సంకలనాలు
Telugu

బినాటోన్ మొబైల్‌తో బ్యాక్ టు ఎయిటీస్‌

ఇదంతా స్మార్ట్ ఫోన్ల కాలం. మొబైల్స్ అన్నీ బ‌క్కిచిక్కిపోతున్నాయి. ఎంత స‌న్న‌గా ఉంటే అంత క్రేజ్‌. అయితే ఆ ట్రెండ్‌కు స్వ‌స్తిప‌లుకుతోంది బినాటోన్‌. త‌న‌దైన స్ట‌యిల్‌తో మొబైల్ క‌స్ట‌మ‌ర్ల‌ను మ‌ళ్లీ ఎయిటీస్‌కు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తోంది.

GOPAL
16th May 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

బినాటోన్‌.. ఎల‌క్ట్రానిక్ రంగంలో 56 ఏళ్లుగా సేవ‌లందిస్తున్న సంస్థ‌. బ్రాడ్‌బ్యాండ్‌, నెట్‌వ‌ర్కింగ్, హోమ్ మానిట‌రింగ్ సొల్యూష‌న్స్‌, టెలిఫోన్స్‌, మొబైల్‌ఫోన్స్‌ వంటి ప‌రిక‌రాల‌తోపాటు అనేక ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల‌ను త‌యారుచేస్తున్న సంస్థ‌. తాజాగా మ‌రో స‌రికొత్త మొబైల్‌ను కూడా ఇటీవ‌లే మార్కెట్లోకి విడుద‌ల చేసింది. అదే ది బ్రిక్‌, ఇండియాస్ రెట్రో మొబైల్‌.

image


అన్ని సంస్థ‌లూ కొత్త కొత్త మోడ‌ల్స్‌లో, స్లిమ్ మొబైల్స్‌ను రిలీజ్ చేస్తుంటే ఈ సంస్థ మాత్రం క‌స్ట‌మ‌ర్ల‌ను తిరిగి ఎయిటీస్‌కు తీసుకెళ్లింది. ఎనభయ్యో దశకంలో ఉన్న‌టువంటి వైర్‌లెస్ టెలిఫోన్ డిజైన్ మాదిరిగా మొబైల్ ఫోన్‌ను రూపొందించింది. పాత‌కాలం ఫోన్‌లా ఉన్నా దీని ప్ర‌త్యేక‌త‌లు దీనికున్నాయి. ఈ ఫోన్ స్టాండ్ బై టైమ్ ఎంతో తెలుసా.. ఒక నెల‌. అలాగే ధారాళంగా 14 గంట‌లు మాట్లాడొచ్చు. అద్భుత‌మైన ఫ్లాష్‌లైట్‌. ఇంకా ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు. ఈ స్పీడ్ కాలంలో ఇంకా ఎయిటీస్ స్ట‌యిల్ ఎందుకు ? అంటే ప్ర‌తి ఒక్క‌రి జీవితంలోకి ఎయిటీస్ ఫ‌న్‌ను అంద‌జేయాల‌న్న‌దే త‌మ త‌ప‌న అంటారు బినాటోన్ హెడ్ ఎస్‌పీ సింగ్‌.

"మొబైల్ ఫోన్ల‌కు సంబంధించి ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను మార్చాల‌నుకుంటున్నాం. అత్య‌ద్భుత‌మైన ఫ్యాష‌న‌బుల్ మొబైల్‌ల‌ను రూపొందించాల‌న్న‌దే మా ల‌క్ష్యం. ఇప్పుడంతా స్లిమ్ ఫోన్‌ల‌దే రాజ్యం. కానీ పెద్ద‌దైన ఫోన్‌, స్ట‌యిల్‌గా ఉండే మొబైల్‌ను రూపొందించాం".

ఇక ఈ బ్రిక్ ఫోన్‌ను బ్లూ టూత్ ద్వారా స్మార్ట్ ఫోన్‌కు కూడా క‌నెక్ట్ చేయొచ్చు. ఆ స్మార్ట్ ఫోన్‌కు వ‌చ్చిన ఫోన్ల‌ను రిసీవ్ చేసుకోవ‌చ్చు. అలాగే మెసేజెస్‌ను కూడా చ‌ద‌వొచ్చు. లేదంటే బేసిక్ ఫోన్‌గా కూడా వాడుకోవ‌చ్చు.

ప్ర‌త్యేక‌త‌లు..

 • ఇష్ట‌మైన, ప‌సందైన మ్యూజిక్‌ను ఆస్వాదించేందుకు పెద్ద‌ద‌యిన స్పీక‌ర్‌, ఓ మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ వంటి సౌక‌ర్యాల‌ను కూడా ఈ ఫోన్‌లో అందించారు. అలాగే ఎఫ్ ఎం రేడీయో, ఎల్ ఈడీ వంటి అద‌న‌పు సౌక‌ర్యాలు కూడా ఉన్నాయి. ఇక రెట్రో గేమ‌ర్ల కోసం, క్లాసిక్ మొబైల్ ఫోన్ గేమ్ స్నేక్ కూడా ఉంది. ఇది టూ ఇన్ వ‌న్ మొబైల్ ఫోన్‌, బ్లూటూత్ హ్యాండ్ సెట్ (బ్లూ టూత్ ద్వారా బ్రిక్ మొబైల్‌కు క‌నెక్ట‌యి స్మార్ట్ ఫోన్‌గా మార్చుకోవ‌చ్చు). 
 • బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్ కాంటాక్ట్స్‌, మ్యూజిక్‌, కాల్ లాగ్ అన్నింటిని యాక్సెస్ చేయొచ్చు. అలాగే స్పీక‌ర్ల‌లో మ్యూజిక్‌ను ఆస్వాదించొచ్చు. ఐఓఎస్‌తోపాటు ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు కూడా ఈ బ్లూటూత్ అనుకూలంగా ఉంది. 
 • యూఎస్‌బీ ద్వారా కూడా స్మార్ట్ ఫోన్‌ను చార్జ్ చేసుకోవ‌చ్చు. 
 • 3495 రూపాయ‌ల స‌ర‌స‌మైన ధ‌ర‌కు బ్రిక్ మొబైల్ అన్ని ఆన్‌లైన్, రిటైల్‌ స్టోర్స్‌లో ల‌భిస్తోంది.
కొన్ని డీల్స్‌లో అయితే కేవ‌లం రూ. 2708 రూపాయ‌ల‌కే దొరుకుతోంది. రివ్యూలు కూడా ఈ మొబైల్ గురించి పాజిటీవ్‌గానే చెప్తున్నాయి. బినాటోన్ వెబ్‌సైట్ meetthebrick, డిజిట‌ల్ స్పై వెబ్‌సైట్‌లో రివ్యూలు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ల‌ను వాడి చార్జింగ్ త్వ‌ర‌గా అయిపోవ‌డం, రేడియేష‌న్ స‌మ‌స్య వంటి ఇబ్బందులు ఎదుర్కొన్న‌వారికి ఈ బ్రిక్ మొబైల్ ఎంతో ఊర‌ట‌నిస్తుండ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. మూడు వేల రూపాయ‌లు ఖ‌ర్చుపెట్టి ఈ బ్రిక్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే, క‌స్ట‌మ‌ర్లు ఏ విధంగాను నిరాశ చెంద‌ర‌ని బినాటోన్ భ‌రోసా ఇస్తున్న‌ది. మ‌రికెందుకు ఆల‌స్యం. ఓ సారి ప్ర‌య‌త్నించి చూస్తే.. మ‌న‌మూ ఎయిటీస్‌లోకి వెళ్లిపోవ‌చ్చు

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags