సంకలనాలు
Telugu

కన్నడిగుల మనసు దోస్తున్న 'ఫ్రెష్ మెను'

GOPAL
12th Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

తాజాగా, నాణ్యతతో ఉంటే ఏ పదార్థమైనా కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అది ఫుడ్ ఇండస్ట్రీలో చాలా అవసరం. కస్టమర్లు కోరుకునే రుచికరమైన, తాజా ఆహార పదార్థాలను అందిస్తూ కన్నడిగుల మనసు దోచారు ఐఐఎం పూర్వ విద్యార్థిని రష్మీ దాగా. బెంగళూరు నగర వీధుల్లో ఫ్రెష్ మెనూతో గల్లీ గల్లీలో కొత్త వంటకాలను అందిస్తున్నారు. ఏడాదిలోపే తమ వ్యాపారాన్ని మరో పది నగరాలకు విస్తరించాలనుకుంటున్నారు.

రుచికరమైన ఆహార పదార్థాలను చూస్తే ప్రతి ఒక్కరికి నోరూరుతుంది. రోజు తినే ఆహారం కావొచ్చు లేదా అప్పుడప్పుడు టేస్ట్ చేసే స్పెషల్ వంటకాలూ కావొచ్చు. రుచికరంగా ఉంటే వాటిని తినకుండా ఉండలేం. అలా భోజన ప్రియుల బలహీనతలను క్యాష్ చేసుకుని వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారు ఫ్రెష్ మెనూ సీఈఓ, సంస్థ ఫౌండర్ రష్మీ దాగా. 

image


ఫుడ్ బిజినెస్‌లోకి రష్మీ ప్రవేశించి ఏడాది దాటింది. ఈమె కెరీర్‌లో ఎక్కువగా కొనసాగింది సేల్స్ పర్సన్‌గానే. సేల్స్ రంగంలోనే ఎక్కువగా నేర్చుకున్నానని ఈ ఐఐఎం గ్రాడ్యుయేట్ అంటూ ఉంటారు. ‘‘ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో సేల్స్ రంగంలో పని చేసిన తర్వాత సొంతంగా ఏదైనా సంస్థను స్థాపించాలనుకున్నాను. అలా సొంత మూలధనంతో afday.comను ప్రారంభించాను. కళలు, కళారంగాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు అదో వేదిక’’ అని ఆమె వివరించారు.

అయితే ఆ ప్రయోగం ఆమె అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. దీంతో ఆ సంస్థను మూసేసి మరోసారి ఓ కంపెనీలో చేరారు. ఏడాదిన్నరపాటు బ్లూస్టోన్, ఓలా క్యాబ్‌ సంస్థలకు సేల్స్ హెడ్‌గా పనిచేశారు. మరోసారి స్టార్టప్ కంపెనీపై ఆమెకు మనసు మళ్లింది. దీంతో ఈసారి ఫుడ్ బిజినెస్‌లోకి ప్రవేశించారు.

తాజా తాజా ఫ్రెష్ మెనూ..

రుచికరమైన ఆహార పదార్థాలంటే చాలామందికి నోరూరుతుంది. రష్మీ కూడా భోజన ప్రియురాలు. అందుకే ఈ రంగంలోకి ప్రవేశించానంటారామె. రెస్టారెంట్‌ లాంటి వ్యాపారం అంత ఉపయోగకరం కాదని ఆమె నిర్ణయానికొచ్చేశారు. దీంతో వెస్ట్రన్ మార్కెట్‌ను కొన్నాళ్లపాటు పరిశీలించారు. ఫ్రెష్ పేరుతో తయారు చేసే తాజా, రుచికరమైన భోజనాన్ని అందిస్తే ఎలా ఉంటుంది అనే ఐడియా ఆమె మదిలో మెదిలింది. ‘‘ఓ ఫంక్షనల్ కిచన్‌ను ఏర్పాటు చేసి కొత్త కొత్త రుచులను టెస్ట్ చేయడం ఆరంభించాం. మార్కెట్లో మంచి స్పందన వచ్చింది’’ అని రష్మీ చెప్పారు.

ఫ్రెష్ మెనూ సిబ్బంది

ఫ్రెష్ మెనూ సిబ్బంది


సంస్థను ప్రారంభించినప్పటి నుంచి ఆహార పదార్థాలు తాజాగా ఉండేలా చూసుకున్నారామె. ఇందుకోసం మొత్తం చెయిన్‌ను సొంతంగా చూసుకున్నారు. మెనూలో ఏం ఉండాలి, దానికి కావాల్సిన పదార్థాలు, ప్యాకింగ్, డెలివరీ, ఇలా ప్రతి అడుగులోనూ సొంతముద్ర కనిపించేలా పనిచేశారు. ‘‘ప్రతి విభాగంలోనూ ఒప్పందాలు కుదుర్చుకుని, నాణ్యమైన ఆహారాన్ని అందించడం ఔట్ సోర్సింగ్ ద్వారా చాలా కష్టం’’ అని అంటారామె.

మొదటి అడుగు..

ఫ్రెష్ మెనూ కోసం మంచి పదార్థాలను అందించే వ్యాపారుల ఎంపిక అంత సులభం కాదు. అందుకోసం ఆమె ఎంతో కష్టపడ్డారు. ఇందుకోసం షెఫ్‌లనే స్వయంగా మార్కెట్‌కు తీసుకెళ్లారు. మొదట్లో మార్కెట్‌కు వచ్చేందుకు షెఫ్‌లను అంగీకరించలేదు. అయితే ఆ తర్వాత ఆమె పట్టుదలను చూసి వారు అంగీకరించారు. ఫంక్షనల్ కిచెన్స్‌ను ఏర్పాటు చేయడం, పర్ఫెక్ట్ ప్యాకేజీ డిజైన్, పర్ఫెక్ట్ డెలివరీ చైన్‌ను ఆమె ఏర్పాటు చేసుకున్నారు.

‘‘ కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా పూర్తి పనితనం లేకపొతే, మంచి బ్రాండ్‌గా గుర్తింపు పొందడం కష్టం. మార్కెట్లో పట్టు సాధించాలాంటే ఇది చాలా అవసరం కూడా’’ అని రష్మీ చెప్తారు.

సిబ్బంది, షెఫ్‌లతో ఫ్రెష్ మెనూ సీఈఓ రష్మీ

సిబ్బంది, షెఫ్‌లతో ఫ్రెష్ మెనూ సీఈఓ రష్మీ


ఆపరేటింగ్ కిచెన్స్

హబ్ అండ్ స్పోక్ మోడల్‌ను ఫ్రెష్ మెనూ ఫాలో అవుతోంది. అంటే ఏ ప్రాంతం నుంచైతే ఆర్డర్ వస్తుందో, అదే ప్రాంతం నుంచి పదార్థాలను సరఫరా చేస్తారు. ఉదాహరణకు బెంగళూరులోని ఇందిరానగర్ నుంచి ఆర్డర్ వస్తే, ఇందిరా నగర్ కిచెన్‌లో తయారైన ఆహార పదార్థాలనే సప్లయ్ చేస్తారు. అలా చేయడం వల్ల పదార్థాలు తాజాగా ఉండటమే కాకుండా, త్వరగా కూడా కస్టమర్లకు చేరుతాయి. ఫ్రెష్ మోనూ సిబ్బంది నిర్వహించిన రీసెర్చ్, సర్వేల ఆధారంగా వివిధ ప్రాంతాల్లో కిచెన్ సెటప్‌లను ఏర్పాటు చేశారు. కిచెన్లను ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రాంతాల్లో మార్కెటింగ్ వ్యవహారాలు నిర్వహించారు.

బెంగళూరులో సర్జాపూర్, వైట్‌ఫీల్డ్, కోరమంగళ, బెల్లాండుర్, రిచ్‌మండ్ టౌన్, ఇందిరానగర్, జేపీ నగర్, హెన్నూరు, బీటీఎం లేఔట్ వంటి ప్రదేశాల్లో పది ఆపరేటింగ్ కిచెన్స్ ఉన్నాయి సంస్థకు. మరికొన్ని రోజుల్లో ఈ కిచెన్ల సంఖ్యను పెంచాలన్న ఆలోచన ఉంది.

సిబ్బందితో రష్మీ

సిబ్బందితో రష్మీ


‘‘ ముంబై, ఢిల్లీల్లో కూడా ఇలాంటి నమూనాతో వ్యాపారం మొదలుపెట్టాం. భోజన ప్రియుల మనసు త్వరలోనే దోచుకుంటాం ’’ అని రష్మీ చెప్పారు.

సరికొత్త ప్యాకేజింగ్

కస్టమర్లను ఆకర్షించాలంటే రుచికరమైన భోజనం అందించడం ఒక్కటే సరిపోదని రష్మీ భావన. అలాగే ఇందుకోసం ఎవరితోనైనా ఒప్పందం చేసుకోవడం కూడా అన్ని సందర్భాల్లో వర్కవుట్ కాదని ఆమె అనుకుంటూ ఉంటారు. ఆహార పదార్థాలను బట్టి ప్యాకేజింగ్ కూడా డిఫరెంట్‌గా మార్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా సిబ్బంది రూపొందిస్తుంటారని రష్మీ చెప్పారు.

‘‘ మనకు ఇష్టమైన, కోరుకున్న, కావాల్సినంత ప్రతిసారీ మార్కెట్లో లభించకపోవచ్చు. కస్టమర్లు కొన్నిసార్లు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు చేస్తుంటారు. స్టార్టప్ కంపెనీగా ఆ పని పూర్తి చేయలేకపోవచ్చు. ప్యాకేజింగ్ అనేది ఎప్పటికప్పుడు చేసుకునే ప్రక్రియ’’ అని ఆమె వివరించారు.

ఫ్రెష్ మోనూ వ్యవస్థాపకురాలు రష్మీ దగా

ఫ్రెష్ మోనూ వ్యవస్థాపకురాలు రష్మీ దగా


ఫుడ్ డెలివరీకీ ఎయిర్‌టైట్, లాకింగ్ సౌకర్యమున్న బాక్సులు ఉపయోగించాల్సి ఉంటుంది. అందువల్ల ప్రస్తుతానికైతే పర్యావరణహితమైన ప్యాకేజింగ్‌ సాధ్యం కావడం లేదని రష్మీ చెప్తారు.

స్టార్టప్ కంపెనీ ప్రతి ఒక్కరి లక్ష్యం ఒక్కటే. వేగంగా ఎలా వృద్ధి చెందాలి. అందుకు ఆమె కొన్ని సూచనలు కూడా ఇస్తారు. సరైన మార్గంలో పయనిస్తూ, పరిష్కారాలు కనుక్కోవాలంటారామె. సిబ్బంది వ్యవహారాలను సరిగ్గా పర్యవేక్షిస్తే ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కావని, ఒకవేళ సమస్యలు వచ్చినా పరిష్కారమవుతాయని అంటారామె. ‘‘మంచి దూరదృష్టి, పనిచేసే ఆలోచన ఉన్నవారిని ఎంపికచేసుకోవడమే ముఖ్యం’’ అని రష్మీ వివరించారు.

సమస్యలతో పోరాటం

ఫ్రెష్ మోనూ బెంగళూరులో విజయపథాన నడుస్తున్నప్పటికీ రష్మీ కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. అన్ని రంగాల బాధ్యతలను స్వతంత్ర్యంగా నిర్వహిస్తూ, అన్నింటిని కలుపుకుని పోవడం అంత సులభం కాదు. అందుకోసం సిబ్బందిని ఆమె తనకు అనుకూలంగా డివైడ్ చేసుకున్నారు. ఏర్పాటు చేసిన ప్రతీ లొకేషన్‌లోనూ కార్యకలాపాలు వేగంగా జరిగేలా చూసుకుంటారు. అలా కొన్ని ప్రాంతాల్లో కొన్ని విభాగాల్లో పనులు వేగంగా జరుగుతుండటం ఆమె దృష్టికొచ్చింది.

వేగంగా వృద్ధి

గత డిసెంబర్‌లో లైట్‌స్పీడ్ వెంచర్స్ ఫ్రెష్ మెనూలో పెట్టుబడులు పెట్టింది. నిధులకు కూడా కొరత లేకపోవడంతో మరింత పటిష్టమైన బృందాన్ని తయారు చేస్తామని రష్మీ ధీమాగా చెప్తున్నారు. జనవరి నుంచి ప్రతి నెలా ఓ కొత్త కిచెన్‌ను ప్రారంభించారామె. ప్రతి నెలా వ్యాపారంలో 30 నుంచి 40 శాతం వృద్ధి కనిపించింది.

క్వాలిటీయే కీలకం

నాణ్యమైన పదార్థాలను అందిస్తే ఏ వ్యాపారమైనా దినదినాభివృద్ధి చెందుతుంది. నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ప్రతిరోజూ చర్యలు తీసుకోవడం, అంతర్గత చెకింగ్స్ ఎప్పటికప్పుడు నిర్వహిస్తుంటారు ఫ్రెష్ మెనూలో. ప్రతి ఒక్క కస్టమర్లను సంతృప్తి పర్చడం అంత కష్టమైన పనేమీ కాదన్నది రష్మీ భావన. అందునా ఫుడ్ ఇండస్ట్రీలో విభిన్న రుచులు కోరుకునే కస్టమర్లను ఆకట్టుకోవడంలోనే మజా ఉంటుందనేది ఆమె ధీమా.

కస్టమర్ల అభిప్రాయాలకే ఫ్రెష్ మెనూ పెద్ద పీట వేస్తోంది. కస్టమర్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎప్పటికప్పుడు పనితీరును మార్చుకుంటోంది. ‘‘ ప్రతి రోజూ ఒకే మెనూ కాకుండా ఎప్పటికప్పుడూ మార్చేస్తున్నాం. కస్టమర్ల ఫీడ్ బ్యాక్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం. వారి అభిప్రాయాల ఆధారంగానే మమల్ని మెరుగుపర్చుకుంటూ అభివృద్ధి చెందుతున్నాం’’ అని రష్మీ వివరించారు.

ఫ్రెష్ మెనూలో పనిచేసే ప్రతీ ఉద్యోగి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారు. సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే కాదు.. వాటిని పరిష్కరించేందుకు కూడా ప్రయత్నిస్తారు. ప్రతీ సారీ వేర్వేరు ఉద్యోగులు మార్కెటింగ్ విధులు నిర్వర్తించి సమస్యలు తెలుసుకుంటారు. అంతేకాదు షెఫ్‌లు సైతం ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో కస్టమర్ల అభిప్రాయాలు తెలుసుకుని, వారు ఎక్కువగా కోరుకునే రుచులనే వారికందిస్తారు.

భారీ మార్కెట్

ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ రంగం విలువ 50 కోట్ల బిలియన్ డాలర్ల మార్కెట్‌గా అంచనా వేస్తున్నారు. అంతేకాదు ప్రతీ ఏటా 16 శాతం వృద్ధి కూడా నమోదవుతోంది. భారత్‌లో కూడా ఈ రంగం వేగంగా విస్తరిస్తోంది. ఫుడ్ ఇండస్ట్రీకి ఈ ఏడాది తొలి అర్ధభాగంలోనే 3.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. స్విగ్గీ, కేతాల్ అడ్వయిజర్స్‌కు చెందిన కునాల్ వాలియా వంటి ఫుడ్ స్టార్టప్ సంస్థలు పెట్టుబడులపై భారీగా అంచనాలు పెట్టుకున్నాయి.

యువత, భార్యభర్తలు ఉద్యోగాలు చేసే కుటుంబాలు సభ్యులు బయట ఆహారానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, వారి కారణంగా ఫుడ్ ఇండస్ట్రీలు భారీగా లాభపడుతున్నాయని ఇండియా కోషియంట్ ఫౌండర్ ఆనంద్ లూనియా అంటున్నారు.

website

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags