సంకలనాలు
Telugu

అరుదైన వస్తువుల అద్భుత వేదిక ఇండియన్ రూట్స్

మీ వద్ద ఓ అరుదైన వస్తువు ఉంటుంది. లేదూ.. ప్రాచీన కాలపు అందాల నగిషీల బొమ్మ ఉంటుంది..!! కాదూ... రసరమ్యమైన రామాయణాన్ని అద్భుతంగా అంచుపై ఆవిష్కరించిన చీర ఉంటుంది..! దాన్ని దాచుకోగలిగితే సరే. కానీ అమ్మేయాలంటే మాత్రం.. మీరు దిక్కులు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే.. మీకు అలాంటి అపురూపమైన వస్తువులను అధిక ధరలకు ఎక్కడ కొంటారో తెలియదుగా..! ఇలాంటి వారి ఇబ్బందులను గుర్తించిన యువకులు.. ఇండియన్ రూట్స్ పేరిట అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది ఎన్డీటీవీ. ఇంటర్నెట్ ద్వారా ఇలాంటి అపురూపమైన వస్తువులకు సరైన గిట్టుబాటు ధర లభించేలా చేస్తుంది ఈ.. ఇండియన్ రూట్స్.

30th Mar 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఇంటర్నెట్ ద్వారా వాణిజ్యం... అందులో లాభాలు సముపార్జించడం అంత తేలికేమీ కాదు. అయితే.. ఎన్డీటీవీ గ్రూప్ కి చెందిన ఆన్ లైన్ రిటైల్ వ్యాపారం.. ఇండియన్ రూట్స్ స్థాపించిన ఎనిమిది నెలల్లోపే అద్భుతమైన లాభాల బాట పట్టింది. దేశ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు, వారికి చెందిన అపురూప వస్తువుల విక్రయాలే లక్ష్యంగా ఈ ఇండియన్ రూట్స్ ఏర్పాటైంది.

ఖర్చుల నియంత్రణ, వెళ్ళిపోయే వాళ్ళని పట్టించుకోకపోవడం, నవ్య ఆలోచనలు, మార్జిన్ ల కోసం అన్నట్లు కాకుండా, కీలకమైన బ్రాండ్ల ఉత్పత్తులను విక్రయించడం లాంటి చర్యలతో.. గత నెలలోనే మేము లాభాలబాట పట్టాము. అంటారు సంస్థ సీఈఓ, సహ వ్యవస్థాపకుడూ అయిన రాహుల్ నార్వేకర్.

image


ప్రస్తుతం సంస్థ నెలకు 2,700 ఆర్డర్లను సాధిస్తోంది. ప్రతి ఆర్డర్ కూడా సగటున రూ. 10,000 వరకూ ఉంటోంది. చీరలు, ఎస్.కె.డి.,(సెమీ నాక్డ్ డౌన్ – ఇంపోర్ట్ డ్యూటీ తప్పించుకునేందుకు విడిభాగాలుగా తీసుకువచ్చేవి) గృహొపకరణాలు లాంటి క్రయ విక్రయాలు అధికంగా ఉంటున్నాయి. గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. ఈ-కామర్స్ ద్వారా.. గతంలో ఎన్నడూ లేని రీతిలో, రూ 19 లక్షల విలువ చేసే ఒకే లావాదేవీని నిర్వహించింది. అతి ప్రాచీనమైన దువ్వెనకు, డిజైనర్ పరణవి కపూర్ రూపొందించిన శాలువాకు ఈ ధర పలికింది. ప్రముఖ డిజైనర్లు సవ్యసాచి, రోహిత్ బాల్, నీతా లుల్లా, మీరా, ముజఫర్ అలి, అనితా డోంగ్రే లాంటి ప్రముఖుల డిజైన్లనూ ఇండియన్ రూట్స్ ఆహ్వానిస్తోంది.

దేశీయ, అంతర్జాతీయ విపణిలో తేడాలు :

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ-కామర్స్ వెంచర్స్ నిర్వహించడంలో రాహుల్ కు విశేష అనుభవం ఉంది. ఇండియన్ రూట్స్ కన్నా ముందు.. రాహుల్ ఫ్యాషన్ అండ్ యు సంస్థ వ్యవస్థాపక సభ్యుడిగా ఉండేవారు. ఇండియన్ రూట్స్ తో.. సునిశితము, అపురూపమూ అయిన భారతీయ వస్తువులను ప్రపంచంలోని మిగిలిన భారతీయులకు విక్రయిస్తున్నాము. అని రాహుల్ తెలిపారు.

ఈ-కామర్స్ ఆధారిత ఇతర సంస్థలకన్నా.. ఇండియన్ రూట్స్ చాలా విభిన్నమైనదనే చెప్పాలి. వస్తువును అందించాక నగదు చెల్లింపు విధానానికి వీరు వ్యతిరేకం. “ మేము సిఓడి (క్యాష్ ఆన్ డెలివరీ) విధానాన్ని అనుసరించము. మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉంటాము. అత్యున్నత నాణ్యతతో కూడిన ఉత్పత్తిని గుర్తిస్తాము. ఇందులో అత్యంత ప్రాచీనమైన హస్తకళాకృతులూ ఉంటాయి. చేతివృత్తుల కళాకారులు.. తమ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం లేక.. మరుగున పడిపోతున్నారు. అని రాహుల్ అంటారు. రామాయణాన్ని చేతితో అందంగా ముద్రించిన ప్రత్యేక చీరను నేత కార్మికుడి నుంచి గుర్తించి.. దాన్ని ఈ-కామర్స్ ద్వారా అమ్మిపెట్టారు.. ఇండియన్ రూట్స్ నిర్వాహకులు.

క్యాష్ ఆన్ డెలివరీ లేదు !

దేశంలో,.. ముఖ్యంగా పల్లెల్లోని చేతి వృత్తి కళాకారులను మధ్యవర్తులు దోచుకుంటున్నారు. ఇండియన్ రూట్స్ సంస్థ ఇలాంటి వారికి చెక్ పెడుతుంది. అటు చేతి వృత్తి కళాకారుడికి, ఉత్పత్తి కొనుగోలు దారుడికీ సంతృప్తి కలిగేలా చేస్తుంది. “ హస్తకళాకారుడి ఉత్పత్తి అంటూ.. ఓ చేతి సంచీని అమ్మజూపితే.. ప్రజలు సంతోఫంగా లక్షల రూపాయలు పెట్టి కొంటారు. అదే.. హస్త కళాకారుల చేతుల్లో నిజంగానే తయారైన వస్తువులకు మార్కెట్ లో.. మార్కెటింగ్, ప్యాకేజింగ్, సరఫరా అంశాలన్నీ కనిపించవు. మేము ఆలోపాన్ని సరిదిద్దే పాత్రను పోషిస్తున్నాము. అదే మాకు ఇతర ఈ-కామర్స్ వ్యాపార సంస్థలకూ మధ్య తేడా అంటారు రాహుల్.

ఇండియన్ రూట్స్ సంస్థ విక్రయాలు.. అమెరికా, యుకె, భారత్, కెనెడా, ఆస్ట్రేలియా, అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా దేశాల్లో అత్యధికంగా జరుగుతున్నాయి. భారతీయులు కూడా ఈ-కామర్స్ ద్వారా వస్తువులను పొందే వీలుంది. అయితే.. ప్రస్తుతం మేము అంతర్జాతీయ విపణి మీదనే దృష్టి సారించాము. అక్కడి వ్యాపార రంగంలో ఆధిపత్యం సాధించాలనుకుంటున్నాము. అంతర్జాతీయ మార్కెట్లో మెరుగైన ఫలితాలు సాధించాక, భారతీయ మార్కెట్ పై దృష్టి కేంద్రీకరిస్తాము. భారత్ లో ఈ-కామర్స్ విధానం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఇక్కడ కూడా మాకు ఎన్నో ఆర్డర్లు వస్తున్నాయి. అయితే.. డబ్బు చెల్లింపుల చోటే సమస్య వస్తోంది. మేము వస్తువులు అందించాక డబ్బు తీసుకునే విధానానికి దూరం. అయితే.. భారత్ లో ఎక్కువ మంది వినియోగదారులు, వస్తువు ఇంటికి చేరాకనే డబ్బులు చెల్లించే విధానానికి అలవాటు పడి ఉన్నారు. అంటారు రాహుల్.

ఎన్డీటీవీ లాంటి గ్రూపునకు కింద.. ఇండియన్ రూట్స్ లాంటి వాణిజ్య సంస్థను నిర్వహించడం ఎంత కష్టం..? ఏదైనా అటూ ఇటూ అయితే ఎంతటి అప్రతిష్ట..? ఈ ప్రశ్నలే రాహుల్ కు వేస్తే.. “ మేము ఎన్డీటీవీ గ్రూప్ సంస్థల్లో ఉన్నాము. అంటే.. అవే విలువలు పాటిస్తాము. మేము చేసే వ్యాపారంలో ఎలాంటి దాపరికాలు గానీ, మోసాలు గానీ ఉండవు. మాదంతా పారదర్శక విధానమే అని బదులిస్తారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags