ర్స్ కన‌న్‌, కెల్లి


ఐదేళ్ల క్రితం ఈ అక్కాచెల్లెల్లిద్ద‌రూ రీసెర్చ్ ఫౌండేష‌న్ ఫ‌ర్ గ‌వ‌ర్నెన్స్ ఇన్ ఇండియా (ఆర్ఎఫ్‌జీఐ)ని స్థాపించి న్యాయ సంస్క‌ర‌ణ‌ల‌పై ప‌నిచేశారు. ప్ర‌ధాన‌మంత్రి అడ్వ‌యిజ‌రీ బాడీ నేష‌న‌ల్ నాలెడ్జ్ క‌మిష‌న్‌లో ప‌నిచేసిన క‌నన్‌ ఓ అడ్వ‌కేట్‌. 2013లో వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోర‌మ్ మీటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆమెకు ఓ అద్భుతమైన ఐడియా వ‌చ్చింది. భార‌త చ‌ట్టాలను కామిక్ రూపంలో తీసుకొస్తే చిన్న‌పిల్ల‌ల‌కు కూడా సుల‌భంగా అర్థ‌మ‌వుతుంద‌ని ఆమెకు అనిపించింది. వెంట‌నే దీన్ని ఆచ‌ర‌ణ‌లో పెట్టేందుకు త‌న సోద‌రి కెల్లీకి త‌న ఆలోచ‌న వివ‌రించింది. వ‌ర‌ల్డ్ బ్యాంక్‌లాంటి అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌కు రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చేసి పెట్టే కెల్లీకి కూడా క‌న‌న్ ఐడియా న‌చ్చింది. భార‌త చ‌ట్టాల‌ను కామిక్ రూపంలో తెస్తే అంద‌రికీ సుల‌భంగా అర్థ‌మవుతాయ‌ని ఆమె కూడా భావించారు. త‌మ ఐడియాను వాస్త‌వ‌రూపంలోకి తెచ్చేందుకు ఓ టీమ్‌ను ఏర్పాటుచేసుకన్నారు. పౌర‌శాస్త్రాల‌కు చెందిన పాఠాలు సాధారణంగా థియ‌రీ రూపంలో ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవ‌డం విద్యార్థుల‌కు సంక్లిష్టంగా ఉంటుంది. చ‌ట్ట‌ప‌ర‌మైన హ‌క్కుల‌ను విద్యార్థుల‌కు ప‌రిచ‌యం చేయ‌డానికి ప్ర‌భావ‌వంత‌మైన మార్గాన్ని పెంపొందించాల‌ని ధురు సిస్ట‌ర్స్ భావించారు. వారికి అర్థ‌మ‌య్యే రీతిలో చెపితేనే న్యాయ వ్య‌వ‌స్థ గురించి పిల్ల‌ల‌కు అర్థ‌మ‌వుతుందని, అదే మంచి మార్గ‌మ‌ని వారు నిర్ణ‌యానికి వ‌చ్చారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చిన్న‌పిల్ల‌ల‌ను ఆక‌ర్షిస్తున్న కార్టూన్స్ ద్వారా చ‌ట్టాల‌ను వివ‌రిస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియా వారి మ‌దిలోక మెదిలింది. దీంతో చ‌ట్టాలు, హ‌క్కుల‌ను లాటూన్స్ రూపంలో డెవ‌ల‌ప్‌చేశారు.

లాటూన్స్ కామిక్స్ ముఖ‌చిత్రం

లాటూన్స్ కామిక్స్ ముఖ‌చిత్రం


ఆస‌క్తి రేకెత్తించే కార్టూన్ల రూపంలో చ‌ట్టాలు, వ్య‌క్తిగ‌త హ‌క్కుల గురించి లాటూన్స్‌లో వివ‌రించారు. అంద‌రికీ సుల‌భంగా అర్థ‌మ‌య్యే రీతిలో చెప్పారు. కామిక్స్‌ను రూపొందించేందుకు చైల్డ్ సైకాల‌జిస్ట్‌ల‌ను సంప్ర‌దించారు. ఎవ‌రిని ల‌క్ష్యంగా చేసుకుని ఈ చ‌ట్టాలు, హ‌క్కులు రాస్తున్నారో వారిని సుల‌భంగా ఆక‌ట్టుకునేలా లాటూన్స్‌ను క్రియేట్ చేశారు. కాస్త వినోదాన్ని, మ‌రింత విద్య‌ను స‌మ్మిళితం చేసి, అన్ని వ‌య‌సుల వారికి అర్థ‌మ‌య్యేలా ఈ పుస్త‌కాన్ని అందుబాటులోకి తెచ్చారు. చ‌ట్టాల గురించి పూర్తిగా అవ‌గాహ‌న లేక‌పోవ‌డం కార‌ణంగా చాలామంది త‌మ దైనందిన జీవితాల్లో సాధికార‌త సాధించ‌లేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో చ‌ట్టాల గురించిన అవ‌గాహ‌న అవ‌స‌రాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన లాటూన్స్ విద్యాల‌యాల్లో విడ‌మ‌ర్చి చెప్పేందుకు మంచి సాధ‌నంగా ఉప‌యోగ‌ప‌డుతున్నది. డిజైన‌ర్లు, ఉపాధ్యాయుల‌తో కూడిన లాటూన్స్ బృందం అంద‌రికీ సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా కామిక్స్‌ను రూపొందించారు. ప్రాథ‌మిక హ‌క్కులు, వ్య‌క్తిగ‌త హ‌క్కులు, చిన్న పిల్ల‌ల హ‌క్కులు, పౌర విధులు వంటివాటిని ఫోక‌స్ చేస్తూ ఈ సిరీస్‌ను రూపొందించారు.

చ‌ట్టాల గురించి కామిక్స్‌లో వివ‌రిస్తున్న పుగ్లూ క్యారెక్ట‌ర్‌

చ‌ట్టాల గురించి కామిక్స్‌లో వివ‌రిస్తున్న పుగ్లూ క్యారెక్ట‌ర్‌


వివిధ సామాజిక‌, ఆర్థిక స‌మాజాల‌కు చెందిన విద్యార్థుల‌కు గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో తొలి లాటూన్స్‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ విద్యార్థుల నుంచి వ‌చ్చిన స్పంద‌న లాటూన్స్ వ్య‌వ‌స్థాప‌కుల‌ను అమిత ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. చ‌ట్టాల గురించి తెలుసుకునేందుకు ఏ పుస్తకాలు బాగుంటాయని నిర్వ‌హించిన స‌ర్వేలో చాలామంది లాటూన్స్‌ను ప్రిఫ‌ర్ చేయ‌డం విశేషం. కామిక్స్ రూపంలో ఉన్న లా కాన్సెప్ట్స్‌ను అర్థం చేసుకోవ‌డం చాలా సుల‌భంగా ఉంద‌ని 70% విద్యార్థులు భావిస్తున్నారు. 

ఫండ‌మెంట‌ల్ రైట్స్‌, రైట్స్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెష‌న్స్ వివ‌రాల‌ను పొందుప‌ర్చిన తొలి వాల్యూమ్‌ను గ‌త ఏడాది నవంబ‌ర్‌లో విడుద‌ల చేశారు. ఈ కామిక్‌లో పుగ్లూ అనే క్యారెక్ట‌ర్ ద్వారా హ‌క్కుల‌కు, చ‌ట్టాల‌కు చెందిన విష‌యాల‌ను వివ‌రించారు. యువ రీడ‌ర్ల నుంచి ఈ పుగ్లూపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తున్న‌ది. తొలి సిరీస్‌కు ఊహించ‌ని రీతిలో రెస్పాన్స్ రావ‌డంతో లాటూన్స్ సిరీస్‌ను రూపొందించేందుకు ధురు సిస్ట‌ర్ సిద్ధ‌మ‌వుతున్నారు. కంపెండియంను పూర్తిచేసేందుకు ఈ అక్కాచెల్లెల్లిద్ద‌రూ నిధులు స‌మీక‌రించే ప‌నిలో ప‌డ్డారు. ఈ నిధులు సమీక‌ర‌ణ ద్వారా చిన్న‌పిల్ల‌లంద‌రికీ ఈ లాటూన్స్‌ను అటు ఆన్‌లైన్‌లో ఇటు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచాల‌ని అనుకుంటున్నారు. భార‌త చ‌ట్టాల‌ను మ‌రింత‌గా ఉప‌యోగించుకునేందుకు చ‌క్క‌టి వెబ్‌సైట్‌ను, మొబైల్ అప్లికేష‌న్ల‌ను కూడా రూపొందించాల‌ని వారు భావిస్తున్నారు.

లాటూన్స్‌లో చ‌ట్టాల గురించి తెలుసుకుంటున్న పుగ్లూ

లాటూన్స్‌లో చ‌ట్టాల గురించి తెలుసుకుంటున్న పుగ్లూ


చ‌ట్టాలు, చ‌ట్టాల‌కు సంబంధించిన ప‌దాల‌ను అర్థం చేసుకోవ‌డానికి భ‌య‌ప‌డిపోయిన పిల్ల‌లు, యువ‌కుల‌కు చ‌ట్టాల‌ను సుల‌భంగా అర్థం చేసుకునేందుకు ఈ లాటూన్స్ ఎంత‌గానో ఉప‌యోప‌డుతున్నాయి. క‌న‌న్‌, కెల్లి నిధుల స‌మీక‌ర‌ణ గురించి తెలుసుకోవాలంటే లాటూన్స్ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి. నిధుల స‌మీక‌ర‌ణ ప్ర‌చారంలో భాగంగా Milaap.org ఈ స్టోరీని యువ‌ర్‌స్టోరీకి అంద‌జేసింది.

website- lawtoons

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags