సంకలనాలు
Telugu

'అప్ గ్రాడ్'తో అప్ గ్రేడ్ అవుతారా?

టాప్ ఆంట్రప్రెన్యూర్లు, ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ పాఠాలతో 'అప్ గ్రాడ్'

Sri
14th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

కొత్త మొబైల్ ఫోన్ కొన్న నెల రోజులకే ఔట్ డేట్ అవుతుంది. మరిన్ని కొత్త ఫీచర్స్ తో మరో మొబైల్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. అవన్నీ చూసి ఇప్పుడున్న ఫోన్ ను అప్ గ్రేడ్ చేసుకోవాలని ఉత్సాహపడుతుంటారు. ఓ ఏడాదో, రెండేళ్లో వాడి పారేసే మొబైల్ ఫోన్ గురించే ఇలా ఆలోచిస్తే... మరి కెరీర్ సంగతేంటీ? అప్పుడెప్పుడో పూర్తైన డిగ్రీ పట్టాతో ఉద్యోగం సాధించారు సరే... ఆ తర్వాత కెరీర్ లో రాణించడానికి కావాల్సిన స్కిల్స్ సంగతేంటీ? ఎంప్లాయర్స్ ఎలాంటి టాలెంట్ ను కోరుకుంటున్నారు? మరి మీ దగ్గర అవన్నీ ఉన్నాయా? మీకు మీరు ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతున్నారా? ఇలా ఆలోచించే వారి కోసం ఉద్యోగాలకు ఇబ్బంది లేకుండా ఆన్ లైన్ కోర్సులు అందించే సంస్థలెన్నో ఉన్నాయి. వాటన్నింటికంటే భిన్నమైనది 'అప్ గ్రాడ్' స్టార్టప్. అసలీ స్టార్టప్ ఏంటీ? మిగతా వాటికీ దీనికి ఉన్న తేడా ఏంటో చూద్దాం...

image


'అప్ గ్రాడ్'తో అప్ గ్రేడ్

'అప్ గ్రాడ్'... ఇది ఎడ్యుటెక్ ప్లాట్ ఫామ్. ఎప్పుడైనా, ఎక్కడ్నుంచైనా... ఆన్ లైన్ లో హయ్యర్ ఎడ్యుకేషన్ అందించే సంస్థ. ప్రధానంగా భావి ఆంట్రప్రెన్యూర్లను టార్గెట్ గా పెట్టుకుందీ సంస్థ. ఆంట్రప్రెన్యూర్ కావాలని కలలు కనే వారికి ఉత్తమమైన విజ్ఞానాన్ని అందించడమే ఈ సంస్థ లక్ష్యం. అందుకు తగ్గట్టుగా 30 టాప్ ఆంట్రప్రెన్యూర్స్, ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ కంటెంట్ తో ప్రోగ్రామ్ డిజైన్ చేస్తోంది. ఫుడీబే జొమాటోగా ఎలా మారింది? ఎదుర్కొన్న సవాళ్లేంటీ? వారి ప్రయాణంలో నేర్చుకున్నదేంటీ? ఈ సందేహాలు భావి ఆంట్రప్రెన్యూర్లకు వచ్చే ఉంటాయి. ఇవే కాదు... ఆంట్రప్రెన్యూర్ షిప్ కు సంబంధించి ఏ సందేహాలున్నా తమ దగ్గర సమాధానం ఉందన్నది ఈ సంస్థ ధీమా. ఆంట్రప్రెన్యూర్ షిప్ అంటేనే నేర్చుకోవడం. చాలా స్కిల్స్ ఉంటాయి. వీటన్నింటినీ ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ ద్వారా 'అప్ గ్రాడ్'లో నేర్చుకోవచ్చు.

2015 జులైలో మయాంక్ కుమార్, రోనీ స్క్రూవాలాలు కలిసి 'అప్ గ్రాడ్'ను ప్రారంభించారు. ఐఐటీ, ఐఐఎం, యూసీ బర్కిలీ, బిర్లా ఇన్ స్టిట్యూట్ లాంటి సంస్థల ఫ్యాకల్టీ మెంబర్స్ వీరికి సేవలందిస్తున్నారు. 30 మంది ఆంట్రప్రెన్యూర్ల అనుభవాలు, ఇండస్ట్రీలోని పది మంది గెస్ట్ స్పీకర్లు పాఠాలు బోధిస్తున్నారు. ముఖ్యంగా మూడు విస్తృతమైన విభాగాలపై దృష్టిపెట్టారు.

1. వేర్వేరు ఆంట్రప్రెన్యూయల్ కాన్సెప్ట్స్ నుంచి ప్రత్యేక అంశాలు నేర్చుకోవడం.

2. ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ ఎదుర్కొన్న సవాళ్లను తెలుసుకుంటూ ఈ కాన్సెప్ట్స్ గురించి అవగాహన పెంచుకోవడం.

3. తాము నేర్చుకున్నదంతా రియల్ లైఫ్ బిజినెస్ లో అమలుపర్చడం.

"ఆంట్రప్రెన్యూర్ షిప్ ని పూర్తి స్థాయిలో నేర్పిస్తామని మేమెప్పుడూ చెప్పలేదు. కానీ ఆంట్రప్రెన్యూర్ షిప్ కు సంబంధించిన చాలా విభిన్నమైన అంశాలను మేం బోధిస్తాం. ఇవి నేర్చుకోవడం ద్వారా భావి ఆంట్రప్రెన్యూర్లు సవాళ్లను సులువుగా ఎదుర్కోగలరు. గతంలో పలువురు ఆంట్రప్రెన్యూర్లు చేసిన తప్పులను వీళ్లు చేయకుండా ఉంటారన్నది మా ఆలోచన" అంటారు రోనీ.

స్టార్టింగ్ ట్రబుల్

ఇలాంటి వెంచర్ ప్రారంభించడం గొప్ప కాదు. సరైన అనుభవజ్ఞులు దొరకాలి. అన్నీ పక్కాగా నేర్పేవాళ్లుండాలి. ఆ స్థాయిలో యాక్టివిటీస్ జరగాలి. ప్రారంభ రోజుల్లో మయాంక్, రోనీలు భారీస్థాయిలో విద్యావేత్తలు, కంటెంట్, ప్రొడక్షన్, టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ ని నియమించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం టీమ్ సంఖ్య 45. ఇక టాప్ ఆంట్రప్రెన్యూర్లను, నిపుణులను ఒకేచోట చేర్చారు. తమ వినూత్న ఐడియా వల్లే ఇదంతా సాధ్యమైందంటారు మయాంక్. ఆన్ లైన్ మీడియం ద్వారా పాఠాలు బోధిస్తుండటంతో తమ ప్రోగ్రామ్స్ చాలామందికి అందుబాటులో ఉంటున్నాయని గర్వంగా చెబుతున్నారు.

"ఆంట్రప్రెన్యూర్లుగా రాణిద్దామని అనుకుంటున్నవారి కోసం ఏదైనా చేయాలన్న తపన తోనే 'అప్ గ్రాడ్' ప్రారంభించాం. ఇండస్ట్రీకి చెందిన 40 మంది నిపుణుల అనుభవ పాఠాలను, నైపుణ్యాలను ఒకే వ్యక్తి కోసం ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ పైకి తీసుకురావాలంటే ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సిందే" అంటారు మయాంక్.

కంటెంట్ ను విద్యాపరంగా, విజ్ఞానపరంగా మార్చడంలో వీరికి సమస్యలొచ్చాయి. ఆంట్రప్రెన్యూర్లను పాఠాల కోసం ఒప్పించడం కూడా వీరికి పెద్ద సవాలే. ఒక కాన్సెప్ట్ నిర్మాణం ఎలా ఉండాలని ఆలోచించడం ఒక సమస్యైతే... వాటిని కెమెరా ముందు వివరించడం మరో సమస్య. టాప్ ఆంట్రప్రెన్యూర్స్, ఎక్స్ పర్ట్స్ అందుబాటులో ఉన్నప్పుడే పని చేసుకోవాలి. ఒక్కోసారి అసాధారణమైన సమయాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి రాత్రి పది నుంచి మధ్యరాత్రి ఒంటిగంటవరకు షూటింగ్ చేసిన సందర్భాలున్నాయి.

సరైన ప్రోగ్రామ్ ను తీర్చిదిద్దడం

మిగతా ఎడ్యూటెక్ ఆర్గనైజేషన్ల లాగా కంటెంట్, వీడియోలతో నింపెయ్యడం వీరి ఉద్దేశం కాదు. ఆంట్రప్రెన్యూర్స్, ఎక్స్ పర్ట్స్ నైపుణ్యాలను, అనుభవాలను అందించే వేదిక తయారు చేయడమే ప్రధాన ఉద్దేశం. డిమాండ్ ను, అవసరాన్ని సృష్టించడమే మా టాలెంట్ అంటారు రోనీ. ప్రజలు ముందు ఇదేంటని చూస్తారు. తర్వాత ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. ఆ తర్వాత దాని అవసరం ఏంటో బోధపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యత, నైపుణ్యత అవసరం ఇంకా తీరలేదు. మారుతున్న పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా ఉద్యోగులు మారట్లేదు. విద్యావ్యవస్థ ఎలా ఉండాలంటే చదువుతోనే పూర్తి నైపుణ్యం వచ్చెయ్యాలి. ప్రతీ అంశంలో మాస్టర్ కావాలి. ప్రస్తుత విద్యావ్యవస్థ అలా లేకపోవడం వల్లే స్కిల్స్ నేర్పే సంస్థలు పుట్టుకొస్తున్నాయి. వచ్చే రెండేళ్లలో మరో 15 ప్రోగ్రామ్స్ ప్రారంభించాలన్న లక్ష్యంతో పనిచేస్తోందీ సంస్థ. వేర్వేరు నగరాల్లో అడుగు పెట్టాలన్న ఆలోచన కూడా ఉంది.

"వ్యక్తులకు వారి కెరీర్ లో ఎదిగేందుకు విద్యాపరంగా, జ్ఞానపరంగా మేం ఎంతో ఉపయోగపడుతున్నాం. అంతే కాదు... వేర్వేరు కెరీర్ లో అడుగు పెట్టాలనుకునేవారికీ సాయపడుతున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే కెరీర్ గ్రోత్ ను అప్ గ్రేడ్ చేసుకోవడం అన్నమాట" అంటారు మయాంక్.

'అప్ గ్రాడ్'కు 20 దేశాల్లోని 200 నగరాల నుంచి రెండు వేలకు పైగా దరఖాస్తులొచ్చాయి. రెవెన్యూ వివరాలేంటో చెప్పడానికి నిరాకరించారు 'అప్ గ్రాడ్' ఫౌండర్లు. 'అప్ గ్రాడ్'లో సెషన్ తీసుకోవడం గొప్ప అనుభవం అంటారు గెస్ట్ స్పీకర్లలో ఒకరైన బ్లూ స్టోన్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) అన్షుల్ ఖండేల్వాల్. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను నేర్పడం విద్యార్థులకు చాలా మేలు చేస్తుందంటారాయన. ఇక ఇక్కడ నేర్చుకోవడం గొప్పగా ఉందంటారు విద్యార్థి షెజీన్ వేలాయుధన్.

"మొదట్లో కొన్ని సెషన్స్ తర్వాత ఆసక్తి ఇంకా పెరుగుతుంది. వేర్వేరు రంగాలకు చెందినవారి పాఠాలతో వేర్వేరు విభాగాల జ్ఞానమంతా తెలిసిపోతుండటం ఆసక్తిని మరింత పెంచుతుంది. ఇక స్టడీ మెటీరియల్ ఎలా కావాలంటే అలా అన్ని ఫార్మాట్లలో లభించడం విశేషం. వీడియోలు, ప్లెయిన్ టెక్స్ట్, పీడీఎఫ్, క్వశ్చన్-ఆన్సర్స్ లభించడం నన్నెంతో ఉత్సాహపర్చాయి" అంటారు షెజీన్ వేలాయుధన్.

భారతదేశంలో 18 నుంచి 24 ఏళ్ల వయస్సున్నవారి సంఖ్య 15 కోట్లు ఉంటుంది. వీరిలో రెండున్నర కోట్ల మంది మాత్రమే ఉన్నత చదువుల కోసం ఆసక్తి చూపుతున్నారు. అంటే ప్రతీ ఆరుగురిలో ఒకరు మాత్రమే హయ్యర్ స్టడీస్ వైపు అడుగులు వేస్తున్నారంటారు మయాంక్.

"ప్రధాన విద్యావ్యవస్థకు అనుబంధంగా మారుతున్న ఆన్ లైన్ ఎడ్యుకేషన్ స్పేస్ లో చాలా సవాళ్లున్నాయి. ప్రధాన విద్యావ్యవస్థతో సమానంగా పాఠాలు అందించాలి. నేర్చుకునే అనుభవం అలాగే ఉండాలి. అంటే స్కూల్ లో, కాలేజీలో, యూనివర్సిటీలో లభించినట్టు ఉండాలి" అంటారు మయాంక్.

యువర్ స్టోరీ మాట

భారతదేశంలో 14 లక్షలకు పైగా స్కూళ్లు, 35 వేల ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి. కాలేజీకెళ్లే విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. ప్రపంచంలోని ఉన్నత విద్యావ్యవస్థ ఉన్న అతిపెద్ద దేశాల్లో మనదీ ఒకటి. అయితే ఐదారుగురిలో ఒక్కరు మాత్రమే ఉన్నత విద్యవైపు అడుగులు వేస్తున్నారు. 30 శాతం మంది భారతీయ గ్రాడ్యుయేట్లకు మాత్రమే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మిగతా వారిని స్కిల్స్ పరంగా అప్ గ్రేడ్ చేసేందుకు వేదాంతు, సింపిలెర్న్ లాంటి పలు ఎడ్యుటెక్ స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి. వీటిలో 'అప్ గ్రాడ్' కాస్త విభిన్నమైన మోడల్ తో వస్తోంది. ప్రతీ ప్రోగ్రామ్ పాఠ్య ప్రణాళిక నిపుణుల స్వీయానుభవాలతో రూపొందించిందే. ఇలాంటివి ఆన్ లైన్ లో ఎక్కడా దొరకవని గర్వంగా చెబుతారు రోనీ. మరి కర్ల్ మెహ్తాకు స్కిల్ డెవలప్ మెంట్ ప్లాట్ ఫామ్ 'స్కిల్ అప్ ఇండియా'తో 'అప్ గ్రాడ్' ఎలా పోటీ పడుతుందో చూడాలి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags